DailyDose

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి

వరుసగా మూడో రోజు రాష్ట్రంలో వందకుపైగా కేసులు నమోదయ్యాయి. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 12,385 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 122 మందికి పాజిటివ్ అని తేలింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 94 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్ జిల్లాలో 9 కేసులను గుర్తించారు.

ఒమిక్రాన్ సబ్‌ వేరియంట్లు బీఏ 4, బీఏ 5 కారణంగా హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వేరియంట్ల ప్రభావంతో రానున్న రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే ఇవి డెల్టా వేరియంట్‌లా ప్రమాదకరం కాదని అధికారులు తెలిపారు.బుధవారం తెలంగాణలో 116 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 731కి చేరింది. గురువారం 122 కొత్త కేసులు నమోదు కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 811కు చేరుకుంది. రాష్ట్రంలో డైలీ పాజిటివిటీ రేటు 1 శాతం దాటింది. తెలంగాణలో మార్చి 7న 102 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 17న 11కి పడిపోయాయి. కరోనా మొదలైన తర్వాత రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం అదే తొలిసారి. కాగా మే నెల మధ్యలో మళ్లీ రోజువారీ కరోనా కేసులు 119కి చేరాయి.తెలంగాణలో ఇదీ పరిస్థితి..రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7,94,029 కరోనా కేసులను గుర్తించారు. గురువారం నాటికి తెలంగాణలో కరోనా బారిన పడి 4111 మంది ప్రాణాలు కోల్పోయారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో కరోనా మరణాలేవీ నమోదు కాలేదు. గురువారం రాష్ట్రంలో 42 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 7,89,107కి చేరింది.[10/06, 11:35 am] నమస్కారం : *సంగారెడ్డి: వరకట్న వేధింపులకు యువతి బలి*