DailyDose

విజయవాడలో రెచ్చిపోయిన వైకాపా కార్పొరేటర్ వర్గీయులు – TNI నేర వార్తలు

విజయవాడలో రెచ్చిపోయిన వైకాపా కార్పొరేటర్ వర్గీయులు – TNI  నేర వార్తలు

*విజయవాడ భవానీపురంలోని బెరంపార్కులో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి వర్గీయులు బెరంపార్కులో ఫొటోషూట్‌ చేస్తుండగా డబ్బులు కట్టాలని.. ప్రశ్నించిన ఏపీ టూరిజం సిబ్బందిపై దాడి చేశారు. విజయవాడ భవానీపురంలోని బెరంపార్కులో వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. వైకాపా కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి వర్గీయులు బెరంపార్కులో ఫొటోషూట్‌ చేస్తుండగా ఏపీ టూరిజం సిబ్బంది వారించారు. టూరిజం నిబంధనల ప్రకారం ఫొటోషూట్‌కు డబ్బులు చెల్లించాలని కోరారు. అయితే డబ్బులు చెల్లించేందుకు వారు నిరాకరించారు. డబ్బులు కట్టాలని.. ప్రశ్నించిన ఏపీ టూరిజం సిబ్బందిపైనా కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్‌రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారు. దీనిపై పర్యాటక సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు.

*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి, ఆమె భర్త ముప్పసాని రమేశ్తో కలిసి ఓ మహిళపై విచక్షణారహింతగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ మహిళ అని చూడకుండా ఇంటిలోపలికి వెళ్లి మరీ దాడి చేసిన తీరు.. తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*సికింద్రాబాద్ మెట్టుగూడలో జిమ్ ట్రైనర్‌పై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. ఇంటికి వచ్చి మరీ అతనిపై లాఠీ ఝుళిపించారు. ఏమైనా ఉంటే స్టేషన్‌కు ఉదయం వచ్చి మాట్లాడతానని అన్నందుకు లాఠీలు, బూటు కాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన జిమ్ ట్రైనర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విచక్షణా రహితంగా పోలీసులు కొట్టిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

*అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. కొత్తగా నిర్మిస్తున్న ఆపరేషన్‌ థియేటర్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఆ మంటలు ఆస్పత్రిలోని పిల్లల వార్డులోకి విస్తరించాయి. పొగ కమ్ముకోవడంతో పిల్లలు, తల్లిదండ్రులు ఆసుపత్రి నుంచి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

*శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం రాజాంలో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల చిన్నారి ప్రవీణ్తో పాటు.. తల్లి రెయ్య జ్యోతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.*శ్మశానాల్లోని అస్థికలతో వ్యాపారం.. తండ్రీకొడుకులు అరెస్ట్పం జాబ్ లూధియానాలో శ్మశానాలలోని అస్థికలను తాంత్రికులకు విక్రయిస్తున్న ఘటన వెలుగుచూసింది. ఈ దందా నిర్వహిస్తున్న ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. అస్థికలను రూ.లక్షా 50 వేలకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ ముఠా చేస్తున్న వ్యాపారం గురించి పోలీసులకు తెలిసింది.

*ఒంగోలు జిల్లా మంత్రి జోగి రమేష్ కు తప్పిన
కారు ప్రమాదం ఒంగోలు వద్ద ఘటన.. మంత్రి జోగి రమేష్ కాన్వాయ్ లో ప్రమాదం.. ఢీకొన్న రెండు కార్లు ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో జరిగిన ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన మంత్రి కారు మంత్రి సేఫ్..మరోకారులో వెళ్లి న మంత్రి జోగి రమేష్..

* చిత్తూరు జిల్లా తవణంపల్లి తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ దాడులు. అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ జనార్దన్ నాయుడు ఆధ్వర్యంలో నలుగురు ఇన్స్పెక్టర్ల బృందం సర్ప్రైజ్ విజిట్ . తాసిల్దార్ కార్యాలయం పై అధికంగా ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారుల. రికార్డులను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

*అనుమానాస్పదంగా విద్యార్థి మృతి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఎస్ ఎఫ్ 12A రెండవ అంతస్తు హాస్టల్ కు చెందిన పి యు సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న నెల్లూరుకు చెందిన ఆర్ నితీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పట్టణ ఎస్ఐ తలారి రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ ఘటన ఒక్కసారిగా కళాశాల ఆవరణలో భయాందోళన కలిగించింది. గతంలో అనేక సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ త్రిబుల్ ఐటీ ప్రాంగణంలో భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

*నల్లగొండ: జిల్లాలోని చిట్యాల మండలంలో విషాదం చోటుసుకుంది. మండలంలోని వెలిమినేడులో పిడుగుపాటుకు గీతకార్మికుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన అంతటి శివకుమార్‌ (29) ఆదివారం సాయంత్రం కల్లు గీయడానికి వెళ్లాడు. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఓ చెట్టు కింద నిలబడ్డాడు. కాగా, అదే చెట్టుపై పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

*కేరళ పండళంలోని ఓ రెస్టారెంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. తొలుత సిలిండర్ నుంచి గ్యాస్ లీకై.. పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఫలక్ మజ్లిస్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. రెస్టారెంట్లో పనిచేస్తున్న సల్మాన్, సిరాజుద్దీన్, కన్నన్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రెస్టారెంట్కు భోజనం చేసేందుకు వచ్చిన కస్టమర్లు బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ పేలుడు ధాటికి రెస్టారెంట్లోని వంట సామాగ్రి, కిటికీ తలుపులు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

*మద్యం మత్తులో ఓ హెడ్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మర్కాపురంలోని ఓ హెటల్‌లో హెడ్ కానిస్టేబుల్ నరసయ్య మద్యం సేవించి రభస చేశాడు. నరసయ్యపై ఉన్నతాధికారులకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ జరిపిన అధికారులు… హెడ్ కానిస్టేబుల్‌ను వీఆర్‌కు పంపారు. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ వీరంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

* కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం పెద్దగొల్లపాలెంలో పిడుగు పడి ఇల్లు దగ్ధమైంది. సోమవారం ఉదయం పూరి ఇంటిపై పిడుగు పడటంతో ఒక్కసారికి మంటలు వ్యాపించాయి. పిడుగు శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. వెంటనే గ్రామస్తులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

*తమిళనాడు దిండిగల్లో ఘోర ప్రమాదం జరిగింది. అత్తూరు సమీపంలో ఓ బస్సు.. ఓమ్నీ వ్యాన్ను ఢీకొట్టింది. సరైన సిగ్నల్ ఇవ్వకుండా వ్యాన్ డ్రైవర్ అకస్మాత్తుగా మలుపు తిప్పడమే ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తోంది. బస్సును నియంత్రించేందుకు డ్రైవర్ ప్రయత్నించినా సాధ్యపడలేదు. వ్యాన్, బస్సు ఢీకొని.. పక్కనే ఉన్న ఓ చిన్న షెడ్డువైపు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో వ్యాన్తోపాటు ఆ షెడ్డు, కొన్ని ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.

*పాకిస్థాన్ దేశంలో మరో దారుణం జరిగింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని జీలం నగరంలో ఐదుగురు వ్యక్తులు ఓ గర్భిణి ఇంట్లోకి చొరబడి భర్త ముందే ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.భర్తను తాళ్లతో కట్టేసి గర్భిణీపై సామూహిక అత్యాచారం చేశారు.దాడి అనంతరం మహిళ స్వయంగా ఆస్పత్రికి వచ్చింది. బాధితురాలు తనకు జరిగిన బాధను వివరించడంతో ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె రక్త నమూనాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం లాహోర్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.ఈ కేసును విచారించేందుకు పంజాబ్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

*జగిత్యాల జిల్లాలోని గోవిందుపల్లెలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అన్నం చక్రవర్తి(22) అనే యువకుడిని స్నేహితులు కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడకికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులతో జరిగిన గొడవలే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం పిడుగుపాటుకు ఇద్దరు బలయ్యారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మండలం కురిమిద్ద గ్రామానికి చెందిన తిరుపతయ్య చంద్రకళ దంపతులు తమ కుమారుడితో కలిసి పొలానికి వెళ్లారు. సాయంత్రం వర్షం కురవడంతో వారితో పాటు చుట్టుపక్క పొలాల్లో పని చేసుకుంటున్న కూలీలు సమీపంలో ఉన్న చెట్టు కిందకు చేరారు. అదే సమయంలో పిడుగు పడటంతో సాంబశివుడు( అక్కడికక్కడే మృతి చెందాడు. ఐదుగురు గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న ఒక బాలుడిని ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు పంపించారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి చెందిన కురువ పరమేశ్‌ ( గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా పిడుగుపడి మృతి చెందాడు. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల ఆదివారం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. గాలి దుమారం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్లువిద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. నల్లగొండ మునుగోడులో మోస్తరు వాన పడింది. వరంగల్‌ జిల్లాలో ఆదివారం సాయంత్రం పలు చోట్ల గాలి దుమారంతో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. సంగెం మండలం గవిచర్లలో కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. వరంగల్‌- నెక్కొండ రోడ్డులో వృక్షాలు నేలమట్టం కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

*పల్నాడు జిల్లా ఎర్రబాలెంలో అప్పుల బాధతో మిరియాల పూర్ణచంద్రరావు (46) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తన 70 సెంట్ల భూమితో పాటు 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా వ్యవసాయంలో కలిసిరాక రూ.6.80 లక్షలు అప్పులపాలయ్యాడు. అప్పుతీర్చే మార్గం కనిపించకపోవడంతో శుక్రవారం ఇంట్లోనే గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు గుంటూరు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

*హైదరాబాద్ జూబ్లిహిల్స్ గ్యాంగ్‌రేప్ ఘటన మరువక ముందే ఏపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. కొండయ్యపాలెంలో హెల్పింగ్ హాండ్స్ స్కూల్ కరస్పాండెంట్ విద్యార్థినిని అత్యాచారం చేశాడు. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక‌ హెల్పింగ్ హాండ్స్ స్కూల్ హస్టల్‌లో ఉంటూ చదువు కుంటుంది. ఈ క్రమంలో స్కూల్ కరస్పాండెంట్ విజయ్ కుమార్ బాలికను లోబరుచుకుని అత్యాచారానికి ఒడిగట్టాడు. స్కూల్‌కు సెలవులు ఇవ్వడంతో బాలిక ఇంటికి వెళ్లింది. కొద్ది రోజులకు వాంతులు, రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ మురళీమోహన్ మాట్లాడుతూ..‘‘హెల్పింగ్ హాండ్స్ స్కూల్ కరస్పాండెంట్ వయసు 60 సంవత్సరాలు. బాలికపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు విజయ్ కుమార్‌పై కేసు నమోదు చేశాం. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం. హెల్పింగ్ హాండ్స్ స్కూల్‌లో ఎల్.కె.జీ నుంచి వివిధ తరగతుల్లో చదువుతున్న పిల్లల 40 మంది వరకు ఉన్నారు. బాలికకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. విజయ్ కుమార్ గురించి మరింత లోతుగా విచారణ చేస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

*అన్నమయ్య: జిల్లాలోని రాజంపేట మండలం ఎస్‌ఆర్.పాలెం అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌ నిర్వహించారు. కూంబింగ్ లో భాగంగా 21 మంది ఎర్రచందనం తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 22 గొడ్డల్లు, 2 రంపాలు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడ్డాడు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

*అన్నమయ్య: జిల్లాలోని రాజంపేట మండలం ఎస్‌ఆర్.పాలెం అటవీప్రాంతంలో పోలీసుల కూంబింగ్‌ నిర్వహించారు. కూంబింగ్ లో భాగంగా 21 మంది ఎర్రచందనం తమిళ కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి 22 గొడ్డల్లు, 2 రంపాలు, 14 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇప్పటివరకు ఎన్నిసార్లు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడ్డాడు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
* తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు బాలికలు సహా ఏడుగురు మృతి చెందారు. కడలూరు జిల్లా నెల్లికుప్పం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నెల్లికుప్పం సమీపంలోని గ్రామాలకు చెందిన మహిళలు, బాలికలు ఆదివారం మధ్యాహ్నం కెడిలం నది ఆనకట్ట సమీపంలోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలోనే నీటిలోకి దిగగా ప్రమాదవశాత్తు మునిగిపోయారు.

*రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. బీబీనగర్‌-ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్ల మార్గమధ్యంలో ఓ వ్యక్తి(55) చనిపోయి ఉన్నాడని సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి శరీరంపై నీలం రంగు ప్యాంట్‌, ఎరుపు రంగు బనియన్‌ ఉన్నాయని తెలిపారు.

* జాతీయ రహదారిపై వెళుతున్న లారీకి ఆదివారం వీరవల్లి సమీపంలో మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన డ్రైవర్‌, క్లీనర్‌ కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ లారీలో యాసిడ్‌ డ్రమ్ములు ఉండటంతో మంటలు అదుపులోకి తేవడం చాలా కష్టమైంది. గన్నవరం, గుడివాడ, ఆటోనగర్‌, హనుమాన్‌జంక్షన్‌ల నుంచి అగ్నిమాపక సిబ్బంది తరలివచ్చారు. వాహనాల్లో నీరు చాలకపోవడంతో ఫోమ్‌తో మంటలను అదుపులోకి తెచ్చారు. లారీ ఇంజన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వచ్చి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. లారీ పూర్తిగా కాలిపోయింది.

*అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో మరోసారి విషవాయువు కలకలం రేపింది. శుక్రవారం బ్రాండిక్స్‌ ఆవరణలోని సీడ్స్‌ కంపెనీలో విషవాయువు విడుదలై సుమారు మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. దీంతో కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఆదివారం సుమారు ఉదయం ప్రాంతంలో బ్రాండిక్స్‌ ఆవరణలో ఘాటైన వాసన రావడంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే యాజమాన్యానికి ఫోన్‌ చేసి చెప్పారు. యాజమాన్య ప్రతినిధులు విశాఖలోని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖ నుంచి పీసీబీ బృందం వచ్చి తనిఖీలు నిర్వహించి ప్రమాదం లేదని చెప్పినట్టు తహసీల్దార్‌ రాంబాయి తెలిపారు.

*జగిత్యాల: జిల్లాలోని దొంగ నోట్ల ముఠా గుట్టురట్టయింది. ఐదుగురి నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ నిందితుల నుంచి రూ.15 లక్షల నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా దొంగ నోట్లతో ఎంతమంది మోసం చేశారు? ఎన్ని అవకతవకలకు పాల్పడ్డారు? అసలు ఈ దొంగ నోట్లను ఎక్కడ తయారు చేస్తున్నారు? అనే కోణంలో విచారిస్తున్నారు.

*కాకినాడలో 9వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్‌ విజయ్ కుమారే విద్యార్ధినిపై పలుమార్లు అత్యాచారం చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. కాకినాడ కొండయ్యపాలెంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధిని.. అక్కడి దగ్గర్లోని హాస్టల్‌లో ఉంటోంది. కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి విద్యార్ధినిపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత పలుమార్లు విద్యార్థిని భయపెట్టి, బెదిరించి లోబరుచుకున్నాడు కరెస్పాండెంట్‌ విజయ్‌ కుమార్. సెలవులకు ఇంటికి వచ్చిన కూతురికి తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భస్రావం జరిగిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు షాక్‌ తిన్నారు. అసలేం జరిగిందనే దానిపై తమ కూతురిని ఆరా తీశారు. కరెస్పాండెంట్‌ చేసిన అఘాయిత్యం గురించి చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విజయ్‌ కుమార్‌ పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు.