Politics

వైకాపా పేరును అలా మార్చుకుంటే మంచింది – TNI రాజకీయ వార్తలు

వైకాపా పేరును అలా మార్చుకుంటే మంచింది   – TNI రాజకీయ వార్తలు

* అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. వైకాపా పేరును వైఫల్యం చెందిన పార్టీగా మార్పు చేసుకోవాలని సూచించారు. వైకాపా పాలకులు అభివృద్ధిని, ప్రజలను అగాథంలోకి నెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారన్నారు. వైకాపా పేరును వైఫల్యం చెందిన పార్టీగా మార్పు చేసుకోవాలని భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి భాజపా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ప్రస్తావిస్తే.. రాష్ట్రంలోని అధికార పార్టీకి ఉలుకెందుకని ప్రశ్నించారు. ఆ పార్టీకి ఎక్కడ తగలాలో అక్కడ తగిలిందని.. అందుకే మాజీ మంత్రులతో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు. ఎవరైనా భాజపా పట్ల చులకనగా మాట్లాడితే ‘ఖబడ్దార్‌’ అంటూ జీవీఎల్‌ హెచ్చరించారు.కేవలం ఒక ఎన్నికకే పరిమితమైన పార్టీగా వైకాపాను జీవీఎల్ పేర్కొన్నారు. రాజకీయాల్లో వ్యాఖ్యలు హుందాగా ఉండాలని.. లేకుంటే రాజకీయ భవిష్యత్తు ఉండబోదని అన్నారు. అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. అభివృద్ధిని, ప్రజలను అగాథంలోకి నెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేశారన్నారు. ఇదే విషయాన్ని నడ్డా ప్రస్తావిస్తే.. అతనిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయటం సరైంది కాదన్నారు. వైకాపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను మళ్లించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తనతో చర్చకు రావాలని రాష్ట్ర ఆర్ధిక మంత్రికి జీవీఎల్ సవాల్‌ చేశారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ కార్డులకు ఎక్కడా వైద్యం అందడం లేదన్నారు. వైకాపా నేతలు మాట్లాడే మాట్లాడే ప్రతి చెత్త మాటను తాము అనువాదం చేసి మరీ తమ పార్టీ ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

*విద్యాశాఖలో మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర: చంద్రబాబు
విద్యాశాఖలోకి మున్సిపల్ స్కూల్స్ విలీనం ప్రభుత్వ కుట్ర అని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పురపాలక స్కూళ్ల విలీన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్‌కు విరుద్ధమన్నారు.విద్యా శాఖలో మున్సిపల్ పాఠశాలల విలీనం ప్రభుత్వ కుట్ర అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలని ఆరోపించారు. నాలుగున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ను పణంగా పెడతారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. విలీన ప్రతిపాదనపై మున్సిపల్ టీచర్ల పోరాటానికి తెదేపా మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు.మున్సిపల్ పాఠశాలలు పట్టణ ప్రాంతంలో పేద, బడుగు వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఎంతో కీలకంగా ఉన్నాయన్నారు. ప్రైవేటు స్కూల్స్ నుంచి కూడా మున్సిపల్ పాఠశాలకు అడ్మిషన్లు వస్తున్నాయని తెలిపారు. కొన్ని పురపాలక పాఠశాలల్లో సీట్లు లేక నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి ఈ ప్రభుత్వానికి తెలీదా ? అని నిలదీశారు. నిన్నటి వరకు ఎయిడెడ్ పాఠశాలలను టార్గెట్ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు మున్సిపల్ పాఠశాలల ఆస్తులపై కన్నేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మున్సిపల్ పాఠశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ ప్రతిపాదనలు హైకోర్టు ఉమ్మడి సర్వీస్ రూల్స్కు విరుద్దంగా ఉన్నాయని ధ్వజమెత్తారు.

*మీకోసం పార్టీని పణంగా పెట్టలేను: cm jagan
ఆరు నెలల పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరు చూస్తామని సీఎం జగన్ అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా చేయని వారిని ఆరు నెలల తరువాత ఉపక్షించేది లేదన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పై సమావేశంలో సీఎం జగన్ మాట్లాడారు. మీకోసం పార్టీని పణంగా పెట్టలేనన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరుపై సమావేశంలో ఐ పాక్ నివేదిక అందించారు. పార్టీ నేతలు ఎవరు ఎలా పని చేస్తున్నారో ఐ పాక్ టీం నివేదిక ఇచ్చింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఏడుగురు ఏమ్మెల్యేలు అసలు పాల్గొన లేదని నివేదిక అందించింది. ఏలూరు, కోవూరు, శ్రీశైలం, మైలవరంలలో అసలు కార్యక్రమం జరగలేదన్నారు.

*ఆ ఘనత జగన్‌ ప్రభుత్వానిదే : టీడీపీ నాయకుడు ఉమా
ఏపీలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమా ఆరోపించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను దుకాణాల వద్ద డ్యూటీ వేసి మద్యాన్ని విక్రయించిన ఘనత జగన్‌దేనని విమర్శించారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు తగ్గడానికి ప్రభుత్వమే కారణమని దుయ్యబట్టారు.రెండు లక్షలమంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు మీకెక్కడిదని ప్రశ్నించారు.టీడీపీ హయాంలో వరుసగా 95 శాతం ఉత్తీర్ణత సాధించగా నేడు ఉత్తీర్ణత ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఇంజినీరింగ్‌, డిగ్రీ కళాశాలలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం ఎందుకు తగ్గిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ చేసి అమ్ముకుంది వూసీపీ నేతలైతే.. మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు చేశారని అన్నారు.

*టీడీపీ అధికారంలోకి వస్తే ఏడాదిలోపే ప్రాజెక్ట్‌ల పూర్తి: కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
జగన్ ప్రభుత్వంపై టీడీపీ నాయకులు విరుచుకుపడ్డాడు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా పడకేసిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంవత్సరంలోపే వేదావతి, గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తామని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. సున్న వడ్డీ పథకం పేరుతో మహిళలను మోసం చేస్తున్నాడని, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్‌తో కుమ్మక్కై ఏపీ ప్రజలను మోసం చేస్తున్నాడని ఎమ్మెల్సీ ఎన్ఎండీ షారుఖ్ ఆరోపించారు. పట్టిసీమ ద్వారా ఆంధ్ర ప్రాంతానికి సాగునీరిచ్చి, శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు అందించాలన్నది చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. టీడీపీ ఎంతో క్రమశిక్షణ గల పార్టీ అని, కోడుమూరు నియోజకవర్గంలో పార్టీ నాయకులు గ్రూప్ రాజకీయాలు మానుకోవాలి పార్టీ కార్యకర్తలకు సూచించారు.

*బండారు సత్యనారాయణకు భయం పట్టుకుంది: పేర్ని నాని
ప్రభుత్వ పధకాలను ప్రతీ ఇంటికి తీసుకెళ్ళడం గడపగడప కార్యక్రమ లక్ష్యమని మాజీమంత్రి పేర్ని నాని ప్రకటించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్ధానికంగా ఉండే సమస్యలను అక్కడికక్కడే పరిష్కారిస్తున్నామని తెలిపారు. సచివాలయ పరిధిలోని అన్ని ఇళ్ళకూ మూడు రోజుల్లో వెళుతున్నామన్నారు. ఎమ్మెల్యే, మంత్రుల పనితీరు పరిశీలిస్తామని తెలిపారు. మాజీమంత్రి బండారు సత్యనారాయణకు భయం పట్టుకుందని ఎద్దేవాచేశారు. దొడ్డి దారిన వచ్చిన ప్రజాప్రతినిధులకే భయం పట్టుకుందని పేర్ని నాని అన్నారు.

*నడ్డా పర్యటనతో ఏపీలో బీజేపీ కొత్త ఉత్సాహం: GVL
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పర్యటనతో ఏపీలో బీజేపీ కొత్త ఉత్సాహం వచ్చిందని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. డొక్కు ఫ్యాన్ పార్టీ మాయలు అందరికీ అర్థమయ్యాయని అన్నారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసేది అప్పుల కోసమే కాదా అని ప్రశ్నించారు. లిక్కర్, ఇసుక మాఫియాలతో రూ.కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. జొన్నాడ వెళితే బీజేపీ నేత సోము వీర్రాజును అడ్డుకున్నారన్నారు. ఏపీని నిషేధిత ప్రాంతంగా ఏమైనా పరిగణిస్తున్నారా అంటూ నిలదీశారు. కేంద్ర సాయం, ఖర్చులు, పథకాలపై చర్చకు సిద్ధమని జీవీఎల్ స్పష్టం చేశారు.

*రంగులపై ఉన్న శ్రద్ద విద్యార్థుల భవిష్యత్‌పై ‌లేదు: Ravipati Sai Krishna
వైసీపీ ప్రభుత్వంపై తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పదో తరగతి ఫలితాలు వచ్చాయన్నారు. టెన్త్ పరీక్షలు నిర్వహించడం ఫలితాలు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేసి కోట్ల రూపాయలు స్వాహా చేశారని, రంగులపై ఉన్న శ్రద్ద విద్యార్థుల భవిష్యత్‌పై లేదని విమర్శించారు.పాఠశాలలో ఉన్నతమైన విద్యపై శ్రద్ద పెట్టలేదని, 71 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫెయిల్ అవ్వడం సిగ్గుమాలిన చర్యని సాయి కృష్ణ అన్నారు. ‘‘పదో తరగతి విద్యార్థుల ఫెయిల్… ప్రభుత్వ పతనానికి నాంది.. మేనమేమ అని చెప్పుకుంటున్న సీఎం.. విద్యార్థుల పట్ల శాపంగా మారారు.. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారిని పాస్ చేయాలన్నారు..’’ అప్రకటిత విద్యుత్ కోతలు కూడా విద్యార్థులు ఫెయిల్ అవ్వదానికి ఒక కారణమని సాయి కృష్ణ అన్నారు.

*దళితుల ఆర్ధికాభివృద్ధికే దళిత బంధు: మంత్రి Talasani
దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రారంభించిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తె లిపారు. బుధవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో 28 మంది దళితబంధు లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ జిల్లా కలెక్టర్ శర్మన్ తో కలిసి వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ BR అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికోసం ప్రభుత్వం కృషిచేస్తుందని చెప్పారు. అభివృద్దిలో ఎంతో వెనుకబడిన దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ఆ లోచన అన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబందు పతకాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ పథకంలో ఒకొక్క లబ్ధిదారుడికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో మీకు అనుభవం ఉన్న రంగంలో పెట్టుబడులు పెట్టి లబ్దిపొందాలని సూచించారు.

*న్యాయమూర్తులను తిట్టిన ‘పంచ్‌’ను జగన్‌ ఎలా కలుస్తారు?: వర్ల
‘‘దళితుడైన తన డ్రైవర్‌ను కిరాతకంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఐదు నిమిషాలు కూడా విచారించలేదు. సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకు టీడీపీ మహిళా నేత గౌతు శిరీషను సీఐడీ అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. శిరీష మాదిరిగా అనంతబాబుతో ఎందుకు వ్యవహరించలేకపోయారు? పోలీస్‌ శాఖ వైసీపీ పార్టీ అనుబంధ విభాగంగా మారిపోయిందా?’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఐడీ సీఎం జగన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పావుగా మారిపోయింది. వారి ఆదేశాలను పాటిస్తూ రాజకీయ వేధింపులకు ఉపయోగపడటం తప్ప ఆ విభాగం వల్ల ప్రజలకు కలుగుతున్న వీసమెత్తు ప్రయోజనం లేదు. న్యాయమూర్తులను దూషించిన పంచ్‌ ప్రభాకర్‌ను దావో్‌సలో సీఎం జగన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఎలా కలుస్తారు? దీనిపై పోలీసులు, సీఐడీ వారిని విచారించాలి’’ అని వర్ల డిమాండ్‌ చేశారు.

*కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం లేదు: ప్రవీణ్‌కుమార్‌
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను మరిచిన కేసీఆర్‌ పాలనపై రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేదని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. ఆయన చేపట్టిన 86రోజుల బహుజన రాజ్యాధికారయాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో ముగించారు. ఈ సందర్భంగా బంగారుగూడెంలో మాట్లాడుతూ కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక భద్రాద్రి ఏజెన్సీకి వచ్చి మూడు రోజులు ఇక్కడే ఉండి పోడు రైతులకు పట్టాలు ఇస్తానని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని ఆరోపించారు. హామీలను మరిచిన కేసీఆర్‌ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చర్మగీతం పడేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. మాయమాటలతో మభ్యపెడుతున్న కేసీఆర్‌ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు

*అంగన్‌వాడీలకు దశలవారీగా శిక్షణ: సత్యవతి
వచ్చే ఎనిమిది నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ టీచర్లకు దశలవారీగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. నగరంలోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అంగన్‌వాడీలకు మంగళవారం ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ (డీవోపీటీ) ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో 3582 మంది అంగన్‌వాడీ టీచర్లతో పాటు 3282 ఇతర సిబ్బంది ఉన్నారన్నారు. ఈ శాఖ పరిఽధిలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేసేందుకు వీరందరికీ నైపుణ్యా భివృద్ధి శిక్షణ అందించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.

*కేటీఆర్‌ విదేశీ పర్యటన ఖర్చు 13.22కోట్లు
మంత్రి తారకరామారావు ఇటీవల జరిపిన విదేశీ పర్యటనలకు రూ. 13.22 కోట్లు ఖర్చయింది. గత నెల 22-26 వరకు స్విడ్జర్‌లాండ్‌లోని దావో్‌సలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలలో మంత్రి పాల్గొన్నారు. అంతకుముందు ఐదు రోజుల పాటు యూకేలోనూ పర్యటించారు. ఆయనతోపాటు ఐటి కార్యదర్శి జయేష్‌ రంజన్‌, మరో 8 మంది అధికారులున్నారు. విదేశీ పర్యటనకు బడ్జెట్టులో ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించింది. అయితే అవి సరిపోవని, అదనంగా రూ. 7.80 కోట్లు కావాలని అధికారులు కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఇలా ఇప్పటికే మొత్తం రూ. 9.80 కోట్లను ఆర్థికశాఖ ఇప్పటికే విడుదల చేసింది. అయితే అదనంగా రూ. 3.42 కోట్లు కావాలని అధికారులు కోరడంతో.. ఆర్థికశాఖ రెండోసారి అదనపు నిధులను మంగళవారం మంజూరు చేసింది. దీంతో యూకే, దావో్‌సలో మంత్రి కేటీఆర్‌ 10 రోజుల ఖర్చు మొత్తం రూ. 13.22 కోట్లకు చేరింది.

*దమ్ముంటే నా ఛాతీపైకి తుపాకీ గురిపెట్టు : Mamata Banerjee
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ మంగళవారం గర్జించారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలవనివ్వబోనని గట్టిగా చెప్పారు. ‘‘నా శరీరంలో రక్తం ఉన్నంత వరకు బెంగాల్ విభజనను అనుమతించను’’ అని స్పష్టం చేశారు. బెంగాల్ విభజన కోసం డిమాండ్ చేస్తున్న కమ్టాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (కేఎల్ఓ) చీఫ్ జిబోన్ సింగ్‌కు ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే తన ఛాతీపైకి తుపాకీ గురి పెట్టాలన్నారు. అలీపుర్‌ద్వార్‌లో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.మమత బెనర్జీ ఉత్తర బెంగాల్ పర్యటన నేపథ్యంలో కోచ్ కమ్టాపూర్ రాష్ట్ర ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తున్న కేఎల్ఓ చీఫ్ జిబోన్ సింగ్ ఓ హెచ్చరిక చేశారు. ‘‘మమత బెనర్జీకి చెప్తున్నాను. కోచ్ కమ్టాపూర్‌లో అడుగు పెట్టొద్దు. కోచ్ కమ్టాపూర్‌ ఏర్పాటును మీరు వ్యతిరేకించలేరు లేదా జోక్యం చేసుకోలేరు’’ అని హెచ్చరించారు.

*న్యాయమూర్తులను తిట్టిన ‘పంచ్‌’ను జగన్‌ ఎలా కలుస్తారు?: వర్ల
‘‘దళితుడైన తన డ్రైవర్‌ను కిరాతకంగా హత్య చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఐదు నిమిషాలు కూడా విచారించలేదు. సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకు టీడీపీ మహిళా నేత గౌతు శిరీషను సీఐడీ అధికారులు ఏడు గంటలపాటు విచారించారు. శిరీష మాదిరిగా అనంతబాబుతో ఎందుకు వ్యవహరించలేకపోయారు? పోలీస్‌ శాఖ వైసీపీ పార్టీ అనుబంధ విభాగంగా మారిపోయిందా?’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘సీఐడీ సీఎం జగన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతిలో పావుగా మారిపోయింది. వారి ఆదేశాలను పాటిస్తూ రాజకీయ వేధింపులకు ఉపయోగపడటం తప్ప ఆ విభాగం వల్ల ప్రజలకు కలుగుతున్న వీసమెత్తు ప్రయోజనం లేదు. న్యాయమూర్తులను దూషించిన పంచ్‌ ప్రభాకర్‌ను దావో్‌సలో సీఎం జగన్‌రెడ్డి, మిథున్‌రెడ్డి ఎలా కలుస్తారు? దీనిపై పోలీసులు, సీఐడీ వారిని విచారించాలి’’ అని వర్ల డిమాండ్‌ చేశారు.

*రాజకీయ చిచ్చుకు మంత్రి అంబటి యత్నం
జలవనరుల మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఆయన ఇక్కడ డీజీపీ కార్యాలయంలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు అందచేశారు. ‘‘మంత్రి నా ట్విటర్‌ ఖాతాను మోసపూరితంగా వాడుకున్నారు. నా పేరుతో నకిలీ పోస్టులు సృష్టించి సామాజిక మాధ్యమంలో ప్రచారం చేశారు. రెండు రాజకీయ వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. ఆయన చేసిన పని వెనుక సీఎం జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. వీరంతా కలిసి పన్నిన పెద్ద కుట్రలో ఇదొక భాగం. వీరు, ఇతర కుట్రదారులపై కూడా విచారణ జరిపి చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి’’ అని ఉమ తన ఫిర్యాదులో కోరారు

*అయ్యన్న రౌడీ నా…! చెత్త నా…!
స్థానికులు తమ సమస్యలు చెబితే.. అధికార పార్టీ ఎమ్యెల్యే ఉమాశంకర్‌ గణేశ్‌ టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిపై బూతు పురాణం అందుకున్నారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర గణేశ్‌ ‘గడప గడపకు’ కార్యక్రమం కోసం మంగళవారం గొలుగొండపేటలో పర్యటించారు. పైల భవానీ అనే మహిళ వితంతు పింఛన్‌ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొందరు సెల్‌ఫోన్‌తో ఇదంతా రికార్డు చేస్తున్నట్టు గమనించి… ఎమ్మెల్యే పూనకం వచ్చినట్టుగా ఊగిపోయారు. అయ్యన్నపాత్రుడే గ్రామస్థులతో అలా మాట్లాడించారని భావించి బూతులు అందుకున్నారు. ‘‘ఒరేయ్‌.. రౌడీ నా..! చెత్త నా..! దమ్ము లేక నలుగురు ఆడవాళ్లను పంపించి అడిగిస్తావా? టీడీపీ కుక్కలు ఏమీ పీకలేవు. తలుచుకుంటే అయ్యన్నపాత్రుడిని ఇంటి నుంచి ఇంచి కూడా కదలనివ్వను’’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఆయన వెనకున్న స్థానిక వైసీపీ నాయకులు పింఛన్‌ అడిగిన పైల భవానీని మెడ పట్టుకుని గెంటేశారు. స్థానిక టీడీపీ నేత గొంప చిట్టిబాబుపై దాడి చేశారు.

*‘ఫలితాలు’ రివర్స్‌తో సిగ్గొచ్చిందా: బుద్దా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మంగళవారం ట్విటర్‌ వేదికగా వైసీపీ నేత విజయసాయిరెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు. ’’దైవంతో సమానమైన గురువులను మద్యం షాపుల ముందు నిలబెట్టిన నీచుడు.. గన్నేరుపప్పు రెడ్డి విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నానని ఉపన్యాసం ఇవ్వడం వి డ్డూరం. మూడేళ్లుగా పాఠశాలలు తెరవకుండానే పది మందికి ఇంగ్లీష్‌ నేర్పిన ఘనత నాదే అని చెప్పుకోవడానికి లేని సిగ్గు పదో తరగతి ఫలితాలు రివర్స్‌ అయి తే వచ్చిందా? ఏ 2 కేటు రెడ్డీ?’’ అం టూ బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

*జైల్లో‌ అనంతబాబును వీఐపీలా ట్రీట్‌ చేస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు
గవర్నర్‌ హరిచందన్‌ను టీడీపీ నేతలు కలిశారు. అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, ఎంఎస్ రాజు, పిల్లి మాణిక్యాలరావు, పలువురు నేతలు వున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడారు. సుబ్రహ్మణ్యం హత్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ విచారణ కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయాలని కోరామన్నారు. అనంతబాబు అరాచకాలను గవర్నర్‌కు వివరించామన్నారు. జైల్లో‌ అనంతబాబును వీఐపీలా ట్రీట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుపై పోలీసులు ఏం‌ విచారించారు? అని ఆయన ప్రశ్నించారు. కనీస‌ విచారణ కూడా చేయకుండా పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. సస్పెండ్ డ్రామాతో వైసీపీ పెద్దల సహకారం ఉందన్నారు.

*జైల్లో‌ అనంతబాబును వీఐపీలా ట్రీట్‌ చేస్తున్నారు: నక్కా ఆనంద్‌బాబు
గవర్నర్‌ హరిచందన్‌ను టీడీపీ నేతలు కలిశారు. అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో నక్కా ఆనంద్‌బాబు, పీతల సుజాత, ఎంఎస్ రాజు, పిల్లి మాణిక్యాలరావు, పలువురు నేతలు వున్నారు. ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడారు. సుబ్రహ్మణ్యం హత్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. సుబ్రహ్మణ్యం హత్యపై సీబీఐ విచారణ కోరినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయాలని కోరామన్నారు. అనంతబాబు అరాచకాలను గవర్నర్‌కు వివరించామన్నారు. జైల్లో‌ అనంతబాబును వీఐపీలా ట్రీట్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం హత్య కేసుపై పోలీసులు ఏం‌ విచారించారు? అని ఆయన ప్రశ్నించారు. కనీస‌ విచారణ కూడా చేయకుండా పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. సస్పెండ్ డ్రామాతో వైసీపీ పెద్దల సహకారం ఉందన్నారు. .

*Apలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం: జేపీ నడ్డా
రాజమండ్రి సాంస్కృతిక నగరమని… ఈ గడ్డ నుంచే తెలుగు భాష ప్రారంభమైందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బీజేపీ గోదావరి గర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ ఏపీ నుంచి ప్రస్తుత ప్రభుత్వాన్ని సాగనంపాలని, బీజేపీకి అధికారం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జేపీ నడ్డా తెలిపారు. 2014కు ముందు చాలా ప్రాంతాల్లో కరెంట్, విద్య, వైద్యం ఉండేది కాదని చెప్పారు. అవినీతి అంటే జీవితంలో భాగం కాదని ప్రధాని అన్నారని జేడీ నడ్డా పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో అవినీతికి చరమగీతం పాడామని చెప్పారు

*అప్పులు రూ.5 లక్షల కోట్లకు చేరాయి: mp raghu rama raju
జగన్‌ ప్రభుత్వంలో అప్పులు రూ.5 లక్షల కోట్లకు చేరాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. పథకాలను సగానికి సగం తగ్గించారని చెప్పారు. ఉన్నత విద్యను గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటే ఇంగ్లీష్ అదే వస్తుందన్నారు. నాడు-నేడు ప్రచారం ఇప్పటికైనా ఆపేయాలని సూచించారు. పరీక్షా వాల్యూయేషన్ విధానం వల్లే విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. రిషికొండలో విధ్వంసం చేసిన ప్రదేశంలో మొక్కలు నాటాలన్నారు. ఫ్లాట్ ఏరియాలో మాత్రమే అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారని, ఈ విషయంపై కోర్టుకు వెళ్తానన్నారు.

*ఏపీలో మూడు కోట్ల మందిని జగన్ దోపిడీ చేస్తున్నారు: సోము వీర్రాజు
ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్ల రాజకీయాలతో చిచ్చు రేపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాజమండ్రి లో బీజేపీ నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఏపీ (Ap)లో అభివృద్ధే జరగలేదన్నారు. ఏపీలో ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఇసుక, మట్టిని దోచుకుంటున్నారని ఆరోపించారు. బీసీలకూ అన్యాయం చేస్తున్నారని.. హిందుత్వంపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను దోపిడీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు గిట్టుబాటు ధర లేకుండా మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని.. బయట మార్కెట్లలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని సోము వీర్రాజు ఆక్షేపించారు.

*ఏపీ, తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు: జయప్రద
జన్మభూమి రాజమండ్రి అని..కర్మ భూమి ఉత్తరప్రదేశ్అని.. అవి తనకు రెండు కళ్ళలాంటివని సినీ నటి జయప్రద అన్నారు. బీజేపీ రాజమండ్రి సభలో ఆమె మాట్లాడుతూ అప్పులప్రదేశ్‎ను స్వర్ణాంధ్రగా మార్చటానికి జేపీ నడ్డా వచ్చారన్నారు. అన్నదాత సుఖంగా ఉన్నారా.. అన్నం లేకుండా ఉన్నారా అని జయప్రద ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేయకుండా ఏపీ (Ap)లో ఏడు లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. ఏపీ, తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఆడపిల్ల బయటకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లి గడప దగ్గర ఎదురు చూస్తుంటుందని జయప్రద వ్యాఖ్యానించారు.*