Kids

ఆ స్టేషన్ లో నో నేమ్.. ఎందుకో తెలుసా?

ఆ స్టేషన్ లో నో నేమ్.. ఎందుకో తెలుసా?

మన దేశంలో పేరు లేని రైల్వే స్టేషన్ ఒకటి ఉందంటే మీరు నమ్మగలరా? అది అసంభవం అని అనుకుంటున్నారా? కాదు అది నిజమే.బెంగాల్ లోని బర్ద్వాన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో పూర్వ వర్ధమాన్ జిల్లాలో రైనా, రైనాగర్ అనే రెండు గ్రామాలున్నాయి. రైనా గ్రామానికి దర్లో 2008లో కొత్తగా ఓ రైల్వేస్టేషన్‌ని నిర్మించారు.అప్పటి నుండి ఈ స్టేషన్‌కు పేరనదే లేదు.రైనాగర్ రైల్వే స్టేషన్..రైనా, రైనాగర్ గ్రామాల మధ్య ఉంటుంది.ఐతే… దానికి రైనాగర్ అనే పేరు పెట్టడం రైనా గ్రామ ప్రజలకు నచ్చలేదు.తమ ఊరి పేరు ఎందుకు పెట్టలేదు అని వారు వాదనకు దిగారు.దీనిపై రైల్వే అధికారులు ఆన్సర్ ఇవ్వలేకపోయారు.ఈలోగా రైనాగర్ ఊరి ప్రజలు… ఆల్రెడీ పెట్టిన పేరును తొలగించడానికి వీలు లేదని పట్టుపట్టారు.చెప్పాలంటే… ఈ రైల్వేస్టేషన్… రైనాగర్ కంటే… రైనాకే దగ్గరగా ఉందని రైనా ఊరి ప్రజలు వాదించారు.అంతేకాదు… ఈ స్టేషన్ భవనం ఉన్నది… రైనా గ్రామంలోనే.అందువల్లే ఆ ఊరి ప్రజలు దీనికి రైనా రైల్వేస్టేషన్ అని పెట్టాలని డిమాండ్ చేశారు.దాంతో… పెద్ద గొడవైంది.రెండు ఊళ్ల ప్రజలూ ఘర్షణకు దిగారు.ఇలా ఇరు గ్రామల మధ్య గొడవ మొదలైంది.ఈ నేపధ్యంలో రైల్వే స్టేషన్‌లో ఉన్న నేమ్‌ బోర్డును తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టేషన్‌కు పేరనేదే లేకుండా పోయింది.అయితే ఈ స్టేషన్‌లో రైనానగర్ పేరుతోనే టిక్కెట్లు ఇస్తారు.2017 మార్చి 31న ఓ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించిన ప్రశ్న ఒకటి వచ్చింది.‘ఇండియాలో 7,349 రైల్వేస్టేషన్లు ఉన్నాయి.వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి.ఒక్కదానికి మాత్రం పేరు లేదు.అది ఏది?’ అన్నదే ఆ ప్రశ్న.దాంతో మరోసారి దీనికి సంబంధించినది వార్తల్లో నిలిచింది.