NRI-NRT

ఒమన్‌లో కన్నులపండువగా మహానాడు సంబరాలు!

ఒమన్‌లో కన్నులపండువగా మహానాడు సంబరాలు!

ప్రవాసాంధ్రులు టీడీపీ కి సహకరించాలి
మస్కట్ మహానాడులో టీడీపీ సీనియర్ నేతల విజ్జప్తి
అంగరంగ వైభవంగా మస్కట్ మహానాడు వేడుకలు

ఒమన్ రాజధాని మస్కట్‌లో ఎన్ఆర్ఐ టీడీపీ ఒమన్ విభాగం ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు పండుగ వాతావరణంలో జరిగాయి. ఒమన్‌లోని అంబేద్కర్ సేవాసమితి డప్పు వాయిద్యాల నడుమ ఒమన్ కౌన్సిల్ సభ్యులు డ్యాన్యులు చేస్తూ కేరింతలు కొట్టారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో మహానాడు, అన్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు రాష్ట్రం నుంచి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, టీడీపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి సత్య, ఎన్ఆర్ఐ టీడీపీ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి, తెలుగుయువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ హాజరయ్యారు. తొలుత అన్న ఎన్టీఆర్ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. మా తెలుగుతల్లికి మల్లె పూదండతో ప్రారంభం కాగా, జాతరో జాతర… తెలుగుదేశం జాతర.. అంటూ ఆహుతులు తమ వేదికపైకి వచ్చి ఆనందంతో నృత్యాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ… ప్రపంచవ్యాప్తంగా తెలుగుప్రజలకు ప్రత్యేక గుర్తింపుతెచ్చిన తెలుగుదేశం పార్టీకి ప్రవాసాంధ్రులంతా అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాక్షసపాలనను అంతమొందించేందుకు ప్రవాసులు తమవంతు సహకారం అందించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి సత్య మాట్లాడుతూ… పొట్టచేతబట్టుకొని అత్యంత పేద కుటుంబంలో పుట్టి తనతో సహా లక్షలాదిమంది ఖండాంతరాలు దాటి వచ్చామని, నేడు ఒక మూర్ఖుని పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతుంటే భరించలేక ప్రవాసాంధ్రులను చైతన్యవంతం చేయాలని ఇక్కడకు వచ్చినట్లు చెప్పారు. అన్న ఎన్టీఆర్ జీవితం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మోసపుమాటలతో మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి యువతకు మటన్, చికెన్ షాపులు, సారా కొట్లలో ఉద్యోగాలిచ్చాడని దుయ్యబట్టారు. పరిపాలనదక్షుడైన చంద్రబాబు హయాంలో యువత ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకు తిరిగే పరిస్థితులు కల్పించారని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రవాసులంతా తమవంతు సహకారం అందించాలని కోరారు.

t9
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ… నేడు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు పట్టపగలే ధైర్యంగా రోడ్లపై తిరిగే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ యజ్జంలో ప్రవాసులంతా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు అండగా నిలవాలని కోరారు. అంగన్ వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మాట్లాడుతూ… తాము పుట్టిన తెలుగుగడ్డ రుణం తీర్చుకునేందుకు ఎన్నికల సమయంలో ప్రతి ప్రవాసుడు తమ గ్రామాలకు చేరుకొని తెలుగుదేశం విజయానికి మీ వంతు తోడ్పాటును అందించాలని కోరారు. అవినీతి కేసుల్లో 16 నెలలు జైలుజీవితం అనుభవించిన జగన్ రెడ్డి… మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి అరాచకం సృష్టిస్తున్నాడని, నేడు ఎపిలో ఏ వర్గానికీ రక్షణ లేదని ఆందోళన వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ… నేడు ఒమన్ లోని తెలుగువారి కళ్లల్లో ఆనందం చూస్తుంటే అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలా ఉందని అన్నారు. డప్పు వాయిద్యంతో అందరినీ ఉర్రూత లూగించిన రాజు మిత్రబృందానికి అభినందలు తెలిపారు. రెండురోజుల క్రితం ఒమన్ దేశానికి వచ్చిన తమపై ఇక్కడి ప్రజలు ఎనలేని అభిమానం చూపించారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు చేసిన సేవ ఎనలేనిదని, అటువంటి పార్టీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ప్రతి తెలుగువాడిపై ఉందని చెప్పారు. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ మాట్లాడుతూ… ఉత్తరాఖండ్ వరదల సమయంలో అప్పటి ప్రభుత్వం స్పందించకపోయినా చంద్రబాబు అమెరికా పర్యటన రద్దుచేసుకొని వచ్చి 425 మందిని స్వదేశానికి చేరవేశారని తెలిపారు. తెలుగువారు కష్టాల్లో ఉన్నారంటే మెరుపు వేగంతో స్పందించే వ్యక్తి చంద్రబాబునాయుడని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలవడం చారిత్రక అవసరమని అన్నారు.
t8
ఒమన్ మహానాడును ఉద్దేశించి జూమ్ ద్వారా మాజీమంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందేశమిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రవాసాంధ్రులు ఉడతా భక్తిగా చేయగలిగిన సాయం చేయాలని, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలపై గళమెత్తాలని కోరారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ….వృత్తిరీత్యా వివిధ దేశాల్లో ఉండికూడా బాధ్యతను మరువకుండా చంద్రబాబు సీఎం కావాలని అకుంఠిత దీక్షతో మహానాడు నిర్వహిస్తున్న ఒమన్ ప్రవాసాంధ్రులకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఓటుబ్యాంకుగా మరల్చడానికి ప్రవాసులు తమవంతు కృషిచేయాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రానికి సంపద చేరుతుందని, ఇప్పుడు ఎపిలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీసీ ఒమన్ విభాగం నేతలు నల్లి హరిబాబు, మొహమ్మద్ ఇమామ్, జెట్టి గురుమూర్తి, సూరపనేని రాజశేఖర్, సూరపునేని జస్విత, వడ్లపట్ల మురళి, గారపాటి సత్య శ్రీధర్ , తేలప్రోలు వాసుబాబు, ఆమథి సీతారామయ్య, కొడాలి కిరణ్ కుమార్, కంతేటి రాఘవేంద్ర, వేములపల్లి పవన్ కుమార్ , కొర్రపాటి రమేష్ బాబు, సుఖవాసి రవికిరణ్ , తేళ్ల అనిల్ కుమార్ , అమిలినేని గిరిబాబు, గాలి నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.