Movies

అతడే నా సర్వస్వం

అతడే నా సర్వస్వం

చెన్నై సొగసరి శృతిహాసన్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచుగా అభిమానులతో ముచ్చటిస్తూ తన మనుసులోని భావాల్ని పంచుకుంటుంది. వారు అడిగే ఎలాంటి ప్రశ్నలకైనా నిర్మొహమాటంగా సమాధానాలిస్తుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో సుదీర్ఘంగా ముచ్చటించింది. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలపై తనదైన శైలిలో సమాధానమిచ్చింది. అయితే వీటిలో ఓ ప్రశ్న మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ప్రపంచంలో మీరు బాగా ప్రేమించే వ్యక్తి ఎవరని ఓ అభిమాని అడగ్గా…చిరునవ్వులు చిందిస్తూ తన పక్కనే ఉన్న ప్రియుడివైపు కెమెరా తిప్పి చూపించింది. అతడే తన సర్వస్వం అంటూ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేసింది. గత రెండేళ్లుగా చిత్రకారుడు శంతను హజారికాతో శృతిహాసన్‌ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట ముంబయిలో సహజీవనం చేస్తున్నారు. తమ ప్రణయబంధంలో ఎటువంటి దాపరికం లేదని..సమయం వచ్చినప్పుడు వివాహం గురించి నిర్ణయం తీసుకుంటానని శృతిహాసన్‌ అనేక సందర్భాల్లో చెప్పింది.