NRI-NRT

ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు!

ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు!

సిడ్నీలో ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మల్టీ కల్చరల్ నైట్ పేరుతో ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. పలురంగాల తెలుగు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే పలు నృత్య ప్రదర్శనలు, కార్యక్రమాలు జరిగాయి. మన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరానికి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇటువంటి కార్యక్రమాలు ఈ దిశగా ఎంతో సహకరిస్తాయని కార్యక్రమానికి విచ్చేసిన ఆస్ట్రేలియన్ రాజకీయ ప్రముఖులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ సభ్యులు పలు రంగాలలో సేవలు అందిస్తున్న తెలుగు, తమిళ, ఆస్ట్రేలియన్ సేవారంగం ప్రముఖులను సత్కరించారు.ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు!ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ అధ్యక్షులు ప్రశాంత్ కడపర్తి మాట్లాడుతూ.. సిడ్నీ నగరంలో మంచి కార్యక్రమాలకు ప్రజల ఆదరణ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల‌ను, ఆచార వ్యవ‌హారాల‌ను పాటిస్తుండ‌టం, ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లల‌కు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియ‌జెప్పడమే సంస్థ ముఖ్య ఉదేశ్యమని తెలిపారు. ఈ బహు సంస్కృతి కార్యక్రమం అందుకు నిదర్శనమన్నారు.
g6
స్థానిక బౌమాన్ హాల్ బ్లాక్‌టౌన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1500 మంది హాజరయ్యారు. మినిస్టర్ జాఫ్ లీ మాట్లాడుతూ.. కోవిడ్ తర్వాత తాను పాల్గొన్న అతి పెద్ద కార్యక్రమం ఇదేనని, ఈ వేడుక నభూతో నభవిష్యత్ రీతిలో ఉందని చెప్పారు..ఎక్స్ అప్పోజిషన్ లేబర్ లీడర్ జోడి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 8 ఏళ్ళు అయ్యింది అని, ఆ రాష్ట్ర ఏర్పాటు ప్రజల నిజమైన రిపబ్లిక్ ఆకాంక్షను ప్రతిబింబిస్తోందన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ సంస్కృతిపై ప్రజల ప్రేమలా అందంగా ఉందని ఎంపీ జూలియా ఫిన్ వ్యాఖ్యానించారు. కౌన్సిలర్ లివింగ్‌స్టన్ మాట్లాడుతూ తన బాధ్యతలు తెలుగు ప్రజల సహకారంతో మరింత మెరుగ్గా నిర్వహిస్తానని తెలియజేశారు.ఇండియన్ కౌన్సలర్ సంజయ్ ములక మాట్లాడుతూ ఇటు వంటి కార్యక్రమాలు తనకు మాతృదేశాన్ని ఇక్కడే చూస్తున్న ఆనందాన్ని ఇస్తాయని చెప్పారు.
g7
ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు!విదేశాల్లో ఉంటూ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతున్న ఎన్నారైల కృషి ఎనలేనిదని, తెలంగాణ ఎన్నారైలు వేల మైళ్ల దూరంలో ఉంటున్నా మ‌న‌ససంతా తెలంగాణపైనే ఉంటుందని గోవర్ధన్ రెడ్డి ముద్దం( జనరల్ సెక్రటరీ) అన్నారు. Ec Team ( ప్రశాంత్ కడపర్తి ప్రెసిడెంట్/ వాణి ఏలేటి (వైస్ ప్రెసిడెంట్) గోవర్ధన్ రెడ్డి ముద్దం ( జనరల్ సెక్రటరీ) వినయ్ కుమార్ యమా (ట్రెజరర్) అశోక్ మాలిష్ (పబ్లిక్ ఆఫీసర్), విద్య రెడ్డి సేరి-కల్చరల్ సెక్రటరీ మల్లిఖార్జున్ అవిరేణి (EC) ఈ కార్యక్రమ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు.