NRI-NRT

న్యూజెర్సీ లో ఘనంగా ‘ఆట’ సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు

న్యూజెర్సీ లో ఘనంగా  ‘ఆట’ సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు

‘ఆటా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 17వ మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహాసభలలో భాగంగా న్యూజెర్సీలో ఆటా సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నాట్యం, జానపదం ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. కాన్ఫరెన్స్ డైరెక్టర్ రఘువీర్ రెడ్డి, విజేతలను అభినందించి గొప్ప ప్రదర్శనలు ఇచ్చినందుకు, పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూజెర్సీ సయ్యంది పాదం బృందానికి అభినందనలు తెలిపారు. న్యూజెర్సీ ఆటా కోఆర్డినేటర్ ఇంద్రకరణ్ రెడ్డి, వాలంటీర్లకు, న్యూజెర్సీ ఆటా టీమ్ రాజ్ చిలుముల, రీజినల్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆటా బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు, మెమోంటోలను అందించారు.
Whats-App-Image-2022-06-05-at-7-21-00-PM
న్యూజెర్సీ విజేతల వివరాలు :
సోలో నాన్ క్లాసికల్ సీనియర్ – నేహా రెడ్డి వంగపాటి
సోలో నాన్ క్లాసికల్ జూనియర్ – సంజన నూకెళ్ల
సోలో సీనియర్ క్లాసికల్ – మెగానా మధురకవి
సోలో జూనియర్ క్లాసికల్ – జాన్వీ ఇరివిచెట్టి
నాన్ క్లాసికల్ గ్రూప్ జూనియర్ – నిషా స్కూల్ ఆఫ్ డ్యాన్స్
నాన్ క్లాసికల్ గ్రూప్ సీనియర్ – శైలా మండల స్కూల్ ఆఫ్ డాన్స్
గ్రూప్ జూనియర్ – చార్వి పొట్లూరి, శ్రీనికా కృష్ణన్
Whats-App-Image-2022-06-05-at-7-21-31-PM
వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడం పట్ల సయ్యంది పాదం పోటీల ఛైర్ సుధా కొండపు, సలహాదారు రామకృష్ణారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు స్థానిక కోఆర్డినేటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆటా 17వ కన్వెన్షన్ & యూత్ కాన్ఫరెన్స్, మొదటిసారిగా వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటర్ లో జూలె 1 నుంచి 3 వరకు వాషింగ్టన్ డీసీలో అంగరంగ వైభవంగా జరగనుంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్ తో జూలై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరుకానున్నారు. విజయ్ దేవరకొండ, డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు.
Whats-App-Image-2022-06-05-at-7-21-58-PM
Whats-App-Image-2022-06-05-at-7-22-09-PM
Whats-App-Image-2022-06-05-at-7-22-49-PM
Whats-App-Image-2022-06-05-at-8-58-36-PM-1
Whats-App-Image-2022-06-05-at-8-58-36-PM-2
Whats-App-Image-2022-06-05-at-8-58-36-PM-3
Whats-App-Image-2022-06-05-at-8-58-36-PM
Whats-App-Image-2022-06-05-at-9-01-00-PM-1
Whats-App-Image-2022-06-05-at-9-01-00-PM-2-1
Whats-App-Image-2022-06-05-at-9-01-00-PM-2
Whats-App-Image-2022-06-05-at-9-01-00-PM