Movies

ఇండో అమెరికన్‌ గూఢచారి..

Auto Draft

ఇప్పటికే రెండు విజయాలతో ఏడాదిని విజయవంతంగా కొనసాగిస్తున్నది బాలీవుడ్‌ తార ఆలియా భట్‌. కెరీర్‌ పరంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘గంగూభాయ్‌ కథియావాడి’ ఇచ్చిన విజయాలతో పాటు ప్రేమికుడు రణబీర్‌తో పెళ్లి ఆమెకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఉత్సాహంలో ప్రస్తుతం ఓ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నదీ భామ. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ పేరుతో దర్శకుడు టామ్‌ హార్పర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ స్పై థ్రిల్లర్‌లో ఆలియా మాయా సింగ్‌ అనే ఇండో అమెరికన్‌ గూఢచారి పాత్రలో కనిపించనుంది. గాల్‌ గాడట్‌, జామీ డోర్నన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ఇంగ్లండ్‌లో జరుగుతున్నది. ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నది ఆలియా. ఆమెకు ఈ సినిమా హాలీవుడ్‌ ఆఫర్‌తో పాటు మరో గొప్ప మేలు చేసిందంటున్నారు ఆమె స్నేహితులు. ఇటీవల దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ తన 50వ పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఆ పార్టీకి బాలీవుడ్‌ ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ పార్టీనే కోవిడ్‌కు సూపర్‌ స్ప్రెడర్‌ అయ్యింది. షారుఖ్‌ ఖాన్‌, కత్రీనా కైఫ్‌ సహా దాదాపు 50 మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఆలియా ఉండి ఉంటే తప్పకుండా పార్టీకి వెళ్లేదని, ఆమెకూ వైరస్‌ సోకే అవకాశాలు ఉండేవని ఉత్తరాది మీడియా విశ్లేషిస్తున్నది.