Politics

ఈనెల 20నుంచి టీడీపీ రైతు పోరుబాట బహిరంగ సభలు – TNI తాజా వార్తలు

ఈనెల 20నుంచి టీడీపీ రైతు పోరుబాట బహిరంగ సభలు –  TNI  తాజా వార్తలు

*ఈనెల 20వతేదీ నుంచి టీడీపీ రైతు పోరుబాట బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… కడప నుంచి టీడీపీ రైతు పోరుబాట సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టడంపై ఉద్యమించాలన్నారు.

*ఏపీ మహిళలు, రైతులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ తీపికబురు చెప్పింది. ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన 219 వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిన్న జరిగింది.2022-23 వార్షిక రుణ ప్రణాళికకు ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించగా.. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.164740 కోట్లు కేటాయించారు. 2021-22 లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.కౌలు రైతులకు రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ద పెట్టాలని సూచనలు చేశారు. మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గృహ నిర్మాణలను రాష్ట్రంలో భారీ ఎత్తున చేపట్టాలని.. విలువైన భూముల పట్టాలను పేదలకు అందించామని పేర్కొన్నారు. వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంటుందని.. పేదలకు అండగా నిలవాలని బ్యాంకులను కోరారు.

*బాలికలుమహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి నోరువిప్పకపోవడం బాధాకరమని ఏఐసీసీ ప్రచార కార్యదర్శి దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. అత్యాచార ఘటనలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గతంలో మహిళల పట్ల‌ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. మంచి అధికారిగా పేరున్న సీవీ ఆనంద్ కూడా వణుకుతూ మాట్లాడటం.. పోలీసులపై రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయన్న విషయం స్పష్టమవుతుందన్నారు.

*రాజ్భవన్లో ‘మహిళా దర్బార్‌’ ముగిసింది. మహిళా దర్భార్‌లో గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని.. రాజ్భవన్ను గౌరవించాలన్నారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడమే మన బాధ్యత అని చెప్పారు. రాజ్భవన్నే గౌరవించకుంటే.. సామాన్యుల పరిస్థితేంటి? అని ప్రశ్నించారు. తెలంగాణలో మహిళపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదని తప్పుబట్టారు. ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని తమిళిసై ప్రశ్నించారు.

*చార్మినార్ దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మహ్మద్‌ప్రవక్తపై బీజేపీ మాజీ స్పోక్స్‌పర్సన్‌ నుపూర్‌ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ముస్లింల ఆందోళన చేపట్టారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లింలు ర్యాలీగా బయల్దేరారు. నుపూర్‌శర్మ, నిత్యానంద, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో ముస్లింల నిరసనతో భారీగా పోలీసులను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేశారు.

*మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లింలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం ఢిల్లీ, కోల్‌కతాలలో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

*రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఖరిఫ్ పంటకు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఋతుపవనాలు ముందుగా వస్తున్నాయన్నారు. ఖరిఫ్ పంట ఈసారి బాగా రావాలని కోరుకుంటున్నాన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. టీడీపీ వాళ్ళు పెడుతున్న కేసుల్లో వాస్తవం లేదని మంత్రి అంబటి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, మంత్రి జోగి రమేష్ , ఎమ్మేల్యే మల్లాది విష్ణు, మెరుగు నాగర్జున తదితరులు పాల్గొన్నారు.

*వర్షాకాలం సమీపిస్తుండడంతో..సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమల పెరుగుదలకు అవకాశం లేకుండా చూసుకోవాలన్నారు. 2019లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని గుర్తు చేశారు. జలుబు, జ్వరం, పొడి దగ్గు లక్షణాలుంటే… వెంటనే ఐసోలేట్ అయి కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని కోరారు. పాజిటివ్ అని నిర్ధారణ అయితే వైద్యుల సూచనమేరకు మందులు వాడాలని సూచించారు. ఈ నెల  నుంచి ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. అర్హులందరూ వేయించుకోవాలని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో పిల్లలకు వాక్సినేషన్ ప్రక్రియ కొంత నెమ్మదించిందని, విద్యాసంస్థలు వాక్సినేషన్ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. కోరితే ప్రత్యేక క్యాంపులు స్కూళ్ల వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.7 నుండి 1 శాతానికి చేరుకున్నదని .. కరోనా పాండమిక్ నుంచి ఎండమిక్ దశకు చేరుకున్నదని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో నాలుగో వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని, వ్యాక్సినేషన్ పెద్ద మొత్తంలో జరగటమే అందుకు కారణమన్నారు. ముందు జాగ్రత్త చర్యగా మాస్కులు అందరూ విధిగా ధరించాలని కోరారు.

*ప్రభుత్వ ఆస్పత్రిలో హైడ్రామా చోటుచేసుకుంది. ఆరోగ్యశ్రీ కార్డుపై ప్రధాని ఫొటో ఎందుకులేదని కేంద్రమంత్రి భారతీ నిలదీశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిని కేంద్రమంత్రి తనిఖీ చేశారు. జనరల్‌ వార్డులో ఆరోగ్యశ్రీ కార్డును పరిశీలించారు. ఆరోగ్యశ్రీకి కేంద్రం కూడా నిధులు ఇస్తుంది కదాఅని నిలదీశారు. ఆరోగ్యశ్రీ కార్డుపై సీఎం జగన్‌ ఫొటో వేసి మోదీది ఎందుకు వేయలేదంటూ.. ఏపీ ఆరోగ్య కమిషనర్‌ నివాస్‌ను భారతీ ప్రశ్నించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే మల్లాది విష్ణును కూడా ప్రశ్నించారు. ఆరోగ్య కమిషనర్‌ వివరణ ఇచ్చినాభారతీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

*యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు సెక్రటరీ తిరు ప్రశాంత్ ఎం.వాడ్నేరే, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ తిరు ప్రతీక్ తయల్, ట్రెజరీ, అకౌంట్స్ విభాగం అదనపు డైరెక్టర్ నిరూపరాక్ సందర్శించారు.ఈ సందర్భంగా తెలంగాణ గ్రామపంచాయతీ పరిధిలో ఉపయోగించే ఈఏఫ్ఎమ్ఎస్( ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్‌ సిస్టం) పోర్టల్ వినియోగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ గ్రామ పంచాయతీలో నిధులను ఎలా ఉపయోగించుకుంటున్నారనే అనే విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉపయోగించే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను తమిళనాడులో సైతం అందుబాటులోకి తీసుకుకొస్తామని వారు తెలిపారు.

*మీర్‎పేట్ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‎ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్‎పేట్‎లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్‎కి అడ్డుపడ్డారు. దీంతో మీర్‎పేట్‎లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్‎పేట్ స్టేషన్‎కు తరలించారు.
*సికింద్రాబాద్‌ ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ తరఫున జూపార్కులోని తెల్ల నెమలిని ఏడాది పాటు దత్తత తీసుకున్నారు. అందుకుగాను అవసరమైన రూ.30 వేల చెక్కును గురువారం క్లబ్‌ ప్రతినిధులు లతా షా, మీరా గౌరి, చేతన్‌ షా, దయానంద్‌ గౌరిలు క్యూరేటర్‌ ఎస్‌.రాజశేఖర్‌కు అందజేశారు.

*భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో కోర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.బాలాజీరెడ్డి తెలిపారు. ఈ నెల 12న ఉదయం 9గంటలకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సంఘం విస్తృతస్థాయి సమావేశంలో పలు అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. సమాజంలో మానవ హక్కులు, సమాజ శ్రేయస్సు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చట్టాలు చేశాయని ముఖ్యంగా మహిళలకు అనేక రకాల చట్టాలు తెచ్చాయని తెలిపారు.

*కేంద్ర వైధ్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ శుక్రవారం ఉదయం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అలాగే ఈవో భ్రమరాంబ అమ్మవారి ఫోటో, లడ్డు ప్రసాదం అందజేశారు.

*బోగోలు మండలం జువ్వలదిన్నె గ్రామ శివారు ప్రాంతంలో నాటుసారా తయారీ కేంద్రాలపై కావలి సెబ్‌ సీఐ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి గురువారం దాడులు చేశారు. రాజు యానాది నాటుసారా బట్టీ వేసి కాస్తుండగా గుర్తించి 400లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. అనంతరం అతడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. అంతేగాక 5 లీటర్ల నాటుసారా, తయారీ సామగ్రిని స్వాధీన చేసుకున్నామని తెలిపారు. సారా తయారీకి బెల్లం విక్రయించిన కిరాణ షాపు యజమాని వివరాల కోసం విచారణ చేస్తున్నామని తెలిపారు. త్వరలో అతడిని అరెస్టు చేస్తామన్నారు.

* ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలపడంతో పురపాలకశాఖలోని ఉపాధ్యాయులకు బదిలీల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ అండ్‌ డైరక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తూ ప్రాంతీయ సంచాలకులకు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత బదిలీల్లో ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో బదిలీలు నిర్వహించనున్నారు. రెండేళ్లు సర్వీసు కనీస అర్హతగా ఈ బదిలీల మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అక్టోబరు 1, 2021 తేదీని పరిగణనలోకి తీసుకుని సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులకు, స్కూల్‌ అసిస్టెంట్లకు 8 విద్యా సంవత్సరాలు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు 5 విద్యా సంవత్సరాల పాఠశాల సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ తప్పనిసరి చేయనున్నారు. 50 సంవత్సరాలు నిండిన పురుష ప్రధానోపాధ్యాయులు, మహిళా ప్రధానోపాధ్యాయులను బాలికల ఉన్నత పాఠశాలల్లో నియమించనున్నారు. ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

* ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల్లో బదిలీలకు ఆమోదం తెలపడంతో పురపాలకశాఖలోని ఉపాధ్యాయులకు బదిలీల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదలైంది. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ అండ్‌ డైరక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ షెడ్యూల్‌ విడుదల చేస్తూ ప్రాంతీయ సంచాలకులకు ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత బదిలీల్లో ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో బదిలీలు నిర్వహించనున్నారు. రెండేళ్లు సర్వీసు కనీస అర్హతగా ఈ బదిలీల మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అక్టోబరు 1, 2021 తేదీని పరిగణనలోకి తీసుకుని సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయులకు, స్కూల్‌ అసిస్టెంట్లకు 8 విద్యా సంవత్సరాలు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు 5 విద్యా సంవత్సరాల పాఠశాల సర్వీసును పరిగణనలోకి తీసుకుని బదిలీ తప్పనిసరి చేయనున్నారు. 50 సంవత్సరాలు నిండిన పురుష ప్రధానోపాధ్యాయులు, మహిళా ప్రధానోపాధ్యాయులను బాలికల ఉన్నత పాఠశాలల్లో నియమించనున్నారు. ప్రిఫరెన్షియల్‌ కేటగిరీ వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

*మీర్‎పేట్ రహదారిపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. NSUI నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‎ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయ్యాలని డిమాండ్ చేశారు. మీర్‎పేట్‎లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని NSUI నాయకులు అందించే ప్రయత్నం చేశారు. మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వకపోవడంతో కాన్వాయ్‎కి అడ్డుపడ్డారు. దీంతో మీర్‎పేట్‎లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా NSUI అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సహా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి మీర్‎పేట్ స్టేషన్‎కు తరలించారు.
*వారాంతాల్లో శ్రీవారి దర్శనానికి అధిక సమయం కేటాయించనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… శుక్ర శని ఆదివారాల్లో దర్శనానికి గంటలు సమయం కేటాయిస్తామన్నారు. తిరుమల కొండపై గదులు దొరికే అవకాశం ఉండదని, భక్తులు ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని అన్నారు. త్వరలోనే స్లాటడ్ సర్వదర్శనాలు పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఇకపై నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు నిలిపివేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

* గత 67 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఉత్సవాల్లో విశిష్ట శైలితో ప్రత్యేతకను చాటే ఖైరతాబాద్‌లో ఈసారి మట్టి వినాయకుడే పూజలు అందుకోనున్నాడు. ఈ విషయాన్ని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ ప్రకటించింది. గురువారం గణపతి ప్రాంగణంలో కన్వీనర్‌ సందీ్‌పరాజ్‌, కార్యదర్శి ఎస్‌ రాజ్‌కుమార్‌, ఉపాధ్యక్షుడు మహేష్‌ యాదవ్‌లు విలేకరులతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణానికి హాని కలిగించకుండా, హుస్సేన్‌సాగర్‌ కలుషితం కాకుండా చూడడంలో తమ వంతు పాత్రగా ఈ ఏడాది మట్టి గణపతి విగ్రహాన్ని తయారు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. శిల్పి చినస్వామి రాజేంద్రన్‌ 50 అడుగుల ఎత్తుతో బంకమట్టితో పాటు ఇతర సామగ్రిని వినియోగించి విగ్రహాన్ని తయారు చేస్తారని చెప్పారు. ఎప్పటి మాదిరిగానే గణేష్‌ విగ్రహం తయారు చేస్తామని చెప్పిన ఉత్సవ కమిటీ.. పోలీసుల ఒత్తిడి వల్లనే మట్టి ప్రతిమను చేస్తామని ప్రకటించినట్లు తెలుస్తోంది. గణేష్‌ ఉత్సవాలు ఆగస్టు 31న ప్రారంభమై సెప్టెంబరు 9న హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనంతో ముగుస్తాయని భాగ్యనగర్‌ ఉత్సవ గణేష్‌ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు తెలిపారు. ఉత్సవాలు సాఫీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, అవరోధాలు కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. హిందువుల పండుగలపై ఆంక్షలు విధిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

*సురభి నాటకాన్ని అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించి, తెలుగు రంగస్థల ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత రేకందార్‌ నాగేశ్వరరావు(72) ఇకలేరు. సురభి బాబ్జీగా సుపరిచితుడైన ఆయన లింగంపల్లిలోని స్వగృహంలో గురువారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. బాబ్జీ 1949లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా గజపతినగరంలో పుట్టారు. సురభి నాటక సంస్థ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావుకు (కూతురు సుభద్రమ్మ కొడుకు) ఆయన మనవడు. నాలుగేళ్ల వయసులోనే నటుడిగా రంగ ప్రవేశం చేశారు. రాముడు, కృష్ణుడు, నక్షత్రకుడు, కార్యవర్థి తదితర పౌరాణిక పాత్రలతో ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు.

*ఎస్సీ యువత రిజర్వేషన్‌ కోటాకు పరిమితం కాకుండా ఓపెన్‌ కేటగిరీలోనూ ఉద్యోగాలు సాధించేలా తీరిదిద్దాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. సివిల్స్‌, గ్రూప్‌-1 వంటి పోటీ పరీక్షల్లో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ, స్టడీ సర్కిళ్ల పనితీరుపై మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లలో వసతులు మెరుగు పరచాలన్నారు. పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల స్వయం సహాయక సంఘాల మహిళలు ‘సహజ’ పేరుతో తయారు చేస్తున్న ఉత్పత్తుల్ని గురుకులాలు, హాస్టళ్లకు అందించాలని అధికారులను ఆదేశించారు.

*ఈ నెల 3 నుంచి ప్రభుత్వం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకూ 61,477 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. బడికి వెళ్లని పిల్లలను గుర్తించి, వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడానికి ఉపాధ్యాయులు ‘బడిబాట’లో కృషి చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులనూ ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

*గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్స్‌ (సీఆర్‌టీ)గా కొనసాగుతున్న వారిని 2022-23 విద్యా సంవత్సరానికి రెన్యూవల్‌ చేశారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో విధులు నిర్వహించిన 1777 మంది సీఆర్‌టీలను ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా కొనసాగేందుకు అనుమతించారు. గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో విద్యార్ధుల చేరిక ఆధారంగా ఎంత మంది సీఆర్‌టీలు అవసరమనేది సంబంధిత జిల్లా కలెక్టర్లు లెక్కించాలని, ఇందుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే జూలై 31లోగా హైదరాబాద్‌లోని కమిషనర్‌ కార్యాలయానికి తెలియజేయాలని గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్‌ వి. సర్వేశ్వర్‌ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

*తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థల నుంచి రూ. 6,283 కోట్ల బకాయిలు రావాలని పేర్కొంటూ గత ఏడాది తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఏపీ జెన్‌కో ఉపసంహరించుకొంది. గురువారం ఈ పిటిషన్‌ చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి ధర్మాసనం ఎదుట విచారణకు రాగా, దాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ఏపీ జెన్‌కో తరఫు న్యాయవాది ఎం.విద్యాసాగర్‌ తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఓ సబ్‌కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీచేసిందని తెలిపారు. ఆ సబ్‌కమిటీ పరిష్కరించాల్సిన సమస్యల్లో ఈ బకాయిల అంశం కూడా ఉందని పేర్కొన్నారు. అందుకే పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒకవేళ సబ్‌కమిటీ ఎదుట సమస్య పరిష్కారం కానిపక్షంలో మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

*భారత్‌లో గంజాయి సాగు చేయడం నిషేధం. భారత్‌లోనే కాదు… ఆసియా దేశాల్లో గంజాయి సాగు చేసినా, తరలించినా, విక్రయించినా, వినియోగించినా నేరమే. కానీ.. థాయ్‌లాండ్‌ ప్రభుత్వం గంజాయి సాగుతోపాటు, దాని వినియోగాన్ని కూడా చట్టబద్ధం చేస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించిన తొలి ఆసియా దేశంగా నిలిచింది. గురువారం నుంచే థాయ్‌లాండ్‌లోని చిన్న చిన్న కేఫ్‌ల్లో కూడా గంజాయి విక్రయాలు మొదలయ్యాయి. గతంలో దొంగచాటుగా గంజాయి కొనుగోలు చేసేవారు.. ఇప్పుడు బహిరంగంగా దాన్ని పొందగలుగుతున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడంపై మాత్రం ఆ దేశం నిషేధం విధించింది.

* ఎనిమిదో ఇంటర్నేషనల్‌ యోగా డే కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావును ప్రారంభించారు. ఆయుష్‌ కార్యాలయంలో ఆయుర్వేద, నాచురోపతి విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి 20వ తేదీ కార్యక్రమం కొనసాగనున్నది. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ యోగ అంటే మనసు, శరీరం, ఆత్మల కలయిక అనీ, ఈ మూడింటిని అది ఏకం చేస్తుందన్నారు. ప్రపంచంలో 75శాతం రోగాలున్నా.. తన చుట్టూ అందరూ రోగులే ఉన్నా.. తనకు రోగం వస్తే కానీ ఆలోచించకపోవడం, జాగ్రత్తపడక పోవడం అందరికీ అలవాటైందన్నారు.

*భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 14వ తేదీన శ్రీసీతారామచంద్రస్వామి వారికి జేష్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ప్రతిఏటా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ జేష్టాభిషేక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంప్రదాయం అనేక శతాబ్ధాలుగా కొనసా గుతోంది. ఈ నేపథ్యంలో 13న ఉత్సవాలకు అంకు రార్పణ చేయనున్నారు. 14న 81 కలశాలతో సమస్త నదీ జలాలను ఆవాహన చేసి అనంతరం పంచామృ తాలతో స్వామివారికి అభిషేకం నిర్వహి స్తారు. అలాగే జలాలతో స్వామి వారికి సహస్రధారాభిషేకం చేస్తారు. ఇదిలా ఉండగా 14న జేష్టాభిషేకం నేపఽథ్యం లో రామయ్యకు నిత్యకల్యాణం, తిరువీధిసేవ, పవళింపుసేవ నిలిపివేయనున్నారు. 15నుంచి నిత్యకల్యాణాన్ని యథాప్రకారం కొనసాగిస్తారు.

*విద్యుత్తు సంస్థల్లో సాధారణ బదిలీల ప్రక్రియ మొదలయింది. దక్షిణ డిస్కమ్‌(ఎస్పీడీసీఎల్‌), ఉత్తర డిస్కమ్‌(ఎన్పీడీసీఎల్‌-వరంగల్‌)లలో ఈనెల 30 నాటికి ఒకే చోట మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారిని విధిగా బదిలీ చేయనున్నారు. దక్షిణ డిస్కమ్‌లో బదిలీ అయ్యేవారి జాబితా ఈనెల 13న ప్రదర్శిస్తారు. 28న బదిలీ ఉత్తర్వులు వెలువడతాయి. 2023 జూన్‌ 30వ తేదీ లోపు పదవీ విరమణ చేసేవారిని బదిలీ చేయరు. ఉత్తర డిస్కమ్‌లో మాత్రం బదిలీ చేస్తారు. ఇందులో బదిలీ అయ్యేవారి జాబితాను శుక్రవారం ఆయా కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. అభ్యంతరాలుంటే 14వ తేదీ లోపు తెలియజేయాలి. 25న బదిలీ ఉత్తర్వులు వెలువడతాయి. బదిలీ అయిన వారంతా 30వ తేదీలోపు ఆయా స్థానాల్లో చేరాలి

*నైరుతి రుతు పవనాలు మరింత ముందుకు కదులుతున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న 48గంటల్లో గోవా, దక్షిణ మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, ఏపీలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వరకు వ్యాపించిన ఉపరితల ద్రోణి తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని పేర్కొంది. రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, రుతుపవనాలు తెలంగాణను తాకటానికి మరో మూడు, నాలుగు రోజుల సమయం పడుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

*వరి పంటకు ప్రధాన శత్రువు కాండం తొలిచే పురుగు. పంట వేసిన మొదట్లోనే ఈ పురుగు ప్రభావం మొదలై చివరకు రైతులకు తీవ్ర నష్టం కలగజేస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బహుళజాతి సంస్థ సల్ఫర్‌ మిల్స్‌ లిమిటెడ్‌ కొత్త పురుగు మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇమారా జుడ్వా-జీ పేరుతో ఈ మందులను మార్కెట్‌లోకి విడుదల చేసింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన్‌ డీలర్స్‌ సమావేశంలో కంపెనీ ప్రతినిధులు వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్‌ కోమల్‌ బుఖన్‌వాలా మాట్లాడుతూ… భారతదేశంలో వరి ప్రధాన పంట అయినందున దాని సంరక్షణను దృష్టిలో ఉంచుకుని కొత్త పురుగు మందులను తీసుకొస్తున్నట్టు తెలిపా రు. తమ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దేశాలకు పురుగు మందులను ఎగుమతి చేస్తుందని సీఈఓ జి.వీరభద్రం తెలిపారు. కార్యక్రమంలో కంపెనీ ప్రెసిడెంట్‌ రాజేంద్రకుమార్‌ అఖానీ బిజినెస్‌ హెడ్‌ ఎన్‌.నాగేంద్రరావు మార్కెటింగ్‌ మేనేజర్స్‌ శివప్రసాద్‌ రీజినల్‌ మేనేజర్‌ విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

* వైఎస్ వివేకా హత్యకేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. కడప సెంట్రల్ జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించడానికి అనుమతివ్వాలని శివశంకర్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం తెలపడంతో న్యాయమూర్తి పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.

*బాబాయిని వేసేసిన అబ్బాయి పనే గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతి అని, ఇదంతా ‘జగనాసుర రక్తచరిత్ర పార్ట్‌-2’అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఆరోపించారు. గంగాధర్‌రెడ్డి మృతిపై బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివేకానందరెడ్డి హత్యను చూసినవాళ్లు.. డెడ్‌బాడీకి కుట్లేసిన అనుమానితులు ముగ్గురు అనుమానాస్పదంగా మృతిచెందడం వెనక పెద్ద మిస్టరీయే ఉందని చెప్పారు. ‘వివేకానందరెడ్డిని దారుణంగా చంపేసిన గ్యాంగ్‌ ముందుగా గుండెపోటు అని, ఆతర్వాత చంద్రబాబు చంపించేశారని ఆరోపణలు చేశారు. తీరా అది ఇంటి గొడ్డలే అని తేలడంతో కేసులో కీలకమైన వారిని ఒక్కొక్కరినీ అంతమొందిస్తున్నారు. సింహాద్రిపురానికి చెందిన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య, జగన్‌రెడ్డి మామ గండిరెడ్డి అనుమానాస్పద మరణం, మరో కీలక అనుమానితుడు కువైట్‌ గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద మృతి వెనక పెద్దల గుట్టును సీబీఐ రట్టు చేయాలి.

*హయత్‌నగర్‌ మండల పరిధిలోని తొర్రూర్‌లో హెచ్‌ఎండీఏ (HMDA) లేఅవుట్‌లో మరోసారి 148 ప్లాట్లను విక్రయిస్తున్నామని, ఈ నెల 30న ఈ-వేలం వేయనున్నామని హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ గంగాధర్‌ తెలిపారు. ఈ మేరకు కొనుగోలుదారులతో లేఅవుట్‌ స్థలంలో గురువారం సమావేశం నిర్వహించి లేఅవుట్‌ ప్రాధాన్యతను వారు వివరించారు. వేలంపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎంఎ్‌సటీసీ ప్రతినిధి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

*ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర సరస్వతీ అమ్మవారి సన్నిధిలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రద్దీ పెరుగుతోంది. భారీ సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నారు

*వరంగల్‌ రైల్వేస్టేషన్‌ శివనగర్‌ సైకిల్‌ స్టాండ్‌ వద్ద ఓ మహిళ నుంచి 280 కిలోల పటికను గురువారం అధికారులు పట్టుకున్నారు. ఖిలావరంగల్‌ మండలం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌, స్పెషల్‌ ట్రైన్‌ చెకింగ్‌ టీమ్‌ అధికారులు, సీఐ చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ రైల్వేస్టేషన్‌ శివనగర్‌ సైకిల్‌ స్టాండ్‌ వద్ద తనిఖీలు చేస్తుండగా ఓ మహిళ నుంచి 280 కిలోల పటిక పట్టుకున్నట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. నెక్కొండ మండలం, కోసకంచతండాకు చెందిన భూక్య రమను అదుపులోకి తీసుకొని పటికను సీజ్‌ చేశామన్నారు. అనంతరం ఖిలావరంగల్‌ తహసీల్దార్‌ ఫణికుమార్‌ ఎదుట ఆమె బైంబోవర్‌ చేశామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ చంద్రమోహన్‌, ఎస్సై సరిత,స్పెషల్‌ ట్రెన్‌ చెకింగ్‌ టీమ్‌ ఎస్‌ఐ లింగగౌడ్‌ పాల్గొన్నారు.

* తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న అన్నక్యాంటీన్‌ను మంగళగిరి నగరపాలకసంస్థ అధికారులు ధ్వంసం చేశారు. ఒకసారి కాదు…ఏకంగా రెండుమార్లు అన్నక్యాంటీన్‌పై నగరపాలకసంస్థ అధికారులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. మంగళగిరి నియోజకవర్గ పార్టీ బాధ్యతలను చూసుకుంటున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. పేదలకు రెండు రూపాయలకే పట్టెడన్నం పెట్టాలన్న సదాశయంతో బస్టాండ్‌ ఎదుట పాత హైవే వెంబడివున్న ఖాళీస్థలంలో తాత్కాలిక అన్నక్యాంటీన్‌ను గురువారం ఏర్పాటు చేయిస్తుండగా నగరపాలకసంస్థ సిబ్బంది వచ్చి దానిని సమూలంగా కూల్చివేశారు. సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారంతా పహరా కాస్తూ మళ్లీ దానిని పునర్నిర్మాణం చేయించారు.

*పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గతంలో కన్నా ఎక్కువ మంది ఫెయిలయ్యారని, దీనివల్ల విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారని, దీన్ని గమనించి ప్రభుత్వం పాస్‌మార్కును 30గా నిర్ణయించి విద్యార్థులకు న్యాయం చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కెఎ్‌సఎస్‌ ప్రసాద్‌ గురువారం ప్రభుత్వాన్ని కోరారు. కొవిడ్‌ వల్ల రెండు సంవత్సరాలుగా చదువు సరిగా సాగలేదని, 8వ తరగతి విద్యార్థి సరాసరి 10వ తరగతికి వచ్చి పరీక్షలు రాయడం వల్ల ఇబ్బందిపడ్డారని పేర్కొన్నారు. విద్యార్థుల మానసిక గందరగోళాన్ని తగ్గించేందుకు ఉత్తీర్ణత మార్కులను 30గా నిర్ణయించాలని కోరారు. జూలై 6న జరిగే సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

*ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి నంద్యాల జిల్లా శ్రీశైల జలాశయానికి గురువారం ఇన్‌ఫ్లో స్వల్పంగా కొనసాగుతోంది. సుంకేసుల జలాశయం నుంచి 4,311 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో గురువారం సాయంత్రం 6 గంటల సమయానికి 819.10 అడుగుల వద్ద 40.2078 టీఎంసీలుగా నమోదయింది.

* తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి బంగారు లక్ష్మీకాసులహారం, యజ్ఞోపవీతం విరాళంగా అందాయి. చెన్నైకి చెందిన సరోజా సూర్యనారాయణన్‌ అనే భక్తురాలు 4.150 కిలోల బరువున్న ఈ ఆభరణాలను గురువారం రాత్రి నైవేద్య విరామ సమయంలో ఆలయంలోని రంగనాయక మండపంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. వీటి విలువ రూ.2.45 కోట్లని దాత తెలిపారు.

*పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థిని పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామానికి చెందిన దంపతులు సూర్యచంద్రం, నాగమణి దంపతులు మనస్పర్థలతో నాలుగేళ్ల కిందట విడిపోయారు. అప్పటి నుంచి నాగమణి కుమారుడు, కుమార్తె సంధ్యారాణితో కలిసి దేవరపల్లి మండలం యర్నగూడెంలోని పుట్టింటి వద్ద ఉంటోంది. అయితే ఇటీవల ఆమె దుబాయ్‌ వెళ్లింది. సంధ్యారాణి తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ పదో తరగతి పరీక్షలు రాసింది. 20 రోజుల కిందట చినకొండేపూడి గ్రామంలో ఉంటున్న తండ్రి సూర్యచంద్రం వద్దకు వచ్చింది.

*చాగలమర్రిలో రెండు రోజుల క్రితం పంచాయతీ అధికారులు కూల్చివేసిన ఇళ్లను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పరిశీలించారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరారని.. ఎంక్రోచ్‌మెంట్ పేరుతో టీడీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చి వేయడం దారుణమని పేర్కొన్నారు. వైసీపీ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరించారు.