Politics

పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర జనం కోసమా? బాబు కోసమా? – TNI రాజకీయ వార్తలు

పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర జనం కోసమా? బాబు కోసమా? – TNI రాజకీయ వార్తలు

* జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పాలని ఏపీ మంత్రి ఆర్‌కే రోజా ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌ బస్సు యాత్ర చేస్తున్నది జనం కోసమా లేక చంద్రబాబు కోసమా రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టం చేయాలన్నారు. చంద్రబాబుకు ఆపద రాకుండా పవన్‌ కల్యాణ్‌ కాపాడుకోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. శనివారం ఉదయం రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నగరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులతో కలిసి వచ్చిన మంత్రి రోజా.. వీఐపీ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని వేదపండితుల నుంచి ఆశీర్వచనం పొందారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తన గన్‌మెన్‌, డ్రైవర్‌ ఆలయ మహాద్వారం నుంచి వచ్చారని పలు ఛానల్స్‌ దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లినట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు తన హయాంలో ఎన్నో ఆలయాలను కూల్చివేసిన సమయంలో ఈ ఛానల్స్‌ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.పిల్లలు సరిగా చదవకపోవడం, కరోనా వల్లనే ఉత్తీర్ణత తగ్గిందని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు.పదో తరగతి పరీక్షల ఫలితాలపై టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. చాలా రాష్ట్రాల్లో తక్కువ ఉత్తీర్ణత వచ్చిందని, అక్కడ ప్రతిపక్షాలు ఇక్కడి మాదిరిగా రాజకీయాలు చేయడం లేదని గుర్తుచేశారు. మహానాడులో తొడగొట్టి రమ్మని పిలిచిన టీడీపీ నేతలు, లోకేశ్‌ జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని, వల్లభవనేని వంశీ వస్తే ఎందుకు పారిపోయారని రోజా ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి తెలుగుదేశం పార్టీ మీద కోపమున్నందుకే తరచుగా పార్టీని మూసేస్తానంటున్నాడని చమత్కరించారు.

*మంగళగిరి ఎయిమ్స్లో.. త్వరలో ఎమర్జెన్సీ సేవలు: కేంద్ర మంత్రి
మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్రమంత్రి భారతి ప్రవీణ్‌ పవార్ పర్యటించారు. ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటిన కేంద్రమంత్రి.. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్‌పై ప్రజలకు అవగాహన కలిగించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్లో త్వరలో ఎమర్జెన్సీ సేవలను ప్రారంభిస్తామని కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ చెప్పారు. ప్రస్తుతం రోజుకు 1,700 ఓపీ నమోదవుతోందన్న భారతి.. సేవలను మరింత విస్తరించనున్నామన్నారు. 2018లో రూ.1,618 కోట్లతో ఎయిమ్స్ ప్రారంభించామని.. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటిదని చెప్పారు. ఇప్పటికే యూజీ కోర్సు నిర్వహిస్తున్నామని.. పీజీ కోర్సును త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు.మంగళగిరి ఎయిమ్స్ను సందర్శించిన మంత్రి.. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎయిమ్స్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని.. జనరిక్ మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయుష్మాన్ భారత్పై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆమె ఆదేశించారు.

*ప‌ల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంది : ఎమ్మెల్సీ క‌విత‌
పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు. ప‌ల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుంద‌నే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్ ప‌ట్టుద‌ల‌తో ప‌ల్లెల అభివృద్ధి కోసం చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండాలని సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి ప్రారంభించారని క‌విత తెలిపారు. బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గంలోని దేశాయిపేట గ్రామంలో నిర్వ‌హించిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత పాల్గొని ప్ర‌సంగించారు.

*ద‌ళిత‌బంధు యూనిట్ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టిస్తే చ‌ర్య‌లు : మంత్రి గంగుల
భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ క‌న్న క‌ల‌లు తెలంగాణ రాష్ట్రంలో నెర‌వేరుతున్నాయ‌ని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ద‌ళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎద‌గ‌డ‌మే ల‌క్ష్యంగా సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలిపారు. ద‌ళిత‌బంధు యూనిట్‌గను ప‌క్క‌దారి ప‌ట్టిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి క‌మ‌లాక‌ర్ హెచ్చ‌రించారు. క‌రీంన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని తాహెర్ కొండాపూర్ గ్రామానికి కేటాయించిన‌ ద‌ళితబంధు యూనిట్ల‌ను ఎంపీడీవో కార్యాల‌యంలో శనివారం ల‌బ్ధిదారుల‌కు మంత్రి గంగుల క‌మలాక‌ర్ పంపిణీ చేశారు.

*బీజేపీ పాపాల‌కు ప్ర‌జ‌లెందుకు బ‌లి కావాలి : దీదీ
మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నేత‌ల విద్వేష వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా నిర‌స‌న‌లు మిన్నంటుతున్నాయి. హౌరాలో శ‌నివారం పోలీసులు, నిర‌స‌న‌కారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు తలెత్త‌డంపై బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ స్పందించారు. బీజేపీ చేసిన త‌ప్పుల‌కు ప్ర‌జ‌లు ఎందుకు ఇబ్బందులు ప‌డాల‌ని ఆమె నిల‌దీశారు. హౌరా ఘ‌ర్ష‌ణ‌ల‌కు దోషుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని, ఈ హింస వెనుక కొన్ని రాజ‌కీయ పార్టీల ప్ర‌మేయం ఉంద‌ని దీదీ పేర్కొన్నారు.

*తనపై ఆరోపణలు చేసేది చంద్రబాబు స్కూల్‌ స్టూడెంట్సే : వల్లభనేని వంశీ
తనపై ఆరోపణలు చేసేది కేవలం చంద్రబాబు స్కూల్‌ స్టూడెంట్సే అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చమత్కరించారు. తనను విమర్శిస్తున్న వీరేమీ జస్టిస్‌ చౌదరులు కాదని అన్నారు. తనను విలన్ అన్న వారు హీరోలా? అని నిలదీశారు. యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు నిన్న చేసిన విమర్శలకు వల్లభవనేని ఘాటుగా సమాధానమిచ్చారు. తనను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది గన్నవరం నియోజకవర్గం ప్రజలు అని, ఎవరికైనా ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలని సూచించారు.

*కులం, మ‌తం పేరిట చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు.. మంత్రి కేటీఆర్ ధ్వ‌జం
ఇవాళ మ‌న దేశంలో ఏం జ‌రుగుతుందో యువ‌త ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ప్ర‌పంచంలో జ‌రుగుతున్న చ‌ర్చ గురించి అంద‌రూ ఆలోచించాలి. నిన్న ప్రార్థ‌న‌ల అనంత‌రం 25 కోట్ల మంది ముస్లిం సోద‌రులు దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్టారు. ఎందుకీ విప‌రీత ధోర‌ణులు క‌నిపిస్తున్నాయి. చిల్ల‌ర‌మ‌ల్ల‌ర మాట‌లు మాట్లాడుతున్న‌ది ఎవ‌రో ఆలోచించాలి. క‌రెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి ఆలోచించాలి. పిల్ల‌ల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ కులం, మ‌తం పేరిటి చిల్ల‌ర మ‌ల్ల‌ర రాజ‌కీయాలు చేస్తూ, ప‌చ్చ‌గా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చ‌లి మంట‌ల‌ను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. స‌వ్య‌మైన ప‌ద్ధతుల్లో ముందుకు పోతేనే అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

*రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌.. సీఎం కేసీఆర్‌కు మ‌మ‌తా బెన‌ర్జీ లేఖ‌
ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఇవాళ లేఖ రాశారు. ఢిల్లీలో ఈ నెల 15న జ‌రిగే స‌మావేశానికి సీఎం కేసీఆర్‌ను మ‌మ‌త ఆహ్వానించింది. ఈ సంద‌ర్భంగా 8 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు స‌హా 22 మంది జాతీయ నేత‌ల‌కు మ‌మ‌త లేఖ రాశారు.రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల దృష్ట్యా విప‌క్షాల‌ను బెంగాల్ సీఎం కూడ‌గ‌డుతున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లో బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిని బ‌రిలో నిలిపేందుకు మ‌మ‌త తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో ఈ నెల 15న ఢిల్లీలో నిర్వ‌హించే భేటీకి 22 మంది నేత‌ల‌కు ఆహ్వానం పంపారు. తెలంగాణ‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్‌, ఒడిశా, పంజాబ్ సీఎంల‌తో పాటు ప‌లువురి ప్ర‌ముఖుల‌కు లేఖ‌లు రాశారు మ‌మ‌తా బెన‌ర్జీ.

*కేసీఆర్‌.. టైమ్‌పాస్‌ రాజీయాలు చేసింది చాలు: బండి సంజయ్‌
తెలంగాణలో బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ అన్నట్టుగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేసీఆర్‌.. కేంద్రంపై పోరుకు సిద్దమవుతుండగా.. సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యజలు చేశారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోసారి కేసీఆర్‌ సర్కార్‌పై మండిపడ్డారు. బండి సంజయ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘‘కేసీఆర్ టైమ్‌పాస్ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు అని వ్యాఖ్యలు చేసిన సంజయ్.. ముందు తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ క్రుమంలోనే మోదీ ఎనిమిదేళ్ల పాలనపై.. అదే సమయంలో కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..? అంటూ బండి సవాల్‌ విసిరారు. వారసత్వ, అవినీతి పార్టీలు దేశంలో అంతమైపోతున్నాయని అన్నారు. తెలంగాణను కులాలు, మతాలు, వర్గాల పేరుతో కేసీఆర్ విచ్ఛిన్నం చేశారని సంజయ్ ఆరోపించారు. ప్రపంచంలో భారత్‌ను మోడీ అగ్రస్థానంలో నిలిపారని చెప్పారు. కానీ, కేసీఆర్‌ మాత్రం ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

*వివేకా హత్య గురించి సీఎంకు తెలుసు: buddha venkanna
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్‌కు తెలుసని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్‌ హత్యపై జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. హత్య కేసు నిందితులంతా అనుమానాస్పదంగా చనిపోన్నారని తెలిపారు. గంగాధర్‌రెడ్డి మృతివెనుక ఉన్న మిస్టరీ ఏంటి అని అడిగారు. గంగాధర్ రెడ్డి మరణంపై కూడా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్ సునీతా రెడ్డి, అతని భర్తకు రక్షణ కల్పించాలన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సహనం పెరిగిపోతోందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.

*దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి:Gangula kamalakar
అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా లేకున్నా తెలంగాణ లో నెరవేరుతున్నాయని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్అ న్నారు. దళితులు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో దళిత బంధులో భాగంగా తాహెర్ కొండాపూర్ గ్రామానికి కేటాయించిన యూనిట్లను ఎంపీడీవో కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి ద్వారా మన పల్లెలను మన భావితరాలకు అందించడానికి తెచ్చిందే ఈ కార్యక్రమమని అన్నారు.

*పల్లె ప్రగతితో గ్రామాలు దేశానికి ఆదర్శంగా మారాయి:Errabelli
పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇప్పుడు గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకురుతున్నాయని, ఒకప్పటి పట్టణ, నగర వలస తగ్గిపోయి, ఇప్పుడు పల్లెలకు వలస మొదలైందన్నారు. గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం పెరిగి, ఆరోగ్యం పెరిగి గ్రామాలు ఆయు ఆరోగ్యాలకు అడ్రెస్స్ గా మారాయని చెప్పారు.ఒక గ్రామానికి పచ్చదనం పెంచడానికి నర్సరీలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాలు వంటివి ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

*మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమే: KTR
మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేది ఒక్క టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఢిల్లీ నుంచి ప్రతిరోజు టూరిస్ట్‌లు వస్తున్నారని ఎద్దేవాచేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్‌ అంటున్నారని, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ఏం అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్లకు అధికారం ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారని, కులపిచ్చిగాళ్లు కావాలా?, అభివృద్ధి కోసం పాటుపడే టీఆర్ఎస్ కావాలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

*మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి: Revanth Reddy
సోమవారం అన్ని రాష్ట్రాల ఈడీ ఆఫీసుల ఎదుట కాంగ్రెస్ నిరసన తెలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా సీబీఐ, ఈడీలను మార్చుకున్నాయని విమర్శించారు. గ్రేటర్ పరధిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలపై ఈనెల 15 అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్, బీజేపీలను ఆహ్వానిస్తామని తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమం కార్యక్రమంలో మరింత స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

*అభివృద్ధి చేతగానివాళ్లు మాకు అడ్డుతగులుతున్నారు: ధూళిపాళ్ల
అభివృద్ధి చేతగానివాళ్లు తమకు అడ్డుతగులుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో డెయిరీ నిధులతో రోడ్డు వేస్తే శిలాఫలకం ధ్వంసంచేస్తారా? అని ప్రశ్నించారు. రూ.29.52 లక్షల సంగం డెయిరీ నిధులతో రోడ్డు నిర్మించామని, రహదారిని జీవీ అంజనేయులు ఈనెల 9న ప్రారంభించారని తెలిపారు. బాధ్యత లేనివాళ్లు శిలాఫలకం ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు.

*నాడు-నేడు పేరుతో YCP నేతల దోపిడీ: నక్కా ఆనంద్‌బాబు
నాడు-నేడు పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు వాస్తవాలు మాట్లాడడం చేతకాదన్నారు. చదువు లేని బేవర్స్‌ బ్యాచ్‌ని మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెట్టారని తప్పుబట్టారు. విద్యావ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఏపీలో అసలు సంక్షేమ పరిపాలనే లేదన్నారు. ఆకతాయితనంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆనంద్‌బాబు మండిపడ్డారు.

*మంత్రి పదవి రాకున్నా పార్టీ మారను: ఎమ్మెల్యే శిల్పా
మంత్రి పదవి రానంత మాత్రాన ఏ పార్టీకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. ‘నేను అలిగే వ్యక్తిని కాదు. పోరాడే వ్యక్తిని.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. వారితోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతిసారి పార్టీలు మారే ఆలోచన నాకు లేదు. మహానాడును అంతా బూచిగా చూపించారు.. త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ చూస్తే టీడీపీ వాళ్లకు దిమ్మ తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధితో వచ్చే ఎన్నికలలో 175 సీట్లలో గెలుస్తాం.’ అని ఎమ్మెల్యే శిల్పా అన్నారు.

*విజయసాయి రెడ్డి చర్చలకు పిలవడం హాస్యాస్పదం: దేవతోటి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజువిమర్శలు గుప్పించారు. ‘‘సూట్ కేస్ కంపెనీల సృష్టి కర్త, అవినీతి సొమ్ముకు గుత్తెదారు విజయసాయి రెడ్డి చర్చలకు పిలవడం హాస్యాస్పదం. విజయ సాయి రెడ్డి సవాల్ విసిరడ౦… పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఎవరు ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు’’ అంటూ దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు.

*పంట విరామం జగన్ పాలనా పాపమే: Jawahar
ఏరువాక సమయంలో పంట విరామం జగన్ పాలనా పాపమే అని మాజీ మంత్రి జవహర్ (Jawahar) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ధాన్యం డబ్బులు నేటికి రైతు ఖాతాలోకి జమ కాలేదని తెలిపారు. వ్యవసాయ ప్రోత్సాహకాలు ప్రచారానికి పరిమితమయ్యాయన్నారు. పంట బోదెల పూడికకు చర్యలు శూన్యమని విరుచుకుపడ్డారు. నీటి తీరువా ప్రణాళిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు భరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. పాడి పంటలు జగన్ పాలనలో కుధేలవుతున్నాయన్నారు. వ్యవసాయం అంటేనే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పుండు మీద కారం లా మోటర్లకు మీటర్లు అని… ఏ ప్రయోజనాల కోసం మీటర్లు పెడుతున్నారో చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.

*బీజేపీ గెలుపు నాకు షాక్ ఇవ్వలేదు : శరద్ పవర్
మహారాష్ట్ర నుంచి రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం తనకు దిగ్భ్రాంతి కలిగించలేదని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ చెప్పారు. అధికార కూటమికి తన ఓట్లు అన్నీ తనకు లభించాయని, కొందరు స్వతంత్రులు మాత్రమే బీజేపీకి ఓటు వేశారని చెప్పారు. ఈ ఫలితాల ప్రభావం తమ కూటమి ప్రభుత్వ స్థిరత్వంపై ఉండబోదని చెప్పారు. మహారాష్ట్రలో ఎన్‌సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రం నుంచి ఆరు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 3, మహా వికాస్ అగాడీ కూటమి 3 స్థానాలను దక్కించుకున్నాయి. బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, మాజీ రాష్ట్ర మంత్రి అనిల్ బొండే, ధనంజయ్ మహడిక్, ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ నేత ఇమ్రాన్ ప్రతాప్‌గఢి, శివసేన నేత సంజయ్ రౌత్ గెలిచారు. శివసేన నేత సంజయ్ పవార్, బీజేపీ నేత ధనంజయ్ మహడిక్ మధ్య భీకర పోరు జరిగింది. చివరికి శివసేన నేత ఓటమిపాలయ్యారు.

*కేసీఆర్ పగటి కలలు కంటున్నారు: Tarun chug
ఫాంహౌస్‌లో కూర్చొని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నారని తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో మహిళలపై ఘోరమైన రేపులు జరుగుతున్నాయని, వాటిని అరికట్టడంపై కేసీఆర్ దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలలో రేప్ జరిగిందని, ముఖ్యమంత్రి వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.రక్షక భటులే, భక్షక భటులుగా మారారన్నారు. వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి పుణ్యం కోసం కాశీకి వెళ్లినట్టు కేసీఆర్ తీరుతుందని యెద్దేవా చేశారు. దేశంలో వేలాది పార్టీలు ఉన్నాయని, ఆయనకు కూడా జాతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందన్నారు. బంగారు తెలంగాణ చేస్తానని చేయలేకపోయాడు, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జాతీయ రాజకీయాల నినాదం ఎత్తుకున్నారని తరుణ్ చుగ్ విమర్శలు గుప్పించారు.

*బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలి? : Mamata Banerjee
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. హౌరాలో జరుగుతున్న సంఘటనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆమెను అరెస్టు చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. హౌరాలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

*వైసీపీ మహిళా మంత్రులపై Angara Rammohan తీవ్ర విమర్శలు
వైసీపీ మహిళా మంత్రులపై టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్(Angara rammohan) తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… జగన్ సర్కార్లో మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాల పట్ల మంత్రి రోజా తేలికగా మాట్లాడుతున్నారన్నారు. మంత్రి రోజా.. తాను ఇంకా జబర్దస్త్ షోలోనే ఉన్నాననుకుంటున్నారని అన్నారు. తల్లుల పెంపకంలో లోపమే కారణమని హోంమంత్రి అంటున్నారని… అంటే మహిళలపై అఘాయిత్యాలకు వారి తల్లులే కారణమా? అని ప్రశ్నించారు. మంత్రులు ముందు వారి శాఖలపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ హితవుపలికారు.

*రాష్ట్రంలో పన్ను బకాయిల వసూలకు వన్ టైమ్ సెటిల్ మెంట్: సీఎం జగన్
పేరుకు పోయిన పన్ను బకాయిల వసూలుకు వన్‌ టైమ్‌ సెటిల్‌ మెంట్‌ విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రభుత్వ శాఖల ప్రగతిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్షించారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. శాఖల వారీగా సమీక్షించిన సీఎం … పలు ఆదేశాలిచ్చారు.సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందుబాటులోకి తేవాలి..అన్ని శాఖల్లో ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయాలు పెంచుకోవాలని సీఎం ఆదేశించారు. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. టిడ్కోకు సంబంధించి రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్‌ సేవలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలన్న సీఎం… ఎలాంటి సేవలు పొందవచ్చనే అంశాలపై సిబ్బంది ప్రజలకు తెలియజేయాలన్నారు. కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా రిజిస్ట్రేషన్‌ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందనే దానిపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లపై సీఎం చర్చించారు. ఇప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పత్రాలతో రిజిస్ట్రేషన్‌ సేవలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. క్రమంగా ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. 14వేల మంది గ్రామ, వార్డు కార్యదర్శులకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నామని తెలిపారు. అక్టోబరు 2 నాటికి తొలివిడత కింద రిజిస్ట్రేషన్‌ సేవలు, భూహక్కు-భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలని సీఎం సూచించారు.

*నా మెసేజ్‌ KCRకు చేరితే చాలు: తమిళిసై
గవర్నర్ తమిళిసై తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనలు జరిగిన నేపథ్యంలో మహిళల సమస్యలు వినాలని గవర్నర్‌ తమిళిసై నిర్ణయించారు. ఇందుకోసం రాజ్‌భవన్‌లో ‘మహిళా దర్బార్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాజ్‌భవన్‌ నుంచి ప్రభుత్వానికి మెసేజ్ ఇచ్చేందుకే తాను ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ను కలిసి ఏడాది దాటిందని, తనను కలవకున్నా తన మెసేజ్‌ సీఎంకు చేరితేచాలని వ్యాఖ్యానించారు. వీసీలపై అధికారాలు తియ్యాలా వద్దా అనేది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ప్రజాదర్బార్ నిరంతర కార్యక్రమమన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి రాజ్‌భవనేనని చెప్పారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఫాలో కావట్లేదని, అయినా తన కార్యక్రమాలు ఆపలేదని తెలిపారు. ప్రభుత్వం ప్రవర్తన మార్చుకోవాలి, సమస్యలు పరిష్కరించాలని సూచించారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి ఫిర్యాదుపై మానిటరింగ్ చేస్తున్నామని, తన ఫిర్యాదులపై ప్రభుత్వ శాఖలన్నీ స్పందించాలని తమిళిసై పేర్కొన్నారు.

*BJP, ప్రధాని డైరెక్షన్‌లోనే మహిళా దర్బార్: జగ్గారెడ్డి
బీజేపీ, ప్రధాని డైరెక్షన్‌లోనే రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ నిర్వహించారని ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మతవిద్వేషాలతో ఓట్లు రాబట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ప్రభుత్వం, పోలీసులు రాజాసింగ్‌ లాంటి వ్యక్తులను ఎందుకు కట్టడి చేయట్లేదు? అని ప్రశ్నించారు. రాజాసింగ్‌, హిందువులు ఆజ్మీర్‌ దర్గాకు వెళ్లకుండా అడ్డుకోగలరా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

*గిరిజన పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం: మంత్రి సత్యవతి
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని 1,430 ప్రాథమిక పాఠశాలలు, 326 ఆశ్రమ పాఠశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్చినట్లు మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనపై టీచర్లందరికీ ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. గిరిజన పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంపై ‘బడి బాట’ కార్యక్రమంలో విస్తృత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో విద్యా సంస్థలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అన్ని ఐటీడీఏల ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులతో డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి సత్యవతి రాథోడ్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆదివాసి ప్రాంతాల్లో విద్యాలయాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

*మహిళలకు రక్షణ కల్పించలేని సీఎం ఉరేసుకోవాలి: షర్మిల
మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కల్పించలేని సీఎం ఉరేసుకోవాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. నమ్మి రెండుసార్లు అవకాశమిచ్చిన ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం ఖమ్మంజిల్లా బోనకల్‌ మండలానికి చేరుకుంది. రాపల్లి, బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించిన ఆమె బ్రాహ్మ ణపల్లిలో మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నికలప్పుడు పెద్ద సినిమా చూపించి, ఆ తరువాత మొహం చాటేయడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని మండిపడ్డారు. కొత్త పథకాలతో మళ్లీ జనం ముందుకు వస్తారని, ఆయన మాయ మాటలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌ పాలన తిరిగి తెచ్చుకుంటేనే తెలంగాణ బాగుపడుతుందని, అందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు కదిలి రాజన్న బిడ్డగా తనను ఆశీర్వదించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాపల్లి గ్రామంలో అరక దున్ని, ట్రాక్టర్‌ నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

*జూమ్‌లో చొరబడిన నేతలపై చర్య తీసుకోండి: వర్ల
రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు నారా లోకేశ్‌ నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లోకి వైసీపీ నాయకులు వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభవనేని వంశీ, గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, కొత్తపల్లి రజనీ అక్రమంగా చొరబడ్డారని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. వారిపై కేసులు నమోదు చేయాలని కోరుతూ సీఐడీ అదనపు డీజీపీకి శుక్రవారం ఫిర్యాదు చేశారు.

*లోకేశ్‌ ఎందుకు.. నేను చాలు! దమ్ముంటే రండి: అనిత
‘పదో తరగతి పరీక్షలపై తనతో ముఖాముఖీకి రావాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేశ్‌కు సవాళ్లు విసురుతున్నారు. బ్రోకర్‌ పనుల్లో ఆరితేరిన విజయసాయితో చర్చకు లోకేశ్‌ అక్కరే ్లదు. నేను చాలు. దమ్ముంటే రండి’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత సవాల్‌ విసిరారు. ‘విశాఖను దోపిడీ చేయడం అయిపోయింది. విజయసాయిరెడ్డి ఇప్పుడు విజయవాడపై పడ్డాడు. విజయవాడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ ఏం చేస్తాడో జాగ్రత్తగా చూసుకోండి’ అని హెచ్చరించారు.

*గన్‌ జూమ్‌ మీటింగ్‌లోకి మేం చొరబడితే…?
‘టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ జూమ్‌ మీటింగ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీలు దొంగల్లా చొరబడటం సిగ్గుచేటు. సీఎం జగన్‌ నిర్వహించే జూమ్‌ మీటింగ్‌లోకి మేము చొరబడి ప్రశ్నలు సంధిస్తే తట్టుకునే దమ్ముందా?’ అని టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రజలు ఓ దోపిడీ దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. ఆ దొంగ నుంచి ఇప్పుడు రాష్ట్రాన్ని, పిల్ల ల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది’ అన్నారు. ‘‘లోకేశ్‌ చర్చకు సిద్ధం అన్నది జగన్‌తోనే.. మీ వాడిలో దమ్ముంటే చర్చకు రమ్మను. ఎనీ బ్లూ మీడియా.. లోకేశ్‌ ఈజ్‌ రెడీ..!’’ అంటూ విజయసాయిరెడ్డికి ట్విట్టర్‌లో అయ్యన్న సవాల్‌ విసిరారు.

*వ్యవసాయం గురించి పవన్‌కేం తెలుసు: కాకాణి
రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తే భయపడి ప్రభుత్వం ధాన్యం డబ్బులు చెల్లించిందని పవన్‌కల్యాణ్‌ మాట్లాడటం చూస్తుంటే ఆయన అవివేకం అర్థమవుతోందని, కేవలం చంద్రబాబు రాసిచ్చిన స్ర్కిప్ట్‌ చదువుతూ రైతుల్లోనూ అభాసుపాలు అవుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరులో వ్యాఖ్యానించారు. 10 పంటలు చూపితే వాటిలో 5 పంటల పేర్లు కూడా చెప్పలేని పవన్‌కల్యాణ్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఏ కారణంతో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారో పవన్‌ చెప్పాలని నిలదీశారు.

*175 సీట్లా.. 17 కూడా రావు: రామకృష్ణ
‘ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని చెప్పుకునేందుకు సీఎం జగన్‌ సిగ్గుపడ్డాలి. 175 కాదు గదా.. వారికి 17 కూడా రావు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సీపీఐ మహాసభలో పాల్గొన్న ఆయన.. బహిరంగ సభలో మాట్లాడారు. ‘మోదీ, జగన్‌ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి. కోనసీమలో క్రాప్‌ హాలిడే ప్రకటించే దుస్థితి ఎందుకు వచ్చిందో సీఎం బదులివ్వాలి. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అధికారంలేని కీలుబొమ్మల్లా మారారు’ అని రామకృష్ణ కోరారు.

*బాబు, దేవినేని కేసులకు భయపడను: అంబటి
సీఐడీలో నాపై కేసు పెట్టారా అని వ్యంగ్యంగా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్‌ నుంచి తూర్పు, పశ్చిమ డెల్టాకు శుక్రవారం నీరు విడుదల చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, దేవినేని ఉమా కేసులకు భయపడే వారు ఎవరూ లేరని చెప్పారు. ఎవరికైనా ఫిర్యాదులు చేసుకునే అవకాశం ఉందన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటుందన్నారు. అవసరమైతే చంద్రబాబు, దేవినేని ఉమా అంతర్జాతీయ న్యాయస్థానాలనూ ఆశ్రయించవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

*పేర్ని నాని.. ఓ వెర్రి పుష్పం: సోము
బీజేపీని, పార్టీ గుర్తు కమలాన్ని తక్కువ చేసి మాట్లాడిన పేర్ని నాని ఒక వెర్రి పుష్పమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులు మదమెక్కి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏజెంట్లను కూడా తమ పార్టీ పెట్టుకోలేదని మదమెక్కి మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ఎన్నికలంటే ఏమిటో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో చూపిస్తామని చెప్పారు. ఆత్మకూరులో గతంలో బీజేపీ గెలిస్తే ఓ పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ పెట్టి ఓడించారని, మరో రెండు పర్యాయాలు అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు.

*క్రాప్‌ హాలిడే వైసీపీ పాపమే: పవన్‌
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే అన్నపూర్ణ వంటి కోనసీమలో క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితి దాపురించిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ధాన్యం అమ్మిన రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని విమర్శించారు. కాలువలు, డ్రైయిన్ల మరమ్మతులు, పూడిక తీత, గట్టు పటిష్ఠం చేయడం వంటి పనులపై శ్రద్ధ చూపడం లేదని ధ్వజమెత్తారు. రంగు మారిన ధాన్యానికి ధర ఇవ్వడం లేదని, ఇలాంటి ఇబ్బందులతోనే రైతాంగం పంట వేయకూడదని నిర్ణయం తీసుకుందని తెలిపారు. తొలకరి పంట వేయలేమని కోనసీమ రైతులు ప్రభుత్వానికి లేఖలు రాస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అన్నం పెట్టే రైతు కోసమే ఏ ప్రభుత్వ పథకాలైనా ఉంటాయని అలాంటి అన్నదాతలే పంట పండించలేమని తేల్చి చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 2011లో లక్షన్నర ఎకరాల్లో పంట విరామం ప్రకటించారని గుర్తుచేశారు. ఆనాడు గోదావరి జిల్లాల రైతుల నిర్ణయం దేశాన్ని కుదిపేసిందని చెప్పారు.

*పేర్నినాని ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది: ఎంపీ బాలశౌరి
మాజీమంత్రి పేర్నినాని ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని ఎంపీ బాలశౌరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను మచిలీపట్నం రాకుండా అడ్డుకుంటున్నాడని తెలిపారు. ఎంపీ సుజనాచౌదరితో కార్యక్రమాల్లో పేర్నినాని పాల్గొంటాడని, ప్రభుత్వాన్ని సుజన విమర్శిస్తే పేర్నినాని స్పందించడని తప్పుబట్టారు. టీడీపీ నేత కొనకళ్ళ నారాయణతో మాట్లాడకపోతే నానికి నిద్రపట్టదన్నారు. కానీ సొంత పార్టీ ఎంపీ మాత్రం బందర్ రాకూడదా? అని ప్రశ్నించారు. బందర్‌ పేర్నినాని అడ్డా కాదని చెప్పారు. ‘‘ఇకపై బందర్‌లోనే ఉంటా..నా కార్యక్రమాల్లో పాల్గొంటా. ఎవరేం చేస్తారో చూస్తా..ఎంపీ అంటే ఏమిటో చూపిస్తా. నేను తాటాకు చప్పుళ్లకు భయపడే రకం కాదు’’ అని బాలశౌరి హెచ్చరించారు.

*లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధం: కొడాలి
నారా లోకేశ్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. తన ఐడీతో నేరుగా వెళితే లోకేశ్‌ మాట్లాడరని.. అందుకే తన మేనల్లుడి లింక్‌ నుంచి మీటింగ్‌లో పాల్గొన్నానని వెల్లడించారు. కరోనా వల్ల రెండేళ్లుగా 8, 9 తరగతులు సరిగా జరగలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాప్‌టా్‌పలు, ఆన్‌లైన్‌ క్లాసులు లేవని, కరోనా వల్ల క్లాసులు జరగకపోవడంతో ఉత్తీర్ణత శాతం తగ్గిపోయిందని చెప్పారు. గ్రేస్‌ మార్కులు వేయాలని అడుగుతున్నారని.. అలా ఇస్తే ఆ పిల్లలు కూడా లోకేశ్‌, పవన్‌లా తయారవుతారని కొడాలి వ్యాఖ్యానించారు.

*సాగుకు లక్ష కోట్ల ఖర్చు నిరూపిస్తారా: సోమిరెడ్డి
వ్యవసాయ శాఖకు మూడేళ్లలో రూ.లక్షా 10వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పిన వ్యవసాయ మంత్రి నిరూపిస్తే.. వంగి దండం పెడతానని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సవాల్‌ చేశారు. వ్యవసాయ రంగంలో దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారో తెలిపితే.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఓవిధంగా వ్యవసాయ శాఖ మూతపడిందని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు రూ.43వేల కోట్లు ఖర్చు పెట్టినట్లు నిరూపించాలని, ఇందులో బ్రోకర్లకు ఎంత పోయిందో చెప్పాలన్నారు. ఉచిత విద్యుత్‌కు ఇచ్చింది రూ.13వేల కోట్లు అనడం పచ్చి అబద్ధమని విమర్శించారు.

*ఎమ్మెల్యే అండతో దారుణాలు: ఎమ్మెస్‌ రాజు
మంగళగిరి నియోజకవర్గంలో మహిళా అధికారిణి హేమమాలినిరెడ్డి దారుణాలు అంతింత కాదయా.. అంటూ టీడీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు శుక్రవారం ట్విటర్‌ వేదికగా విమర్శించారు. తాడేపల్లి కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ హేమమాలినిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతో కుమ్మక్కై మూడేళ్లుగా ఒకే చోట పోస్టింగ్‌లో ఉన్నారని, ఆర్కేకు రైట్‌ హ్యాండ్‌గా మారి పేదల ఇళ్లు కూల్చడం, పేదల నోటి దగ్గర కూడు లాక్కోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకొచ్చాక హేమమాలినిరెడ్డి అక్రమాస్తులపై విచారణ చేయడం, వాటిని ఇదే జేసీబీతో కూల్చడం ఖాయమని హెచ్చరించారు.

*వ్యవసాయం గురించి పవన్‌కేం తెలుసు: కాకాణి
రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిస్తే భయపడి ప్రభుత్వం ధాన్యం డబ్బులు చెల్లించిందని పవన్‌కల్యాణ్‌ మాట్లాడటం చూస్తుంటే ఆయన అవివేకం అర్థమవుతోందని, కేవలం చంద్రబాబు రాసిచ్చిన స్ర్కిప్ట్‌ చదువుతూ రైతుల్లోనూ అభాసుపాలు అవుతున్నాడని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరులో వ్యాఖ్యానించారు. 10 పంటలు చూపితే వాటిలో 5 పంటల పేర్లు కూడా చెప్పలేని పవన్‌కల్యాణ్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఏ కారణంతో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటించారో పవన్‌ చెప్పాలని నిలదీశారు.

*175 సీట్లా.. 17 కూడా రావు: రామకృష్ణ
‘ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తాయని చెప్పుకునేందుకు సీఎం జగన్‌ సిగ్గుపడ్డాలి. 175 కాదు గదా.. వారికి 17 కూడా రావు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సీపీఐ మహాసభలో పాల్గొన్న ఆయన.. బహిరంగ సభలో మాట్లాడారు. ‘మోదీ, జగన్‌ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయి. కోనసీమలో క్రాప్‌ హాలిడే ప్రకటించే దుస్థితి ఎందుకు వచ్చిందో సీఎం బదులివ్వాలి. వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అధికారంలేని కీలుబొమ్మల్లా మారారు’ అని రామకృష్ణ కోరారు.