DailyDose

అల్లూరి జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. ఐదుగురు మృతి – TNI నేర వార్తలు

అల్లూరి జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా.. ఐదుగురు మృతి   – TNI  నేర వార్తలు

*నెల్లూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఉలవపాడు వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోని నలుగురు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు కిందకు దిగారు. దీంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. వారు గుంటూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పారు.

* బీఫ్ స్మగ్లింగ్ చేస్తున్నపశ్చిమ యూపీకి చెందిన నలుగురు వ్యక్తులను నొయిడా పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో అరెస్టు చేసిన ఈ నలుగురికిపై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సెక్టార్ 62లో ఆదివారం రాత్రి పోలీసుల తనిఖీల్లో 150 కేజీల బీఫ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

*మియపూర్‌లో తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక పిస్తోల్, తాపంచ, రెండు మ్యాగజైన్‌లు, 13 బుల్లెట్లు, 6 మొబైల్ ఫోన్లు, ఆక్టివా వాహనం, కారు స్వాధీనం చేసుకుని మీడియాకు వారి వివరాలు తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు తుపాకులతో సంచరిస్తున్నారన్న పక్క సమాచారం‌తో ముగ్గురికి అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. పాత నేరస్థుడు స్వాన్ లియోనార్డ్ అలియాస్ కన్నా(34)ను అరెస్ట్ చేశామని, ఇతని వెనక బొలెరో కారులో వస్తున్న మరో ఇద్దరు సాయిరాం, సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కన్నాపై కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ నమోదైందని, వీరి వద్ద ఉన్న వెపన్స్ బీహార్ నుంచి తెచ్చినట్టు గుర్తించామన్నామన్నారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై పోలీస్ నిఘా ఉండటంతో అరెస్ట్ చేశామన్నారు. నిందితులకు తుపాకులు సమకూర్చిన బీహార్‌కు చెందిన ఆలోక్ పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు.

*అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మేరీల్యాండ్‌లోని స్మిత్‌బర్గ్‌ ఘటన మరువక ముందే చికాగోలో మరోసారి చోటుచేసుకున్నది. చికాగోలోని ఇండియానా నైట్‌క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చికాగోలో వారం రోజుల్లో తుపాకీకి ఆరుగురు బలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడని, అతనికోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

*అల్లూరి సీతారామరాజు: జిల్లాలోని చింతూరు మండలంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సాలోని భవానిపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఏడుగుర్రాళ్లపల్లి మూలమలుపు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. క్షతగాత్రులను ఏడుగుర్రాళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన చింతూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*ఆ లారీ డ్రైవర్‌ అసలే మద్యం మత్తులో ఉన్నాడు. ఆపై లారీని తప్పుడు దారిలో ఇతర వాహనాలకు ఎదురు నడుపుకొంటూ వెళ్లాడు. అతడి నిర్లక్ష్యానికి మూల్యం, మూడు నిండు ప్రాణాలు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోని మల్లారం గ్రామ శివారుల్లో రహదారిపై ఈ ఘోరం చోటుచేసుకుంది.

*పార్వతీపురం మన్యం జిల్లాలో పిడుగుపాటుకు కురుపాం మండలం గుజ్జువాయి పంచాయతీ నేరేడుమానుగూడకు చెందిన బిడ్డిక రవీంద్ర (21), రాంప్రసాద్‌ (20) అనే అన్నదమ్ములు మృతిచెందారు. ఆదివారం కొండపోడు పనులకు తల్లి మాధవితో కలిసి వెళ్లిన వారు మేఘాలు కమ్ముకోవడంతో మర్రిమానుగూడలోని తమ పొలంలో ఉన్న ఇంట్లో తలదాచుకున్నారు. ఆ ఇంటిపై పిడుగుపడడంతో రవీంద్ర, రాంప్రసాద్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందారు. మాధవి అస్వస్థతకు గురికావడంతో భధ్రగిరి పీహెచ్‌సీకి తరలించారు.

*శ్రీకాకుళం నుంచి వచ్చిన రైలులో మృతదేహం లభ్యమయింది. మృతుడి వయసు 45-50 ఏళ్లు ఉంటుందని రైల్వే పోలీసుల అంచనా వేశారు. నలుపు టీషర్ట్‌, బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి మృతుడు వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆస్పత్రికి మృతదేహం తరలించారు. మృతుడి సమాచారం గుర్తించే పనిలో రైల్వే పోలీసులు నిమగ్నమయ్యారు.

*అత్యంత అరుదైన, సు మారు రూ. 25 కోట్ల విలువ చేసేమరకత పంచముఖ వినాయక విగ్రహాన్ని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనతోపాటు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న అదే పార్టీకి చెందిన మరో నేతను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై ఉన్నతస్థాయి నేతల నుంచి ఒత్తిడి రావడంతో విగ్రహాన్ని వారి వద్ద ఉంచుకొని నిందితులను వదిలేశారు. వివరాల్లోకి వెళితే.. ఎర్రగొండపాలెంలోని వైసీపీ నేత వై. వెంకటేశ్వరరెడ్డి నివాసాన్ని ఒంగోలు సీసీఎస్‌ పోలీసులు శుక్రవారం రాత్రి సోదా చేశారు. ఇంట్లో ఉన్న మరకత పంచముఖ వినాయక విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వెంకటేశ్వరరెడ్డితోపాటు ఆ సమయంలో ఆయనతోపాటు ఉన్న మండలంలోని గోళ్లవిడిపికి చెందిన మరో వైసీపీ గ్రామస్థాయి నేత గజ్జెల చెన్నయ్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ విగ్రహాన్ని తన వద్ద ఉంచుకునేందుకు అవసరమైన అనుమతులున్నాయని వెంకటేశ్వరరెడ్డి చెప్పడంతో ఉత్తర్వులు తీసుకురావాలని చెప్పి వారిని విడుదల చేశారు. కాగా, ఈ విగ్రహాన్ని హైదరాబాద్‌ నుంచి తీసుకొచ్చినట్లు సమాచారం. దీని వెనుక ఎర్రగొండపాలెంలోని ఓ పంచాయతీ కార్యదర్శి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. విక్రయించాలని భావించినట్లు తెలుస్తోంది.

*ఎన్నిసార్లు కోరినా తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయలేదనే కోపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సీసీఎస్‌ కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. ఒకటో పట్టణ ఎస్‌ఐ సుమన్‌ వివరాల మేరకు.. సీసీఎస్‌ కాలనీకి చెందిన నజీర్‌ కుమారుడు మహబూబ్‌ బాషా( తనకు పెళ్లి చేయాలని కొన్ని రోజులుగా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కొన్ని రోజులు ఆగాలని వారు నచ్చచెబుతూ వచ్చారు. ఉండే ఆస్తులు అమ్మి అయినా తనకు పెళ్లి చేయాలని ఆదివారం మళ్లీ తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. వారు అదే సమాధానం చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.