DailyDose

పోలీసుల ఎదుటే విలేకరులను చితకబాదిన వైకాపా నేతలు – TNI నేర వార్తలు

పోలీసుల ఎదుటే విలేకరులను చితకబాదిన వైకాపా నేతలు   – TNI  నేర వార్తలు

*అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా నేతలు వీరంగం సృష్టించారు. పోలీసుల ఎదుటే మీడియా ప్రతినిధులను చితకబాదారు. స్థానికంగా ఉన్న మురుగునీటి పైపులైను మరమ్మతుల విషయంలో తెదేపా, వైకాపా నేతలు పోటీపడ్డారు.అదే సమయంలో ఈ ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరులపై వైకాపా నేతలు దాడి చేసి చితకబాదారు. అంతటితో ఆగకుండా ఒక మీడియా ప్రతినిధి ఫోన్‌ లాక్కొని వెళ్లారు. తెదేపా కౌన్సిలర్‌ మల్లికార్జున, కాంట్రాక్టర్‌ మల్లికార్జునరెడ్డిపైనా వైకాపా నేతలు దాడి చేశారు.

*విజయవాడ రైల్వే స్టేషన్లో మూడేళ్ల వయస్సు పాపను గుర్తు తెలియని మహిళ కిడ్నాప్‌ చేసిన ఘటన కలకలం రేపింది. కూలీపనులు చేసుకుంటూ రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న మీర్జావలి, హుస్సేన్ దంపతుల చిన్న కుమార్తె అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు ఆర్పీఎఫ్ కార్యాలయంలోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. గుర్తు తెలియని మహిళ పాపను తీసుకెళ్తున్నట్లు దృశ్యాలు రికార్డు అయ్యాయి. దీంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి మూడు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు చేస్తున్నామని రైల్వే సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

*అక్రమంగా భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 9మంది నిందితులను పాడేరు జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు కోర్టుకు తరలించారు. గురువారం లబ్బురు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించి 13 లక్షలు విలువచేసే 25 ప్యాకెట్లలోని 684 కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడ్డ గంజాయిని లక్ష్మీపురం నుంచి ఒడిశాకు తరలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుల నుంచి జీపు, బొలెరోలతో పాటు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

*హౌరా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించేందుకు ప్రయత్నించిన పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. ఉత్తర్ దీనజ్‌పూర్ ఎంపీ అయిన మజుందార్‌ను విద్యాసాగర్ సేతులోని టోల్ ప్లాజా సమీపంలో అదుపులోనికి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

*హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న షర్ఫుద్దీన్‌ ఇలియాజ్‌ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరజ్‌ అనే యువకుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. సినీనటి కరాటే కల్యాణి బృందం సభ్యుడైన సూరజ్‌ పలు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ షర్ఫుద్దీన్‌పై ప్రతి ఒక్కరూ పీఎ్‌సలలో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.

*రైలు కిందపడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పీఎస్‌ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాటేదాన్‌ సాయినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్‌గౌడ్‌ కుమారుడు రాగిణి రిషిగౌడ్‌(21) డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం శివరాంపల్లి- బుద్వేల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

*ఏపీలో విషాదం నెలకొంది. చెట్టుపై పండిన రేగుపండ్లను తిన్న నలుగురు తీవ్ర అస్వస్థతకు గురికాగా వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కోసిగి గ్రామంలో చెట్టు నుంచి రేగిపండ్లు తెంపిన మహిళతో పాటు ముగ్గురు చిన్నారులు వాటిని తిన్నారు. కొద్దిసేపటికే వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా హర్ష(2) అనే చిన్నారి మార్గమధ్యలో మృతి చెందింది. అస్వస్థతకు గురైన మహాదేవి అనే మహిళ పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందజేస్తున్న వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన అంజి, శ్రీరాములును ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు.

*పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు ఎసరు పెట్టారు. వేంపల్లెలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేశారు. సీఎం జగన్‌ను కూడా లెక్కచేయకుండా జర్నలిస్టుల స్థలాలు కబ్జా చేశారు. కబ్జా స్థలాలను టీడీపీ కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకే దిక్కు లేకపోతే ఎలా స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

*వ‌రంగ‌ల్ : జిల్లాలోని చార్‌బౌలిలో శ‌నివారం ఉద‌యం ఓ పాత భ‌వ‌నం కూల్చి వేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు కార్మికుల‌కు మృతి చెందారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. శిథిలాల కింద ఉన్న ప్రకాశ్ (32), సునీత (30) మృత‌దేహాల‌ను పోలీసులు బ‌య‌ట‌కు వెలికితీశారు. మరో ఇద్ద‌రు కార్మికులు శ్రీనివాస్, జ్యోతి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జ్యోతి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

* వంతెనపై ప్రయాణిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. దీంతో వెంటనే ట్యాంకర్.. వంతెనపై నుంచి కింద పడింది. ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో బడాపాండుసర్ వంతెనపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది సజీవ దహనమైనట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదం వెనుక కారణం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.

*చిత్తూరు జిల్లా పలమనేరు పలమనేరు నాగమంగళం జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుకనుండి ఢీకొట్టిన కారు. ప్రకాష్ 39 సాఫ్ట్వేర్ ఇంజనీర్. మ్య 38 వైఫ్ పవన్ 12 కుమారుడు. రమ్యకు తీవ్ర గాయాలు తలలో రెండు చోట్ల హాస్పిటల్లో వేలూరు కు రెఫర్ చేసినట్లు తెలిపారు.ఇరువురికి స్వల్ప గాయాలు.

*ప్రొద్దుటూరు టౌన్‌లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి నిఘా ఉంచి ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్టు చేశామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ హాలులో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా బుడ్డప్పనగర్‌కు చెందిన అన్నాదమ్ములు పీకారి కోటయ్య అలియాస్‌ షాలి పీకారి షాలి అలియాస్‌ కోటయ్య ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల తాడిపత్రి టౌన్లలో దొంగతనాలు చేశారు. చోరీ చేసిన బంగారు నగలు అమ్మి జల్సాలు చేసుకునేవారు.

* జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో మైనర్ నిందితులను పోలీసులు జువైనల్ హోమ్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులందరికీ ఉస్మానియాలోని ఫోరెన్సిక్ విభాగంలో లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించనున్నారు. డాక్టర్ సుధాకర్ నేతృత్వంలో వైద్య బృందం సాదిద్దున్ మాలిక్‌తో పాటు ఐదుగురు మైనర్ నిందుతులకు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మూడు ప్రైవేట్ కార్లలో నిందితుల్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముఖాలకు మాస్కులు వేసి ఒక్కొక్కరిని ఫోరెన్సిక్ విభాగంలోకి తరలిస్తున్నారు. ఈ వైద్య పరీక్షకు సుమారు రెండు గంటలు సమయం పట్టే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించనున్నారు.

*నకిలీ ఎంఎన్ఓ అవతారంలో చోరీలకు పాల్పడుతున్న దొంగను రిమ్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప శ్రీరామ్నగర్కు చెందిన మణిదీప్ కోవిడ్ సమయంలో ఏఎన్ఎమ్గా పనిచేసిన అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని చోరీలకు తెరలేపాడు. మణిదీప్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు… నిందితుడి నుంచి 22 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా సర్వజన వైద్యశాలకు వచ్చే రోగులు లక్ష్యంగా చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి రోగుల ఒంటిపై బంగారు నగలు చోరీ చేశాడు. స్వీపర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘరానా దొంగను అరెస్ట్ చేశారు.

*హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న షర్ఫుద్దీన్‌ ఇలియాజ్‌ అనే వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూరజ్‌ అనే యువకుడు సిటీ సైబర్‌ క్రైమ్స్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. సినీనటి కరాటే కల్యాణి బృందం సభ్యుడైన సూరజ్‌ పలు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ షర్ఫుద్దీన్‌పై ప్రతి ఒక్కరూ పీఎ్‌సలలో ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు.

*రైలు కిందపడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పీఎస్‌ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాటేదాన్‌ సాయినగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న శ్రావణ్‌కుమార్‌గౌడ్‌ కుమారుడు రాగిణి రిషిగౌడ్‌(21) డిగ్రీ చదువుతున్నాడు. శుక్రవారం శివరాంపల్లి- బుద్వేల్‌ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

*ప్రొద్దుటూరు టౌన్‌లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి నిఘా ఉంచి ఇద్దరు అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్టు చేశామని ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని పెన్నార్‌ హాలులో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లా బుడ్డప్పనగర్‌కు చెందిన అన్నాదమ్ములు పీకారి కోటయ్య అలియాస్‌ షాలి, పీకారి షాలి అలియాస్‌ కోటయ్య ప్రొద్దుటూరుతో పాటు ఎర్రగుంట్ల, తాడిపత్రి టౌన్లలో దొంగతనాలు చేశారు. చోరీ చేసిన బంగారు నగలు అమ్మి జల్సాలు చేసుకునేవారు.

*అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండల పరిధిలోని రంగచేడు గ్రామానికి చెందిన రైతు బోయ బొట్లయ్యగారి రుద్రప్ప (46) అప్పుల బాధ తాళలేక శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రుద్రప్పకు 1.30 ఎకరాల పొలం ఉంది. దీనికితోడు ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకుని వరి, వేరుశనగ సాగు చేశాడు. గిట్టుబాటు ధరలేక నష్టపోయాడు. పెట్టుబడి కోసం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. దీంతో పాటు గత ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రైవేటు కంపెనీ (చోళ) నుంచి ట్రాక్టర్‌ కొనుగోలు కోసం రూ.9 లక్షలు ఫైనాన్స్‌ తీసుకున్నాడు. దీని ఈఎంఐ కూడా చెల్లించలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్‌ కంపెనీ నిర్వాహకులు రెండు రోజుల క్రితం రుద్రప్ప ఇంటివద్దకు వచ్చి సొమ్ము చెల్లించకపోతే ట్రాక్టర్‌ తీసుకెళతామని హెచ్చరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేకువజామున ఇంటి లోపలి గదిలోకి వెళ్లి దూలానికి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

*భారతీయ జనతా పార్టీ మాజీ అధికార ప్రతినిధి ఇటీవల ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జార్ఖండ్‌లోని రాంచీలో శుక్రవారం పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగింది. కొందరు దుండగులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ గుడి ప్రాంగణంలోకి పెట్రోలు బాంబులు విసిరారు. ఆ సమయంలో ఆ గుడి పూజారి కుటుంబ సభ్యులు అక్కడే నిద్రిస్తున్నారు.