Politics

అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఒవైసీ పై కేసు

అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఒవైసీ పై కేసు

ఉద్రిక్తలు పెంచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం(ఐఎఫ్ఎస్ఓ) ఎఫ్ఐఆర్న మోదు చేశారు. అలాగే యతి నర్సింగానంద్పే రును సైతం ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అసదుద్దీన్ ప్రసంగిస్తూ ఉద్రిక్తల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారని ఎఫ్ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. వీరితో పాటు సోషల్ మీడియాతో విధ్వేష వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైతం ఐఎఫ్ఎస్ఓ కేసులు నమోదు చేసింది. జర్నలిస్టు సబా నఖ్వీ, హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే, రాజస్థాన్‌కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ గ్రూపులను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు విఘాతం కలిగించే పరిస్థితులను సృష్టిస్తున్నారనే ఆరోపణలతో వీరిపై కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. విద్వేష వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఇతర సోషల్ మీడియా వినియోగదారులపై ఇదే విధమైన సెక్షన్ల కింద రెండవ ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.