NRI-NRT

సౌదీ అరేబియాలో కొత్త వీసా పథకం

Auto Draft

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్(జీసీసీ) నివాసితుల కోసం సౌదీ అరేబియా త్వరలో కొత్త వీసా పథకాన్ని తీసుకువస్తున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి అహ్మద్ అల్ ఖతీబ్ వెల్లడించారు. 2019లో కింగ్‌డమ్ ప్రారంభించిన పర్యాటక వీసాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పిన మంత్రి.. సందర్శనకు వచ్చే వారికి నిర్దిష్ట పరిమితులు లేవని అన్నారు. తాజాగా ప్రముఖ మీడియా ఏజెన్సీతో మాట్లాడిన అల్ ఖతీబ్.. 2021లో సౌదీలో 64 మిలియన్ల దేశీయ పర్యటనలు జరిగాయని గుర్తు చేశారు. దీంతో విదేశాల నుంచి వచ్చిన సందర్శకుల సంఖ్య గతేడాది 5 మిలియన్లకు చేరుకుందన్నారు.

అయితే, కరోనా సమయంలో పర్యాటకుల సంఖ్య 40శాతం మేర తగ్గినట్లు పేర్కొన్నారు. దిరియా ప్రాజెక్టు‌లోని అల్ బుజైరి ప్రాంతాన్ని ఈ ఏడాది తెరవనున్నట్లు అల్ ఖతీబ్ తెలిపారు. ఇక 2019లో ఉద్యోగాల కల్పనలో పర్యాటక రంగం సహకారం 3 శాతంగా నమోదైందని మంత్రి చెప్పారు. 2030 నాటికి ఇది 10శాతానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. Saudi Arabia లో ఉద్యోగ రంగం 2019 నుంచి ఇప్పటివరకు 15శాతం మేర పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దాంతో మొత్తం ఉద్యోగాల సంఖ్య 8.20లక్షలకు చేరుకుందన్నారు. అలాగే 2019లో జీడీపీలో 3శాతంగా ఉన్న పర్యాటక రంగ ఆదాయాన్ని 2030 నాటికి 10శాతానికి చేర్చాలనే లక్ష్యంగతో ముందుకుసాగుతన్నామని చెప్పుకొచ్చారు. దీనికోసం 2030 నాటికి 200 బిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ వ్యయాన్ని వెచ్చించాలని లక్ష్యంగా నిర్ధారించుకున్నట్లు తెలిపారు.