Movies

ఘనంగా నయన్- విఘ్నేశ్​ పెళ్లి

ఘనంగా నయన్- విఘ్నేశ్​ పెళ్లి

కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ హీరోయిన్​ నయనతార-దర్శకుడు విఘ్నేశ్​ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్ సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారని తెలిసింది. సామాజిక ఈ వేడుకకు సంబంధించి కొన్ని ఫొటోలు వైరల్​ అయ్యాయి.
FUzd-PJ9-VUAE-2f7
ఎట్టకేలకు కోలీవుడ్‌ లవ్‌బర్డ్స్‌ హీరోయిన్​ నయనతార-దర్శకుడు విఘ్నేశ్​ పెళ్లి ఘనంగా జరిగింది. సన్నిహితులు, కుటుంబసభ్యుల మధ్య మహాబలిపురంలోని షెరిటన్‌ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు కూడా మెరిశారు. సూపర్​స్టార్​ రజనీకాంత్, హీరో కార్తి,​ బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​, దర్శకుడు అట్లీ, నిర్మాత బోనీకపూర్​, మణిరత్నం కూడా హాజరై సందడి చేశారని తెలిసింది. సోషల్​మీడియాలో వీరి ఫొటోలు వైరల్​గా మారాయి. రజనీకాంత్​ కారు దిగి లోపలికి వెళ్తున్న ఫొటో ఒకటి బయటికి రాగా.. షారుక్ క్రీమ్​ కలర్​ షూట్​, వైట్​ షర్ట్ ధరించి స్టైలిష్​ లుక్​లో దర్శనం ఇచ్చారు. ఈ ఫొటోను షారుక్​ మేనేజర్​ పూజా దద్దాని షేర్​ చేశారు.
kcr6
download high resolution instagram photos
ఇక ఈ పెళ్లిలో కోలీవుడ్ స్టార్​ హీరోలు అజిత్​, విజయ్​తో పాటు టాలీవుడ్​, శాండల్​వుడ్​కు చెందిన సినీ సెలబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. మరోవైపు తమ జీవితాల్లో ప్రత్యేకమైన ఈ రోజుని పురస్కరించుకుని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందితోపాటు 1800 మంది చిన్నారులకు భోజనం అందజేయాలని ఈ జంట నిర్ణయించుకుందట. ఈ మేరకు అభిమాన బృందాలతో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
FUzc-UFza-QAAx-Y9-C
కాగా, పెళ్లికి కాసేపు ముందు విఘ్నేశ్.. నయన్​కు ఉద్దేశిస్తూ​ ఓ ఎమోషనల్​ పోస్ట్ చేశారు. “ఈ రోజు జూన్‌ 9 అంటే ఈరోజు నయన్‌ డే. భగవంతుడు, విశ్వం, నా జీవితంలోని ప్రతిఒక్కరి ఆశీస్సులకు ధన్యవాదాలు..!! మంచి వ్యక్తులు, సమయాలు, అనుకోని మధుర సంఘటనలు, ఆశీస్సులు, షూటింగ్‌ రోజులు, దేవుడి ప్రార్థనలు.. నా జీవితం ఇంత అందంగా ఉండటానికి ఇవే కారణం. ఇక ఇప్పుడు లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌ నయన్‌కు దీన్ని అంకితం చేస్తున్నాను. మై తంగమై.. నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబై వేదికపైకి రావడాన్ని చూసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నా. కుటుంబసభ్యులు, స్నేహితుల సమక్షంలో జీవితంలోని కొత్త అంకాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఉన్నారు” అని విఘ్నేశ్‌ శివన్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అది చూసిన సినీ తారలు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
FUzd-PKAUc-AAPlb3
FUzd-PLt-VEAAVO-B
FUzd-PLu-Vs-AEF4wb