NRI-NRT

దోహాలో ఘ‌నంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు

దోహాలో ఘ‌నంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు

టీఆర్ఎస్ పార్టీ ఖ‌త‌ర్ ఆధ్వ‌ర్యంలో దోహాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు. టీఆర్ఎస్ ఖ‌త‌ర్ అధ్య‌క్షుడు శ్రీధ‌ర్ అబ్బ‌గౌని ఆధ్వ‌ర్యంలో కేక్ క‌ట్ చేసి తెలంగాణ వాసుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, దేశానికే త‌ల‌మానికంగా నిలిచింద‌న్నారు.
Doha-TRS1
తెలంగాణ‌పై కేంద్రం చూపిస్తున్న వివ‌క్ష‌ను శ్రీధ‌ర్ అబ్బ‌గౌని ఎండ‌గ‌ట్టారు. తెలంగాణ‌కు రావాల్సిన నిధుల విష‌యంలో మోదీ వివ‌క్ష చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు. రాష్ట్రం ఏర్ప‌డిన ఎనిమిదేండ్ల త‌ర్వాత బీజేపీ రాష్ట్ర ఆవిర్భావ వేడుక‌లు నిర్వ‌హించ‌డం సిగ్గుచేట‌న్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో దేశంలో గుణాత్మ‌క మార్పు రావ‌డం ఖాయ‌మ‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ ఖ‌త‌ర్ నాయ‌కులు మ‌హేంద‌ర్ చింత‌కుంట‌, మాసం రాజారెడ్డి, ఎల్ల‌య్య తాల్ల‌పెల్లి, ప్ర‌వీణ్ మోతే, భాస్క‌ర్ గౌడ్, న‌ర్స‌య్య మీరా పాల్గొన్నారు.