NRI-NRT

డెలావేర్ లో పోటా పోటీ గా జరిగిన అట సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు

డెలావేర్ లో పోటా పోటీ గా జరిగిన అట సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు

జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ D.Cలో జరగనున్న 17వ ATA కన్వెన్షన్‌ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో భాగంగా ATA కన్వెన్షన్ బృందం జూన్ 4, 2020 న డెలావేర్ లోని జాన్ డికిన్సన్ హైస్కూల్ ఆడిటోరియంలో ATA సయ్యంది పాదం నృత్య పోటీలను విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నాట్యం, జానపదం మరియు ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.రియా సివ్వా పాటతో ప్రారంభమైన ఈ పోటీలను తిలకించేందుకు 200 మందికి పైగా హాజరయ్యారు. జడ్జీలు శ్రీమతి అనిషా ధరణిప్రగడ, శ్రీమతి రెమా పల్లెం మరియు శ్రీమతి శైల మండల ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా నిలిచారు.
ata-Sayyandi1
ఈ కార్యక్రమానికి ATA బోర్డు ఆఫ్ ట్రస్టీ హను తిరుమల్ రెడ్డి, సయ్యండి పాదం చైర్ సుధా కొండపు, కో-చైర్ భాను మాగులూరి, ప్రాంతీయ సలహాదారు కిరణ్ అలా, రీజినల్ కోఆర్డినేటర్లు సతీష్ బండ, కిరణ్ బైరి, సౌజన్య కొలిపాక, ప్రియా అమర, అలాగే స్టాండింగ్ కమిటీ సభ్యులు వేణు కొలిపాక, ప్రశాంత్ గుడుగుంట్ల అధ్యక్షత వహించారు. ATA బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు మరియు మొమెంటోలను అందించింది. ఈ పోటీల్లో గెలిచిన రాష్ట్ర స్థాయి విజేతలు, DC జరగనున్న కన్వెన్షన్‌లో ఫైనల్స్‌లో పోటీపడతారు. ఫైనల్స్‌కు శేఖర్‌ మాస్టర్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం.
ata-Sayyandi2
***డెలావేర్ విజేతల వివరాలు
సీనియర్ క్లాసికల్ సోలో – మీరా రత్నగిరి
సీనియర్ క్లాసికల్ గ్రూప్ – నిశ్చిత త్యమగొండ్లు కృష్ణమూర్తి
జూనియర్ క్లాసికల్ సోలో – సంవేద్య గరిమెళ్ళ
జూనియర్ క్లాసికల్ గ్రూప్ – శ్రీవిద్య రెడ్డి కర్ర, సిరి మట్ట, హాసిని మట్ట
సీనియర్ నాన్ క్లాసికల్ సోలో – కామేశ్వరి కొటికలపూడి
సీనియర్ నాన్ క్లాసికల్ గ్రూప్ – ఐషాని కశ్యప్, వల్లి పర్వతనేని, సంజన తొట్టెంపూడి
జూనియర్ నాన్ క్లాసికల్ సోలో – రీదున్ గుజ్జ
జూనియర్ నాన్ క్లాసికల్ గ్రూప్ – సాన్వి చల్లా, అన్విక సోమేపల్లి, సీయోన తాలి, రియా ఆనంద్, విహాన్ కిసనగరం, అభినవ్
ata-Sayyandi3
నరసారెడ్డిగారి, గౌతమ్ మంచాల, విహాన్ బుద్దుల హను తిరుమల్ రెడ్డి న్యాయనిర్ణేతల సహనానికి అభినందనలు తెలిపారు, మరియు పాల్గొన్న వారందరికీ వారి అద్భుతమైన పనితీరు మరియు ప్రతిభకు అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు. ATA నాయకత్వానికి, అధ్యక్షుడు భువనేష్ బూజాల, కన్వీనర్ సుధీర్ భండారు, సయ్యండి పాదం సలహాదారు రామకృష్ణ అల, చైర్ సుధ కొండపు, కో-చైర్ భాను మాగులూరి మరియు రామ్‌రాజ్ పోటీ నిర్వహణలో అద్భుతమైన మద్దతు మరియు సలహాలను అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమాన్ని సజావుగా, విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ఇతర బృంద సభ్యులు మరియు వాలంటీర్లు శృతి మేడిశెట్టి, సంధ్య వెన్నమనేని, సుభాషిణి రెడ్డి, ఉమా దొంతిరెడ్డి మరియు సుమన్‌లకు కూడా ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.డెలావేర్ ATA కోఆర్డినేటర్లు ATA నాయకత్వానికి, న్యాయనిర్ణేతలకు, పాల్గొనేవారికి మరియు ప్రేక్షకులకు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ata-Sayyandi4
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA 17వ కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్, మొదటిసారిగా వాల్టర్ E కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 1-3, 2022 వరకు వాషింగ్టన్ DCలో అంగరంగ వైభవం గా జరగనుంది.మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్‌తో జూలై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరు కావడం విశేషం. విజయ్ దేవరకొండ, డిజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ మరియు రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేయాలని June 15,2022 వరకు 50% off Early Bird discounted price ఇవ్వటం జరుగుతుంది.