DailyDose

భాగ్యనగరంలో మరో దారుణం – TNI నేర వార్తలు

భాగ్యనగరంలో మరో దారుణం   – TNI  నేర వార్తలు

*కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీ కి చెందిన ముచ్చు స్వర్ణకుమారి, విజయవాడకు చెందిన శివన్నారాయణను 2014 లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు, కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు రేగాయి..కొంతకాలంగా భర్తను వదిలి పుట్టింటికి సమీపంలోని ఆర్టీసీ కాలనీ లో పిల్లలతో కలిసి అద్దెకు ఉంటున్న స్వర్ణకుమారి.. ఈనెల ఆరో తేదీన తండ్రి చనిపోవడంతో స్వర్ణకుమారిని పుట్టింట్లోనే ఉండ మంటూ ఒత్తిడి తెస్తున్న తల్లి వెంకమ్మ.. ఈ విషయంపై గురువారం ఇరువురి మధ్య జరిగిన వాగ్వాదం.. భర్తను వదిలి ఒంటరిగా ఉంటున్న స్వర్ణకుమారి పుట్టింటి వాళ్ళ ఒత్తిడితో మనస్థాపానికి గురై ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుoది.. విషయం తెలుసుకుని హుటాహుటిన ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు.. అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించిన వైద్యులు.. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

*తెలంగాణ రాష్ట్ర రాజధానిలో మరో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు ఆటోడ్రైవర్ సలీమ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*ఏటీఎంలో నగదు జమ చేస్తున్న వ్యక్తి వద్ద రూ.1.92 లక్షలు దొంగతనం చేశారు ముగ్గురు ఆగంతుకులు. గుజరాత్ సూరత్కు చెందిన చందన్కుమార్ నగదు జమ చేసేందుకు జీఐడీసీలోని ఏటీఎంకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఏటీఎంలోకి వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి నగదుతో పాటు సెల్ఫోన్ను లాక్కెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఏటీఎం సీసీటీవీలో నమోదయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

*ఢిల్లీలోని షాజ‌హాన్ రోడ్‌లో ఉన్న యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(యూపీఎస్సీ) కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 3:10 గంట‌ల స‌మ‌యంలో కార్యాల‌యంలోని నాలుగో అంత‌స్తులో మంట‌లు చెల‌రేగాయి. అప్ర‌మ‌త్త‌మైన యూపీఎస్సీ సిబ్బంది అగ్నిమాప‌క శాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న ఐదు ఫైరింజ‌న్లు మంట‌ల‌ను అదుపు చేశాయి. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. అయితే ఎలాంటి ప్రాణ న‌ష్టం సంభ‌వించలేదు.

*సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బందంకొమ్ము గ్రామం శ్రీరామ హిల్స్‌లో వరకట్న వేధింపులతో సంయుక్త అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన రెండు నెలలకే సంయుక్తను భర్త ఉత్తేజ్ కుమార్, అత్త లావణ్య, మామ పవన్ వేధింపులకు గురిచేయడంతో మనస్థాపానికి గురైన ఆమె ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
*రుణం దొరక్క ఇద్దరు రైతులు అత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లా, కుమ్రంభీమ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా గాదేగూడ‌ మండలం ఖాడ్కి గ్రామానికి చెందిన రైతు మాధవ మారు ఖరీఫ్‌కు అప్పుపుట్టలేదని ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది అప్పులు తీరకపోవడంతో షావుకార్లు అప్పులు ఇవ్వలేదు. దాంతో మనస్థాపం చెంది ఉరివేసుకున్నారు. కుమ్రంభీమ్ జిల్లా కెరమేరి మండలం తుమ్మగూడేంలో రైతు రాథోడ్ మోహన్ కూడా అప్పు పుట్టక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

*ఆసియా దేశం థాయిలాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది.గంజాయి సాగు,దాని వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్టు నిన్న ప్రకటించింది. ఫలితంగా గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా రికార్డులకెక్కింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిన్నటి నుంచే అక్కడి దుకాణాలు, కేఫ్‌లలో గంజాయి విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. గంజాయిని చట్టబద్ధం చేసిన ప్రభుత్వం..దానిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం నిషేధించింది. దీనిని ఉల్లంఘించిన వారికి మూడు నెలల జైలు శిక్ష, రూ. 60 వేల జరిమానా తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. కాగా,గంజాయి ఇప్పుడు చట్టబద్ధం కావడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన దాదాపు 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేయనుంది.గంజాయిని చట్టబద్ధం చేసిన థాయిలాండ్ ప్రభుత్వం వైద్య పరమైన ఉపయోగాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అంతేకాదు,నేటి నుంచి దేశవ్యాప్తంగా 10 లక్షల గంజాయి మొక్కలు పంపిణీ చేయాలని ఆ దేశ మంత్రి అనుతిన్ చార్న్ విరాకుల్ నిర్ణయించారు.

* టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి వైసీపీ నేతలు ప్రత్యక్షమవడంపై సీఐడీ అడిషనల్ డీజీపీకి ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు. పదవ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని నింపేందుకు లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారని తెలిపారు. కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారన్నారు. అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో తెలిపారు.

*యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ డీసీఎం వ్యాన్ స్కూటీని ఢీకొట్టడంతో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*భువనగిరి మండలం హన్మాపురం బాచ్పాన్ వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి నుంచి స్కూటీపై ముగ్గురు జగదేవ్‌పూర్ వైపు వెళ్తుండగా, డీసీఎం వాహనం జగదేవ్‌పూర్ వైపు నుంచి భువనగిరి వైపు వస్తుంది. ఈ క్రమంలోనే డీసీఎం వాహన డ్రైవర్ మద్యం మత్తులో స్కూటీని ఎదురుగా బలంగా ఢీకొట్టి 50 మీటర్లు ఈడ్చుకుంటూ వెళ్లింది.ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

* తిరుమల మొదటిఘాట్‌లో గురువారం ఓ కారు బోల్తా పడింది. చెన్నైకి చెందిన భక్త బృందం శ్రీవారి దర్శనం పూర్తిచేసుకుని తమ కారులో తిరుగు ప్రయాణమైంది. అలిపిరికి సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ వాహనంలోని ముగ్గురు భక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.

*కోయబత్తూర్‌లో కారును లారీ ఢీకొన్న ఘటనలో ట్రైనీ డాక్టర్‌ మృతిచెందారు. కోవై మదుకరై రాంబృందావన్‌నగర్‌కు చెందిన రామశిఖాపతి కుమార్తె రామశివాని (22) కోవై ప్రభుత్వాసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌గా పనిచేస్తోంది. సోమవారం మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చిన ఆమె తిరిగి కారులో ఆస్పత్రికి బయల్దేరింది. మదుకరై ఎల్‌ఎన్‌టీ రహదారి జంక్షన్‌లో ఓ ట్యాంకర్‌ లారీ కారును ఢీకొంది. ఈ ఘటనలో రామశివాని సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న మదుకరై పోలీసులు కారు శిధిలాల నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కోవై ప్రభుత్వాసుపత్రికి తరలించి, ట్యాంకర్‌ డ్రైవర్‌ తిల్లైయరసన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

*అప్పుల బాధ తట్టుకోలేక ఓ రైతు తన పొలంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గురువారం ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగింది. జిల్లాలోని గాదిగూడ మండలం ఖడ్కీ గ్రామానికి చెందిన మడావి మారు (50) కు గ్రామ శివారులో ఎనిమిదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే పత్తి, కంది సాగు చేశారు. ఇందుకోసం స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంకు నుంచి రూ.1.50 లక్షలు, ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.4 లక్షల వరకు అప్పు చేశారు. అకాల వర్షాలతో పంట దిగుబడి మొత్తం పోయింది. దీంతో అప్పులు తీర్చేందుకు ఆయన తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓ వైపు అప్పులు ఇచ్చిన వారు తీర్చాలని వేధించడం, మరోవైపు కొత్తగా ఎవరూ అప్పు ఇవ్వకపోవడంతో గత కొద్ది రోజులపాటు ఆయన తీవ్ర ఆందోళన చెందారు. వ్యవసాయ భూమిని అమ్మేందుకూ మనసు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై గురువారం తన పొలంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు గాదిగూడ ఏఎస్సై ధామన్‌ తెలిపారు.

*రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాడిపర్తి, నందివనపర్తి గ్రామాల మధ్య హైనాలు బీభత్సం సృష్టించాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గొర్రెల పాకపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో ఏకంగా 80 గొర్రెలు చనిపోయాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నందివనపర్తికి చెందిన పార్వతమ్మ, తాడిపర్తికి చెందిన బైకని అంజయ్య అక్కాతమ్ముళ్లు. వారికి 80 గొర్రెలు ఉన్నాయి. వాటిని మేపుకొంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం సాయంత్రం 80 గొర్రెలను మందలోకి తోలి ఇంటికి చేరుకున్నారు. గురువారం ఉదయం చూడగా మందలో ఏకంగా 80 గొర్రెలు మృతిచెంది ఉన్నాయి. స్థానికుల సమాచారంతో బాధితులు అక్కడికి చేరుకొని బోరున విలపించారు. మృత్యువాత పడిన గొర్రెల విలువ సుమారు రూ.12 లక్షల వరకు ఉంటుందని బాధితులు తెలిపారు. యాచారం సీఐ లింగయ్య, ఎస్‌ఐ ప్రభాకర్‌లతో పాటు అటవీశాఖ రేంజర్‌ కమాలుద్దీన్‌, సెక్షన్‌ అధికారి విజయభాస్కర్‌రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ కిరణ్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు

*కోడూరు రేంజ్‌ కేవీ బావి సెక్షన్‌ సౌత్‌ బీట్‌ పరిధిలోని చలివేంద్రకోన వద్ద గురువారం ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌.ఐ కృపానంద తెలిపారు. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా కొంతమంది నాటు తుపాకులతో సంచరిస్తుండగా అనుమానంతో వారిని చుట్టుముట్టి రెండు నాటు తుపాకులు రెండు గొడ్డళ్ళు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. పట్టుబడిన వారిలో కోడూరు మండలం బుడుగుంటపల్లికి చెందిన బత్తల శ్రీనివాసులు ఓబులవారిపల్లి మండలం వై.కోటకు చెందిన సి.సుబ్రహ్మణ్యం సి.రమణయ్య సి.రాధాక్రిష్ణ అల్లం వెంకటరమణ ఉన్నారు. వీరు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పాత నేరస్థులని అడవిలో జంతువులను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తారని తెలిపారు. మరి కొంతమంది అడివిలోకి పారిపోయారని వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఈ దాడిలో తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.మోహన్‌ నాయక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

*ఎన్టీఆర్: జిల్లాలోని కంచికచర్ల మండలం పేరకలపాడు సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంగా వెళ్తున్న ద్విచక్ర వాహనం డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దేశబోయిన నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో మరొక రెండు ద్విచక్ర వాహనాలకు కూడ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

*ఖమ్మం: జిల్లాలోని నేలకొండపల్లి మండలం చెరువు మాదారంలో దారుణఘటన జరిగింది. కుటుంబ కలహాలతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రతో దాడి చేసుకోవడంతో ఒకరు మృతి చెందారు. కుటుంబీకుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఘర్షనకు గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

*గోవా నుంచి విజయవాడకు డ్రగ్స్‌ తరలిస్తున్న మణిపూర్‌కు చెందిన మహిళ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు టెకీలను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ కె.నారాయణరెడ్డి కథనం ప్రకారం.. గోవాలో ఉంటున్న మణిపూర్‌ మహిళ డయానా నైజీరియాకు చెందిన ఆమె భర్త ఉచె జస్టిన్‌ ఐదేళ్లుగా హైదరాబాద్‌ విజయవాడకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు చేతన్‌ ఆదిత్య గతంలో గోవా వెళ్లినప్పుడు డయానాతో పరిచయం ఏర్పడింది. కావాల్సినప్పుడు డ్రగ్స్‌ తెప్పించుకునేవారు. గురువారం ఉదయం గోవా నుంచి డ్రగ్స్‌తో బస్సులో హైదరాబాద్‌ వచ్చిన డయానా.. అక్కడి నుంచి విజయవాడ బయలుదేరింది. చేతన్‌ ఆదిత్యలను చౌటుప్పల్‌ శివారులో ఉన్న హైవే హోటల్‌ కు రావాలని సూచించింది. దాంతో వారిద్దరూ కారులో చౌటుప్పల్‌ వెళ్లారు. దీనిపై ఉప్పందుకున్న చౌటుప్పల్‌ పోలీసులు.. ఆ ముగ్గురిని అరెస్టు చేసి రూ.లక్ష విలువైన కొకైన్‌ పింక్‌పిల్స్‌ డ్రగ్స్‌ ఒక బీఎండబ్ల్యూ ఒక కియా కారును రూ. వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

*ఆ యువతీ యువకులిద్దరూ ఐటీ ఉద్యోగులు.. ఒకరినొకరు ఇష్టపడ్డారు.. తమ ప్రేమను పెద్దలు మన్నించడంతో పెళ్లి చేసుకున్నారు! అయితే.. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో వరుడు దుర్మరణంపాలయ్యాడు. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలోకి జారుకున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన అడపా రాజేందర్‌కు కుమారుడు పృథ్వీ(29), ఏపీలోని విజయవాడకు చెందిన భార్గవి లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ గత నెలలో అక్కడి నుంచి స్వస్థలాలకు చేరుకున్నారు. మే 29న విజయవాడలో వివాహమైంది. శనివారం లండన్‌ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. భార్య భార్గవిని విజయవాడలో ఉంచి లండన్‌ ప్రయాణానికి అవసరమైనవి కొనేందుకు పృథ్వీ 8న కోదాడకు వచ్చాడు. హాలియాకు చెందిన స్నేహితుడు రూ.2 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, వాటిని తీసుకునే బాధ్యతను తండ్రి రాజేందర్‌కు అప్పగించి.. సొంత కారులో ఆయనతో కలిసి అక్కడికి బయలుదేరాడు. అయితే కోదాడ నుంచి హాలియాకు హజూర్‌నగర్‌, మిర్యాలగూడ మీదుగా వెళ్లాల్సి ఉండగా, గూగుల్‌ మ్యాప్‌లో వెతకటంతో నకిరేకల్‌ మీదుగా చూపింది. దీంతో తండ్రీకుమారులిద్దరూ ఆ దారిలో వెళుతుండగా నకిరేకల్‌ మండలం గోరెంకలపల్లి సమీపంలోకి రాగానే ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట నుంచి కరీంనగర్‌ వెళుతున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొంది. దీంతో వాహనం నడుపుతున్న పృథ్వీకి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో నకిరేకల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రాజేందర్‌కు గాయాలయ్యాయి.

*దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో ఓ మహిళపై అత్యాచారం జరిగింది.జూన్ 3న ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఢిల్లీలోని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.అత్యాచారం చేసిన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నాడు.పోలీసులు కథనం ప్రకారం నిందితుడు, బాధిత మహిళ ఇద్దరూ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమయ్యారు.అత్యాచారం చేసిన నిందితుడు హైదరాబాద్ నివాసి అని, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం తాము గాలిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు వివరించారు.

*చిన్నారి ఆరాధ్య తల్లి మోహన పావని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కంటి కింద కణితి తొలగింపు కోసం గత నెలలో జీజీహెచ్‌లో చిన్నారి ఆరాధ్య… వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. చిన్నారి మృతిపై కలెక్టర్ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే చిన్నారి మృతిపై నేటి వరకు కమిటీ నివేదిక రాని పరిస్థితి. దీనిపై చిన్నారి తల్లిదండ్రులు పలువురు ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగారు. ఈ క్రమంలో నిన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డిని ఆరాధ్య తల్లిదండ్రులు కలిశారు. అయితే అప్పిరెడ్డి వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన ఆరాధ్య తల్లి పావని బలవన్మరణానికి యత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు పావనిని హుటాహుటిన జీజీహెచ్‌కు తరలించారు.

*కోడూరు రేంజ్‌ కేవీ బావి సెక్షన్‌ సౌత్‌ బీట్‌ పరిధిలోని చలివేంద్రకోన వద్ద గురువారం ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి, రెండు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఆర్‌.ఐ కృపానంద తెలిపారు. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా కొంతమంది నాటు తుపాకులతో సంచరిస్తుండగా అనుమానంతో వారిని చుట్టుముట్టి రెండు నాటు తుపాకులు, రెండు గొడ్డళ్ళు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. పట్టుబడిన వారిలో కోడూరు మండలం బుడుగుంటపల్లికి చెందిన బత్తల శ్రీనివాసులు, ఓబులవారిపల్లి మండలం వై.కోటకు చెందిన సి.సుబ్రహ్మణ్యం, సి.రమణయ్య, సి.రాధాక్రిష్ణ, అల్లం వెంకటరమణ ఉన్నారు. వీరు ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పాత నేరస్థులని, అడవిలో జంతువులను చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తారని తెలిపారు. మరి కొంతమంది అడివిలోకి పారిపోయారని, వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఈ దాడిలో తిరుపతి టాస్క్‌ఫోర్స్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.మోహన్‌ నాయక్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.