Movies

రాజమౌళి సినిమాలో ఐశ్వర్యారాయ్?

రాజమౌళి  సినిమాలో ఐశ్వర్యారాయ్?

కొద్దిరోజులుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. రజనీకాంత్ , నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కనున్న చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్న టిస్తోందని. ‘2.0’ తర్వాత మళ్ళీ ఈ ఇద్దరి జోడీ అభిమానుల్ని అలరించబోతుండడం విశేషంగా మారింది. దీనిపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ వార్త అభిమానుల్ని ఖుషీ చేస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజమౌళి తదుపరి చిత్రంలో ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం ఘన విజయం తర్వాత రాజమౌళి తదుపరి చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జక్కన్న తదుపరి చిత్రం ఉండబోతున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ జంగిల్ నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇదివరకే వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ అండ్ టీమ్ ఇప్పుడు ఆ పనిలోనే ఉంది. ఇందులో ఒక కీలక పాత్రను ఐశ్వర్యారాయ్ చేయబోతోందని ఒక రూమర్ స్ప్రెడ్ అవుతోంది. కొందరు ఈ వార్తని కొట్టిపడేస్తున్నప్పటికీ.. ఐశ్వర్యారాయ్ ఈ సినిమాలో నటిస్తే ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలోని సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వచ్చే నెల్లో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నారు. SSMB 28 గా పిలుచుకొంటున్న ఈ సినిమాకి ‘అర్జునుడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ‌అతడు , ఖలేజా చిత్రాల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీని తర్వాత మహేశ్ బాబు రాజమౌళి చిత్రానికి షిఫ్ట్ అవుతాడు. మరి నిజంగానే ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ నటిస్తుందో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.