DailyDose

మెక్సికోలో పేలిన తుపాకీ‌.. మృతుల్లో ఐదుగురు విద్యార్థులు! – TNI నేర వార్తలు

మెక్సికోలో పేలిన తుపాకీ‌.. మృతుల్లో ఐదుగురు విద్యార్థులు!   – TNI  నేర వార్తలు

*అమెరికాలో తుపాకీ నరమేధం శాంతించడం లేదు. తాజాగా మెక్సికో వీధుల్లో దుండగుల కాల్పుల్లో ఆరుగురు మృతి చెందారు. ఇందులో ఐదుగురు స్కూల్‌ పిల్లలే కావడం గమనార్హం. మధ్య మెక్సికోలో సాయుధులైన దుండగులు.. గువానాజువాటో వీధుల్లో తెగపడ్డారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు స్టూడెంట్స్‌తో(16 నుంచి 18 ఏళ్ల మధ్య వాళ్లు) పాటు ఓ వృద్ధురాలు మృతి చెందింది. చనిపోయిన వాళ్లంతా బారోన్‌ కమ్యూనిటీకి చెందిన వాళ్లేనని గువానాజువాటో మేయర్‌ నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. రెండు వారాల కిందట గువానాజువాటోలోని సెలాయా నగరంలో జరిగిన ప్రతీకార దాడుల్లో పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నారు. డ్రగ్స్‌, చమురు దొంగతనాల నేపథ్యంలోనే ఇక్కడ గ్యాంగ్‌ వార్‌లు జరుగుతున్నాయి. 2006 డిసెంబర్‌ నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పదన మిలిటరీ యాంటీ డ్రగ్‌ ఆపరేషన్‌ వల్ల మెక్సికోలో ఇప్పటిదాకా మూడున్నర లక్షల హత్యలు జరిగాయి.

*ఢిల్లీలోని జామియా నగర్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల పార్కింగ్‌ స్టేషన్‌ వద్ద బుధవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కార్లు, ద్విచక్ర వాహనాలతో సహా దాదాపు వందలాది వెహికిల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. మంటల్లో కాలిబూడిదైన వాటిలో ఈవీ వాహనాలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అందుపులోకి తెచ్చారు.

* ఓ ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్ బ్యాట‌రీ పేలిపోవ‌డంతో.. ఓ గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ఘ‌ట‌న సిద్దిపేట జిల్లాలోని పెద్ద చీకోడు గ్రామంలో బుధ‌వారం తెల్ల‌వారుజామున చోటు చేసుకుంది.వివ‌రాల్లోకి వెళ్తే.. పెద్ద చీకోడు గ్రామానికి చెందిన పుట్ట ల‌క్ష్మీనారాయ‌ణ త‌న ఎల‌క్ట్రిక్ మోపెడ్ వాహ‌నాన్ని ప‌క్క‌నే ఉన్న దుర్గ‌య్య గుడిసె వ‌ద్ద మంగ‌ళ‌వారం రాత్రి పార్కు చేశాడు. బుధ‌వారం తెల్ల‌వారుజామున ఆ వాహ‌నం బ్యాట‌రీ పేలిపోయింది. దీంతో మంట‌లు చెల‌రేగి గుడిసెకు అంటుకున్నాయి. క్ష‌ణాల్లోనే గుడిసె పూర్తి కాలిపోయింది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది.అయితే ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో గుడిసెలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. దుర్గ‌య్య కుటుంబ స‌భ్యులు గుడిసెకు కొద్ది దూరంలో నిద్రిస్తున్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

*బాలిక‌లు, మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు, వేధింపుల ఘ‌ట‌న‌లు కొన‌సాగుతున్నాయి. తాజాగా నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. క‌దులుతున్న బ‌స్‌లో మైన‌ర్ బాలిక‌పై ముగ్గురు వ్య‌క్తులు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డిన ఉదంతం బిహార్‌లోని బెటియా ప్రాంతంలో క‌ల‌క‌లం రేపింది. బస్‌లో స్ప్ర‌హ కోల్పోయిన స్ధితిలో బాలిక క‌నిపించ‌డంతో ఈ దారుణం వెలుగుచూసింది.

* పాక్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్‌ వ్యాన్‌ వంద అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది దుర్మరణం పాలయ్యారు. జోబ్‌ నేషనల్‌ హైవేపై ఖిల్లా సైఫుల్లాకు సమీపంలో ప్రమాదం జరిగినట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో 23 మంది ఉన్నారని, ఇందులో 22 మంది మరణించినట్లు పేర్కొంది.

*మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న విదేశీ మహిళను దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్వచ్ఛమైన కొకైన్ను క్యాప్సూళ్లలో నింపి.. పొట్టలో దాచుకొని స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు మొత్తం 51 క్యాప్సూళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్రికాలోని మాళవి దేశానికి చెందిన ఆ మహిళ… ఇథియోపియా మీదుగా దిల్లీకి వచ్చిందని అధికారులు తెలిపారు. గ్రీన్ ఛానెల్ను దాటే క్రమంలో ఆమె పట్టుబడిందని చెప్పారు.

*ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు పీఎస్‌ వద్ద దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. దుకాణం నుంచి వస్తున్న మంటలను అదుపు చేస్తుండగా మంటలు ఎగిసిపడి గ్యాస్ సిలిండర్‌ పేలింది. దీంతో హెడ్‌ కానిస్టేబుల్‌కు గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

*కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. విజయనగరం నుండి విజయవాడ వెళ్తున్న స్విఫ్ట్ కారు అదుపుతప్పి కల్వర్టు గోడను ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో మానేపల్లి లక్ష్మణరావు (22) అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి షేక్ బషిర్ (27) విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఉప్ప‌ల్ ప‌రిధిలోని మ‌ల్లాపూర్ చౌర‌స్తాలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయిని మ‌హారాష్ట్ర‌కు త‌ర‌లించేందుకు య‌త్నించిన న‌లుగురు వ్య‌క్తుల‌ను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా స‌భ్యుల‌కు చెందిన కారులో నుంచి 125 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసులు నిర్ధారించారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించి, గంజాయి ర‌వాణాను అడ్డుకున్నారు.

*మహారాష్ట్రలోని పుణేలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పుణేలోని ఔంధ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్ రూఫ్ టాప్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ వాణిజ్య సముదాయం పదో అంతస్తులో ట్రూ ట్రాంప్ ట్రంప్ అనే రెస్టారెంట్ ఉన్నది. బుధవారం తెల్లవారుజామున రెస్టారెంట్ లోపలి భాగంలో మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెస్టారెంట్‌ మొత్తం వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతంలో పెద్దఎత్తున పొగలు వ్యాపించాయి.

*అనంతపురం: జిల్లాలోని నార్పల మండలం వెంకటంపల్లిలో నీటి గుంతలో పడి రెండు కాడెద్దులు మృతి చెందాయి. నీళ్లు తాపడం కోసం ఎద్దులను రైతు మునేంద్ర నీటి గుంత వద్దకు తీసుకెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఎద్దుల బండి నీటి గుంతలోకి జారి వెళ్లడంతో రెండు కాడెద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. కాడెద్దుల మృతితో రైతు విషాదంలో మునిగిపోయాడు.

*జరుగుమల్లి మండలం బిట్రగుంట దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనడంతో పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

*పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని మోసం చేసి ముఖం చాటేసిన యువకుడిపై మంగళవారం పోలీసులు కేసునమోదు చేశారు. ఎస్‌ఐ కె.రామకృష్ణ వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం కురుకురు గ్రామానికి చెందిన 20 ఏళ్ల వయసున్న ఇంజనీరింగ్‌ విద్యార్థి తమ కుమార్తె(20)ను మోసం చేశాడంటూ గోపాలపురం మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన తల్లిదం డ్రులు ఫిర్యాదు చేశారన్నారు. ఇద్దరికీ తమ బంధు వుల ఇంటి జరిగినా ఓ శుభకార్యంలో పరిచయాలు ఏర్పడి, కొద్దిరోజులు ఫోన్‌లో మాట్లాడుకున్నారని, అది కాస్త ప్రేమగా మారి, నిన్ను పెళ్ల చేసుకుం టానని నమ్మించి తన అవసరాలు తీర్చుకున్న యువ కుడు ఇప్పుడు తమ కమార్తెను వద్దంటున్నాడని, పెళ్లి గురించి మాట్లాడితే తమ అంతు చూస్తానని బెదిరిస్తున్నట్టు యువతి తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.

*మద్యం మత్తులో ఓ ఇంట్లోకి చొరబడిన ముగ్గురు వ్యక్తులు.. బయట నిద్రిస్తున్న వ్యక్తికి నోట్లో గుడ్డలు కుక్కి.. కాళ్లు, చేతులు కట్టిపడేసి.. ఇంట్లో నిద్రిస్తున్న ఆయన కోడలిపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ బయటకు రావడంతో వారు పారిపోయారు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు… సోమవారం రాత్రి ఆ మహిళ తన భర్త, కుమార్తెతో ఇంట్లో నిద్రిస్తోంది. మామ ఇంటి బయట మంచంపై పడుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఆమె భర్త బహిర్భూమికి వెళ్లాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన తలారి హనుమేష్‌, పాటప్ప, కృష్ణమూర్తి మద్యం మత్తులో ఆ ఇంట్లోకి చొరబడ్డారు. బయట ఉన్న ఆమె మామకు నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు, చేతులు కట్టేశారు. మహిళపై అత్యాచారయత్నం చేశారు. ఆమె గట్టిగా కేకలు వేస్తూ.. వారి నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. చుట్టుపక్కల వారు లేచి వచ్చేసరికి నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు, భర్తతో కలిసి బాధితురాలు కోసిగి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యా దు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

*ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బాలిక తండ్రి కుప్పం పట్టణంలో జ్యూస్‌ బండి నడుపుతున్నాడు. రాజస్థాన్‌ నుంచి తరలివచ్చిన ఈ కుటుంబం పట్టణంలో నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి అతడి ఆరేళ్ల కుమార్తె ఆరుబయట ఆడుకుంటుండగా.. కుప్పం కొత్తపేట రామ్‌నగర్‌కు చెందిన శ్రీధర్‌ (45) అటుగా వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న అతడు.. బాలికను మభ్యపెట్టి పక్కనే ఉన్న పాడుబడ్డ భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు శ్రీధర్‌కు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను కుప్పం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

*ఆ వ్యక్తిది ఎంత విషాదాంతం! ప్రాణం నిలిపేందుకు తరలిస్తుంటే ఆ అంబులెన్స్‌ ప్రమాదం బారినపడింది. తీవ్రగాయాలు కావడంతో ఆ రోగి దుర్మరణం పాలయ్యాడు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీకి చెందిన దనిబాబు(34) చర్లలో ఫెర్టిలైజర్‌ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన మంగళవారం ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను భద్రాచలం తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో కొత్తగూడెం తరలిస్తున్నారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం వద్ద ముందుగా వెళ్తున్న ఓ వాహనాన్ని అంబులెన్స్‌ ఓవర్‌టెక్‌ చేసేక్రమంలో కర్ర లోడుతో వచ్చిన లారీని ఢీకొట్టింది. అంబులెన్స్‌లో ఉన్న దనిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.

*ఆ వ్యక్తిది ఎంత విషాదాంతం! ప్రాణం నిలిపేందుకు తరలిస్తుంటే ఆ అంబులెన్స్‌ ప్రమాదం బారినపడింది. తీవ్రగాయాలు కావడంతో ఆ రోగి దుర్మరణం పాలయ్యాడు. కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో ఈ ఘటన జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం విజయపురికాలనీకి చెందిన దనిబాబు(34) చర్లలో ఫెర్టిలైజర్‌ షాపు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన మంగళవారం ఆస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆయన్ను భద్రాచలం తీసుకెళ్లారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో కొత్తగూడెం తరలిస్తున్నారు. బూర్గంపాడు మండలం లక్ష్మీపురం వద్ద ముందుగా వెళ్తున్న ఓ వాహనాన్ని అంబులెన్స్‌ ఓవర్‌టెక్‌ చేసేక్రమంలో కర్ర లోడుతో వచ్చిన లారీని ఢీకొట్టింది. అంబులెన్స్‌లో ఉన్న దనిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు.

*యాప్‎ల ద్వారా అప్పు తీసుకున్న మహిళకు ఉద్యోగుల నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మహిళ ఫొటోను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి వాట్సాప్ లో పోస్టింగ్ చేశారు. తీసుకున్న అప్పు చెల్లించకపోతే ఈ ఫొటోను ఆమె స్నేహితులకు పంపుతామని బెదిరింపులకు దిగారు. మహిళల మొత్తం 20 యాప్‎ల ద్వారా అప్పు తీసుకున్నారు. 20 వాట్సాప్ నంబర్ల ద్వారా అసభ్యకర మెసేజు పంపారు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడిని ఈ తరహాలోనే వేధింపులు గురి చేశారు. రెండు ఘటనలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

*దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటి వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళేందుకు చింతమనేని ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. బయటకు వెళ్ళడానికి పోలీసులు అంగీకరించలేదు. కోర్టు వాయిదాకు వెళ్లాలని చింతమనేని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. టీడీపీ నేతలు గన్ని వీరాంజనేయులు, బడేటి చంటి తదితరులు చింతమనేని ఇంటికి చేరుకున్నారు.

* జ్యూస్‌లో మత్తు మందు కలిపి బంగారు గొలుసును దొంగిలించిన ఘటన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్‌ బోయినపల్లికి చెందిన పోచమ్మ కూలీ. మంగళవారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చి బయట కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. జీడిమెట్ల మార్కండేయనగర్‌కు చెందిన సంతోషి (32) పోచమ్మ వద్దకు చేరుకుని మాయమాటలు చెప్పి మత్తు మందు కలిపిన జ్యూస్‌ ఇచ్చింది. పోచమ్మ స్పృహ కోల్పోతున్న సమయంలో మెడలోని తులం బంగారు గొలుసు, చెవిపోగులు, 10 తులాల కాళ్ళ పట్టీలు దొంగతనం చేసి పరారైంది. గంట తర్వాత కోలుకున్న పోచమ్మ స్థానికుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సంతోషిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

*ప్రకాశం జిల్లా జరగుమిల్లి మండలం బిట్రగుంట వద్ద.. రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో.. ఓ ట్రావెల్ బస్సు రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టటంతో ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో సుమారు 20మందికి గాయాలయ్యాయి. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు.. రహదారిపై ఉన్న లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. డ్రైవర్, క్లీనర్ లకు తీవ్రగాయాలుకాగా.. మరో 18 మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయపడ్డారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

* ఓ న‌లుగురు స్నేహితులు ఈత‌కు వెళ్లారు. ఇద్ద‌రు కాలువ ఒడ్డుపై కూర్చొని ఎంజాయ్ చేస్తుండ‌గా, మ‌రో ఇద్ద‌రు నీటిలోకి దిగారు. వీరిద్ద‌రిలో ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘ‌ట‌న కాగ‌జ్‌న‌గ‌ర్ మండ‌ల ప‌రిధిలోని నామాన‌గ‌ర్ గ్రామ స‌మీపంలోని పెద్ద‌వాగు వ‌ద్ద చోటు చేసుకుంది.