DailyDose

భారీ అగ్ని ప్రమాదం.. 35 మంది అగ్నికి ఆహుతి.. – TNI నేర వార్తలు

భారీ అగ్ని ప్రమాదం.. 35 మంది అగ్నికి ఆహుతి..   – TNI  నేర వార్తలు

*బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ షిప్పింగ్ కంటైనర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. చిట్టగాంగ్ జిల్లాలోని సీతకుందా ప్రాంతంలోని డిపోలో జరిగిన ఈ ఘటనలో 450 మంది దాకా గాయపడ్డారు. చిట్టగాంగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పోలీస్ అవుట్‌పోస్ట్ దగ్గర విధులు నిర్వరిస్తున్న పోలీసు అధికారి నురుల్ అలమ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. రసాయనాల కారణంగా మంటలు చెలరేగాయని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెప్పారు. 9 గంటలకు అంటుకున్న ఈ మంటలు అర్ధరాత్రి సమయానికి పెద్ద ఎత్తున అలుముకుని పేలుడు సంభవించిందని.. ఆ పేలుడు తర్వాత మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయని తెలిపారు.

వైద్యఆరోగ్య శాఖ అధికారి ఇస్లాం మాట్లాడుతూ.. 450 మందికి పైగా ఈ ఘటనలో గాయపడ్డారని, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు 19 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించేందుకు ఆరు అంబులెన్స్‌లు కూడా అందుబాటులో ఉన్నట్లు చిట్టగాంగ్ అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహ్మద్ ఫరూక్ హుస్సేన్ సిక్దార్ తెలిపారు.

*జూబ్లీహిల్స్ పీఎస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. 42 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలపై కేసు నమోదైంది. మీడియా కథనాల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించారు. అత్యాచారం కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ… 3 రోజుల క్రితం పీఎస్‌ ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతావారిని గుర్తించేపనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

*కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద జాతీయ రహదారిపై అగ్నిప్రమాదం.వెళుతున్న లారీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. అప్రమత్తమైన లారీ డ్రైవర్ రోడ్ పై నిలిపివేత.లారీలో నుండి భారీగా మంటలు,అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది.లారీ విజయవాడ వైపు నుండి ఏలూరు వైపు వెళుతుండగా ప్రమాదం.లారీలో కెమికల్స్ కి సంభందించి లోడు ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

*తూ.గో.జిల్లా:-కొవ్వూరు మండలం కాపవరం హైవే పై రోడ్డు ప్రమాదం.మోటార్ సైకిల్ ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.భర్తమృతి.భార్య పరిస్థితి విషమం కుమారుడు సురక్షితం.

*రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకున్నది. రాష్ట్రంలోని ఆమేర్‌ ప్రాంతంలో ఎనిమిదేండ్ల బాలికను దుండగులు గొంతుకోసి చంపారు. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన బాలిక.. ఆదివారం ఉదయం దడాబాదీ ప్రాంతంలో శవమై తేలింది. ఎవరూ లేని ప్రాంతంలో బాలిక మృతదేహం నగ్నంగా కనిపించిందని జైపూర్‌ అదనపు జీసీపీ సుమన్‌ చౌదరి తెలిపారు.

*కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. హాస్టల్‌లో ఉంటున్న బాలిక లైంగిక దాడికి గురైంది. హాస్టల్‌ నిర్వాహకుడు విజయకుమార్‌ అఘాయిత్యానికి పాల్పడడంతో ఆమె గర్భందాల్చింది. సెలవులో ఇంటికి వచ్చిన బాలికకు గర్భస్రావంకావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు గర్భస్రావం కావడంతో అనుమానంతో తల్లి వాకబు చేయగా లైంగిక దాడి విషయాన్ని తల్లికి వివరించింది.

*మిజోరాంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. లాంగ్లీ జిల్లాలోని సతీక్‌ సమీపంలో హెరాయిన్‌ తరలిస్తున్న ఇద్దరిని మిజోరాం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద 222 గ్రాముల మత్తుమందును స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో దానివిలువ రూ.1.11 కోట్లు ఉంటుందని తెలిపారు. హెరాయిన్‌ను సబ్బు పెట్టెల్లో ఉంచి తరలిస్తున్నారని, మొత్తం 17 సోప్‌ బాక్సులను సీజ్‌చేశామని వెల్లడించారు. మిజోరాంలో జరుగుతున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

*టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు బెదిరింపు కాల్స్‌ వచ్చింది. ‘నీ హత్యకు షూటర్‌ని మా బాస్‌ నియమించాడు’ అని గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసినట్లు చింతమనేని చెబుతున్నారు. ఆగంతకుడి ఫోన్‌కాల్‌పై త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్‌లో చింతమనేని ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో చింతమనేని పేర్కొన్నారు. ఇటీవల ”నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించింది. టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడ్ని. నా లాయర్‌కు సజ్జల వార్నింగ్‌ ఇచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రశ్నించినందుకు నాపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉంది. సీఎం జగన్‌తోపాటు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, నవ్‌జ్యోత్‌సింగ్‌ గ్రేవల్‌తో పాటు స్థానిక పోలీసులు, అధికారులు, సహకరించిన 21 మందిని శిక్షించాలి” అంటూ ఏలూరు మొబైల్‌ కోర్టులో చింతమనేని ప్రభాకర్‌ ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు..

* నేపాల్‌లోని రూపందేహి జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. భైరహవాన్ – పరాసి రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోహిణి నదిలో పడిపోగా.. తొమ్మిది మంది మృతి చెందారు. మరో 23 గాయపడగా.. క్షతగాత్రులను భైరహవాన్‌ మెడికల్‌ కాలేజీకి తరలించగా.. చికిత్స పొందుతున్నారు.

*నేపాల్‌లోని రూపందేహి జిల్లాలో ప్రమాదవశాత్తు బస్సు నదిలో పడిపోయింది. భైరహవాన్ – పరాసి రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోహిణి నదిలో పడిపోగా.. తొమ్మిది మంది మృతి చెందారు. మరో 23 గాయపడగా.. క్షతగాత్రులను భైరహవాన్‌ మెడికల్‌ కాలేజీకి తరలించగా.. చికిత్స పొందుతున్నారు.

* బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో ఘోర అగ్రిప్రమాదం జరిగింది. చిట్టగాంగ్‌లోని కాదమ్రసుల్‌ ప్రాంతంలోని కంటైనర్‌ డిపోలో అర్ధరాత్రి పేలుడు సంభవించింది. దీంతో డిపోలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 35 మంది మరణించారు. వారిలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. మరో 450 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

*చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరుతో పాటు పలు మండలాల్లో ఏటీఎంల వద్ద చేతివాటాన్ని ప్రదర్శించిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను ఒకటో పట్టణ ఎస్‌ఐ సుమన్‌ వెల్లడించారు. జీడీ నెల్లూరు తవణంపల్లె దామలచెరువు కొత్తపల్లెమిట్ట పెనుమూరు ఐరాల తదితర ప్రాంతాల్లోని ఏటీఎంలలో ఇటీవల కొంతకాలంగా కస్టమర్ల దృష్టిని మరల్చి దొంగతనాలు జరిగాయి. కేసులు నమోదు చేసిన పోలీసులు ఏటీఎం దొంగలపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో శనివారం పోలీసులు రెడ్డిగుంట చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. వేలూరు వైపు నుంచి చిత్తూరుకు వస్తున్న కారును ఆపి అందులో ఉన్న కృష్ణగిరికి చెందిన మంజునాథ్‌ ప్రవీణ్‌ ఎన్‌.మంజునాథ్‌లను విచారించగా ఏటీఎంలలో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. దాంతో వారిని అరెస్టు చేసి వారి వద్ద ఉన్న నగదును సీజ్‌ చేశార

*తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ఓ స్కూల్‌ కరస్పాండెంట్‌ కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతుండడంతో బాలిక గర్భవతి అయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాకినాడ కొండయ్యపాలెం రామాలయం ప్రాంతంలో ఉన్న హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో స్థానిక గొడారిగుంటకు చెందిన ఏళ్ల బాలిక తరగతి చదువుతోంది. ఆ స్కూల్‌కు చెందిన వసతిగృహంలో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. బాలికపై కన్నేసిన స్కూల్‌ కరస్పాండెంట్‌ విజయ్‌కుమార్‌ గత కొంత కాలంగా బాలికను భయపెట్టి పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

*మారణాయుధాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది భవానీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జహంగీరాబాద్‌కు చెందిన దుస్తుల వ్యాపారి మహ్మద్‌ హుస్సేన్‌( తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సేల్స్‌మన్‌ మహ్మద్‌ జావీద్‌ లు మారణాయుధాలు విక్రయిస్తున్నారు. వీరిదందాపై పక్కా సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు భవానీనగర్‌ పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ తల్వార్‌ రెండు డ్రాగర్‌ కత్తులు ఒక బటన్‌ కత్తి నకుల్‌ పంచ్‌ రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను భవానీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

*ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో శనివారంనాడు భారీ పేలుడు సంభవించింది. ధోలానా ప్రాంతంలోని రసాయనిక ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. మరో 15 మంది వరకూ గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు.

*శ్రీసత్యసాయి: జిల్లాలని రామగిరి మండలం పోలేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తగలి కాడెద్దులు, రైతు అదెప్ప(40) మృతి చెందాడు. ఇనుప కిరాణా బంకును ఎద్దుల బండిపై తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

* రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నాటు సారా తయారీ, విక్రేతలపై స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(సెబ్‌) వారం రోజుల్లో 560 కేసులు నమోదు చేసింది. 692 మందిని అరెస్టు చేసింది. నాటుసారా 2,940 లీటర్లు స్వాధీనం చేసుకుని 30 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసింది. అక్రమ మద్యం 2,717 లీటర్లు, బెల్ట్‌ షాపుల్లో స్థానిక మద్యం 327 లీటర్లు సీజ్‌ చేసినట్టు సెబ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు సెబ్‌ కమిషనర్‌ రవిశంకర్‌ అయ్యనార్‌ తెలిపారు. నాటుసారా, అక్రమ మద్యం సరఫరా చేస్తున్న 63 వాహనాలను సీజ్‌ చేసి 3,219 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నట్ల వివరించారు. నాటుసారా తయారీకి బెల్లం విక్రయిస్తున్న 16 మందిపై పీడీ యాక్టు నమోదు చేశామన్నారు. గంజాయి సరఫరా చేస్తున్న 13 మందిని అరెస్టు చేసి ఆరు కేసులు నమోదు చేశామని చెప్పారు. వెయ్యి కిలోలకు పైగా గంజాయి సీజ్‌ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామన్నారు. మే 27నుంచి జూన్‌ 2వరకూ సెబ్‌ డీఐజీ రమేశ్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన చర్యల వల్ల అక్రమ మద్యం, గంజాయి వ్యాపారులు జైలుకు వెళ్లారని వివరించారు. రాష్ట్ర సరిహద్దులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ మద్యం అక్రమ రవాణా అడ్డుకొంటున్నామని వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో నాటుసారా స్థావరాలు, తయారీ, రవాణా పసిగట్టి ఎక్కడి కక్కడ ధ్వంసం చేస్తున్నట్లు చెప్పారు.

*దత్తత తీసుకున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించాడు.అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన హనుమంతప్పకు సంతానం లేకపోవడంతో తన బావమరిది కూతురును దత్తత తీసుకున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో దత్తపుత్రిక (12) పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక గట్టిగా కేకలు వేస్తూ, లైంగిక దాడిని అడ్డుకుంది. దీంతో ఆగ్రహించిన హనుమంతప్ప, పక్కనే ఉన్న కట్టెతో బాలిక తలపై కొట్టగా ఆమె స్పృహ తప్పింది. అరుపులు విన్న స్థానికులు అక్కడకి చేరుకుని బాలికను రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

*మారణాయుధాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకులను సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, భవానీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. జహంగీరాబాద్‌కు చెందిన దుస్తుల వ్యాపారి మహ్మద్‌ హుస్సేన్‌(27), తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సేల్స్‌మన్‌ మహ్మద్‌ జావీద్‌(19)లు మారణాయుధాలు విక్రయిస్తున్నారు. వీరిదందాపై పక్కా సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, భవానీనగర్‌ పోలీసులతో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఓ తల్వార్‌, రెండు డ్రాగర్‌ కత్తులు, ఒక బటన్‌ కత్తి, నకుల్‌ పంచ్‌, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నిందితులను భవానీనగర్‌ పోలీసులకు అప్పగించారు.

* రాజశేఖర్ కిడ్నాప్, హత్య కేసును ఛేదించిన పోలీసులు కట్టంగూరు మండలం, రసూల్ గూడలో రాజశేఖర్ ( కిడ్నాప్, హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను డీఎస్పీ నర్సింహా రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజశేఖర్ స్నేహితుడు వెంకన్నే నిందితుడని తెలిపారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితుడు.. రాజశేఖర్ దగ్గర లక్ష రూపాయల అప్పు తీసుకున్నాడు. తిరిగి కట్టమని రాజశేఖర్ ఒత్తిడి చేశాడు. కాగా వెంకన్న, రాజశేఖర్ ఒకే అమ్మాయితో చనువుగా ఉండడంతో రాజశేఖర్‌ని హత్య చేస్తే డబ్బు మిగలడంతో పాటు అమ్మాయి విషయంలో అడ్డంకి లేకుండా అవుతుందని వెంకన్న భావించాడు. ఓ పథకం ప్రకారం రాజశేఖర్‌ను రామచంద్రపల్లికి పిలిపించి తాటి ముంజలు కొట్టే కత్తితో హత్యచేసి అనంతరం మృతదేహాన్ని పూడ్చి పెట్టాడని డీఎస్పీ వెల్లడించారు.

*జూబ్లీహిల్స్ సామూహిక లైంగికదాడి ఘటనకు సంబంధించి పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ఉమర్‌ఖాన్‌ను జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఘటనపై విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన మైనర్‌ బాలుడిని రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. దీంతో ఈ కేసులో నిందితులుగా గుర్తించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

*మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనం తర్వగా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఫడ్నవీస్‌ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఆయన 2020లో వైరస్‌ బారినపడగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.