DailyDose

డీజీపీకి చంద్రబాబు లేఖ – TNI తాజా వార్తలు

డీజీపీకి చంద్రబాబు లేఖ –  TNI  తాజా వార్తలు

* డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ నేత జల్లయ్య హత్య, పోలీసుల తీరుపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. హంతకులకు మరణశిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబీకుల అనుమతి లేకుండానే జల్లయ్య మృతదేహాన్ని.. పోలీసులు బలవంతంగా రావులాపురం తరలించారని మండిపడ్డారు. కుటుంబీకులను సైతం బలవంతంగా బస్సుల్లో తీసుకెళ్లారని, జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్నారని చంద్రబాబు తెలిపారు. జల్లయ్య అంత్యక్రియలకు వెళ్లేందుకు టీడీపీ నేతలను, జల్లయ్య బంధువులను అనుమతించాలని లేఖలో కోరారు. పోలీసులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే హత్య జరిగేది కాదన్నారు. ఇప్పటివరకు మాచర్లలోనే ఐదుగురు బీసీ సమాజిక వర్గానికి చెందిన నేతలను హత్య చేశారని తెలిపారు. మాచర్లలో బీసీవర్గంపై జరుగుతోన్న హత్యాకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని చంద్రబాబు లేఖలో డిమాండ్ చేశారు.

*నాంపల్లి పెన్షన్ ఆఫీస్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. సీనియర్ అకౌంటెంట్ వెంకట సత్య నాగ ప్రసాద్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయేషా సిద్దికా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. వారి మరణం తరువాత వచ్చే బెనిఫిట్స్ కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకుంది. అయితే అకౌంటెంట్ ప్రసాద్ రూ. 27 వేలు లంచం అడగడంతో మొదట అయేషా సిద్దికా రూ. 10 వేలు ఇచ్చింది. మిగతా డబ్బు తీసుకుంటుండగా ప్రసాద్‌ను అధికారులు పట్టుకున్నారు

* నాంపల్లి పెన్షన్ ఆఫీస్‌లో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. సీనియర్ అకౌంటెంట్ వెంకట సత్య నాగ ప్రసాద్ రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయేషా సిద్దికా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. వారి మరణం తరువాత వచ్చే బెనిఫిట్స్ కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకుంది. అయితే అకౌంటెంట్ ప్రసాద్ రూ. 27 వేలు లంచం అడగడంతో మొదట అయేషా సిద్దికా రూ. 10 వేలు ఇచ్చింది. మిగతా డబ్బు తీసుకుంటుండగా ప్రసాద్‌ను అధికారులు పట్టుకున్నారు.

*కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ (కేఏఎస్‌) అధికారుల సంఘం పదాధికారులు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను సీఎం దృష్టికి తెచ్చారు. ఈ బృందానికి సంఘం అధ్యక్షుడు రవి తిర్లాపుర నాయకత్వం వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు, దీనదళితులకు, మహిళలకు సకాలంలో నిక్కచ్చిగా అందేలా చొరవ చూపాలని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కేఏఎస్‌ సంఘం నూతన పదాధికారులను ప్రత్యేకంగా అభినందించిన ఆయన మీరు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులన్న సంగతిని గుర్తించాలన్నారు. ప్రభుత్వం ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో రూపొందించే సంక్షేమ పథకాలు ఒక్కోసారి అట్టడుగు వర్గాలకు అందడం లేదని ముఖ్యమంత్రి ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై అధికారులు తక్షణం స్పందిస్తే జనతాదర్శన్‌ వంటి కార్యక్రమాలలో ప్రజలనుంచి విజ్ఞప్తులు స్వీకరించాల్సిన అవసరం తమకు ఉండదన్నారు. ప్రభుత్వ పథకాలు చక్కగా అమలైతే ఇటు అధికారులతోపాటు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందన్నారు. కేఏఎస్‌ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి తప్పకుండా పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.

*ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు. ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం..గడిచిన 24 గంటల్లో దేశంలో 3962 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,31,72,547 కు చేరింది.ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 22,416 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.06 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 26 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,24,677 కి చేరింది.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2697 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,26,25,454 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,93,83,92,885 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 20435 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
*విశాఖ జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య మనస్పర్ధలు పెరుగుతున్నాయి. సహచరుల వైఖరితో తీవ్ర మనస్థాపానికి గురైన పార్టీ ఎమ్మెల్యే తనకు అప్పగించిన నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ తన రాజీనామా పత్రాన్ని విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు వైసీపీ రీజినల్ కో ఆర్ఢినేటర్‌గా ఉన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి లేఖను పంపారు .

*ఒడిశాలోని మంత్రులంద‌రూ ఇవాళ రాజీనామా చేశారు. సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ నేతృత్వంలోని బీజూ జ‌న‌తా ద‌ళ్ ప్ర‌భుత్వానికి అయిదోసారి మూడేళ్లు నిండాయి. ఈ నేప‌థ్యంలో మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేప‌ట్ట‌నున్నారు. దానిలో భాగంగానే మంత్రులంద‌రూ రాజీనామా చేశారు. రేపు కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం నిర్వ‌హించ‌నున్నారు. 2024 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్ నేప‌థ్యంలో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న ఉద్దేశంతో మంత్రులు పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేప‌ట్టారు. తాజా స‌మాచారం మేర‌కు 20 మంది మంత్రులు త‌మ రాజీనామాల‌ను ఒడిశా అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించారు. ఇక రేపు ఉద‌యం 11.45 నిమిషాల‌కు రాజ్‌భ‌వ‌న్‌లో కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం ఉంటుంది. ప్ర‌దీప్ అమ‌త్‌, ల‌తికా ప్ర‌దాన్‌ల‌కు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

*కాంగ్రెస్ పార్టీకి పంజాబ్‌లో మ‌రో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్ర‌ముఖ నేత సునీల్ జాఖ‌డ్ ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీని వీడిన నేప‌ధ్యంలో మ‌రో ఐదుగురు ప్ర‌ముఖ నేత‌లు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. పంజాబ్ మాజీ మంత్రులు గురుప్రీత్ సింగ్ కంగ‌ర్‌, బ‌ల్బీర్ సింగ్ సంధూ, రాజ్ కుమార్ వెర్కా, సుంద‌ర్ శ్యామ్ అరోరా, మాజీ ఎమ్మెల్యే కేవ‌ల్ సింగ్ ధిల్లాన్ శ‌నివారం కాషాయ పార్టీ గూటికి చేరారు.

*ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్‌ అయ్యారు. ఇవాళ పదో తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించి చివరి నిమిషంలో వాయిదా వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సుమారు ఆరు లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షించి వాయిదాతో నిరాశకు గురయ్యారని ఆరోపించారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ కోర్టు హాజరును వాయిదా వేసినట్లుగానే విద్యార్థుల ఫలితాలను కూడా వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

*నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ నామినేషన్‌ దాఖలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో నిబద్దతతో పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

*పెద్దల సభకు కొత్తగా 41 మంది పోటీ లేకుండానే ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి పి.చిదంబరం, రాజీవ్‌ శుక్లా, బీజేపీ నుంచి సుమిత్రా వాల్మీకి, కవితా పటిదార్, కాంగ్రెస్‌ మాజీ నేత కపిల్‌ సిబల్, ఆర్జేడీ నుంచి మీసా భారతి, ఆర్‌ఎల్డీ నుంచి జయంత్‌ చౌదరి తదితరులు రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ నుంచి మొత్తం 11 మంది, తమిళనాడు నుంచి ఆరుగురు, బిహార్‌ నుంచి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు, మధ్యప్రదేశ్‌ నుంచి ముగ్గురు, ఒడిశా నుంచి ముగ్గురు, చత్తీస్‌గఢ్‌ నుంచి ఇద్దరు, పంజాబ్‌ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఇద్దరు, జార్ఖండ్‌ నుంచి ఇద్దరు, ఉత్తరాఖండ్‌నుంచి ఒక్కరు ఎన్నికయ్యారు. మొత్తం 41 మందిలో 14 మంది బీజేపీ, నలుగురు కాంగ్రెస్, నలుగురు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ముగ్గురు డీఎంకే, ముగ్గురు బీజేడీకి చెందినవారున్నారు.

*బొల్లాపల్లి మండలం రావులాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు గ్రామానికి తీసుకొచ్చారు. అంత్యక్రియలు నిర్వహంచేందుకు జల్లయ్య బంధువులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, బ్రహ్మరెడ్డిని అనుమతిస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని మృతుడి బంధువులు చెబుతున్నారు. రోడ్డుపై బైఠాయించి టీడీపీ శ్రేణులు, మృతుడి బంధువుల ఆందోళనకు దిగారు. అయితే రావులాపురానికి టీడీపీ నేతలు రాకుండా హౌస్‌అరెస్ట్‌ చేశారు.

*బాలికపై గ్యాంగ్‌రేప్‌ కేసులో భాగంగా మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కర్నాటక, తమిళనాడులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇప్పటికే వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కొడుకు పోలీసులు అదుపులోఉన్నాడు. నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నారు. కాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికను ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.

*ఈ నెల చివరి నుండి ప్రారంభం కానున్న ఆషాడ బోనాల ఉత్సవాల నిర్వహణ పై పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అ ధ్యక్షతన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో ఈ నెల 6 వ తేదీన ఉదయం 10.30 గంటలకు జరుగుతుంది. ఈ సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ , దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి , మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, GHMC పరిధిలోని రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు, MLC లు, MLA లు, బోనాల ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ ల పోలీస్ కమిషనర్ లు, దేవాదాయ, రెవెన్యూ, పోలీసు, వాటర్ వర్క్స్, ఎలెక్ట్రికల్, కల్చరల్ తదితర శాఖల అధికారులు పాల్గొంటారు

*వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచ‌క‌ పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలో కూడా రాజకీయమా? అని ప్రశ్నించారు. మంత్రికి సమాచారం లేదని ఫలితాల తేదీని అకస్మాత్తుగా వాయిదా వేస్తారా అని నిలదీశారు. పిల్లల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టారు. ఇంతకీ వాయిదా వేసింది మంత్రిగారు అలిగారనా?.. లేక ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల‌ మార్పుల కోసమా? అని లోకేష్‌ ప్రశ్నించారు.

*విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తరాంద్ర జిల్లాల సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డికి, నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించిందని, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

*కడప నగర శిరవారుల్లోని కేఓఆర్‌ఎం ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్ధి శివ ప్రసాద్‌పై ఫైనలియర్ విద్యార్థులు దాడికి దిగారు. దాడికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు. పరారైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వీరి వద్ద నుంచి ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి మాట్లాడుతూ.. విద్యాలయాల్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారవద్దన్నారు. క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలు అయితే విద్యార్థుల పాస్ పోర్ట్‌లు నిరాకరించి, విదేశీవిద్య, ప్రభుత్వ ఉద్యోగులకు అనర్హులు అవుతారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమ శిక్షణలో పెట్టుకోవాలని వెంకట శివారెడ్డి సూచించారు.

*జూలై 2,3,4 తేదీల్లో సొంత నియోజకవర్గంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పర్యటించనున్నారు. ప్రధాని మోదీ జూలై 4న భీమవరం వస్తున్న సందర్భంగా ప్రధాని పర్యటన నిమిత్తం రఘురామ సొంత నియోజకవర్గానికి రానున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీకి రఘురామ లేఖ రాశారు. రెండున్నర సంవత్సరాల తర్వాత నరసాపురం పార్లమెంటు పర్యటనకు రఘురామ వస్తున్నారు.

*నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు.వైసీపికి దమ్ముంటే ఓట్లు కొనకుండా స్వచ్ఛందంగా ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. టీడీపికి స్థిరమైన సిద్ధాంతం లేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి చేతనయితే మంత్రులను ఎన్నికల ప్రచారంలోకి దింపకుండా కేవలం అభ్యర్థులే ప్రచారంలో పాల్గొని లక్ష మెజారిటీతో గెలుపొందాలన్నారు.

*నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి నుంచి వైసీపీ నేతల చేతిలో హతమైన జల్లయ్య మృతదేహాన్ని పోలీసులు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు కూడా లేకుండా మృతదేహాన్ని పోలీసులు తీసుకెళ్లారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

* తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 71,196 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 36,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

*హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జరిగిన మైనర్ అత్యాచార ఘటన‌పై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. హైదరాబాద్ హజ్ హౌస్‌లో ఏర్పాటుచేసిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి పేర్కొన్నారు. నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఇటు పోలీసులు కేసు దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పారు. తెలంగాణ పోలీసులపై ఏ ప్రజాప్రతినిధి ఒత్తిడి లేదన్నారు.

*పిఠాపురంలో టీడీపీ దళిత గర్జన ఏర్పాటు చేశారు. దళిత గర్జనకు అనుమతి లేదంటూ…టీడీపీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలు కొండబాబు, ఎంఎస్‌ రాజుతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

*వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ లేదా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా బహిరంగ సభ జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వారు నగరానికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూలై 2న ఎల్‌బీ స్టేడియంలో సభ నిర్వహించేందుకు రాష్ట్ర పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం శుక్రవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. స్వామివారి కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం తదితర అర్జిత సేవల్లో పాల్గొన్నారు. శుక్రవారం సందర్భంగా గర్భాలయ ప్రవేశం నిలిపివేసి లఘు దర్శనం అమలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌ రమాదేవి నేతృత్వంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

*ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. నాలుగు రాజ్యసభ స్థానాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభకు విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, ఆర్‌ కృష్ణయ్య, నిరంజన్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి డిక్లరేషన్‌ అందించారు.అనంతరం.. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అజెండా మేరకు పనిచేస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు.

*ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ నేత లోకేశ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో టీడీపీ వర్గీయుడు జల్లయ్య హత్య… మరో ఇద్దరిపై దాడి వైసీపీ రాక్షసత్వానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వందలమంది టీడీపీ వర్గీయులను చంపినా సీఎం జగన్ రక్తదాహం తీరదా వైసీపీ నరమేధం ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. ఆపకుంటే తీవ్రపరిణామాలుంటాయని అన్ని బాకీలు సెటిల్‌చేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు.

*తిరుమలలోని సర్వదర్శన క్యూలైన్‌లో శుక్రవారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆముదాల గ్రామానికి చెందిన సుధాకర్‌ ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లారు.తమిళనాడులోని విల్లుపురానికి చెందిన దాదాపు 20మందితో కూడిన భక్తబృందం కూడా అదే సమయంలో లైన్‌లోకి ప్రవేశించింది.ఎస్‌ఎంసీ జనరేటర్‌ సమీపంలో ఈ రెండు కుటుంబాల మధ్య తోపులాట జరిగింది.గొడవకు దిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడంతో సుధాకర్‌ ముక్కు నుంచి రక్తం వచ్చింది. దీంతో సుధాకర్‌ను భద్రతా సిబ్బంది అశ్విని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు.దాడికి దిగిన కోదండరామయ్య, గోపాలకృష్ణ, వరదన్‌ అనే వ్యక్తులను టూటౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత గాయపడిన సుధాకర్‌ కూడా పోలీస్టేషన్‌కు రావడంతో రెండు కుటుంబాలతో పోలీసులు మాట్లాడారు. తమకు కేసు వద్దని, ఆవేశంలో అనుకోకుండా ఘర్షణ జరిగిందని రెండు కుటుంబాలు చెప్పడంతో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు.ఈ ఘర్షణతో క్యూలైన్‌లో కొద్ది సమయం గందరగోళ పరిస్థితి నెలకొంది.

* పింఛన్లు, రోడ్లు, వీధిదీపాలు తదితర సమస్యలపై ‘గడప గడపకు’ వస్తున్న ఎమ్మెల్యేల్ని జనం నిలదీస్తున్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం నాగలాపురంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని అడుగడుగునా మహిళలు నిలదీశారు. అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నామని, బిల్లులు మంజూరు చేయించాలంటూ వృద్ధురాలు ఉన్ని లక్ష్మి, ఆమె కోడళ్లు విజయలక్ష్మి, జయలక్ష్మి ఎమ్మెల్యేను కోరారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే గట్టిగా అరిస్తే బీపీ వస్తుంది తప్ప ఏం ఉపయోగం లేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేలిముద్ర పడడం లేదంటూ బియ్యం ఇవ్వడం లేదని 85 ఏళ్ల వృద్ధుడు ఎల్లప్ప ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రభుత్వం వచ్చిన మూడేళ్ల నుంచి తనకు పింఛన్‌ రావడం లేదని వృద్ధురాలు నరసమ్మ అడిగింది. అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని రాయలచెరువులో ‘అయ్యా నాకు పింఛన్‌ రావడం లేదు. నువ్వు చెయ్యకుంటే ఎవరు చెయ్యల్ల..? ఇంగ నేను ఇట్లే చావల్లా?’ అని రంగమ్మ అనే వృద్ధురాలు ఎమ్మెల్యే పెద్దారెడ్డిని ప్రశ్నించారు. ఇళ్ల మధ్య దారి ఏర్పాటు చేయించాలని ఎస్సీ కాలనీలో వెంకటలక్ష్మి, డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు చెప్పారు. మహిళలు పెద్దఎత్తున సమస్యలు లేవనెత్తుతుండడంతో ఎమ్మెల్యే స్థానిక నాయకులపై మండిపడ్డారు. ‘కాలనీల్లో తిరిగితే ప్రజా సమస్యలు తెలుస్తాయి. నేను ఎమ్మెల్యేగా ఉండాలన్నా, మీరు సర్పంచులుగా ఉండాలన్నా ప్రజల్లో తిరగాలి. వారి సమస్యలు పరిష్కరించాలి’ అని అన్నారు.

* దేశంలో ఇప్పటికే ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) ఉండగా.. దీని తరహాలోనే మరో హైప్రొఫైల్‌ లీగ్‌ రానుంది. ‘గ్రాండ్‌ ప్రీ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ’ అన్న పేరుతో కర్ణాటక బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఈ మెగా ఈవెంట్‌కు శ్రీకారం చుట్టింది. వచ్చేనెల 1 నుంచి 10 వరకు జరిగే ఈ లీగ్‌లో స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్పలాంటి షట్లర్లు పోటీపడనున్నారు. లీగ్‌ ట్రోఫీ, జట్ల జెర్సీలను శనివారం అధికారికంగా ఆవిష్కరించనున్నారు. 8 జట్లు పోటీపడే ఈ లీగ్‌లో విజేత జట్టుకు రూ. 24 లక్షలు, రన్నర్‌పకు రూ. 12 లక్షలు అందజేస్తారు. ఎనిమిది జట్ల పేర్లన్నీ కర్ణాటక రాష్ర్టానికి చెందిన నగరాలు, పట్టణాలకు చెందినవిగానే ఉంటాయి.

* సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తన భార్యకు ప్యాలెస్‌ నిర్మాణానికి విశాఖపట్నంలో రుషికొండను నాశనం చేస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో విలేకరులకు శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రూ.43 వేల కోట్లు దోచుకుని, 34 కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్‌అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం, ఇసుక, ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిపై ఎంతమందిపై కేసులు పెట్టి, చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. విశాఖపట్నంలో ఎంపీ చేస్తున్న అవినీతిపై నోరు ఎందుకు విప్పడం లేదని నిలదీశారు. వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్‌రెడ్డి లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వకాలు జరిపి, భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని ఆరోపించారు. వీరికి సహకారం అందిస్తున్న అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రశ్నించారు. పాత టోల్‌ ఫ్రీ నంబర్‌కే దిక్కులేదని, కొత్తగా ఏసీబీని కలిపేసి ఏసీబీ 14400 అని యాప్‌ ఏర్పాటుచేయడం వల్ల ఏమి ప్రయోజనమని అడిగారు.

*ప్రధాని నరేంద్రమోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ సంబంధిత శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఈ విషయమైన శుక్రవారం సచివాలయం నుంచి ఆయన అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా భీమవరం వస్తున్న ప్రధాని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని సీఎస్‌ తెలిపారు. పశ్చిమ గోదావరి కలెక్టర్‌, ఎస్పీ సహా ఇతర రాష్ట్రస్థాయి వివిధ శాఖల అధికారులు రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకోవాలన్నారు.

* ఈ నెల 6, 7 తేదీల్లో విజయవాడ బందర్‌రోడ్డులోని బాలోత్సవ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశాల్లో రూ.7660 కోట్ల గ్రామ పంచాయతీ నిధుల సమస్య, సర్పంచుల, గ్రామాల సమస్యలపై చర్చించి.., పరిష్కారాల కోసం భవిష్యత్తు ఆందోళనా కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

*ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా పట్నా హైకోర్టుకు బదిలీ అయ్యారు. బదిలీకి రాష్ట్రపతి ఆమోదముద్రవేయడంతో కేంద్ర న్యాయశాఖ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లాను సొంత రాష్ట్రానికి బదిలీ చేస్తూ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

*ఏపీపీఎస్సీలో పారదర్శకత ప్రతిబింబించేలా నియామక ప్రక్రియ ఉండాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ సూచించారు. ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ నేతత్వంలోని కమిషన్‌ సభ్యులు శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా 2018-19 నుంచి 2020-21 సంవత్సరాలకు చెందిన కమిషన్‌ వార్షిక నివేదికలను గవర్నర్‌ ఆవిష్కరించారు. వివిధ దశల్లో ఉన్న నియామకాల ప్రక్రియ గురించి గవర్నర్‌కు గౌతం సవాంగ్‌ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగాల పట్ల యువతకు ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కాలహరణం లేకుండా, నిర్ణీత కాల వ్యవధి మేరకు పని చేయాలని గవర్నర్‌ కమిషన్‌కు సూచించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఏపీపీఎస్సీ సభ్యులు ఆచార్య కె.పద్మరాజు, డా. జి.వి.సుధాకర్‌రెడ్డి ఇతర సభ్యులు పాల్గొన్నారు.

*తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను విచారణ పేరుతో సీఐడీ అధికారులు వేధిస్తున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పీఏ, టెక్కలి నియోజకవర్గ ఐటీడీపీ కోఆర్డినేటర్‌ అణిపి వెంకటేశ్‌ను సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారంటూ గురువారం గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించారు. మళ్లీ శుక్రవారం కూడా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారుల వైఖరిని నిరసిస్తూ టీడీపీ నేతలు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ విషయం ముందుగానే పసిగట్టిన పోలీసులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబును హౌస్‌ అరెస్టు చేయగా, మిగిలిన నేతలు పోలీసుల కళ్లుగప్పి సీఐడీ కార్యాలయం వైపు వచ్చారు. కోవెలమూడి రవీంద్ర (నాని), నసీర్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సీఐడీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు.

* రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీన ఉచిత సామూహిక వివాహాలు(కల్యాణమస్తు) పెద్దఎత్తున నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.

* పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ షాపులు నిర్వహిస్తున్న డీలర్లు ఇక నుంచి ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్లను విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు ఏపీ పెట్రోలియం ఉత్పత్తుల ఆర్డర్‌కు సవరణ చేస్తూ పౌర సరఫరాల శాఖ శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. 20 సిలిండర్లు నిల్వ చేసుకుని అమ్ముకోవచ్చని తెలిపింది.

*ఆదర్శాలు అందరూ చెబుతుంటారు. వాటిని ఆచరణలో చూపించేవారు కొందరే ఉంటారు. వారిలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ కోటేశ్వరరావు ఒకరు. కలెక్టర్‌ తన కుమారుడిని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కలెక్టర్‌ కోటేశ్వరరావు, స్వర్ణలత దంపతులకు దివి అర్విన్‌(4) ఒక్కడే కుమారుడు. స్వర్ణలత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పాలిటెక్నిక్‌ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. వీరు తమ కుమారుడు ఆర్విన్‌ను బుధవారపేటలోని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌లో చేర్పించారు. అక్కడి పిల్లలతో కలిసి ఆర్విన్‌ బొమ్మలకు రంగులు దిద్దుకుంటూ, ఆట వస్తువులతో ఆడుకుంటూ సరదాగా కనిపించాడు. స్వతహాగా కలెక్టర్‌ కోటేశ్వరరావు ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. కలెక్టర్‌ కుమారుడు తమ అంగన్‌వాడీలో చేరడం గర్వంగా ఉందని గ్రేడ్‌1 సూపర్‌వైజర్‌ వసంతమ్మ అన్నారు. అర్విన్‌ ఉదయం 10 గంటలకు స్కూల్‌కు వచ్చి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉంటారని ఆమె తెలిపారు.

*దేవాలయాల్లో బ్రాహ్మణేతరులకు అర్చకత్వం అంటూ తాను అనని దాన్ని అన్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. బ్రాహ్మణేతరులకు అర్చకత్వం బాధ్యతలు ఇస్తామని తానెక్కడా ప్రకటన చేయలేదన్నారు.

* కేంద్రంలోని అధికార బీజేపీ ఆదాయం 2019నాటి లోక్‌సభ ఎన్నికలతో పోల్చుకుంటే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా తగ్గింది. గత నెల 21న కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ)కి బీజేపీ సమర్పించిన వార్షిక ఆడిట్‌ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈమేరకు బీజేపీ సమర్పించిన నివేదికను ఈసీ శుక్రవారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) బీజేపీకి రూ.752.33 కోట్ల నిధులు రాగా, 2019-20లో రూ. 3,623.28 కోట్లు సమకూరాయి. స్వచ్ఛంద విరాళాల ద్వారా రూ. 577.97 కోట్లు, ఎలెక్టొరల్‌ బాండ్ల ద్వారా రూ.22.38 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఎలెక్టొరల్‌ బాండ్ల ద్వారా బీజేపీకి ఎన్నడూలేనివిధంగా రూ. 2,555 కోట్లు ఆదాయం లభించిందని ఈసీ పేర్కొంది. ఖర్చుల పరంగా చూస్తే.. 2020-21లో బీజేపీ రూ. 620.39 కోట్లను వ్యయం చేసింది. కాగా, 2019-20లో రూ. 1,651 కోట్ల మేర ఖర్చయినట్టు బీజేపీ నివేదిక వెల్లడించింది. వీటిలో ఎన్నికలకు సంబంధించిన వ్యయమే దాదాపు రూ. 421.01 కోట్లుగా ఉంది. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికలకు సంబంధించిన ప్రచార వ్యయం గణనీయంగా తగ్గింది. కాగా, అత్యధిక ఆదాయంగల పార్టీగా ఇప్పటికీ బీజేపీనే తొలిస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, 2020-21లో తమకు రూ. 285.76 కోట్ల ఆదాయం లభించినట్టు ఈసీకి సమర్పించిన నివేదికలో కాంగ్రెస్‌ ఇప్పటికే వెల్లడించింది.

*కాంట్రాక్టర్ల నుంచి తెలంగాణ హరిత నిధి(గ్రీన్‌ ఫండ్‌) వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన లైసెన్సు, రెన్యూవల్‌ సమయాల్లో రూ.వెయ్యి గ్రీన్‌ ఫండ్‌ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, బీసీ గురుకులాలకు రూ.35 కోట్లు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

* కాంట్రాక్టర్ల నుంచి తెలంగాణ హరిత నిధి(గ్రీన్‌ ఫండ్‌) వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక ఉపాధి శిక్షణ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాణి కుముదిని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన లైసెన్సు, రెన్యూవల్‌ సమయాల్లో రూ.వెయ్యి గ్రీన్‌ ఫండ్‌ చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, బీసీ గురుకులాలకు రూ.35 కోట్లు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

* భారత్‌-అమెరికా సంబంధాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల పాత్ర ఎంతో కీలకమైందని అమెరికా విదేశీ వ్యవహారాల దౌత్య ప్రతినిధి పాట్రికా లాసినా అన్నారు. హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌లో శుక్రవారం నిర్వహించిన అమెరికా 246వ స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు భారత్‌-అమెరికా దౌత్య సంబంధాల 75 ఏళ్ల ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. అమెరికాతో తెలంగాణ బలమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నట్లు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. భారత్‌-అమెరికా దేశాల మధ్య అనుబంధం నానాటికీ బలోపేతం అవుతుందనేందుకు హైదరాబాద్‌లో భారీ వ్యయంతో నిర్మిస్తున్న కాన్సులేట్‌ కార్యాలయమే నిదర్శనమని హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మేన్‌ అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పాట్రికా ఇక్రిశాట్‌తో పాటు అమెరికా సహకారంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ను సందర్శించారు. నానక్‌రామ్‌గూడలో నిర్మిస్తున్న అమెరికన్‌ కాన్సులేట్‌ కార్యాలయ భవనాన్ని కూడా పాట్రికా సందర్శించారు. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న కార్యాలయాన్ని ఇక్కడకు తరలించే విషయమై పాట్రికా, రీఫ్‌మేన్‌ మంత్రితో చర్చించారు.

*మైనర్‌ బాలికపై అత్యాచార ఘటనను ఖండిస్తూ హోంమత్రిని కలిసేందుకు వెళ్లిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరిని పోలీసులు అడ్డుకోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్‌ బాలికను పబ్‌లోకి అనుమతిచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి, హోంమంత్రి నిద్రపోతున్నారని మండిపడ్డారు.

*జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అఘాయిత్యం ఘటనలో హోంమంత్రి మనుమడు, మజ్లిస్‌ ఎమ్మెల్యే తనయుడి ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. బాధితురాలు నిందితుల పేర్లు చెప్పినా ఎఫ్‌ఐఆర్‌లో వారి పేర్లు నమోదు చేయలేదని ఆరోపించారు. కొంతమంది పోలీసు అధికారులే చట్ట వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హోంమంత్రి మనుమడిపై ఆరోపణలు వస్తే.. హోం మంత్రినే విచారణ చేయించాలని ట్విట్టర్‌ పిట్ట కోరడం విడ్డూరంగా ఉందని కేటీఆర్‌పై సంజయ్‌ మండిపడ్డారు.

* ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) నుంచి ఆధార్‌ నమోదును తప్పనిసరి చేసింది. ఈకేవైసీ పూర్తిచేయడానికి, తొలుత 2022 మార్చి 31 దాకా గడువు పెట్టింది. అప్పటికీ రైతులు స్పందించకపోవడంతో ఆఖరు తేదీని మే 31 వరకు పొడిగించింది. అయినా ఇంకా చాలా మంది రైతుల ఆధార్‌ వివరాలను నమోదు చేయలేదు. దీంతో ఈ-కేవైసీ పూర్తి చేయడానికి జులై 31 దాకా కేంద్రం సమయమిచ్చింది. ఈ మేరకు పీఎం-కిసాన్‌ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటనను ఉంచింది. ఈ పథకం కింద రైతు బ్యాంకు ఖాతాలో ఒక్కో విడత రూ.2 వేల చొప్పున ఆర్థిక సంవత్సరంలో 3 దఫాలుగా మొత్తం రూ.6 వేలు కేంద్రం జమచేస్తోంది.