Politics

కేటీఆర్ విదేశీ పర్యటన ఖర్చు 13.22 కోట్లు

కేటీఆర్ విదేశీ పర్యటన ఖర్చు 13.22 కోట్లు

మంత్రి తారకరామారావు ఇటీవల జరిపిన విదేశీ పర్యటనలకు రూ. 13.22 కోట్లు ఖర్చయింది. గత నెల 22-26 వరకు స్విడ్జర్‌లాండ్‌లోని దావోసలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలలో మంత్రి పాల్గొన్నారు.అంతకు ముందు ఐదు రోజుల పాటు యూకేలోనూ పర్యటించారు. ఆయనతోపాటు ఐటి కార్యదర్శి జయేష్‌ రంజన్‌, మరో 8 మంది అధికారులున్నారు. విదేశీ పర్యటనకు బడ్జెట్టులో ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించింది. అయితే అవి సరిపోవని, అదనంగా రూ. 7.80 కోట్లు కావాలని అధికారులు కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. ఇలా ఇప్పటికే మొత్తం రూ. 9.80 కోట్లను ఆర్థికశాఖ ఇప్పటికే విడుదల చేసింది. అయితే అదనంగా రూ. 3.42 కోట్లు కావాలని అధికారులు కోరడంతో ఆర్థికశాఖ రెండోసారి అదనపు నిధులను మంగళవారం మంజూరు చేసింది. దీంతో యూకే, దావోసలో మంత్రి కేటీఆర్‌ 10 రోజుల ఖర్చు మొత్తం రూ.13.22 కోట్లకు చేరింది.