Movies

వైశాలిగా మెప్పిస్తా

Auto Draft

గాడ్సే’ చిత్రంలో వైశాలి పాత్రలో ఆకట్టుకుంటా అని చెబుతున్నది నాయిక ఐశ్వర్య లక్ష్మి. సత్యదేవ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు గోపి గణేష్‌ రూపొందిస్తున్నారు. సి కళ్యాణ్‌ నిర్మాత. ఈ నెల 17న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపారీ తార. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ…‘సమాజాన్ని ప్రశ్నించే ఓ వ్యక్తి కథ ఇది. ఇందులో నేను వైశాలి అనే పోలీస్‌ అధికారి పాత్రలో నటిస్తున్నాను. కండబలంతో పాటు బుద్ధి బలాన్ని ఉపయోగించే అధికారిగా కనిపిస్తాను. ఆమె బాధ్యత గల అధికారి మాత్రమే కాదు బాధ్యత గల పౌరురాలు కూడా. ఈ కథ నాకు బాగా నచ్చింది. భాష తెలియకున్నా సన్నివేశాల భావోద్వేగాలను అర్థం చేసుకునేదాన్ని. సహాయ దర్శకుల హెల్ప్‌తో సంభాషణలు ఇంగ్లీష్‌లో రాయించుకుని నేర్చుకున్నాను. దర్శకుడు గోపి గణేష్‌ అంత సమయాన్ని ఇవ్వడం వల్లే పాత్రలో సరిగ్గా నటించగలిగాను. సత్యదేవ్‌ మంచి నటుడు. అతను నటించిన చిత్రాలు చూశాను. తోటి నటుడిగా సహకరించాడు. తెలుగు, తమిళ, మలయాళం భాషలేవైనా నాకు సినిమా అంటే ఇష్టం. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటిస్తున్నాను. అప్పట్లో విజయశాంతిలా యాక్షన్‌ ఫిలింస్‌ చేసి పేరు తెచ్చుకోవాలని ఉంది’ అని చెప్పింది.