Politics

23న ఈడీ విచారణకు సోనియా – TNI తాజా వార్తలు

23న ఈడీ విచారణకు సోనియా –  TNI  తాజా వార్తలు

* నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) శుక్రవారం స్పష్టం చేసింది. సోనియాకు ఇటీవల కొవిడ్‌ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమెకు కొత్త తేదీని ఈడీ కేటాయించింది. ఇక కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సోమవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. రాహుల్‌ విచారణకు హాజరైన అనంతరం, ఆయనకు మద్దతుగా ఇక్కడి ఈడీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

*అమరావతిలోని శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానాన్ని రాజధాని రైతులు సందర్శించారు. దేవాలయం వద్ద అమరావతిని రక్షించాలంటూ నినాదాలు చేశారు. గోవింద గోవింద అంటూ నినాదాలు చేశారు. తిరుమల పాదయాత్ర చేయగానే హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చిందని పాలకుల మనస్సు మార్చి అమరావతి నిర్మించేలా మనసు మార్చాలని వెంకటేశ్వరునికి అమరావతి రైతులు విజ్ఞప్తి చేశారు.

*తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైకాపా కార్యాలయానికి పోలీసు క్వార్టర్స్‌కు చెందిన 3 ఎకరాల స్థలం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. పోలీసు స్టేషన్‌కు ఎదురుగా ఉన్న మూడున్నర ఎకరాల స్థలంలో గతంలో క్వార్టర్స్‌ నిర్మించారు. ఈ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చివేశారు. ఈ స్థలంలో పోలీసుశాఖ ఉన్నతాధికారి కార్యాలయంగానీ, పోలీసు క్వార్టర్స్‌ గానీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. తుడా నిధులతో కల్యాణ మండపం వ్యాయామశాల నిర్మిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనలన్నీ పక్కకు నెట్టి ఆ స్థలంలో వైకాపా కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఏడాదికి ఎకరాకు వెయ్యి రూపాయల చొప్పున ఎకరాలను ఏళ్లకు అద్దెకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తెలుగుదేశం జనసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుశాఖకు చెందిన స్థలాన్ని వైకాపాకు ధారాదత్తం చేస్తే ఊరుకునేది లేదని అడ్డుకుంటామని జనసేన నాయకులు హెచ్చరించారు

*చదువుకున్నంత మాత్రానా మహిళను ఉద్యోగం చేయాలని బలవంతం చేయలేమని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. గ్రాడ్యుయేట్‌ అయిన మహిళ బయటకు వెళ్లి పని చేయాలా లేక ఇంటి వద్దనే ఉండాలా అన్నది పూర్తిగా ఆమె ఛాయిస్‌ అని పేర్కొంది. ఒక కేసు విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక జంటకు 2010లో పెళ్లి అయ్యింది. 2013లో భర్త, అతడి కుటుంబంపై భార్య గృహహింస కేసు పెట్టింది. దీంతో కుమార్తెతో కలిసి విడిగా ఆమె నివసిస్తున్నది. గృహహింస కేసుపై విచారణ పెండింగ్‌లో ఉండటంతో భర్త నుంచి పోషణ ఖర్చులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. దీంతో భార్యకు రూ.5,000, కుమార్తె ఖర్చుల కోసం విడిగా రూ.7,000 చొప్పున నెలకు చెల్లించాలని భర్తను పూణే ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది.

*రాష్ట్రంలోని గ్రామసచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. దాంతో ప్రబేషన్‌ వస్తుందా? రాదా? అని.. వస్తే అందరికీ వస్తుందా..? లేక కొందరినే వరిస్తుందా? అనే అనుమానాలతో ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రొబేషన్ ఖరారై పెరిగిన జీతం వస్తుందని ఉద్యోగులు ఆశతో ఉన్నారు. అయితే, జూన్‌ నెల సగం పూర్తికావస్తున్నా.. ప్రొబేషన్‌ దస్త్రం కదలడం లేదు.

* అప్పలాయ గుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. వాహ‌న‌సేవ‌లో ఆల‌య డిప్యూటీ ఈవో లోక‌నాథం, సూపరింటెండెంట్‌ శ్రీ‌వాణి, కంకణభట్టార్‌ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
నిన్న రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్రస‌న్న వేంక‌టేశ్వర‌స్వామివారు వైకుంఠ నాధుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

*కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్‌కుమార్‌ ఎయిమ్స్‌,ఏపీ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రెండురోజుల పర్యటనలో భాగంగా ఆమె విజయవాడలోని మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పీఎంజేఏవై నిధులతో నడుస్తున్న ఆరోగ్యశ్రీ పథకం లోగోపై వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, సీఎం జగన్‌ ఫొటోలు మాత్రమే ఉండడాన్ని తప్పుబట్టారు.

*తాడిపత్రిలో డ్రైనేజీ కాలువ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నంద్యాల రోడ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ మరమ్మత్తు పనులను టీడీపీ చేపట్టింది. గత రెండు రోజుల నుంచి పూడికతీత పనులు జరుగుతున్నాయి. అయితే రిపేరి తాము చేస్తామంటూ వైసీపీ నాయకులు పోటీగా జేసీబీలు ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల మధ్య పోటాపోటీతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ మల్లిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు దాడి చేశారు. వెంటనే ఆమెను తాడిపత్రి ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో టీడీపీ కౌన్సిలర్‌ను కుటుంబ సభ్యులు అనంతపురంకు తరలించారు.

*గుంటూరు: జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌ లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ పర్యటించారు. ఆసుపత్రిలో సదుపాయాలను పరిశీలించారు. ఆయుష్మాన్ భారత్ గురుంచి ఆసుపత్రిలో ఎక్కడా డిస్ప్లే బోర్డు కనిపించకపోవడంతో… ఎయిమ్స్ సూపరిండెండెంట్ ముఖేష్ త్రిపాఠీని కేంద్రమంత్రి నిలదీశారు. వైద్యం అందుతున్న తీరుపై రోగుల నుంచి సమాచారం సేకరించారు. వైద్యులు మాట్లాడే హిందీ, ఇంగ్లీషు తమకు అర్థం కావడం లేదని.. రోగులు చెప్పేది డాక్టర్‌లకు అర్ధం కావడం లేదంటూ కేంద్రమంత్రి పవార్‌కు ఫిర్యాదులు వచ్చాయి.

*తిరుమలలో మీడియాపై మంత్రి రోజా అక్కసు వెళ్లగక్కారు. రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ మహాద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించినా… వెళ్లలేదంటూ మంత్రి బుకాయించారు. కొన్ని చానెల్స్ తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను… తన సిబ్బంది ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా ఎప్పుడు నడుచుకోలేదంటూ సమర్ధించుకున్నారు. రోజా ఎస్కార్ట్ వాహనం డ్రైవర్‌ను విజువల్స్ తీసేందుకు ప్రయత్నించిన మీడియాను రోజా సిబ్బంది అడ్డుకుంది.

*తిరుచానూరులో శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి తెప్పోత్సవాలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.తొలిరోజున రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మ సరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయం చేరుకున్నారు.ఈ సందర్భంగా కల్యాణోత్స వం ఊంజల్‌సేవలను రద్దు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత పద్మసరోవరంలో ఉ త్సవాలు జరగడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. డిప్యూటీఈవో లోకనాధం అర్చకులు శ్రీనివాసాచార్యులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.

*సీఎం జగన్ జిల్లా పర్యటనపై మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు పంట పరిహారం చెల్లించని జగన్ రెడ్డి.. ఏం మొఖం పెట్టుకుని జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. రూ.1,250 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. మూడేళ్లుగా రూ.4 వేల కోట్లు పరిహారం ఇవ్వకుండా దగా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు డ్రిప్ పరికరాలు ఇవ్వాలంటూ.. ఈనెల 13న జిల్లా చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తామని కాలవ శ్రీనివాసులు ప్రకటించారు.

*తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఏడంతస్తుల సచివాలయ భవన నిర్మాణంలో భాగంగా డోమ్‌ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. శుక్రవారానికి మొత్తం 11 డోమ్‌లను బిగించగా.. మరో 23 డోమ్స్‌ను అమర్చాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వీటి బిగింపు పూర్తయితే.. సచివాలయ భవన నిర్మాణం తుదిదశకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. మొత్తం 34 డోమ్‌లను 4 సైజుల్లో ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సచివాలయ భవన నిర్మాణం విజయదశమికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి.

*వాణిజ్యపరంగా వినియోగించే మోటారు వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడంలో జాప్యం చేస్తే చెల్లించాల్సిన జరిమానాపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన తర్వాత రోజు నుంచి లెక్కించి రోజుకు రూ.50 చొప్పున రాష్ట్ర రవాణా శాఖ అధికారులు జరిమానాగా వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇది అమలవుతోంది. కేంద్ర చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలకే ఈ జరిమానా వేయాల్సి ఉండగా, ఇతర వాహనాలకు కూడా దీన్ని వర్తించడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు 15 ఏళ్ల లోపు వాహనాలకు ఫిట్‌నెస్‌ జరిమానాలు వసూలు చేయకూడదంటూ శుక్రవారం తీర్పు ఇచ్చిందని న్యాయవాది సిహెచ్‌. రవీందర్‌ తెలిపారు.
*తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఏడంతస్తుల సచివాలయ భవన నిర్మాణంలో భాగంగా డోమ్‌ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. శుక్రవారానికి మొత్తం 11 డోమ్‌లను బిగించగా.. మరో 23 డోమ్స్‌ను అమర్చాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వీటి బిగింపు పూర్తయితే.. సచివాలయ భవన నిర్మాణం తుదిదశకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. మొత్తం 34 డోమ్‌లను 4 సైజుల్లో ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సచివాలయ భవన నిర్మాణం విజయదశమికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి.

*తెలుగు రాష్ట్రాల్లో గోదావరి బేసిన్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సందర్శించనుంది. ఈనెల 13, 14న రాష్ట్రంలోని సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు పెద్దవాగును పరిశీలించనుంది. అనంతరం 15, 16న ఏపీలోని ప్రాజెక్టులను సందర్శించనుంది. జీఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి అజగేశన్‌ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన బృందం ఈ పర్యటనలు చెయ్యనుంది.
*ఇంటర్మీడియట్‌ బోర్డు పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి కీలక అడుగు పడింది. క్రమబద్ధీకరణ చెయ్యాల్సిన కాంట్రాక్టు లెక్చరర్ల జాబితాను ఇంటర్‌ బోర్డు సిద్ధం చేసింది. ఆ జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. ఆ జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావాలని ఇంటర్‌ బోర్డు సూచించింది.

*తెలుగు రాష్ట్రాల్లో గోదావరి బేసిన్‌లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) సందర్శించనుంది. ఈనెల 13, 14న రాష్ట్రంలోని సీతారామ ఎత్తిపోతల పథకంతో పాటు పెద్దవాగును పరిశీలించనుంది. అనంతరం 15, 16న ఏపీలోని ప్రాజెక్టులను సందర్శించనుంది. జీఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి అజగేశన్‌ నేతృత్వంలో నలుగురు అధికారులతో కూడిన బృందం ఈ పర్యటనలు చెయ్యనుంది.
* సీఎం కేసీఆర్‌ వైఖరి పట్ల వెలమ సామాజికవర్గంలోనూ తీవ్ర అసంతృప్తి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆ సామాజికవర్గంలో ఒక్క కేసీఆర్‌ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. శుక్రవారం జూబ్లీ బస్‌స్టేషన్‌ (జేబీఎ్‌స)కు వెళ్లిన ఆయన బస్‌చార్జీల పెంపుపై ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, కూకట్‌పల్లిలో నిర్వహించిన పార్టీ మేడ్చల్‌ అర్బ న్‌ జిల్లా స్థాయి సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్‌చార్జీల పెంపు వెనుక ప్రైవేటీకరణ కుట్ర ఉందని ఆరోపించారు. బస్‌చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

* రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి మరో ఐదు రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈనెల 8 తేదీనే రుతుపవనాలు రావాల్సి ఉండగా ఇప్పటికే రెండు రోజులు దాటిపోయింది. మరో ఐదు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ కె.నాగరత్న తెలిపారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రతుపవనాలు ప్రవేశించినప్పటికీ పూర్తిస్థాయిలో విస్తరించలేదని, దీంతో రాష్ట్రంలో రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా ప్రవేశించవచ్చని ఆమె చెప్పారు. శుక్రవారం నైరుతి రుతుపవనాలు గోవా, కొంకణ్‌, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాల్లో ప్రవేశించాయని వెల్లడించారు. రాగల 48 గంటల్లో దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగటానికి అనుకూల పరిస్థితులు ఉందని, దీంతో వచ్చే మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని ఆమె వివరించారు.

*టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషకు సీఐడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీచేశారు. ఈ నెల 20న గుంటూరులోని సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని తెలిపారు. సీఐడీ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన నోటీసు పత్రాలను శుక్రవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో ఆమెకు పోలీసు అధికారులు అందజేశారు. సోషల్‌మీడియాలో ప్రభుత్వ పథకాలపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేశారనే అభియోగంపై శిరీషకు కొద్దిరోజుల కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీన మంగళగిరి సీఐడీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘంగా విచారించిన విషయం విదితమే.

* తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులతో పాటు పది ఫలితాలు విడుదలైన నేపథ్యంలో భక్తులు శుక్రవారం ఉదయం నుంచే భారీగా తిరుమలకు చేరుకున్నారు. సాయంత్రం 7 గంటల సమయానికి సర్వదర్శన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్‌ లేపాక్షి మీదుగా ఆస్థానమండపం వరకు దాదాపు రెండు కిలోమీటర్లు వ్యాపించింది. వీరికి దర్శన సమయం 17 గంటలు పడుతోంది.

*కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉసేనాపురం గ్రామానికి చెందిన వైసీపీ మైనార్టీ ముఖ్య కార్యకర్త పక్కిరి మహబూబ్‌ బాషా (45) ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం స్పందించింది. కాంట్రాక్టు పనులకు బిల్లుల చెల్లింపుపై శుక్రవారం రాత్రి కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో వివరణ ఇచ్చారు. ఓర్వకల్లు, ఉసేనాపురం గ్రామాల్లో నాడు-నేడు పనులను పేరెంట్స్‌ కమిటీ చేసిందని, వాటికి బిల్లులు కూడా ఆ కమిటీ అకౌంట్లోనే వేశామని చెప్పారు. ఉశేనాపురంలో ఆర్బీకే భవనాన్ని రూ.21.80 లక్షలతో గ్రామ పంచాయతీ కమిటీ పర్యవేక్షణలో చేశారని, ఈ పనులకు రూ.16.56 లక్షలు చెల్లించామని చెప్పారు. అయితే ఆర్బీకే భవనం, నాడు-నేడు పనులను మహబూబ్‌ బాషా ఇతరుల భాగస్వామ్యంతో చేశారని, బిల్లులు సకాలంలో రాక అప్పుల పాలయినందుకే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు చెబుతున్నారు.

*టీటీడీ నిబంధనలు ఉల్లంఘించినందుకు నయనతారకు నోటీసులు జారీ చేస్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహ కిషోర్ తెలిపారు. ‘ఇటీవల పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేశ్‌ తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. భక్తులు పవిత్రంగా భావించే మాడవీధుల్లో వారు చెప్పులతో సంచరించడం టీటీడీ నిబంధనలకు విరుద్ధం. దీనిపై వివరణ ఇవ్వాలని నయనతారకు నోటీసు పంపాం. ఫోన్లో మాట్లాడాం కూడా. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ కోరుతూ వీడియో రిలీజ్ చేస్తామని నయనతార చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడం’ అని నరసింహ కిషోర్ పేర్కొన్నారు.

*తిరుమలలో టైం స్లాటెడ్‌ సర్వదర్శన విధానంలో కొన్ని ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతానికి నిలిపివేశామని,వేసవి తర్వాత తిరిగి ఈ విధానాన్ని అమలు చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భవిష్యత్తులో భక్తులందరూ ఇంటి వద్ద నుంచే టైంస్లాట్‌ దర్శన టోకెన్లు పొంది దర్శనానికి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ధర్మారెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.

*సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సభ్యులు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో కలసి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లిన జస్టిన్‌ ఎన్వీ రమణ ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో జస్టిస్‌ ఎన్వీ రమణకు, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాకు వేదపండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ డిప్యూటీ ఈవో లడ్డూప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విజయలక్ష్మి కూడా శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

*రాష్ట్రంలో కోటి 10 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగు అవుతుందని జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ తెలిపారు. ఈ ఆయకట్టుకు 1000 టీఎంసీల వరకు నీరు అవసరమవుతుందని ప్రకాశం బ్యారేజ్‌ నుంచి నీటి విడుదల చేసిన సందర్భంగా శశిభూషణ్‌ తెలిపారు. రాష్ట్రంలో ఒక శ్రీశైలం ప్రాజెక్టులో తప్ప మిగిలిన అన్ని జలాశయాల్లో సరిపడినంత నీరు ఉందని తెలిపారు.

*బీటెక్‌+ఎంటెక్‌ డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ (సెల్ఫ్‌ సపోర్టింగ్‌ మోడ్‌)లో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2022 (ఆఈట్‌-2022…ఏయూఈఈటీ)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డైరెక్టర్‌ ఆచార్య డీఏ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అపరాధ రుసుం రూ.750తో ఈ నెల 26వ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 28 నుంచి అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని, 30న ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు. వివరాలకు ఠీఠీఠీ.్చఠఛీ్చౌ.జీుఽ వెబ్‌సైట్‌ను సంప్రతించాలని కోరారు.

*సత్యం రామలింగరాజు తల్లి అప్పలనరసమ్మ ( కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. కరూర్‌ వైశ్యా బ్యాంకు హెచ్‌డీఎ్‌ఫసీ తదితర బ్యాంకుల్లో ఆమెకు ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని (డీఫ్రీజ్‌) హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీచేసింది. సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణంలో రామలింగరాజు తల్లి కూడా లబ్ధిదారేనని పేర్కొంటూ ఆమె బ్యాంకు ఖాతాను సీబీఐ గతంలో స్తంభింపజేసింది. కుంభకోణంలో భాగంగా రామలింగరాజు అక్రమంగా సంపాదించిన ఆస్తులు షేర్లు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు ఇతర లావాదేవీలు ఆయన తల్లి బ్యాంకు ఖాతాల ద్వారా కూడా జరిగాయని సీబీఐ పేర్కొంది. అయితే… నిందితురాలిగా లేని తన ఖాతాలు సీజ్‌ చేయడం అక్రమమని పేర్కొంటూ అప్పలనరసమ్మ హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. వృద్ధురాలినైన తన జీవనభృతి కోసం బ్యాంకు ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించుకునేలా ఆదేశాలు జారీచేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ రాధారాణి ధర్మాసనం… ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను నిర్వహించుకోనివ్వాలని డిపాజిట్ల సొమ్మును తీసుకోనివ్వాలని సీబీఐకి తుది ఆదేశాలు జారీచేసింది.

*వాణిజ్యపరంగా వినియోగించే మోటారు వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవడంలో జాప్యం చేస్తే చెల్లించాల్సిన జరిమానాపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రవాణా వాహనాల ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన తర్వాత రోజు నుంచి లెక్కించి రోజుకు రూ.50 చొప్పున రాష్ట్ర రవాణా శాఖ అధికారులు జరిమానాగా వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇది అమలవుతోంది. కేంద్ర చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన వాహనాలకే ఈ జరిమానా వేయాల్సి ఉండగా, ఇతర వాహనాలకు కూడా దీన్ని వర్తించడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు 15 ఏళ్ల లోపు వాహనాలకు ఫిట్‌నెస్‌ జరిమానాలు వసూలు చేయకూడదంటూ శుక్రవారం తీర్పు ఇచ్చిందని న్యాయవాది సిహెచ్‌. రవీందర్‌ తెలిపారు.

*తిరుచానూరులో శ్రీవారి దేవేరి పద్మావతీ దేవి తెప్పోత్సవాలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.తొలిరోజున రుక్మిణి, సత్యభామ సమేత కృష్ణస్వామి పద్మ సరోవరంలో తెప్పపై మూడు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు.అనంతరం మాడవీధుల్లో ఊరేగుతూ ఆలయం చేరుకున్నారు.ఈ సందర్భంగా కల్యాణోత్స వం, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత పద్మసరోవరంలో ఉ త్సవాలు జరగడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చారు. డిప్యూటీఈవో లోకనాధం, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.

*తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఏడంతస్తుల సచివాలయ భవన నిర్మాణంలో భాగంగా డోమ్‌ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. శుక్రవారానికి మొత్తం 11 డోమ్‌లను బిగించగా.. మరో 23 డోమ్స్‌ను అమర్చాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వీటి బిగింపు పూర్తయితే.. సచివాలయ భవన నిర్మాణం తుదిదశకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. మొత్తం 34 డోమ్‌లను 4 సైజుల్లో ఏర్పాటు చేస్తున్నారు. కాగా.. రూ.617 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన సచివాలయ భవన నిర్మాణం విజయదశమికల్లా పూర్తయ్యే అవకాశాలున్నాయి.

* రాష్ట్రపతి ఎన్నికలకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుకు లంకెపెట్టాలని వైసీపీ, టీడీపీలను పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, స్టీల్‌ప్లాంట్‌, రెవెన్యూ లోటుభర్తీ, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి నిధులు తదితర వరాలు ఇచ్చిందని, వీటిని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ వీటిని సాధించలేక పోయిందన్నారు. 22 మంది ఎంపీలను ఇస్తే జగన్‌ ప్లేటు ఫిరాయించి, బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది, వైసీపీ ఎంపీలు అవసరం లేదు, గట్టిగా డిమాండ్‌ చేయలేం అని సన్నాయి నొక్కులు నొక్కారన్నారు.

*మార్కెటింగ్‌శాఖ కమిషనరేట్‌లో సూపరింటెండింగ్‌ ఇంజనీరు (ఎస్‌ఈ)గా పనిచేస్తున్న ఎం.శ్రీనివా్‌సను ఆ శాఖ అఫిసియేటింగ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపైశుక్రవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. మార్కెటింగ్‌శాఖ ఇంజినీరింగ్‌ విభాగానికి సూపరింటెండింగ్‌ ఇంజనీరు పోస్టు వరకే ఉండగా.. ఎస్‌ఈ కమిషనర్‌ కంట్రోల్‌లో విధులు నిర్వహిస్తారు. ఎస్‌ఈ పోస్టు తర్వాత ఆ విభాగంలో పదోన్నతి లేనందున.. అఫిసియేటింగ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

*గుంటూరు జిల్లా మంగళగిరి ఆర్టీసీ బస్టాండ్‌ వెలుపల..ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కూలదోసిన అన్నాక్యాంటీన్‌ వద్దనే టీడీపీ శ్రేణులు శుక్రవారం ఉద్రిక్తతల నడుమ అన్నాక్యాంటీన్‌ను ప్రారంభించాయి. కూలదోసిన తాత్కాలిక నిర్మాణాల ప్రాంతంలో అన్నాక్యాంటీన్‌ను ప్రారంభించేందుకు అనుమతించబోమంటూ నగరపాలకసంస్థ అధికారులు పెద్దఎత్తున పోలీసు బలగాలను అక్కడ మొహరింపజేశాయి. అయితే అన్నాక్యాంటీన్‌ ప్రారంభాన్ని అదే ప్రాంతంలో ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్న టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా ఎన్టీఆర్‌ విగ్రహ ప్రాంతాన్ని చేరుకున్నాయి.

*సత్యం కంప్యూటర్స్‌ చైర్మన్‌ రామలింగరాజు తల్లి అప్పలనర్సమ్మ బ్యాంక్‌ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. కరూర్‌ వైశ్యా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఆమెకున్న అకౌంట్లను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని స్పష్టం చేసింది. సీబీఐ ఫ్రీజ్‌ చేసిన బ్యాంక్‌ ఖాతాలను పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ అప్పలనర్సమ్మ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు.దీనిపై జస్టిస్‌ జి.రాధారాణి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే, సీబీఐ తరఫున స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఎన్‌.నాగేందర్‌ వాదనలు వినిపించారు. అప్పలనర్సమ్మ కుమారులపై కేసు నమోదు చేసినప్పుడు బంధువులతో పాటు ఆమె బ్యాంక్‌ ఖాతాలనూ ఫ్రీజ్‌ చేశారని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. అయితే సీబీఐ చార్జీషీట్‌లో ఆమె పేరు ఎక్కడా లేదని, నిందితులకు ఆర్థిక నేరాల కింద శిక్ష కూడా విధించారని చెప్పారు. పిటిషనర్‌ 85 ఏళ్ల వృద్ధురాలని, రోజు వారీ అవసరాలకు డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అనంతరం నాగేందర్‌ వాదనలు వినిపిస్తూ.. రామలింగరాజు ఆర్థిక నేరాలతో పిటిషనర్‌ కూడా లబ్ధి పొందారన్నారు. 1999 నుంచి 2001 వరకు ఆమె పేరుపై 3,92,500 షేర్లు ఉన్నాయన్నారు. నేరాలు మోపబడిన కంపెనీలో ఆమె డైరెక్టర్‌గానీ, ప్రమోటర్‌గానీ కాకపోవడంతో చార్జీషీట్‌లో పేరు చేర్చలేదని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగిందని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రిట్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ.. బ్యాంక్‌ ఖాతాలను పునరుద్ధరించాలని సీబీఐని ఆదేశించారు.