DailyDose

తిరుమలలో కళ్యాణమస్తుకు ముహూర్తం ఫిక్స్‌ – TNI తాజా వార్తలు

తిరుమలలో కళ్యాణమస్తుకు ముహూర్తం ఫిక్స్‌ –  TNI  తాజా వార్తలు

*పేదవారికి అండగా ఉండడానికి కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని పున:ప్రారంభిస్తున్నామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకున్న టిటిడి చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆగస్టు 7వ తేదిన 26 జిల్లాలో కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు 7వ తేదిన ఉదయం 8 నుంచి 8:17 నిముషాల మధ్య పండితులు మహూర్తం నిర్ణయించారని, కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డిఓ కార్యాలయాల్లో వివాహ జంటలు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని టిటిడి చైర్మన్ తెలిపారు. నక్షత్ర యుక్త సింహలగ్నంలో సామూహిక వివాహాలు జరిపిస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తే ఆయా ప్రాంతాలలో కూడా కళ్యాణమస్తూ కార్యక్రమాన్ని టిటిడి నిర్వహించేందుకు సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

*కాంట్రాక్టు లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రెసిడెన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రెసిడెన్సియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలను పెంచుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైమ్ స్కేల్ ను అమలు చేస్తున్నామని వెల్లడించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు సొసైటీ కార్యదర్శి ఆర్. నరసింహారావు తెలిపారు. మరోవైపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద జీతాలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం కోరింది. ఇంకోవైపు ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.

*పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఇవాళ తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

*పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. చెన్నూర్ మండలం పోక్కూరు గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కలెక్టర్ భారతి హోళి కేరితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో 44 లక్షల రూపాయలతో పలు అంతర్గత రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లిలో జిల్లాలో గ్యాస్‌ లీకేజీ ఘటనలో వంద మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని అచ్యుతాపురం బ్రాండిక్స్‌ ఎస్‌ఈజడ్‌లోని సీడ్స్‌ యూనిట్లో గ్యాస్ లీకేజీ అయ్యింది. దీంతో వాంతులు, తల తిరగడం, కళ్ల మంటల భయంతో సీడ్‌ కంపెనీ ఉద్యోగులు పరుగులు తీశారు. అస్వస్థతకు గురైన నలుగురు మహిళలకు బ్రాండిక్స్‌ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు.

* ఆర్య సమాజ్‌లో పెళ్లిళ్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. ఆర్య సమాజ్‌ మ్యారేజ్ సర్టిఫికెట్లను గుర్తించబోమని స్పష్టం చేసింది. వివాహ సర్టిఫికెట్లు జారీ చేయడం ఆర్య సమాజ్‌ బాధ్యత కాదని, అధికారుల పని అని సుప్రీంకోర్టు తెలిపింది.ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారనే ఆరోపణలను వ్యతిరేకిస్తూ నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులైన బీవీ నాగరత్న, అజయ్ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. నిందితుడిపై 363, 366ఏ, 384, 384 సెక్షన్లతో పాటు పోక్సో కింద కూడా కేసు బుక్ అయింది. బాధితురాలు మైనర్ కాదని, మేజర్ అని, నిందితుడితో ఆర్యసమాజ్‌లో వివాహం కూడా అయిందని, అత్యాచారం ఆరోపణలు అవాస్తవమని నిందితుడి తరపు న్యాయవాది వాదించారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తిరస్కరించింది. ఆర్యసమాజ్ మ్యారేజ్ సర్టిఫికెట్‌ను గుర్తించబోమని, అసలైన సర్టిఫికెట్ ఎక్కడ అని ప్రశ్నించింది.

* జమ్ముకశ్మీర్లో హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడి భద్రతా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు.. అమర్నాథ్ యాత్రతో పాటు కశ్మీర్లో అదనంగా కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది హోంశాఖ. జమ్ముకశ్మీర్లో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి భద్రతపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దిల్లీలోని నార్త్బ్లాక్లోని హోంశాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కశ్మీర్లో పరిస్థితులు సహా అమర్నాథ్ యాత్ర భద్రతపై చర్చించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, యూనియన్ హోం సెక్రెటరీ అజయ్ కుమార్ భల్లా, సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్, బీఎస్ఎఫ్ చీఫ్ పంకజ్ సింగ్, జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

* విశాఖ జిల్లా సింహగిరిపై ఉన్న సింహాచల దేవస్థాన ఉపదేవాలయమైన రామాలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. ధ్వంసమైన ధ్వజస్తంభాన్ని తొలగించే పనులు చేపట్టారు. ఆలయ ఈవో సూర్యకళ ఆధ్వర్యంలో.. ఈ పనులు జరుగుతున్నాయి. అయితే.. ఈ తవ్వకాల్లో ధ్వజస్తంభం అడుగు భాగంలో బంగారంతో తయారు చేసిన గరుడ యంత్రం, 112 రాగి నాణేలు, రాగితో తయారు చేసిన ధ్వజస్తంభ నమూనా పత్రాలు లభ్యమయ్యాయి. రెవెన్యూ అధికారులు.. పోలీసులు, దేవస్థాన సిబ్బంది, భక్తుల సమక్షంలో పంచనామా నిర్వహించి.. లభ్యమైన వస్తువులను భద్రపరిచారు. ఈ నెల 9వ తేదీన ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది.

*రాజ్యసభ సభ్యులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసిపోయింది. దీంతో రెండు స్థానాలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులైన దామోదర్‌రావు, పార్థసారధి రెడ్డి మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ్య ద్వైవార్షిక ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు సభ్యులు రాజ్యసభకు ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ధ్రువీకరణ పత్రాలు అందజేయనున్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ తన అభ్యర్థులుగా దీవకొండ దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డిని ప్రకటించింది. వారితోపాటు మరో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మాత్రమే పోటీలో మిగిలారు. దీంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

*రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం
ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి డిక్లరేషన్‌ అందించారు.అనంతరం.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అజెండా మేరకు పనిచేస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

*టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్‌యుఐ ఆధ్వర్యంలో శ్రీనగర్‌కాలనీలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం ముందు ఆందోళన జరిగింది. ఈ ఆందోళనకు మద్దతుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరై సబితా ఇంటి ముందు బైఠాయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……ఆర్ఆర్‌బి రెండో విడత పరీక్ష, టెట్ ఒకే రోజు ఉన్నాయన్నారు. రెండు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ ఉన్నారన్నారు. టెట్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. అపాయింట్‌మెంట్ అడిగితే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లు ఇవ్వరని.. ఫోన్ చేస్తే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎత్తడం లేదని, టెట్‌ను వాయిదా వేయాలని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయవద్దన్నారు. నాలుగు రోజుల క్రితం ప్రజల సమస్యల పై చెప్పేందుకు అపాయింట్‌మెంట్ అడుగుతున్నామని, కానీ సీఎం కేసీఆర్‌ కానీ, మంత్రి కేటీఆర్ కానీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు.
టెట్ నోటిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చిందని, ఆర్ఆర్‌బి ఏడాది క్రితం నోటిఫికేషన్ వచ్చిందన్నారు. టెట్, ఆర్ఆర్‌బి రెండు పరీక్షలు రాసే వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారని తెలిపారు. ఒకే రోజు పరీక్షతో ఆర్ఆర్‌బి రెండో పరీక్షకు హాజరు కాలేకపోతున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బాధ్యతాయుతంగా సబితా ఇంద్రారెడ్డి పనిచేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యాక ఇలా తయారయ్యారని ఎద్దేవా చేసారు. కేంద్రం ఏడాది క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ మార్చుకోమని సబితా అనడం ఆమె అవగాహనరహితానికి నిదర్శనమన్నారు. అవగాహన లేని మంత్రిగా సబితా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులను పెట్టి పాలన చేయాలని చూస్తున్నారన్నారు. టెట్ తేదీ మార్చేందుకు ఇబ్బంది ఏంటి..? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మంత్రి కనీసం ఫోన్ ఎత్తడంలేదన్నారు. సబితా ఇంద్రారెడ్డి మనసు కరిగి టెట్ వాయిదా వేయాలని కోరారు. ఒకటి రెండు రోజుల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎన్ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్‌, ఎన్ఎస్‌యుఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

*దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) నూతన భవనం నిర్మాణం గురించి నటుడు రజనీకాంత్‌ పలు సలహాలు, సూచనలు ఇచ్చినట్లు ఆ సంఘం అధ్యక్షుడు నాజర్‌ తెలిపారు. సంఘ కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు పూచి మురుగన్‌ తదితరులు గురువారం (జూన్‌ 2) ఉదయం స్థానిక పోయెస్‌ గార్డెన్‌లోని రజనీకాంత్‌ ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నడిగర్‌ సంఘం ఎన్నికలు జరిగిన రెండేళ్ల తర్వాత ఫలితాలు వెల్లడయ్యాయని, దీంతో నిర్మాణంలో ఉన్న సంఘం నూతన భవన నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం నూతన భవనం వివరాలను రజినీకాంత్‌ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని, అలాగే పలు సూచనలను సలహాలను ఇచ్చారని నాజర్‌ తెలిపారు.

*విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఘటనపై అధికారుల నుంచి వివరాలు కోరారు. ఘటనకు దారితీసిన కారణాలను సీఎంఓ అధికారులు వివరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని అధికారులు వెల్లడించారు. గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని అధికారులు తెలిపారు.

*తెలంగాణలో ఉపాధి హామీ పధకం ద్వారా ఎంతో కూలీలకు పనులు కల్పిస్తున్నామని, వారంతా సంతోషంగా వున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( అన్నారు. ఈ పథకం ద్వారా వేలాది మంది కూలీలకు పని కల్పిస్తున్నామని మంత్రి చెప్పారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధన పల్లి గ్రామ శివారు చెరువులో ఉపాధి హామీ పథకం కింద చెరువు పూడిక పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి గడ్డపార పట్టి మట్టిని తవ్విన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి సమస్యల పరిష్కలనుతప్పకుండా పరిష్కరిస్తామని అన్నరు,.ఈ సందర్భంగా పనులు జరుగుతున్న తీరును కూలీలను అడిగి తెలుసుకున్నారు.వారికి సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ ఆరా తీశారు.పనులు జరుగుతున్న తీరును చూసి సంతోషం వ్యక్తం చేశారు.కూలీలు, అధికారులను మంత్రి అభినందించారు.

*మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం ప్రజల సమస్యలు చెప్పేందుకు అపాయింట్‌మెంట్ అడిగామని మంత్రి ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ (KCR) కూడా ఇవ్వడంలేదని విమర్శించారు. ఇక్కడ సరికొత్త పాలన నడుస్తోందన్నారు. టెట్నో టిఫికేషన్ నెల రోజుల క్రితం వచ్చిందని ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్ ఏడాది క్రితం వచ్చిందన్నారు. టెట్, ఆర్ఆర్‌బీ రెండు పరీక్షలు రాసే వాళ్ళు మూడు లక్షల మంది ఉన్నారన్నారు. ఆర్ఆర్‌బీ పరీక్ష రోజే టెట్ పెడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్ధులు రెండో పరీక్షకు హాజరు కాలేకపోతున్నారని అన్నారు.

*రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 655 మంది పోలీసులు ఉత్తమ సేవా పతకాలు అందుకుంటారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గం.కు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై పోలీసులకు శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవా పతకాలను అందజేస్తారు.

*తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జిల్లా అట్రాసిటీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతబాబు అభ్యర్ధన ఈ నెల 7న విచారణకు రానుంది. కాగా పోలీసులు కస్టడీకి ఇంకా పిటిషన్ వేయలేదు. 6 లోగా కస్టడీకి తీసుకోకపోతే అనంతబాబు విచారణ పోలీసులకు అసాధ్యమే. ప్రస్తుతం అనంతబాబు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.

* సీపీఐ నేతల బృందం శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ను కలిశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను గవర్నర్‌కు వివరించామన్నారు. జగన్ప్ర భుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనేక ఉదంతాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు చూపించామన్నారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లో వాళ్లకి అప్పగించడం దారుణమన్నారు. కేసు లేకుండా ఉండేలా డబ్బు అశ చూపారని, ఆ జిల్లా ఎస్పీ కూడా ఎమ్మెల్సీని కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పారని రామకృష్ణ తెలిపారు.

*రుషికొండకు బయలుదేరిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమను ఎందుకు వెళ్లనివ్వడం లేదని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. అసలు రుషికొండ రహస్యం ఏంటని ప్రశ్నించారు. పాత హోటల్ ఎంత పరిధిలో ఉందో ఆ మేరకే నిర్మాణం చేయాలని.. కోర్టులు కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయన్నారు. కొండ అంతా తొలిచేసినట్టున్నారని.. అందుకే వెళ్లనివ్వడం లేదన్నారు. రుషికొండపై పూర్తి వివరాలు ప్రభుత్వమే ఇవ్వాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

*చైల్డ్ పోర్నోగ్రఫీని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న వ్యక్తికి అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరదండాలు వేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. జసోదానగర్‌కు చెందిన దీపక్ శంకల్‌పరా చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను స్టోర్ చేయడంతో పాటు దానిని ఫేస్‌బుక్ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాడు. దీపక్ గురించి పక్కా సమాచారం అందుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

*సోషల్ మీడియా పోస్టులో కించపరచే మాట వాడినందుకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై పై పలు కేసులు నమోదయ్యాయి. మే 30న ఆయన చేసిన ఒక ట్వీట్‌లో ‘పరియా’ అనే మాట వాడారు. దీనిపై పలు పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరునల్వేలికి చెందిన మురుగున్ అనే వ్యక్తి అన్నామలైపై ఫిర్యాదు చేశారు. అన్నామలైపై కేసు నమోదు చేయాలని సిటీ పోలీస్ కమిషనర్‌ను తన ఫిర్యాదులో ఆయన కోరారు. విడుదలై చిరుతైగల్ కట్చి (వీసేకే) సభ్యుడుగా కూడా మురుగన్ ఉన్నారు.

*తిరుమలలో దుకాణాలు, హోటళ్ల యజమానులు వీలైనంత త్వరగా ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించాలని టీటీడీ అధికారులు హెచ్చరించారు. ఇకపై తనిఖీల్లో హెచ్చరికలు ఉండవని, ఏకంగా షాప్‌ను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. తిరుమలలో ప్లాస్టిక్‌ సంపూర్ణ నిషేధం అమలు చేసేందుకు టీటీడీ అధికారులు గురువారం ముమ్మర తనిఖీలు చేపట్టారు.టీటీడీ రెవెన్యూ విభాగం, ఆరోగ్య శాఖ, నిఘా, భద్రతా విభాగం అధికారులు 10 బృందాలుగా ఏర్పడి తిరుమలలోని పలు ప్రాంతాల్లో దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణదారులు ప్లాస్టిక్‌ కవర్లతో కూడిన వస్తువులు, షాంపులు, బొమ్మలు, దుస్తులు విక్రయించకూడదని ఆదేశించారు

*ఆగస్ట్ 7న రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆగస్ట్ 7న ఉదయం 8 నుంచి 8:15 మధ్య వివాహాల ముహూర్తం నిర్ణయించనున్నారు. కలెక్టర్, ఆర్డీవో ఆఫీసుల్లో వివాహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ర్టాలూ ముందుకు వస్తే.. అక్కడ కల్యాణమస్తు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు

*అన్నాడీఎంకే సర్వసభ్య మండలి సమావేశం ఈ నెల 23న జరుగనుంది. ఈ మేరకు ఆ పార్టీ ఉప సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం గురువారం ప్రకటన విడుదల చేశారు. ప్రతియేటా అన్నాడీఎంకే కార్యాచరణ మండలి, సర్వసభ్య మండలి సమావేశాలను నిర్వహించడం ఆనవాయితీ. 2020 డిసెంబర్‌లో ఈ సమావేశాలు జరిగాయి. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గతేడాది సమావేశం నిర్వహించలేకపోయారు. గతేడాది జనవరిలో పార్టీ కార్యాచరణ మండలి సమావేశం మాత్రమే జరిపారు. ఈ నేపథ్యంలో పార్టీ సర్వసభ్య మండలి సమావేశాన్ని జరుపుకునేందుకు యేడాది గడువు కోరుతూ అన్నాడీఎంకే అధిష్టానం కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయగా, కమిషన్‌ అనుమతిచ్చింది.. మూడు నెలల క్రితం సర్వసభ్య మండలి సమావేశాన్ని జరిపేందుకు సిద్ధమవుతుండగా పార్టీ సంస్థాగత ఎన్నికలను జరపాల్సి వచ్చింది. మూడు నెలలుగా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వంను ఉపసమన్వయకర్త, సమన్వయకర్తలుగా ఎన్నుకున్నారు. ఇదే విధంగా జిల్లా నాయకులు, నగరశాఖల నాయకుల ఎన్నికతో ఇటీవల సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో పార్టీ సర్వసభ్య మండలి, కార్యాచరణ మండలి సమావేశాలు ఈ నెల 23న నగరశివారు ప్రాంతమైన వానగరంలో జరుగుతుందని పార్టీ నేతలు ఈపీఎస్‌, ఓపీఎస్‌ గురువారం సంయుక్తంగా ప్రకటించారు. ఈ సమావేశానికి తాత్కాలిక ప్రిసీడియం చైర్మన్‌ డాక్టర్‌ తమిళ్‌మగన్‌ హుసేన్‌ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాలకు 2500 మంది సర్వసభ్య మండలి సభ్యులు, 500 మంది కార్యాచరణ మండలి సభ్యులు, 1000 మంది ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించనున్నారు.. ప్రస్తుతం పార్టీలో నాయకుల మధ్య జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలను నిరోఽధించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. అదే సమయంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వంలకు మరిన్ని అధికారాలు కల్పించేందుకు కూడా ఈ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. రెండేళ్ల విరామం తర్వాత సర్వసభ్యమండలి సమావేశం జరుగనుండటంతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం నెలకొంది.

*భాగ్యలక్ష్మి అమ్మవారికి సీనియర్ కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు, భట్టి విక్రమార్క, సీతక్క ఇతర ముఖ్య నేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ నేపథ్యంలో భాగ్యలక్ష్మి అమ్మవారిని కాంగ్రెస్ నేతలు దర్శించుకోనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా రావడంతో.. త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు.

*రాయలసీమ యూనివర్సిటీ లో విద్యార్థి సంఘాలు చేపట్టిన 48 గంటల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వీసీ ఆనందరావును రీకాల్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు 48 గంటల సామూహిక దీక్షకు పిలుపిచ్చారు. కాగా… ధర్నా చౌక్‌లో విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

*తిరుమల: ఆగస్టు 7 నుంచి టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమం పునఃప్రారంభం.. వివాహం చేసుకోవాలనుకునే పేద జంటలు కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు-టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

*దక్షిణాది రాష్ట్రాల్లో 50 కిలోల సిమెంటు బస్తా ధరను రూ.20-30 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
ఈనెల 2 నుంచే పెంచిన ధరలు అమల్లోకి వచ్చినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.ముడి పదార్థాల అధిక ధరలతో పాటు ఇంధన వ్యయాలు పెరగడమే ఇందుకు కారణమని వివరించాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో బస్తాపై రూ.20 పెంచగా, తమిళనాడులో రూ.20-30 మధ్య పెరిగింది. కర్ణాటకలో బ్రాండ్‌, ప్రాంతం ఆధారంగా ధరల పెంపు వేర్వేరుగా ఉందని తెలుస్తోంది. ధర పెరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో సిమెంట్‌ బస్తా ధర రూ.320-400 మధ్య; తమిళనాడు, కర్ణాటకల్లో రూ.360-450కు చేరింది.

*ఆగస్ట్ 7న రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆగస్ట్ 7న ఉదయం 8 నుంచి 8:15 మధ్య వివాహాల ముహూర్తం నిర్ణయించనున్నారు. కలెక్టర్, ఆర్డీవో ఆఫీసుల్లో వివాహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ర్టాలూ ముందుకు వస్తే.. అక్కడ కల్యాణమస్తు నిర్వహిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

*ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ సంఘటనలో తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తె ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జరిగిన ఈ సంఘటనలో తల్లీపిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

*బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు టెస్టు కెప్టెన్‌గా వెటరన్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌ హసన్‌ను నియమించారు. లిటన్‌ దాస్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీ్‌సలో ఓటమికి బాధ్యత వహిస్తూ మోమినుల్‌ హక్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. అయితే నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం షకీబల్‌కిది మూడోసారి కావడం విశేషం. 2009లోనే తొలిసారిగా అతడు కెప్టెన్‌కాగా జింబాబ్వేలో సిరీస్‌ ఓటమికి 2011లో తప్పించారు. ఆ తర్వాత 2017లో మరోసారి కెప్టెన్‌ అయిన షకీబల్‌పై 2019లో ఐసీసీ నిషేధం విధించడంతో దూరం కావాల్సి వచ్చింది. ఈనెలాఖరులో బంగ్లా జట్టు విండీస్‌ టూర్‌కు వెళ్లి అక్కడ రెండు టెస్టుల సిరీస్‌ ఆడుతుంది.

*తెలంగాణ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ నూతన చైర్మన్‌గా బొంగు బుచ్చిదాస్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు. గురువారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో జరిగిన ఆ సంఘం ఏజీఎం అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శంకర్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శిగా సుజిత్‌కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రమేష్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులుగా నాగరాజు, మల్లేశ్‌ యాదవ్‌, ఆనంద్‌ రాజ్‌, కోశాధికారిగా దయానంద్‌ రెడ్డి ఎన్నికయ్యారు.

* తెలంగాణ పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ నూతన చైర్మన్‌గా బొంగు బుచ్చిదాస్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు. గురువారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్‌ భవన్‌లో జరిగిన ఆ సంఘం ఏజీఎం అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శంకర్‌ యాదవ్‌, ప్రధాన కార్యదర్శిగా సుజిత్‌కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా రమేష్‌ గౌడ్‌, ఉపాధ్యక్షులుగా నాగరాజు, మల్లేశ్‌ యాదవ్‌, ఆనంద్‌ రాజ్‌, కోశాధికారిగా దయానంద్‌ రెడ్డి ఎన్నికయ్యారు.

*టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఓ ఇంటివాడయ్యాడు. బుధవారం ఆగ్రాలో జరిగిన వేడుకలో నెచ్చెలి జయ భరద్వాజ్‌ను చాహర్‌ వివాహం చేసుకున్నాడు. గతేడాది దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌ రోజు 29 ఏళ్ల దీపక్‌.. స్టేడియం సాక్షిగా జయకు తన ప్రేమను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ వేలంలో దీపక్‌ను చెన్నై రూ. 14 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, గాయం కారణంగా 15వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు.

*సినిమా టికెట్లు ఆన్‌లైన్‌ ద్వారా విక్రయించాలన్న జగన్‌ ప్రభుత్వం ప్రతి టికెట్‌పై 2 శాతం కమీషన్‌ వసూలు చేసేందుకు సిద్ధమైంది. ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు విక్రయించనుంది. ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్లో సినిమా చూడాలన్నా ఇదే పోర్టల్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేయాలి. బుక్‌ మై షో లాంటి ఇతర పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా ప్రభుత్వానికి రెండు శాతం కమీషన్‌ చెల్లించక తప్పదు.

*బెయిల్‌రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లింది ఎందుకు? అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. సీఎం ఢిల్లీ పర్యటనకు కారణం ఏమిటన్నదానిపై ఒక పోల్‌ నిర్వహించారు. ‘‘ఏ 1… రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలంటే తనపై ఉన్న కేసుల విచారణ ఆలస్యం చేయాలని షరతు పెట్టేందుకు. ఏ 2… ప్రత్యేక హోదా తాకట్టు పెట్టుకుని అప్పు ఇమ్మని అడుక్కోవడానికి. ఏ 3… పోలవరం ప్రాజెక్టు ఆపేసినా ఫర్వాలేదు… బాబాయ్‌ని వేసేసిన కేసులో తనను కాపాడమని వేడుకోవడానికి… ఈ మూడింటిలో దేనికోసం..? అని ప్రశ్నించారు. ఈమేరకు లోకేశ్‌ గురువారం ప్రకటన విడుదల చేశారు. కాగా, ‘‘పెందుర్తి మండలం దువ్వపాలెం క్వారీలో వైసీపీ మైనింగ్‌ మాఫియా అడ్డగోలు తవ్వకాలతో కొండ జారిపోయింది. ఇది ప్రకృతి విపత్తు కాదు. జగన్‌ మేడ్‌ డిజాస్టర్‌’’ అని విమర్శించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడు జగన్‌రెడ్డి… అవినీతిని అరికట్టేందుకు యాప్‌ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనన్నారు.

*తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్య వాణి ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం ఉదయం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆమె ఈ విషయం ప్రకటించారు. పార్టీలో తనకు గౌరవం ఇవ్వకపోగా అవమానించారని, మనస్తాపంతో రాజీనామా నిర్ణయం తీసుకొన్నానని చెప్పారు. ‘ఒంగోలు మహానాడులో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వేదికపై కుర్చీ కూడా ఇవ్వలేదు. దీనిపై నేను నా ఆవేదన వ్యక్తం చేశాను. నన్ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లు పుకార్లు పుట్టించారు. దీనితో బాధపడి పార్టీకి రాజీనామా చేశాను. సస్పెన్షన్‌ నిజం కాదని తెలిసిన తర్వాత ఉపసంహరించుకొన్నాను. ఈ విషయాలు చంద్రబాబుకు చెప్పాలని మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వెళ్లాను. అక్కడ చాలాసేపు వేచిచూసేలా చేశారు. తర్వాత అందరితోపాటు పంపారు. అక్కడ నేను నా సమస్యలు చెబుతుంటే ఆయన విసుక్కొన్నారు. ఆయనను నేను తప్పుబట్టను. పార్టీలో కొంతమంది కావాలని నన్ను అణగదొక్కాలని చూశారు.

*ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొ ని వాటిపై ఆందోళన, పోరాటాలు చేసేందుకు ‘జనం కోసం సీపీఎం’ యాప్‌ను రూపొందించామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. గురువారం విజయవాడలో ఆ యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. జనం కోసం సీపీఎం కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నట్లు చెప్పారు.

*పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల చేయనున్నారు. ఆరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్‌ దేవానంద్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశా రు. గతంలో మాదిరే ఈసారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారు. గ్రేడింగ్‌ పద్ధతిని తీసేశారు. విద్యాశాఖ ర్యాంకులనూ ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదని, అలా చేస్తే కనీ సం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

*తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. గడిచిన రెండు నెలల తరహాలోనే మే నెలలో కూడా ఆదాయం భారీగా లభించింది. మే నెలలో 22.68 లక్షల మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా, రూ.129.57 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. 29వ తేదీన అత్యధికంగా 90,885 మంది దర్శించుకోగా, 25వ తేదీన రూ.5.43 కోట్లు హుండీ ఆదాయం లభించింది. మార్చి నెలలో 19.72లక్షలమంది దర్శించుకోగా,రూ.128.61 కోట్ల ఆదాయం సమకూరింది. ఏప్రిల్‌ నెలలో 20.62 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.127.63 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. మే నెలలో భక్తుల సంఖ్యతో పాటు హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. కరోనా ప్రభావం తగ్గడంతో పాటు వేసవి సెలవులు కూడా జతకావడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ భారీగా సమర్పిస్తున్న క్రమంలో హుండీ ఆదాయం పెరిగినట్టు తెలుస్తోంది.

* జై భీమ్ భారత్ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసుల మోహరించారు. కోనసీమ అల్లర్ల దృష్ట్యా అంబేద్కర్ ఆత్మగౌరవ యాత్రకు శ్రవణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ర్యాలీ భగ్నం చేసేందుకు పోలీసుల ప్రయత్నం చేశారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. జడ శ్రవణ్‌కుమార్‌ కార్యాలయం చుట్టూ పోలీసుల మోహరించారు. ఇప్పటికే జేబీబీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ మునికృష్ణారెడ్డి భూకబ్జాకు పాల్పడ్డాడు. తిరుపతి పట్టణంలోని యాదవవీధిలో ఏకంగా రోడ్డు స్థలాన్నే మునికృష్ణారెడ్డి ఆక్రమించాడు. అడ్డంగా ఉన్న కరెంట్ స్తంభాన్ని తొలగించాడు. విద్యుత్ పోల్‌ను పగులగొట్టి సర్వీస్ వైర్లను మునికృష్ణారెడ్డి కొయ్యకు కట్టాడు. నిలదీసిన బాధితులపై మునికృష్ణారెడ్డి బెదిరింపులకు దిగాడు. తిరుపతి కార్పొరేషన్, కలెక్టర్‌కు బాధితులు విన్నవించినా ఫలితం లేదు. తమకు దారి, విద్యుత్ పోల్, కాలువ ఏర్పాటు చేయాలని బాధితులు కోరుతున్నారు.

*విద్యుత్ శాఖ అధికారులతో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. కేంద్ర నిబంధనల ప్రకారం పదిశాతం విదేశీ బొగ్గు కొనుగోళ్ళకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగా 31 లక్షల ఎంటిల బొగ్గు దిగుమతికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి ఉంటుందన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంటల వల్ల విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ కొరత లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ నాటికి కృష్ణపట్నం మూడో యూనిట్ లో ఉత్పత్తి అవుతుందన్నారు.

*వైసీపీ అరాచకాలను ప్రశ్నించాలని ప్రజలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సూచించారు. ఇలాగే ఊరుకుంటే వైసీపీ నేతలు ఇంకా పేట్రేగిపోతారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికీ వ‌స్తారు.. ఊరూరా తిరుగుతారన్నారు. ప్రతి ఆఫీస్కు వచ్చి మిమ్మల్ని కొడతారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

*తెలంగాణ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశానికి జూన్‌ 6న (సోమవారం) ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సీహెచ్‌ రమణ కుమార్‌ తెలిపారు. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. విద్యార్ధులు జ్ట్టిఞ://్టటట్జఛీఛి.ఛిజజ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. హాల్‌ టిక్కెట్‌లో ఏవైనా పొరపాట్లు ఉంటే అందులో పేర్కొన్న పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి సరిచేసుకోవచ్చని తెలిపారు.

*నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల రాష్ట్ర ఏర్పాటు కలను నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీ వారి ఆకాంక్షలనూ నెరవేరుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం కాంగ్రెస్‌ కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని పిలుపునిచ్చారు. మభ్య పెట్టే మాటలతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలను నిలువునా దోపిడీ చేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరులు, విద్యార్థులు, యువకులు, రైతులు మోసపోయారని విమర్శించారు. జనాభాలో 70ు మంది ఆధారపడిన వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. రైతాంగాన్ని ఆదుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు.

*గాంధీభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి.. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి, డప్పులు వాయిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వి.హన్మంతరావు ఉత్సాహంగా డప్పు వాయించారు. జగ్గారెడ్డి.. బంజారాలతో కలిసి చిందేశారు. జగ్గారెడ్డితోపాటు నేతలు బొల్లు కిషన్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఫిరోజ్‌ ఖాన్‌ తదితరులు పాదం కలిపారు. నేతలు, కార్యకర్తల ఆటా పాటలతో గాంధీభవన్‌లో కోలాహలం నెలకొంది. కాగా, గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కు జగ్గారెడ్డితోపాటు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేతలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మెట్టు సాయికుమార్‌ సాదర స్వాగతం పలికారు.

*ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు గురువారం పెదసంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రావతరణ సందర్భంగా సెలవు రోజు కావడంతో ఇష్టదైవాలను దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ప్రధానాలయ పరిసరాలు, ఆర్జిత సేవా మండపాలు, తిరువీధుల్లో యాత్రాజనులతో రద్దీ ఏర్పడింది. స్వామికి నిత్యపూజా కైంకర్యాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేకువజామున స్వామివారికి అభిషేకం, అర్చనలు, అష్టభుజి ప్రాకార మండపంలో హోమ పూజలు, నిత్య కల్యాణోత్సవం, సాయంత్రం వేళ అలంకార సేవలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. స్వామి సన్నిధిలో నిర్వహించిన ఆర్జిత సేవోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ విభాగాల ద్వారా రూ.30,03,149 ఆదాయం ఆలయ ఖజానాకు సమకూరింది.

*హజ్‌ యాత్రికుల కోసం భారత్‌, సౌదీ అరేబియా మధ్య జూలై 31 వరకు 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్టు స్పైస్‌జెట్‌ గురువారం తెలిపింది. శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక విమానాలు జూన్‌ 5-20 మధ్య మదీనాకు బయలుదేరుతాయని ఎయిర్‌లైన్‌ సంస్థ పేర్కొంది. జెద్దా నుంచి శ్రీనగర్‌కు రిటర్ను ఫ్లైట్లు జూలై 15 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపింది. ఈ ఏడాది హజ్‌ విమానాలను నడుపుతున్న ఏకైన భారతీయ ఎయిర్‌లైన్‌ స్పైస్‌జెట్‌ అని సంస్థ పేర్కొంది. స్పైస్‌జెట్‌ గతంలో గయా, శ్రీనగర్‌ నుంచి ప్రత్యేక హజ్‌ విమానాలను నడిపినట్టు గుర్తు చేసింది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యేక హజ్‌ విమాన సేవలు పునఃప్రారంభంకానున్నాయి.

*ఇటీవల కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన పాటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ బీజేపీలో చేరారు. గాంధీనగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ గుజరాత్‌ యూనిట్‌ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎలాంటి పదవులు, టికెన్‌ను ఆశించకుండానే బీజేపీలోకి చేరానని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సాధారణ కార్యకర్తలా పనిచేస్తానని అన్నారు.

*కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీ గురువారం ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో జూన్ 13వతేదీన హాజరు కావాలని ఈడీ తాజా నోటీసు ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రస్తుతం దేశం వెలుపల ఉన్నందున నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి హాజరయ్యేందుకు మరింత సమయం కావాలని కోరారు. గురువారం నాటి ఈడీ విచారణకు హాజరుకావడం లేదని రాహుల్ సమాచారం పంపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ భూకబ్జాలతో వేల కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఢిల్లీ హైకోర్టులో కేసు వేయడంతో నేషనల్ హెరాల్డ్ వ్యవహారం తెరపైకి వచ్చింది.

*టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసుల తీరుపై ఆనంద బాబు ఆగ్రహం చేశారు.గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాళ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఐడీ విచారణకు రానున్నారు. ఈ సందర్భంగా అక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు పిఆర్వో వెంకటేష్ సోషల్ మీడియాలో పోస్టింగ్స్‌పై విచారణకు పిలిచారు. నిన్న అధికారులు విచారణ చేసి రాత్రికి ఇంటికి పంపించారు. సీఐడీ కార్యాలయానికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండటంతో భారీగా పోలీసుల మోహరించారు.

*పాత బస్తీలోని చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయ అమ్మవారికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉద్రిక్తత నడుమ శుక్రవారం ఉదయమే భట్టి , వీహెచ్ , సీతక్క, అంజనీయాదవ్‌.. తదితర నేతలు ఆలయానికి చేరుకున్నారు.బండి సంజయ్ సవాల్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు భాగ్యలక్ష్మి అమ్మవారిని సందర్శించుకోవడం విశేషం. అదే సమయంలో.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనా త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేయించారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే భాగ్యలక్ష్మి దేవాలయం మీద చేయి వేయాలంటూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి‌ సంజయ్ సవాల్ విసిరారు.