Movies

నేరుగా ఓటీటీలోకి

నేరుగా ఓటీటీలోకి

కంగనా రనౌత్‌ నటించిన కొత్త సినిమా ‘తేజస్‌’. ఈ చిత్రంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ పాత్రలో కనిపించనుందీ తార. రోనీస్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సర్వేష్‌ మెవారా దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కంగనా గత సినిమా ‘ధాకద్‌’ బాక్సాఫీస్‌ వద్ద అతి పెద్ద అపజయాన్ని మూటగట్టుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది.దాదాపు 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ‘ధాకద్‌’ కనీసం 10 కోట్ల రూపాయల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. దాంతో దర్శక నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే ‘తేజస్‌’ సినిమాకు పలు రీషూట్లు చేశారట, ఇప్పుడు థియేటర్‌లలో విడుదల చేసేందుకు జంకుతున్నారు. ‘మరో సర్‌ప్రైజ్‌ను మేం తట్టుకునే స్థితిలో లేము’ అని వారు అభిప్రాయపడినట్లు బాలీవుడ్‌ మీడియా చెబుతున్నది. చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే పెట్టుబడికి ఢోకా ఉండదని ఆలోచిస్తున్నారు.