Kids

ట్రైన్ చివరి వెనుక ఆ ‘x’ గుర్తు ఎందుకంటే?

ట్రైన్ చివరి వెనుక  ఆ ‘x’ గుర్తు ఎందుకంటే?

ట్రైన్ చివరి భోగి మీద x అనే గుర్తు పెద్దగా ఎరుపు, తెలుపు లేదా పసుపు రంగులో ఉంటుంది. ట్రైన్ కు చాల భోగీలు ఉంటాయి అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగి లేదా ఏదైనా కారణం చేతనో కొన్ని భోగీలు విడిపోయినట్లయితే స్టేషన్ లో ఉన్న అధికారులు గుర్తించటానికి ట్రైన్ చివరి పెట్టె మీద x అనే గుర్తు తో కంఫర్మ్ చేసుకుంటారు.

స్టేషన్ లో నుంచి ట్రైన్ వెళ్ళేటప్పుడు అక్కడ పని చేస్తున్న వ్యక్తి ట్రైన్ చివరి పెట్టె మీద x అనే గుర్తు ఉందొ లేదో పరిశీలిస్తారు. ఒకవేళ లేనట్లయితే వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇస్తాడు. దాంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యి ఆ ట్రైన్ భోగీలు ఏదైనా ప్రమాదవశాత్తు విడిపోయినట్లు తెలుసుకొని ఆ రూట్లో ఉన్న ట్రైన్ లను నిలిపివేసి వెంటనే ఎక్కడ భోగీలు విడిపోయాయి పరిశీలిస్తారు. అయితే ట్రైన్ మీద ఉన్న ఈ x అనే గుర్తు పగటిపూట మాత్రమే కనిపిస్తుంది.అలాగే రాత్రి సమయంలో ట్రైన్ అన్ని భోగీలతో వెళ్తుంది అని తెలుసుకోడానికి ట్రైన్ చివరి భోగి మీద x అనే గుర్తు కింద ఒక చిన్న రెడ్ లైట్ ఉంటుంది.

ఈ రెడ్ లైట్ ప్రతి అయిదు సెకన్లకు ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది.దింతో స్టేషన్ లో పనిచేసే వ్యక్తి రాత్రి సమయాలలో ట్రైన్ చివరి పెట్టె మీద ఆన్ అవుతున్న రెడ్ లైట్ ను బట్టి ట్రైన్ చివరి పెట్టె గా భావిస్తాడు. దింతో ట్రైన్ అన్ని పెట్టెలతో వెళ్తుంది అని కంఫర్మ్ చేసుకుంటాడు. అలాగే ట్రైన్ చివరి భోగి మీద x అనే గుర్తు,రెడ్ లైట్ తో పాటు LV అని చివరిలో ఉంటుంది. LV అంటే లాస్ట్ వెహికల్ అని అర్ధం.ఈ మూడు కనుక ట్రైన్ చివరి భోగి మీద ఉంటె ట్రైన్ అన్ని భోగీలతో వెళ్తుంది అని అధికారులు కంఫర్మ్ చేసుకుంటారు.