Politics

ఆంధ్రా ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారు? – TNI రాజకీయ వార్తలు

ఆంధ్రా ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారు? – TNI రాజకీయ వార్తలు

*వైసీపీ ప్రభుత్వం ఎక్కడ లేని రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గౌతం రెడ్డి అకాల మరణం కారణంగా ఖాళీ అయిన ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయటం లేదు.. కానీ వైసీపీ నేతలు మాత్రం సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారని పేర్కొన్నారు. వైసీపీకి దమ్ముంటే క్యాబినెట్ మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని నారాయణ సవాల్ విసిరారు. తెలంగాణలో భూములు ధరలు అమాంతం పెరిగాయన్నారు. ఆంధ్రా ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. పేకాటలో మూడు ముక్కలాట జగన్‌లో జీర్ణించుకుపోయిందన్నారు. అందుకే మూడు రాజధానులని అంటున్నారన్నారు. 151 సీట్లు ఇచ్చేంత గొప్ప పని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 23 సీట్లు ఇచ్చేంత చెడ్డ పని టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశారో ప్రజలు ఈ విషయం ఆలోచించుకోవాలన్నారు. తనను జైలుకు పంపించవద్దని జగన్ ప్రధాని కాళ్లు పట్టుకున్నాడన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా కేంద్ర హోం మంత్రిని కలుస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేశారన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు కర్మాగారం నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంచి సమయమన్నారు. ఇది జగన్‌ను ప్రజలే అండమాన్ జైలుకు పంపించే రోజులు దగ్గరేలోనే ఉన్నాయని సీపీఐ నారాయణ పేర్కొన్నారు

* జగన్కు ఆప్షన్ లేదు.. అమరావతి నిర్మాణమే శరణ్యం : కోదండరామ్
రాజధాని అమరావతిని రక్షించుకునేందుకు.. రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 900వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రముఖులు.. రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. రైతులో పోరాటం.. కోర్టు తీర్పు నేపథ్యంలో.. అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా.. ప్రభుత్వానికి ఇంకో దారి లేదని నేతలు తేల్చిచెప్పారు.రాజధాని పరిరక్షణ కోసం అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం.. 900 రోజులకు చేరుకున్న వేళ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్‌, పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ హరగోపాల్‌, సీపీఐ నేత నారాయణ సహా పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. అమరావతి నగరాన్ని అభివృద్ధి చేయడం మినహా.. ప్రభుత్వానికి ఇంకో దారి లేదని తేల్చిచెప్పారు. ఇది రైతుల జీవనోపాధి, హక్కులకు సంబంధించిన అంశమన్న నేతలు.. ఉద్యమంతోనే వాటిని సాధించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు.

*తెలంగాణకు మోదీ చేసిందేమీ లేదు: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
నిర్మల్: రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ.. తెలంగాణకు చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప‌ట్టణ ప్రగ‌తిలో భాగంగా మంత్రి ఇంద్రక‌ర‌ణ్ మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడివాడలో ప‌ర్యటించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల ప‌రిష్కారం, పురోగ‌తిపై ఆరా తీశారు. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కొత్త జిల్లాతో పాటు జిల్లా కోర్టుల‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు.అభివృద్ధితోపాటు ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ప్రజ‌ల‌కు నేరుగా అందుతున్నాయ‌ని, వాటిని స‌కాలంలో అర్హులైన వారంద‌రికీ అందేలా చూసే బాధ్యత అధికారుల‌దేనని స్పష్టం చేశారు. ప‌ల్లె, ప‌ట్టణాల్లో ఎన్నో అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప‌ల్లె, పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు.మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని సీజ‌న‌ల్ వ్యాధుల భారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప‌ల్లె ప్రకృతి కార్యక్రమం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంద‌ని, కొన్ని వార్డుల్లో అనుకున్న స్థాయిలో ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని, అధికారులు అల‌స‌త్వం వీడాల‌న్నారు

*ఒడిశా మంత్రుల మూకుమ్మడి రాజీనామా.. సీఎం ఆదేశాలతోనే!
ఒడిశా మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. స్పీకర్ కూడా తన పదవి నుంచి తప్పుకొంటున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతోనే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గం ఆదివారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనుంది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి వర్గాన్ని సమూలంగా మార్చాలని సంకల్పించారు. అందులో భాగంగానే మంత్రులంతా రాజీనామాలు చేయాలని ఆదేశించారు. దీంతో శనివారం మంత్రులంతా తమ రాజీనామాలను గవర్నర్కు సమర్పించారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా పదవి నుంచి తప్పుకొన్నారు. అయితే తక్షణమే రాజీనామా చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించడం వల్లే వీరంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం 11:45 గంటలకు కొత్తమంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనునన్నట్లు సమాచారం. అయితే మంత్రులకు శాఖల కేటాయింపు విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. సూర్యనారాయణకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.2024 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే నవీన్ పట్నాయక్ మంత్రివర్గాన్ని మార్చుతున్నట్లు తెలుస్తోంది. అంతేగాక జూన్ 20న ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రోమ్, దుబాయ్ను సందర్శించనున్నారు. జూన్ 22న శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే విదేశీ పర్యటనకు ముందే మంత్రివర్గాన్ని మార్చాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒడిశాలో బీజేడీ ప్రభుత్వం మే 29తో మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాష్ట్రంలో ఈ పార్టీ అధికారంలోకి రావడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.

*దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణ సిగ్గుచేటు: Somireddy
భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన దామోదర సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ అన్నారు. అధికార దుర్వినియోగంతోనే బూడిద తొట్టిలు కూలిపోయాయని… 40మంది ప్రాణాలు నష్టపోయేదని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో రోజుకు 10 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. ఓడ రేవు లేని తెలంగాణ రాష్ట్రంలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రక్కనే కృష్ణ పట్నం ఓడరేవు పెట్టుకుని పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వం చేతకాని తనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో టన్ను బొగ్గు ఐదు వేల రూపాయలు అని.. ఇప్పుడైతే టన్ను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు

*అత్యాచార ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలి : భట్టి విక్రమార్క
జూబ్లిహీల్స్ అత్యాచార ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో పబ్‌లపై ప్రభుత్వానికి నియంత్రణ కొరవడినందున, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మైనర్‌లను పబ్‌ల్లోకి ఎలా అనుమతిస్తారని ప్రశ్నంచారు. కేంద్రం ప్రతిపక్షాలపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని, కట్టడి చేయడం కోసం ఈడీని వాడుకుంటున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ప్రతిక దేశ స్వతంత్ర పోరాటం లో కీలకపాత్ర పోషించిందని, సోనియా, రాహుల్ దేశం కోసం అస్తులనే రాసిచ్చిన కుటుంబం సోనియాదని గుర్తుచేశారు

*ఆంధ్రా ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారు?: నారాయణ
వైసీపీ ప్రభుత్వం ఎక్కడ లేని రాజకీయాలు చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. గౌతం రెడ్డి అకాల మరణం కారణంగా ఖాళీ అయిన ఆత్మకూరులో టీడీపీ పోటీ చేయటం లేదు.. కానీ వైసీపీ నేతలు మాత్రం సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారని పేర్కొన్నారు. వైసీపీకి దమ్ముంటే క్యాబినెట్ మొత్తం రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని నారాయణ సవాల్ విసిరారు. తెలంగాణలో భూములు ధరలు అమాంతం పెరిగాయన్నారు. ఆంధ్రా ప్రజల్ని ఏడిపించి జగన్ ఏం సాధిస్తారని ప్రశ్నించారు. పేకాటలో మూడు ముక్కలాట జగన్‌లో జీర్ణించుకుపోయిందన్నారు. అందుకే మూడు రాజధానులని అంటున్నారన్నారు. 151 సీట్లు ఇచ్చేంత గొప్ప పని జగన్మోహన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. 23 సీట్లు ఇచ్చేంత చెడ్డ పని టీడీపీ అధినేత చంద్రబాబు ఏం చేశారో ప్రజలు ఈ విషయం ఆలోచించుకోవాలన్నారు. తనను జైలుకు పంపించవద్దని జగన్ ప్రధాని కాళ్లు పట్టుకున్నాడన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా కేంద్ర హోం మంత్రిని కలుస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేశారన్నారు. ప్రత్యేక హోదా, ఉక్కు కర్మాగారం నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు గురించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు మంచి సమయమన్నారు. ఇది జగన్‌ను ప్రజలే అండమాన్ జైలుకు పంపించే రోజులు దగ్గరేలోనే ఉన్నాయని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.

*ఏపీలో ప్రజలు కాంగ్రెస్‌ను వెలివేయలేదు..: Kamalananda bharati
ఏపీలో ప్రజలు కాంగ్రెస్‌ను వెలివేయలేదని… రూపం మార్చుకుని అదే రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆధ్యాత్మిక వేత్త కమలానంద భారతి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఒక రాష్ట్ర రాజధానిని కులం పేరుతో ఎలా ముడి పెడతారని ప్రశ్నించారు. యావత్ రాష్ట్ర ప్రజలకు, దేశ వాసులకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం కలిగిందని గతంలో రాజధాని ప్రాంత రైతులు సంతోషం వెలిబుచ్చారన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పటి ప్రభుత్వానికి ఎంతో అనుకూలమని తెలిపారు. కేంద్రం ఏపీ ముఖ్యమంత్రిని పెద్దకొడుకుగా చూస్తోందని అన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఇవ్వొచ్చని కేంద్ర ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. అసలు రాజధాని లేకుండా పాలన చేయొచ్చని ఇక్కడి ప్రభుత్వం రుజువు చేసిందని చెప్పారు. ఏపీకి రాజధాని లేకుండా బిల్లును ఒప్పుకోవడం బీజేపీ చేసిన తప్పు అని వ్యాఖ్యానించారు. పార్లమెటులో నిర్ణయం చెయ్యడం కాంగ్రెస్ చేసిన తప్పు అని కమలానాంద భారతి తెలిపారు.

*ప్రజాబలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి: Laxmi parvathi
ప్రజాబలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసి తీరాలని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి టీడీపీకి సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ వేరు.. ఇప్పుడున్న టీడీపీ వేరని పేర్కొన్నారు. టీడీపీ చంద్రబాబు చేతిలోకి వచ్చాక.. మహిళలను ఘోరంగా అవమానిస్తున్నారని, లోకేష్ వచ్చాక పార్టీలో సంస్కారం లోపించిందని విమర్శించారు. మహానాడుకు యాభై వేల మంది హాజరయితే .. తమ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు లక్షల మంది జనం వస్తున్నారని చెప్పారు. జగన్ పాలనలో తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.

*తెలంగాణ వచ్చాక రూపురేఖలే మారిపోయాయి: Indrakaran reddy
రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలొ తెలంగాణ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద్విచ‌క్ర వాహ‌నంపై మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడి వాడలో ప‌ర్య‌టించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల ప‌రిష్కారం, పురోగ‌తిపై గురించి ఆరా తీశారు. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంత‌రం ప‌ద్మ‌శాలి భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి ప్ర‌సంగిస్తూ కొత్త జిల్లాలు ఏర్ప‌డ‌టంతో పాటు జిల్లా కోర్టుల‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు.అభివృద్దితో పాటు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు నేరుగా అందుతున్నాయ‌ని, వాటిని స‌కాలంలో అర్హులైన వారంద‌రికీ అందేలా చూసే బాధ్య‌త అధికారుల‌దేనని స్ప‌ష్టం చేశారు. ప‌ల్లె, ప‌ట్ట‌ణాల్లో ఎన్నో అభివృద్ది ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప‌ల్లె, పట్టణ ప్రగతిలో అందరూ పాల్గొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగ‌స్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. మ‌న ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకుని సీజ‌న‌ల్ వ్యాధుల భారిన ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప‌ల్లె ప్ర‌కృతి కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా కొన‌సాగుతుంద‌ని, కొన్ని వార్డుల్లో అనుకున్న స్థాయిలో ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని, అధికారులు అల‌స‌త్వం వీడాల‌న్నారు.

*దేవరకద్ర‌ను మున్సిపాలిటీగా మారుస్తాం: మంత్రి KTR
మహబూబ్‌నగర్ జిల్లాలోని నియోజకవర్గ కేంద్రం దేవరకద్ర‌ను మున్సిపాలిటీగా మారుస్తామని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్తకోట, దేవరకద్ర‌లలో 100 పడకల ఆస్పత్రుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాలో కొత్తగా 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని తెలిపారు. పల్లెటూర్లకు అపార్ట్‌మెంట్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పేదవాడి ముఖంలో ఆనందం చూడటమే తమ పార్టీ ధ్యేయమన్నారు. ప్రతిపక్షాలు సైంధవ పాత్ర పోషిస్తున్నాయని KTR ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్రం జాతీయ హోదా ఇస్తామని మోసగించిందన్నారు. కృష్ణానదిలో తమకున్న 575 టీఎంసీల నీటివాటా ఇవ్వటంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన సెస్సు వాటా ఇవ్వకపోగా.. రూ. 2 లక్షల కోట్లను ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేస్తున్నారని..ఇందులో నిజం లేక‌పోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించాడు.

*దామోదర సంజీవయ్య విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణ సిగ్గుచేటు: Somireddy
భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన దామోదర సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగంతోనే బూడిద తొట్టిలు కూలిపోయాయని… 40మంది ప్రాణాలు నష్టపోయేదని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో రోజుకు 10 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. ఓడ రేవు లేని తెలంగాణ రాష్ట్రంలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రక్కనే కృష్ణ పట్నం ఓడరేవు పెట్టుకుని పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వం చేతకాని తనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో టన్ను బొగ్గు ఐదు వేల రూపాయలు అని.. ఇప్పుడైతే టన్ను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు

* తెలంగాణ వచ్చాక రూపురేఖలే మారిపోయాయి: Indrakaran reddy
రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలొ తెలంగాణ రూపురేఖ‌లు మారిపోయాయ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. శ‌నివారం ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిలో భాగంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ద్విచ‌క్ర వాహ‌నంపై మున్సిపాటిలోని రాంబాగ్, నాయుడి వాడలో ప‌ర్య‌టించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల ప‌రిష్కారం, పురోగ‌తిపై గురించి ఆరా తీశారు. అభివృద్ధి పనులతోపాటు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంత‌రం ప‌ద్మ‌శాలి భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి ప్ర‌సంగిస్తూ కొత్త జిల్లాలు ఏర్ప‌డ‌టంతో పాటు జిల్లా కోర్టుల‌ను ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు

*రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ ఓటేయొద్దు : తులసిరెడ్డి
జగన్‌, చంద్రబాబులకు రాష్ట్ర బాగుపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయరాదంటూ తమవారికి విప్‌ జారీ చేయాలనీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జగన్‌ ఢిల్ల్లీ కెళ్లింది రాష్ట్ర ప్రయోజనాలకు కానే కాదని తనపై కేసుల మాఫీకి, వివేకా హత్యకేసు నెత్తికి రాకుండా చూసుకొనేందుకు క్విడ్‌ ప్రోకో కోసం వెళ్లాడని ఆరోపించారు.

*ఎస్సీ వర్గీకరణపై తాడోపేడో: మంద కృష్ణ
ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి శ్రీకాకుళం నుంచి మాదిగ సంగ్రామ యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాదిగల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఈ సమస్య పరిష్కరించకుంటే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఎలా తిరగగలరో చూస్తాం’ అని అన్నారు.

*లీకేజీకి కారకులపై చర్యలు తీసుకోవాలి: చంద్రబాబు
విశాఖ జిల్లాలో మళ్లీ విషవాయువు లీక్‌ ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన తర్వాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోకపోవడం విచారకరమని అన్నారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం బాధితులను ఆదుకోవడమే కాకుండా.. నిర్లక్ష్యానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం మీడియాకు జారీ చేసిన ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని అచ్చెన్న ఆరోపించారు.

*జగన్‌ ఢిల్లీ టూర్‌ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలు: కనకమేడల
సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని, హోంమంత్రితో జగన్‌ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పట్లేదు? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని జగన్‌ ఏం అడిగారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. స్వప్రయోజనాల కోసం కేంద్రానికి ఏపీని తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని కాగ్ తప్పుబట్టినా..‎ జగన్ మాత్రం లెక్కలెందుకు బహిర్గతం చేయడంలేదు? అని కనకమేడల రవీంద్ర ప్రశ్నించారు.

*కోనసీమ వివాదం రాజకీయ కుట్ర: పవన్‌ కల్యాణ్కో
నసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్‌ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం జగన్, డీజీపీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఒకే పార్టీలో రెండువర్గాల గొడవను కులఘర్షణగా మార్చారని దుయ్యబట్టారు. కోనసీమ తగులబడుతుంటే బస్సు యాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని ప్రకటించారు. ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందన్నారు. సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్‌ విధానమన్నారు.

*జగన్‌ ఢిల్లీ టూర్‌ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలు: కనకమేడల
సీఎం జగన్‌ ఢిల్లీ టూర్‌ గోప్యతపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని, హోంమంత్రితో జగన్‌ ఏం మాట్లాడారో ఎందుకు చెప్పట్లేదు? అని ప్రశ్నించారు. కేంద్రాన్ని జగన్‌ ఏం అడిగారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. స్వప్రయోజనాల కోసం కేంద్రానికి ఏపీని తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విధానాల్ని కాగ్ తప్పుబట్టినా..‎ జగన్ మాత్రం లెక్కలెందుకు బహిర్గతం చేయడంలేదు? అని కనకమేడల రవీంద్ర ప్రశ్నించారు.

*రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు: లోకేశ్‌
ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ నేత లోకేశ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో టీడీపీ వర్గీయుడు జల్లయ్య హత్య… మరో ఇద్దరిపై దాడి వైసీపీ రాక్షసత్వానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వందలమంది టీడీపీ వర్గీయులను చంపినా సీఎం జగన్ రక్తదాహం తీరదా?.. వైసీపీ నరమేధం ఇంకెన్నాళ్లు? అని ప్రశ్నించారు. ఆపకుంటే తీవ్రపరిణామాలుంటాయని, అన్ని బాకీలు సెటిల్‌చేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు.

*మహిళలపై జరుగుతున్న దారుణాలను Governorకు వివరించాం: Ramakrishna
సీపీఐ నేతల బృందం శుక్రవారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ను కలిశారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలను గవర్నర్‌కు వివరించామన్నారు. జగన్ప్ర భుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనేక ఉదంతాలను ఆధారాలతో సహా గవర్నర్‌కు చూపించామన్నారు. సుబ్రహ్మణ్యంను హత్య చేసి, మృతదేహాన్ని ఇంట్లో వాళ్లకి అప్పగించడం దారుణమన్నారు. కేసు లేకుండా ఉండేలా డబ్బు అశ చూపారని, ఆ జిల్లా ఎస్పీ కూడా ఎమ్మెల్సీని కాపాడే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసును సీబీఐకి ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని గవర్నర్ చెప్పారని రామకృష్ణ తెలిపారు.

*మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి: Kanna
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… దేశ రక్షణలో రాజీ లేదని.. పాక్, చైనాలకు ధీటుగా జవాబు చెప్పారని తెలిపారు. పేదరిక నిర్మూలన మోదీ ఆచరణలో చూపారన్నారు. ప్రజా వైద్యం విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అన్నారు. ఆత్మనిర్బర్ భారత్ కింద 20 లక్లల కోట్లు ప్యాకేజీగా ఇచ్చారన్నారు. పెట్రో ధరల భారం ప్రజలకు పడకుండా పన్నులు తగ్గించారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

*గురజాల అక్రమమైనింగ్‌పై న్యాయపోరాటం చేస్తాం: Yarapatineni
గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల్లో యధేచ్చగా మైనింగ్ జరుగుతుందని తెలిపారు. అధికారులు వారి మెడకు చుట్టుకోకముందే మేల్కొవాలని హితవుపలికారు. అక్రమ మైనింగ్‌పై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు స్పందించాలని యరపతినేని శ్రీనివాసరావు అన్నారు.

*టెండర్‌లో ఆ నిబంధన పెట్టడం సిగ్గుచేటు: Chandrababu
జగన్ సర్కార్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బిల్లుల కోసం కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లకూడదని టెండర్‌లో నిబంధన పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ చర్య రాష్ట్ర పరువు తీసేలా ఉందని, దీనికి ముఖ్యమంత్రి సిగ్గుపడాలన్నారు. కాంట్రాక్టర్లను బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దని టెండర్ డాక్యుమెంట్‌లోనే నిబంధన పెట్టడం రాష్ట్ర దుస్థితికి, అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. కృష్ణా డెల్టా కాలువల మరమ్మతుల టెండర్‌లో బిల్లుల కోసం ఒత్తిడి తేవొద్దని ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలు రాష్ట్రం పరువు తీశాయన్నారు. కాంట్రాక్టర్లు చేసిన పనిలో బిల్లుల కోసం కోర్టుకు వెళ్లవద్దనే నిబంధన పెట్టడం దేశంలో మరే రాష్ట్రంలోను లేదన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లే హక్కు లేదనే నిబంధన పెట్టే హక్కు అసలు జగన్ ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

*పోడు రైతులను మోసగించిన కేసీఆర్‌: షర్మిల
పోడు భూములకు పట్టాలు ఇస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా పట్టాలివ్వకుండా మోసం చేశారని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఖమ్మం జిల్లా కల్లూరు, తల్లాడ మండలాల్లో కొనసాగింది. కల్లూరు మండలం హనుమతండాలో నిర్వహించిన రైతుగోస ధర్నా, తల్లాడ మండలం బిల్లుపాడులో నిర్వహించిన మాటముచ్చట కార్యక్రమాల్లో ఆమె ప్రసంగించారు. అధికారంలోకి రాగానే కుర్చీ వేసుకుని కూర్చుని పోడు సమస్యలు పరిష్కారిస్తానని చెప్పిన కేసీఆర్‌.. అధికారంలోకి వచ్చాకా ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అని చెప్పి రైతులకు బతుకేలేని తెలంగాణ చేశారని ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణ వచ్చాక ఎవరూ బాగుపడలేదు. గ్యాస్‌, కరెంటు, పన్నుల రూపంలో ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తోంది. డిగ్రీలు, పీజీలు చదివిన బిడ్డలు కూలి పనులకు వెళ్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయు. కేసీఆర్‌ మళ్లీ దొంగ హమీలతో మీ ముందుకు వస్తాడు. ఆయన్ను నమ్మవద్దు’’ అని షర్మిల అన్నారు.

*కేంద్ర పెద్దలకు జగన్‌ మసాజ్‌: నారాయణ
ఇకనైనా కేంద్ర పెద్దలకు మసాజ్‌లు చేయడం మాని, విభజన హామీలపై చర్చించాలని సీఎం జగన్‌కు సీపీఐ నేత నారాయణ సూచించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల కోసమే జగన్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నారని, రాష్ట్ర సమస్యలపై మాట్లాడటానికి ఇదే మంచి తరుణమని చెప్పారు. జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లడని, ఒక వేళ వెళితే ఆయనకు ఆయనే ముసుగువేసుకున్నట్టు అవుతుందని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో దివంగత టీడీపీ నేత, ఆయన స్నేహితుడు కళ్లం పానకాలరెడ్డి విగ్రహావిష్కరణకు విచ్చేసిన నారాయణ అక్కడ మాట్లాడారు. జగన్‌ పాలనలో ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగానే టీడీపీ సభలకు జనాలు స్వచ్ఛందంగా భారీగా విచ్చేస్తున్నారని తెలిపారు.

*కోనసీమ వివాదం రాజకీయ కుట్ర: పవన్‌ కల్యాణ్కో
నసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్‌ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం జగన్, డీజీపీ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరును స్వాగతిస్తున్నామని ప్రకటించారు. ఒకే పార్టీలో రెండువర్గాల గొడవను కులఘర్షణగా మార్చారని దుయ్యబట్టారు. కోనసీమ తగులబడుతుంటే బస్సు యాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు. ఘటనపై డీజీపీ స్పందించకుంటే కేంద్రమంత్రి అమిత్‌షాకు లేఖ రాస్తానని ప్రకటించారు. ఏపీలో ఘర్షణలు సృష్టించాలనే కుట్ర జరుగుతోందన్నారు. సమస్యలను పక్కదారిపట్టించడమే వైసీపీ సర్కార్‌ విధానమన్నారు.