Movies

అలాంటి పాత్రలు చేయలేను

అలాంటి పాత్రలు చేయలేను

‘యాక్షన్‌’, ‘జగమే తందిరం’ వంటి అనువాద చిత్రాల్లో మెరిసిన మలయాళీ అందం ఐశ్వర్యం లక్ష్మీ.. త్వరలోనే ‘గాడ్సే’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. సత్యదేవ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. గోపి గణేష్‌ పట్టాభి తెరకెక్కించారు. సి.కల్యాణ్‌ నిర్మాత. ఈ సినిమా జూన్‌ 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని విశేషాలను చెప్పింది ఐశ్వర్య. అవేంటో చూద్దాం..నేను ఏ భాషలో నటించినా.. కచ్చితంగా ఆ భాషపై అవగాహన పెంచుకునే రంగంలోకి దిగుతా. అలా చేయలేదంటే నా పాత్ర తాలూకూ సంభాషణలు, ఎమోషన్లపై సరిగ్గా దృష్టి సారించలేను.నేను నటిగా తెరపైకి అడుగుపెట్టి నాలుగేళ్లు పూర్తవుతోంది. తమిళం, మలయాళ భాషల్లో 15 చిత్రాల్లో నటించా.తెలుగులో ఇదే తొలి చిత్రం. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వానికి.. పౌరులకు మధ్య ఉండే సంబంధాలపై ప్రధానంగా చర్చించారు. అవినీతి మయమైన రాజకీయ నాయకులను, వ్యవస్థను ప్రశ్నించే ధైర్యవంతుడైన గాడ్సే పాత్రలో సత్యదేవ్‌ కనిపిస్తారు’’.ఈ చిత్రంలో నేను వైశాలి అనే తెలివైన పోలీస్‌గా కనిపిస్తా. ఈ పాత్రకు ప్రపంచ జ్ఞానం, సమాజంలోని వర్తమాన అంశాలపై పట్టు ఉండటం ముఖ్యం. అందుకే ఈ సినిమా చేస్తున్నప్పుడు వార్తాపత్రికలు బాగా చదివేదాన్ని.నాకు రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్లంటే చాలా ఇష్టం. ప్రతినాయక ఛాయలున్న పాత్రలు చేయలేను. ఎందుకంటే నేను చాలా సరదాగా ఉంటా. నెగిటివ్‌ రోల్స్‌ చేస్తే.. ఆ ప్రభావం నాపై పడుతుందని భయం(నవ్వుతూ).ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రం చేస్తున్నా. అని చెప్పింది.2017లో మలయాళ సినిమా Njandukalude Nattil Oridavelaతో వెండితెర అరంగెట్రం చేసింది. అనంతంర పలు చిత్రాల్లో నటించింది.ఇప్పుడు ఓ తమిళ వెబ్​సిరీస్​లోనూ నటిస్తోందిపలు అవార్డులను కూడా అందుకుంది. పలు అవార్డులను కూడా అందుకుంది.