Devotional

భద్రాచలం రామయ్యకు 14న జ్యేష్ఠాభిషేకం

భద్రాచలం రామయ్యకు 14న జ్యేష్ఠాభిషేకం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 14వ తేదీన శ్రీసీతారామచంద్రస్వామి వారికి జేష్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రతిఏటా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ జేష్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం అనేక శతాబ్ధాలుగా కొనసా గుతోంది. ఈ నేపథ్యంలో 13న ఉత్సవాలకు అంకు రార్పణ చేయనున్నారు. 14న 81 కలశాలతో సమస్త నదీ జలాలను ఆవాహన చేసి అనంతరం పంచామృ తాలతో స్వామివారికి అభిషేకం నిర్వహి స్తారు. అలాగే జలాలతో స్వామి వారికి సహస్రధారాభిషేకం చేస్తారు. ఇదిలా ఉండగా 14న జేష్టాభిషేకం నేపఽథ్యం లో రామయ్యకు నిత్యకల్యాణం, తిరువీధిసేవ, పవళింపుసేవ నిలిపివేయనున్నారు. 15నుంచి నిత్యకల్యాణాన్ని యథాప్రకారం కొనసాగిస్తారు.

*ఖైరతాబాద్‌లో మట్టి గణనాథుడు
ఈసారి ఖైరతాబాద్‌ మహాగణపతి మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నది. 1954లో ప్రారంభమైన బడా గణేశ్‌ ప్రస్థానం 68 సంవత్సరాలుగా నిరాటకంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు పీవోపీ ద్వారా వైవిధ్యభరితమైన రూపాల్లో గణపతిని ప్రతిష్ఠించారు. ఖైరతాబాద్‌ గణేశుడి చరిత్రలోనే మొదటిసారిగా మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ప్రత్యేకమైన పద్ధతులతో రూపొందిస్తే విగ్రహం పింగాణిలా మారుతుందని శిల్పి రాజేంద్రన్‌ వెల్లడించారు. ఈ ఏడాది 50 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్‌ గణేశుడి తయారీకి మార్కెట్‌లో దొరికే బాంబే మట్టిని వినియోగిస్తున్నారు. ఐరన్‌ రాడ్స్‌, స్టీల్‌మెష్‌తో విగ్రహ మౌలిక రూపాన్ని తయారు చేసుకొని బాంబే మట్టి, సుతిలి పౌడర్‌ మిశ్రమంతో విగ్రహానికి తుది రూపమిస్తారు. అనంతరం చక్కటి రంగులతో అలంకరిస్తారు. ఇలా తయారైన విగ్రహం అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పీవోపీ కంటే బలంగా ఉంటుందని, పింగాణిలా మెరిసిపోతుందని శిల్పి రాజేంద్రన్‌ తెలిపారు. 4 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసినా విగ్రహం చెక్కు చెదరదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ట్రాలీ మీద ఊరేగించవచ్చని చెప్పారు. ఖైరతాబాద్‌ గణేశుడి విగ్రహాన్ని మట్టితో ప్రతిష్ఠిస్తున్నామని ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ సింగరి సుదర్శన్‌, కన్వీనర్‌ సందీప్‌రాజ్‌ తెలిపారు. గురువారం సాయంత్రం గణేశుడి మండపం వద్ద కమిటీ సభ్యులు సింగరి రాజ్‌కుమార్‌, బాల్‌కుమార్‌, మహేశ్‌ యాదవ్‌తో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు. భారత అత్యున్నత న్యాయస్థానం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కర్రపూజ నిర్వహిస్తామని, వారం, పది రోజుల్లో విగ్రహ నమూనాను విడుదల చేస్తామని తెలిపారు.

*యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్య పూజలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించి తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు.కొండపైన గల పర్వతవర్ధిణి రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.18,07,407 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్‌చార్జి ఈఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు.