NRI-NRT

న్యూజెర్సీలో ఎస్పీబీకి ఘన నివాళి

న్యూజెర్సీలో ఎస్పీబీకి ఘన నివాళి

గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం 75వ జయంతి కార్యక్రమం శుక్రవారం నాడు ఎడిసన్ నగరంలో ఘనంగా నిర్వహించారు. కళావేదిక నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి, యాంకర్ సుమ కనకాల, రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, న్యూ జెర్సీ అసెంబ్లీ సభ్యుడు స్టెర్లి స్టాన్లీ, న్యూజెర్సీ పబ్లిక్ యుటిలిటీస్ కమీషనర్ ఉపేంద్ర చివుకులలు ముఖ్యఅథిధులుగా హాజరయ్యారు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మర్షి శాండిల్య శర్మ వేద ఆశీర్వచనంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఎస్పీబీ చిత్రపటానికి పుష్పాలతో నివాళి అర్పించారు. ఉష, రీటా, మౌనిమ, అదితి భావరాజు, మౌనిక, శ్రీకాంత్ సండుగు, సాహితి తదితరులు ఎస్పీబీతో తమ అనుబంధాన్ని సభికులతో పంచుకున్నారు. ఉత్తర అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు విరివిగా పాల్గొన్నారు. కళావేదిక అధ్యక్షులు స్వాతి అట్లూరి, కార్యదర్శి సింగర్ ఉష, కోఆర్డినేటర్ ఉజ్వల్, బోర్డు ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి ధన్యవాదాలు తెలిపారు.

న్యూజెర్సీలో ఎస్పీబీకి ఘన నివాళి
Tribute To SPB In New Jersey By Kalavedika
Tribute To SPB In New Jersey By Kalavedika
Tribute To SPB In New Jersey By Kalavedika