DailyDose

పేర్ని నానితో.. నా బంధం అదే – TNI తాజా వార్తలు

పేర్ని నానితో.. నా బంధం అదే  –  TNI  తాజా వార్తలు

* మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై తెలుగుదేశం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నానితో సత్సంబంధాలు ఉన్నాయంటూ బాలశౌరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఆధారంతో పేర్ని నానికి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారో సమాధానం చెప్పాలన్నారు. తన గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని తనకు రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేసిన కొనకళ్ల.. నానితో తన బంధం ఇదేనని తేల్చి చెప్పారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలు చేసిన బాలశౌరి.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

*తెలంగాణా రాష్ట్రంలో సోమవారం నుంచి పాఠశాలలను పునః ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. సెలవులు పొడిగింపు లేదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలను సోమవారం నుంచి పునః ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాఠశాలల పునః ప్రారంభం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలని పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు. మన ఊరు – మన బడిలో భాగంగా 9వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు

* కరోనా మహ్మారి మరోసారి కోరలు చాస్తున్నది. క్రమంగా రోజువారీ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో వరుసగా రెండో రోజూ 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 8,582 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,32,22,017కు చేరాయి. ఇందులో 4,26,52,743 మంది కోలుకుని డిశ్చార్జీ అవగా, 5,24,761 మంది మరణించారు. మరో 44,513 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మహమ్మారికి నలుగురు బలవగా, 4,435 మంది బాధితులు వైరస్‌నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

*వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్‌, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది.

*టీటీడీకి చెందిన వివిధ ట్రస్ట్‌లకు పలు సంస్థలు పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. ఆదివారం ఉదయం టీటీడీ అధికారుల సమక్షంలో తమ విరాళాల డీడీలను అందించారు. వీరికి ఆలయ పూజారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

*తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ సోమేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకులుగా ఉన్న శరత్‌ను సంగారెడ్డి కలెక్టర్‌గా బదిలీ చేశారు. సిద్దిపేట కలెక్టర్‌గా ప్రశాంత్ జీవన్‌ను బదిలీ చేశారు. నల్గొండ కలెక్టర్‌గా రాహుల్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా కోయ శ్రీహర్షకు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొమురంభీమ్ – ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా చాహత్ బాజ్‌పాయ్‌ బాధ్యతలు అప్పగించారు. కొమురంభీమ్ – ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా ఉన్న కర్నటి వరుణ్‌రెడ్డిని ఉట్నూరు ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ పీవోగా అంకిత్‌ను ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా బదిలీ చేశారు. పంచాయతీ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌గా హనుమంతరావును బదిలీ చేశారు.

*ఏటూరునాగారంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. 17 మందిని కరిసింది. స్వల్పంగా గాయపడిన వారికి ములుగు ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రగాయాలైన వారికి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*వెంకాయమ్మ కుటుంబంపై దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పాలనను విమర్శిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. గతంలో కూడా వెంకాయమ్మపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని ఇప్పుడు ఆమె కొడుకుపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. దళిత మహిళపై దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక కుటుంబంపై అరాచక శక్తులు పదే పదే దాడులు చేస్తుంటే.. అడ్డుకోలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా అని నిలదీశారు. దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

*బాసర సరస్వతీ క్షేత్రం‌లో భక్తుల రద్దీ పెరిగింది. తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తారు. వరుసగా సెలవులు రావడం రేపటి నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానుండటంతో అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.

*కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశుని దర్శనానికి భక్తజనం క్యూ కడుతున్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో ఏడు కొండలపై భక్తుల రద్దీ పెరిగింది. దీంతో క్యూలైన్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో క్యూలైన్లు రాంభగీచ వరకు చేరుకున్నాయి. మరోవైపు నడక మార్గం గుండా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు

*కేసీఆర్‌.. అనే కాలం చెల్లిన మెడిసిన్‌ ఇక పని చేయబోదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయన కలిసి వచ్చిన నేతలు.. ఆయన్ను ఒక జోకర్‌లా చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపేందుకే జాతీయ పార్టీ నినాదాన్ని కేసీఆర్‌ ఎత్తుకున్నారన్నారు. దేశ రాజకీయాలపై మక్కువ ఉన్న కేసీఆర్‌.. ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరగబోయే ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపి ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం.. తానే హీరో, విలన్‌, హీరోయిన్‌ పాత్రలు వేస్తూ రేడియేటర్‌ సినిమా తీసినట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

*దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తెలంగాణలో తెస్తున్నారని, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజా దర్బార్‌ నిర్వహించి రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని పీయూసీ చైౖర్మన్‌ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలక పార్టీలకు అతీతంగా గవర్నర్‌ల నియామకం చేయాలని గతంలో మోదీ చేసిన డిమాండ్‌కు విరుద్ధంగా బీజేపీ అనుకూల వ్యక్తిని ఇక్కడ నియమించి రాజకీయ చేస్తున్నారన్నారు. గవర్నర్‌ రాజకీయ పార్టీల మహిళలతో దర్బార్‌ పెడితే.. అది మహిళా దర్బార్‌ అవుతుందా? అని ప్రశ్నించారు. ఆమెకు ఇష్టమైతే బీజేపీ అధ్యక్షురాలి పదవి చేపట్టాలని ఆయన సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రి అయితే తప్పేమిటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్‌ సీఎంగా చేసిన మోదీ పీఎం అయ్యారని గుర్తు చేశారు. ముచ్చటగా మూడోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రానుందని, కేసీఆర్‌ పట్ల ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదన్నారు. సొంత నిధులతో ఎమ్మెల్సీ కవిత గుడి కట్టిస్తే.. హిందూత్వం ఇప్పుడు గుర్తొచ్చిందా అని.. ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయనతోపాటు తండ్రి, తాతగానీ ఎవరైనా ఒక గుడి కట్టించారా అని ప్రశ్నించారు.

*విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని మోగల్లు గ్రామం. ఆయన 125వ జయంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మోగల్లు చేరుకున్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు స్మారక మందిరం వద్ద మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కలెక్టరు ప్రశాంతి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, బీజేపీ నాయకులు పి. రఘురాం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

*ద్వారకా తిరుమల దేవస్థానం నిత్యాన్నధాన ట్రస్ట్ విరాళంలో పొరపాటు చోటు చేసుకుంది. నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఓ భక్తులు రూ.2116లు చెల్లించాడు. కాగా ఆలయ ఉద్యోగి ఆ మొత్తాన్ని ఆన్‌లైన్లో రూ.8 కోట్లుగా ఎంటర్ చేశాడు. అమౌంట్ టైప్ చేయాల్సిన చోట సదరు ఉద్యోగి పొరబాటున ఆధార్ నెంబర్ టైప్ చేశాడు. దీంతో ఆన్‌లైన్‌లోని అమౌంట్లలో తేడాలు రావడంతో ఆలయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

*కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు భీమవరంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో భీమవరం చేరుకుంటారు. 10 గంటలకు మోగల్లు చేరుకుని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళి అర్పించి, అల్లూరి ధ్యాన మందిరాన్ని సందర్శిస్తారు. అనంతరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. జూలై 4న ప్రధాని పాల్గొనే అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలపై అధికారులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పెదఅమిరంలోని గ్రీన్‌హిల్స్‌లో మీడియా సమావేశం, అనంతరం బీజేపీ జిల్లా పదాధికారులతో సమావేశమవుతారు. బీజేపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొంటారు.

*కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ భీమేశ్వరాలయాన్ని శనివారం కలెక్టర్‌ హిమాన్షు శుక్లా సందర్శించారు. ఆలయంలోని దుండి గణపతి, లక్ష్మీనారాయణస్వామిని దర్శించుకున్నారు. భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సప్తమాతృకల వద్ద సీలింగ్‌ ఫ్యాన్‌కు దుమ్ము పట్టి ఉండటంతో అధికారులను ప్రశ్నించారు. దీంతో ఫ్యాన్‌ తుడిచేందుకు ఆలయ ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్‌ సిబ్బందిని పిలవగా.. కలెక్టరు జోక్యం చేసుకుని మీరే తుడవండని చెప్పారు. దీంతో ఈవోనే స్వయంగా ఫ్యాన్‌ శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ‘భక్తులు వచ్చే ఆలయం పరిశుభ్రంగా ఉండాలి. మీతో ఫ్యాన్‌ తుడిపించినందుకు ఏమీ అనుకోవద్దు. మీరే ఫ్యాన్‌ తుడిస్తే తదుపరి మీ సిబ్బంది సక్రమంగా పనిచేస్తారు’ అని చెప్పారు.

*వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడం సాధ్యపడదని లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ‘‘లోక్‌సభలో పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించిన వారిపైనే అనర్హత వేటు పడుతుంది. రఘురామరాజు అలాంటిదేమీ చేయలేదు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడారని మాత్రం ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం… దీనిపై చర్యలు తీసుకోలేం’’ అని స్పీకర్‌ కార్యాలయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం సభా హక్కుల కమిటీ ఈ విషయం విచారిస్తోందని… వైసీపీ చేసిన ఫిర్యాదుల్లోని అంశాలు, రఘురామరాజు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. ‘‘సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలలో వేటిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందన్న విషయంలో పదో షెడ్యూలులో మార్పులు చేయాలి. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అలాగే… ఇలాంటి అంశాల్లో నిర్ణీత వ్యవధిలోపు చర్యలు తీసుకోవాలని స్పీకర్ల సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చింది. దీంతోపాటు పలు అంశాలపై కమిటీ వేశాం. ఈ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది’’ అని స్పీకర్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

*దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ తెలంగాణలో తెస్తున్నారని, ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రజా దర్బార్‌ నిర్వహించి రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చారని పీయూసీ చైౖర్మన్‌ జీవన్‌ రెడ్డి ఆరోపించారు. శనివారం టీఆర్‌ఎ్‌సఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలక పార్టీలకు అతీతంగా గవర్నర్‌ల నియామకం చేయాలని గతంలో మోదీ చేసిన డిమాండ్‌కు విరుద్ధంగా బీజేపీ అనుకూల వ్యక్తిని ఇక్కడ నియమించి రాజకీయ చేస్తున్నారన్నారు. గవర్నర్‌ రాజకీయ పార్టీల మహిళలతో దర్బార్‌ పెడితే.. అది మహిళా దర్బార్‌ అవుతుందా? అని ప్రశ్నించారు. ఆమెకు ఇష్టమైతే బీజేపీ అధ్యక్షురాలి పదవి చేపట్టాలని ఆయన సూచించారు. సీఎం కేసీఆర్‌ ప్రధాన మంత్రి అయితే తప్పేమిటని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. గుజరాత్‌ సీఎంగా చేసిన మోదీ పీఎం అయ్యారని గుర్తు చేశారు. ముచ్చటగా మూడోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రానుందని, కేసీఆర్‌ పట్ల ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదన్నారు. సొంత నిధులతో ఎమ్మెల్సీ కవిత గుడి కట్టిస్తే.. హిందూత్వం ఇప్పుడు గుర్తొచ్చిందా అని.. ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యలు చేయడం తగదని, ఆయనతోపాటు తండ్రి, తాతగానీ ఎవరైనా ఒక గుడి కట్టించారా అని ప్రశ్నించారు.

*రైతును అటవీ శాఖాధికారులు చితకబాదిన ఘటన నిర్మల్‌ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. పెంబి మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్‌(బాధితుడు) అనే రైతు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే శనివారం మధ్యాహ్నం అటవీ శాఖాధికారులు ప్రతాప్‌, అశీ్‌షలు లక్ష్మణ్‌ఇంటికి వచ్చి.. అతడిని వారి వెంట అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. పోడు వ్యవసాయం ఎందుకు చేస్తున్నావంటూ అక్ష్మణ్‌ను చితకబాదారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులు.. స్థానికులు, తోటి రైతులతో కలిసి అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అకారణంగా లక్ష్మణ్‌ను ఎందుకు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెడ్మ బొజ్జు పటేల్‌ వారికి మద్దతు తెలిపారు. ఫారెస్టు అధికారులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెంబి ఎస్సై మహేశ్‌ తెలిపారు.

* లక్ష్మణ రేఖను దాటుతున్నది టీఆర్‌ఎస్‌ నాయకులేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి అన్నారు. గవర్నర్‌ను, మహిళలను మీరు అగౌరవపరుస్తున్న మాట నిజం కాదా? అని టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో ఇప్పటికీ మొత్తం నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ నిర్వహించిన మహిళా దర్బార్‌కు వచ్చిన వారిలో టీఆర్‌ఎస్‌ నేతల భూ కబ్జాలు, లైంగిక వేధింపుల బాధితులే ఎక్కువ అని చెప్పారు. ఇందుకు గాను టీఆర్‌ఎస్‌ నాయకత్వం సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? షీ టీంలు ఎక్కడున్నాయి? అని రజనీకుమారి నిలదీశారు.

* అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు చేతికి రాకపోవడంతో జీవితంపై విరక్తితో ఇద్దరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో శనివారం జరిగాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం కోక్‌సమన్నూర్‌కు చెందిన రైతు చెవుల ఆనంద్‌రావు(31) అప్పులు తెచ్చి నాలుగు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే వాతావరణంలో మార్పుల కారణంగా పంట దిగుబడి సరిగా రాలేదు. ఈ నేపథ్యంలో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, అప్పులిచ్చిన వారి వేధింపులు ఎక్కువవడంతో ఉరేసుకున్నాడు. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం రామాయపల్లికి చెందిన జక్కుల రమేష్‌ (52) తనకున్న ఎకరం భూమితోపాటు, ఇతరుల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుండగా దిగుబడులు రాక ఆర్థికంగా చితికిపోయాడు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే మార్గం లేక పొలంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

*సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 14న జరిగే ’ఆర్టీసీ రక్షణ-కార్మికుల హక్కులపరిరక్షణ’ సదస్సు లో పాల్గొని సలహాలు-సూచనలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధి బృందం శనివారం విపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించింది. పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ నాయకుడు అజీజ్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీఎ్‌సపీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి ఆహ్వానపత్రాలు అందజేసినట్లు జేఏసీ చైర్మన్‌ కె.రాజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ హన్మంత్‌ ముదిరాజ్‌లు తెలిపారు. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సొమ్మును యాజమాన్యం దారిమళ్లించి ఇతర అవసరాలకు వినియోగించడంతో సంక్షేమ పథకా లు నిలిచిపోయాయని చెప్పారు. ఏడేళ్లుగా న్యాయపరంగా రావలసిన రెండు పీఆర్‌సీ, అయిదు డీఏ బకాయిలను అమలు చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

*సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 14న జరిగే ’ఆర్టీసీ రక్షణ-కార్మికుల హక్కులపరిరక్షణ’ సదస్సు లో పాల్గొని సలహాలు-సూచనలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధి బృందం శనివారం విపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించింది. పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ నాయకుడు అజీజ్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీఎ్‌సపీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి ఆహ్వానపత్రాలు అందజేసినట్లు జేఏసీ చైర్మన్‌ కె.రాజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ హన్మంత్‌ ముదిరాజ్‌లు తెలిపారు. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సొమ్మును యాజమాన్యం దారిమళ్లించి ఇతర అవసరాలకు వినియోగించడంతో సంక్షేమ పథకా లు నిలిచిపోయాయని చెప్పారు. ఏడేళ్లుగా న్యాయపరంగా రావలసిన రెండు పీఆర్‌సీ, అయిదు డీఏ బకాయిలను అమలు చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

*వివిధ జిల్లాల్లో కొత్తగా అందుబాటులోకి రానున్న 131 బస్తీ దవాఖానాల్లో వైద్య సిబ్బంది భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 393 పోస్టులను కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నింపనున్నారు. ఈ మేరకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో బస్తీ దవాఖానాకు మెడికల్‌ ఆఫీసర్‌, స్టాఫ్‌ నర్సు, మరో సపోర్టు స్టాఫ్‌ను తీసుకోనున్నారు.

*ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీనగేష్‌ శనివారం ఓ ప్రకటన చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎ్‌సడబ్ల్యూ కోర్సుల్లో 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు అన్ని సెమిస్టర్లకు సంబంధించిన బ్యాక్‌ లాగ్‌ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల వాయిదా ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

*రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇంత లబ్ధి చేకూర్చిందంటూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలు చెబుతున్న లెక్కలతో లబ్ధిదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి రూ.50లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షల చొప్పున ఇస్తున్నామంటూ శనివారం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గొప్పలు చెప్పారు. ‘ప్రతి గడపకు జగనన్న లక్షలు ఇస్తున్నాడు. ఆయనకు మనం ఏమి ఇవ్వాలి. మళ్లీ ఆయనకే ఓటు వేయాలి. వేస్తారు కదా!’ అంటూ ప్రజల నుంచి గట్టిగా హామీలు తీసుకున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల లబ్ధి ఎలా వచ్చిందని ఆరాతీస్తే అంతా గాలి లెక్కలే కనిపించాయి. ఆయన లెక్కల ప్రకారం.. గిరిపురంలోని మునెమ్మకు నలుగురు కుమార్తెలు. వీరికి వివాహాలు జరిగి వేర్వేరుగా ఉన్నారు. మునెమ్మతోపాటు ఆ నలుగురి కుటుంబాలకూ రూ.8 లక్షల నుంచి రూ.9లక్షల చొప్పునలబ్ధి చేకూరినట్టు చెప్పుకొచ్చారు. వీరంతా జగనన్న ఇంటిపట్టా లబ్ధిదారులు. తిరుపతికి సుమారు 20కి.మీ దూరంలో సెంటు భూమి చొప్పున పొందారు. వాటికే రూ.6లక్షల నుంచి రూ.8లక్షల వరకు ఖరీదు కట్టి, ఆ ఐదు కుటుంబాల లబ్ధి మొత్తం కలిపేశారు. వాస్తవానికి అక్కడ సెంటు స్థలం రూ.2లక్షల విలువ కూడా చేయదు.

*పవిత్ర తిరుమల పుణ్యక్షేత్రంలో వైసీపీ మంత్రి రోజా సెక్యూరిటీలోని ఓ వ్యక్తి ఆలయ నిబంధనలు ఉల్లఘించారు. మహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి కలకలం రేపారు. శ్రీవారి దర్శనం కోసం శనివారం తిరుమలకు వచ్చిన మంత్రి రోజా మహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. కొద్దిసేపటికే రోజా కాన్వాయ్‌లో డ్రైవర్‌గా ఉన్న ఏఆర్‌ కానిస్టేబుల్‌ టీటీడీ ఉద్యోగులు ఆలయంలోకి వెళ్లే బయోమెట్రిక్‌ మార్గం ద్వారా మహద్వారానికి చేరుకుని వేగంగా ఆలయంలోకి ప్రవేశించారు. సాధారణంగా వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో భక్తులు పంచెతో ఆలయంలోకి వస్తారు. అయితే ఆ వ్యక్తి ప్యాంట్‌తో రావడాన్ని గమనించిన విజిలెన్స్‌ అధికారులు అనుమానంతో అడ్డుకుని వెనక్కిపంపారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మంత్రి రోజా స్పందిస్తూ.. ‘ఈ రోజు నేను ఒక్కదాన్నే మంత్రి హోదాలో దర్శనానికి వెళితే ఎవరో మా గన్‌మ్యాన్‌ వచ్చారని ప్రచారం చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. అలాంటి తప్పులు నేను, మావాళ్లు చేయరు’ అన్నారు.

*ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకు విజయదశమి నుంచి జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల యాత్రకు శ్రీకారం చుడుతున్నారని ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యలయంలో, తెనాలిలో క్రియాశీల సభ్యులకు బీమా పత్రాలు, కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అక్టోబరు 5న తిరుపతి నుంచి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ యాత్ర మొదలవుతుందని తెలిపారు. పవన్‌ ప్రతి జిల్లాలోనూ పర్యటిస్తారని చెప్పారు. వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, మన వ్యూహాలతో సన్నద్ధం కావాలని తెలిపారు. ‘‘జగన్‌ రెడ్డికి మరోసారి ఓటు వేయకూడదని రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి 70 శాతం ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల వచ్చిన సర్వేలో తేలింది. సంక్షేమ పథకాలు అతి కొద్దిమందికే అందుతున్నాయి. వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి.

*మంత్రి పదవి రానంత మాత్రాన ఏ పార్టీకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. నేను అలిగే వ్యక్తిని కాదు. పోరాడే వ్యక్తిని.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. వారితోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతిసారి పార్టీలు మారే ఆలోచన నాకు లేదు. మహానాడును అంతా బూచిగా చూపించారు.. త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ చూస్తే టీడీపీ వాళ్లకు దిమ్మ తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధితో వచ్చే ఎన్నికలలో సీట్లలో గెలుస్తాం. అని ఎమ్మెల్యే శిల్పా అన్నారు.

*సాంకేతిక కారణాల వల్ల ఈనెల 12న ఆదివారం వివిధ మార్గాల్లో 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు, సికింద్రాబాద్‌-లింగంపల్లి మార్గంలో ఒక సర్వీసు, లింగంపల్లి-సికింద్రాబాద్‌ మార్గంలో ఒక సర్వీసు రద్దు చేశారు.

*రైతును అటవీ శాఖాధికారులు చితకబాదిన ఘటన నిర్మల్‌ జిల్లాలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. పెంబి మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్‌(బాధితుడు) అనే రైతు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే శనివారం మధ్యాహ్నం అటవీ శాఖాధికారులు ప్రతాప్‌, అశీ్‌షలు లక్ష్మణ్‌ఇంటికి వచ్చి.. అతడిని వారి వెంట అటవీ శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. పోడు వ్యవసాయం ఎందుకు చేస్తున్నావంటూ అక్ష్మణ్‌ను చితకబాదారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులు.. స్థానికులు, తోటి రైతులతో కలిసి అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. అకారణంగా లక్ష్మణ్‌ను ఎందుకు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెడ్మ బొజ్జు పటేల్‌ వారికి మద్దతు తెలిపారు. ఫారెస్టు అధికారులపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెంబి ఎస్సై మహేశ్‌ తెలిపారు.

*టైంపాస్‌ రాజకీయాలు చేయడంలో సీఎం కేసీఆర్‌ దిట్ట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. తెలంగాణలో ఔటయిపోయానన్న నిర్ణయానికి వచ్చి దేశాన్ని ఏలాలని కలలు కంటున్నారన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని దోచుకోవటం అయిపోయింది… ఇక దేశాన్ని దోచుకునేందుకు జాతీయ పార్టీనా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎ్‌స(భారతీయ రాష్ట్ర సమితి) లేదు.. టీఆర్‌ఎస్‌ లేదు.. వాళ్లకు వీఆర్‌ఎస్సే అని జోస్యం చెప్పారు. జాతీయ పార్టీ పెట్టేముందు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు. దేశాన్ని బీజేపీ ఎక్కడ విచ్ఛిన్నం చేసిందో చెప్పాలని ఆయన సీఎంను నిలదీశారు. కులాలు, వర్గాల పేరుతో తెలంగాణను కేసీఆర్‌ విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేస్తున్నారా? అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన ప్రకటనపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. రైతుబంధుకు, ఫీజు రీఇంబర్స్‌ మెంటుకు, ఆరోగ్యశ్రీకి నిధులెందుకు ఇస్తలేరని ప్రశ్నించారు.

*లక్ష్మణ రేఖను దాటుతున్నది టీఆర్‌ఎస్‌ నాయకులేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి అన్నారు. గవర్నర్‌ను, మహిళలను మీరు అగౌరవపరుస్తున్న మాట నిజం కాదా? అని టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో ఇప్పటికీ మొత్తం నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ నిర్వహించిన మహిళా దర్బార్‌కు వచ్చిన వారిలో టీఆర్‌ఎస్‌ నేతల భూ కబ్జాలు, లైంగిక వేధింపుల బాధితులే ఎక్కువ అని చెప్పారు. ఇందుకు గాను టీఆర్‌ఎస్‌ నాయకత్వం సిగ్గుపడాలన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజురోజుకీ పెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? షీ టీంలు ఎక్కడున్నాయి? అని రజనీకుమారి నిలదీశారు.

* సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 14న జరిగే ’ఆర్టీసీ రక్షణ-కార్మికుల హక్కులపరిరక్షణ’ సదస్సు లో పాల్గొని సలహాలు-సూచనలు ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ప్రతినిధి బృందం శనివారం విపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించింది. పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీపీఐ జాతీయ నాయకుడు అజీజ్‌పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బీఎ్‌సపీ అధ్యక్షుడు ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌లను కలిసి ఆహ్వానపత్రాలు అందజేసినట్లు జేఏసీ చైర్మన్‌ కె.రాజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ హన్మంత్‌ ముదిరాజ్‌లు తెలిపారు. ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయించిన సొమ్మును యాజమాన్యం దారిమళ్లించి ఇతర అవసరాలకు వినియోగించడంతో సంక్షేమ పథకా లు నిలిచిపోయాయని చెప్పారు. ఏడేళ్లుగా న్యాయపరంగా రావలసిన రెండు పీఆర్‌సీ, అయిదు డీఏ బకాయిలను అమలు చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.

*వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయడం సాధ్యపడదని లోక్‌సభ స్పీకర్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ‘‘లోక్‌సభలో పార్టీ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించిన వారిపైనే అనర్హత వేటు పడుతుంది. రఘురామరాజు అలాంటిదేమీ చేయలేదు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడారని మాత్రం ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం… దీనిపై చర్యలు తీసుకోలేం’’ అని స్పీకర్‌ కార్యాలయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం సభా హక్కుల కమిటీ ఈ విషయం విచారిస్తోందని… వైసీపీ చేసిన ఫిర్యాదుల్లోని అంశాలు, రఘురామరాజు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నాయి. ‘‘సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలలో వేటిని తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందన్న విషయంలో పదో షెడ్యూలులో మార్పులు చేయాలి. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. అలాగే… ఇలాంటి అంశాల్లో నిర్ణీత వ్యవధిలోపు చర్యలు తీసుకోవాలని స్పీకర్ల సమావేశంలో ఏకాభిప్రాయం వచ్చింది. దీంతోపాటు పలు అంశాలపై కమిటీ వేశాం. ఈ కమిటీ మధ్యంతర నివేదిక ఇచ్చింది’’ అని స్పీకర్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి.

* ఖాద్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కాగా నిత్యాన్నదానం కోసం హిందూపురం ముద్దిరెడ్డిపల్లికి చెందిన బాలయ్య కుటుంబ సభ్యులు 20 క్వింటాళ్ల బియ్యం, వంద కిలోల కందిబేడలు, పది కిలోల పెసరబేడలను ఆలయ ఈఓ పట్టెం గురుప్రసాద్‌, ఆలయ చైర్మన జరిపిటి గోపాలకృష్ణకు అందించారు. అదేవిధంగా గోసరంక్షణ, నిత్యన్నదానం కోసం బెంగుళూరు నగరం అనేకల్‌కు చెందిన ఆర్‌.రామిరెడ్డి, లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు రూ.2లక్షలను విరాళంగా అందజేశారు.

*రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు. రాష్ట్రంలో మద్యం విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విమర్శనాస్త్రాలు సంధించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని.. చిన్న గమనిక అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

*తెలంగాణ కాంగ్రెస్‌లో వర్గ విభేధాలు మరోసారి బయటపడ్డాయి. సిద్దిపేట జిల్లాలో రచ్చబండకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డిని అడ్డుకుని దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.