DailyDose

‘వైఎస్సార్ వల్లే మేము ఇలా ఉన్నాం’ – TNI తాజా వార్తలు

‘వైఎస్సార్ వల్లే మేము ఇలా ఉన్నాం’  –  TNI  తాజా వార్తలు

* దేశంలో ప్రస్తుతం రాజకీయాలు పాడైపోయాయని.. బీజేపీ వల్ల డబ్బు రాజకీయమే నడుస్తోందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ‘కొండా’ సినిమా ప్రమోషన్‌ భాగంగా విజయవాడ వచ్చిన కొండా సురేఖ విజయవాడలోని కంట్రోల్‌ రూమ్‌ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్‌ విగ్రహం నుంచే కొండా సినిమా ప్రమోషన్‌ను ప్రారంభించారు.అనంతరం మాజీ మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కొండా సినిమా ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చాము. వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించి ఏపీలో టూర్ ప్రారంభించాం. వైఎస్సార్ వల్లే మేము ఇలా ఉన్నాం. వైఎస్సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రస్తుతం రాజకీయాలు పాడైపోయాయి. రాజకీయాలకు అతీతంగా నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను.

*వైఎస్ వివేకా హత్య కేసులో ముగ్గురు నిందితుల బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఉమా మహేశ్వర్‌రెడ్డి, సునీల్ బెయిల్ పిటిషన్లపై కోర్టు విచారించింది.వచ్చే సోమవారం వాదనలు వింటామని న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణ కోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

*సీఎం జగన్‌ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీలో జాప్యంపై లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ హామీ దృష్ట్యా మూడేళ్లుగా యువత ఎదురుచూపులు చూస్తున్నారని తెలిపారు. గ్రూప్‌-1 ఎంపిక తీరుపట్ల అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన ఉందన్నారు. అడుగడుగునా అవకతవలకు పాల్పడ్డారని అభ్యర్థుల ఆరోపిస్తున్నారని తెలిపారు. అస్మదీయుల కోసం గ్రూప్‌-1లో అక్రమాలకు తెరతీశారని ఆరోపించారు. రెండుసార్లు విడుదల చేసిన ఫలితాల్లో తేడాతో అభ్యర్థుల్లో ఆందోళనకు గురయ్యారని తెలిపారు. విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని లేఖలో చంద్రబాబు డిమాండ్ చేశారు.

*ఒడిశా రాష్ట్ర శాస‌న‌స‌భ స్పీక‌ర్‌గా బీజూ జ‌న‌తా ద‌ళ్ ఎమ్మెల్యే బిక్రం కేశ‌రి అరుఖా సోమ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే బిక్రం కేశ‌రికి సీఎం న‌వీన్ పట్నాయ‌క్, ఎమ్మెల్యేలు శుభాకాంక్ష‌లు తెలిపారు. అనారోగ్య కార‌ణాల‌తో ఎస్ఎన్ పాత్రో స్పీక‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. పాత్రో స్థానంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిక్రంను స్పీక‌ర్‌గా నియ‌మించారు. అరుఖా 1995 నుంచి భంజాన‌గ‌ర్ నుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో బీజేడీ ఎమ్మెల్యేలు 114 మంది, బీజేపీ 22, కాంగ్రెస్ 9, సీపీఐ(ఎం) నుంచి ఒక‌రు, ఒక స్వ‌తంత్ర ఎమ్మెల్యే ఉన్నారు.

*రేపు సత్యసాయి జిల్లాకు సీఎం
ముఖ్యమంత్రి జగన్‌ రేపు సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారులకు చెల్లించనున్నారు. సీఎం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 10.50 గంటలకు చెన్నేకొత్తపల్లి చేరుకుంటారు.11.15 గంటల నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభ, రైతులతో ముఖాముఖి ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 2.50 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.

*సీఎం జగన్‌రెడ్డికి ది పేరంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ లేఖ రాసింది. 2022-23 విద్యా సంవత్సరంలో కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని, కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆర్టీఈ యాక్ట్ అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.

*నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు.మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగ గా నామకరణం చేశారు.ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ సి మోహన్ ఆ వంగడాన్ని సోమవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో ఆవిష్కరింప జేశారు.ఆధునిక పరిజ్ఞానం తో ఫార్మ్ హౌజ్ లకు సరికొత్త డిజైన్ లను రూపొందించే మోహన్ మామిడిలో నూతన వంగడాన్ని సృష్టించడం అద్భుతమైన ప్రయోగంగ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు.

*’గడప గడప’ కార్యక్రమం కోసం వైసీపీ తంటాలు పడుతోంది. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యేల పీఏలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. శాసనసభ ఆవరణలో పీఏలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు, పీఏలు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై అసహనం వ్యక్తం చేస్తుండడంతో ఈ ఏర్పాటు అంటూ చర్చ జరిగింది. పార్టీ, గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం బాధ్యతలు ఎమ్మెల్యేల నుంచి పీఏలకు షిఫ్ట్ చేస్తున్నట్లు సమాచారం.

*రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ముగిసింది. పేపర్‌-1 పరీక్షకు 90.62 శాతం మంది హాజరయ్యారు. 32,976 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అలాగే పేపర్‌-2లో హాజరుశాతం 90.35గా నమోదైంది. 26,830 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో మహిళలు చంటిపిల్లలను తీసుకుని పరీక్షలకు వచ్చారు. తమ వెంట వచ్చిన సహాయకులకు పిల్లలను ఇచ్చి పరీక్షలు రాశారు. మరికొన్ని చోట్ల నిండు గర్భిణులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ప్రశ్నపత్రం విషయానికొస్తే… గత పరీక్షలతో పోలిస్తే ఈసారి పేపర్‌-1 ప్రశ్నల సరళి భిన్నంగా ఉంది. ప్రశ్నను చదివిన వెంటనే సమాధానాలు తెలుసుకునే విధంగా కాకుండా… కాస్త ఆలోచించి రాసేలా ఇచ్చారని అభ్యర్థులు చెప్పారు. లాంగ్వేజ్‌ ప్రశ్నలన్నీ సంధులు, సమాసాలు, వ్యాకరణానికి సంబంధించిన ప్రాథమిక అంశాల నుంచే ఇచ్చారని తెలిపారు.

*నేరస్థులను ఎలా కట్టడి చేయాలో ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్లి తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. సీఎం కేసీఆర్‌కు సూచించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సలహాలు తీసుకుని, తెలంగాణలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యాచారాల నియంత్రణపై చిత్తశుద్ధి ఉంటే, నేరస్థుల పాలిట సింహ స్వప్నంగా మారిన యోగిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నేరాల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం, ఘటన జరిగిన వెంటనే స్పందించకపోవడం వల్లే రాష్ట్రంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ నగర్‌లో ఇటీవల అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని ఆదివారం సంజయ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బాలికలపై అత్యాచారం జరగని రోజు లేదని.. వీటిపై సీఎం ఎందుకు సమీక్షించడం లేదో అర్థం కావడం లేదన్నారు.

*రాష్ట్రంలో కొత్తగా మరో 129 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 104 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మిగిలిన అన్ని జిల్లాల్లో కలిపి 25 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 13,254 కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు యాక్టివ్‌ కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1039కి చేరింది.

*యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఇష్టదైవాలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయ తిరువీధులు, ఉభయ దర్శన, ప్రసాదాల విక్రయశాల క్యూలైన్లలో భక్తుల కోలాహలం కనిపించింది. స్వామివారి ధర్మదర్శనాలకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు మూడు గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. అయితే, భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వీవీఐపీ దర్శన క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. దేవస్థానంలో వీల్‌చైర్‌ సౌకర్యం లేకపోవడంతో వృద్ధులు ఇబ్బందులకు గురయ్యారు.

*నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించి సోనియా, రాహుల్‌గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేసినందుకు నిరసనగా సోమవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదు ట టీపీసీసీ దీక్ష చేపట్టనుంది. తన నోటీసులకు సమాధానం చెప్పేందుకు రాహుల్‌గాంధీ సోమవారం ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఆయన ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లినప్పటి నుంచి బయటికి వచ్చే వరకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట టీపీసీసీ నిరసన దీక్ష కొనసాగుతుంది.

*మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలను అరెస్టు చేయాలని ముస్లిం మతపెద్దలు డిమాండ్‌ చేశారు. బీజేపీ నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ముస్లింలు నిరసన చేపట్టారు. శాంతి భద్రతల దృష్ట్యా ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. ఎస్పీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళఽతామంటూ పట్టుబట్టడంతో పోలీసులు వారి ని శాంతింపచేయడానికి ప్రయత్నించారు. వారు ససేమిరా అనడంతో అదనపు ఎస్పీ మనోహర్‌ అక్కడికి చేరుకుని వారి నుంచి వినతిపత్రాన్ని తీసుకున్నారు

*వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. ఆదివారం సందర్భంగా గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘుదర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం సత్యనారాయణవ్రతం ఆర్జిత సేవలలో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలోనూ భక్తుల రద్దీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో ఎల్‌.రమాదేవి నేతృత్వంలో అధికారులు ఏర్పాట్లు చేశారు.

*అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌లో కేంద్ర ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. పశ్చిమ తీరంలో చమురు, గ్యాస్‌క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి రిలయన్స్‌-షెల్‌ కంపెనీలకు అనుకూలంగా వచ్చిన తీర్పును అమలు చేయాల్సిందేనని ఇంగ్లీష్‌ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభు త్వం ఈ రెండు కంపెనీలకు 11.1 కోట్ల డాలర్లు ఖర్చుల రికవరీ కింద చెల్లించాలి. ఒక అంతర్జాతీయ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్రం ఈ అప్పీల్‌కు వెళ్లింది.

*భారత ఇ-కామర్స్‌ దిగ్గజాల్లో ఒకటైన ‘ఫ్లిప్‌కార్ట్‌’ ఈక్విటీలో చైనా టెక్‌ దిగ్గజం టెన్సెంట్‌ 0.72 శాతం వాటా తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సాల్‌ నుంచి టెన్సెంట్‌ ఈ వాటాను 26.4 కోట్ల డాలర్లకు (సుమారు రూ.2,060 కోట్లు) కొనుగోలు చేసింది. యూర్‌పలోని తన అనుబంధ సంస్థ టెన్సెంట్‌ క్లౌడ్‌ యూరప్‌ బీవీ ద్వారా టెన్సెంట్‌ ఈ వాటా కొనుగోలు చేసింది. భారత కంపెనీల్లో చైనా కంపెనీల పెట్టుబడులపై ఉన్న ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని టెన్సెంట్‌ ఈ మార్గాన్ని ఎంచుకుంది.

*అమెరికా ఆంక్షలతో ఇరాన్‌ కరెన్సీ ‘రియాల్‌’ చితికి పోతోంది. ఆదివారం ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒక డాలర్‌తో రియాల్‌ మారకం రేటు గతంలో ఎన్నడూ లేని విధంగా 3.32 లక్షల యూనిట్ల కు పడిపోయింది. శనివారంతో పోలిస్తే ఇది 4,500 రియాల్స్‌ ఎక్కువ.

* ఇ-కామర్స్‌ మార్గంలో ఆభరణాలు ఎగుమతి చేసేందుకు సంబంధించిన ప్రామాణిక విధి విధానాల (ఎస్‌ఓపీ) ముసాయిదాను ఆర్థికమంత్రిత్వ విడుదల చేసింది. ఆభరణాలు ఎగుమతి చేయాలనుకునే వర ్తకు లు, తయారీదార్లకు సరళమైన నిబంధనలుండాలని ఆర్థి క శాఖ భావించింది. ఆసక్తి గల వర్గాలన్నీ ఈ ఎస్‌ఓపీ లను పరిశీలించి మంగళవారం నాటికి వాటిపై అభిప్రా యాలు ప్రకటించాలని సూచించింది. ఈ సరళీకృత విధా నాలు విలువైన వజ్రాభరణాలతో పాటుగా ఇమిటేషన్‌ ఆభరణాలకు కూడా వర్తిస్తాయి. ఇందుకు అనుగుణంగా కొరియర్‌ దిగుమతి, ఎగుమతి (ఎలక్ర్టానిక్‌ డిక్లరేషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌)నిబంధనలు-2010తో పాటు అందుకు సంబంధించిన ఫారంలను కూడా సవరించాలని సీబీఐసీ నిర్ణయించింది.

*తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేక ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం శ్రీవారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో మాడవీధుల్లో ఊరేగి దర్శనమిచ్చారు.

*టీటీడీ ట్రస్టులకు ఆదివారం రూ.3.20 కోట్లు విరాళంగా అందాయి. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ గ్రూప్స్‌ యజమానులు వెంకటేశ్వర్లు, ప్రసాదరావు, రాజమౌళి ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు రూ.1.20 కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.60 లక్షలు టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. హైదరాబాద్‌కే చెందిన హాసన్‌ హోమ్స్‌ సంస్థ యజమానులు బాలచంద్ర, స్వప్నకుమార్‌ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.40 లక్షలు అందజేశారు.

*అక్టోబరు 5 విజయదశమి నాడు పవన్‌ కల్యాణ్‌ యాత్ర ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటన కూడా చేశారు. పవన్‌ యాత్రకు పార్టీ నేతలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం పార్టీ ప్రత్యేకంగా ఎనిమిది వాహనాలను కొనుగోలు చేసింది. వీటిని ఆదివారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో వాహనాలకు పార్టీ నాయకులు పూజలు చేశారు. అక్టోబరు 5 నుంచి ఈ వాహనాల కాన్వాయ్‌తోనే పవన్‌ యాత్ర ప్రారంభం కానుంది.

*ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో ఇప్పటి వరకు గుర్తింపు సంఘాలు తమ నేతలను బదిలీల నుంచి కాపాడుకోటానికి సాధారణ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ అనేక ఆగడాలకు పాల్పడేవని, ఇప్పుడు కూడా అవే కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట ప్రధానకార్యదర్శి జి.ఆస్కారరావు ఆరోపించారు. సంఘాల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధపడుతున్నారని ఆక్షేపించారు. అవకతవకలకు పాల్పడితే ఆయా శాఖాధిపతుల కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గుర్తింపు సంఘాల ఆఫీస్‌ బేరర్‌లకు ఆరేళ్ల వరకు బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నారని, దీన్ని అదనంగా మూడేళ్లు పొడిగించే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. ప్రస్తుత బదిలీల్లో గుర్తింపు సంఘ ఆఫీసు బేరర్లకు ఆరేళ్లు మినహాయింపు ఇస్తూనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

*ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల్లో ఇప్పటి వరకు గుర్తింపు సంఘాలు తమ నేతలను బదిలీల నుంచి కాపాడుకోటానికి సాధారణ ఉద్యోగులకు అన్యాయం చేస్తూ అనేక ఆగడాలకు పాల్పడేవని, ఇప్పుడు కూడా అవే కుట్రలు చేస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) రాష్ట ప్రధానకార్యదర్శి జి.ఆస్కారరావు ఆరోపించారు. సంఘాల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధపడుతున్నారని ఆక్షేపించారు. అవకతవకలకు పాల్పడితే ఆయా శాఖాధిపతుల కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తామని, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. గుర్తింపు సంఘాల ఆఫీస్‌ బేరర్‌లకు ఆరేళ్ల వరకు బదిలీ నుంచి మినహాయింపు ఇస్తున్నారని, దీన్ని అదనంగా మూడేళ్లు పొడిగించే కుట్ర జరుగుతోందని ఆక్షేపించారు. ప్రస్తుత బదిలీల్లో గుర్తింపు సంఘ ఆఫీసు బేరర్లకు ఆరేళ్లు మినహాయింపు ఇస్తూనే బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

*ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఏయూ కన్వెన్షన్‌ హాల్లో మూడు రోజుల నేషనల్‌ ట్రైబల్‌ డ్యాన్స్‌ ఫెస్టివల్‌ ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది. నృత్యోత్సవం చివరి రోజు వివిధ రాష్ర్టాల కళాకారుల ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కొద్దిసేపు సరదా నృత్యం చేశారు. కార్యక్రమంలో పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌ కె.రామమోహనరావు మాట్లాడుతూ గిరిజన నృత్యోత్సవాన్ని విశాఖలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో అనేక జాతులు ఉన్నప్పటికీ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు కలిగిన ఆదివాసీలకు వారసత్వ సంపదగా సంక్రమించిన కళలను ఇక్కడ ప్రదర్శించడం ముదావహమన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతిలాల్‌ దండే, కలెక్టర్లు ఎ.మల్లికార్జున(విశాఖ), రవి పట్టన్‌శెట్ట్టి(అనకాపల్లి), సుమిత్‌కుమార్‌(అల్లూరి జిల్లా), జడ్పీ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, జీసీసీ చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి, ఎస్టీ కమిషన్‌ సభ్యులు లిల్లీ, రామలక్ష్మి, మిషన్‌ డైరెక్టర్‌ ఈశ రవీంద్రబాబు తదితరులు మాట్లాడారు. పోటీల్లో ప్రథమ బహుమతి రూ.లక్షను మధ్యప్రదేశ్‌ నృత్య బృందం కైవసం చేసుకుంది. ద్వితీయ బహుమతిగా కర్ణాటక నృత్య బృందం రూ.75 వేలు గెలుచుకోగా, తృతీయ బహుమతి రూ.50 వేలను ఒడిశా నృత్య బృందం గెలుపొందింది. నాలుగో బహుమతిగా మిజోరం బృందానికి రూ.50 వేలు, ఇతర రాష్ర్టాలకు రూ.25 వేల చొప్పున అందజేశారు.

*విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంస్కరణలకు ప్రైవేటు విద్యాసంస్థలు సహకరిస్తూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. వడ్డేశ్వరంలోని కేఎల్‌ యూనివర్సిటిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (అపుస్మా) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు మాకు రెండు కళ్లులాంటివని, అపుస్మా అనుబంధ ప్రైవేట్‌ స్కూల్స్‌ పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయమని అన్నారు. విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సమానమని, రెండు వ్యవస్థలూ ఆదేశాలు పాటిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అనంతరం అపుస్మా రాష్ట్రస్థాయి నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఎంవీ రామచంద్రారెడ్డి, జనరల్‌ సెక్రటరీగా తులసి విష్ణుప్రసాద్‌ ఎన్నికయ్యారు.

*కర్ణాటక సరిహద్దులోని చిత్తూరు తదితర జిల్లాల నుంచి హజ్‌ యాత్రకు బయలుదేరినవారు బెంగళూరులోని హజ్‌ కమిటీ ప్రాంగణంలో అరకొర సౌకర్యాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీలోని చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు బెంగళూరు సమీపంలోనే ఉండడంతో ఆయా జిల్లాల ప్రజలు బెంగళూరు మీదుగా హజ్‌ యాత్రకు బయల్దేరుతున్నారు. అయితే, ఏపీ నుంచి వచ్చే హజ్‌ యాత్రికుల బాగోగులపై కర్ణాటక హజ్‌ కమిటీ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెంగళూరు శివారులోని హజ్‌ కమిటీ ప్రాంగణంలో ఉండలేక చాలామంది యాత్రికులు బంధువుల ఇళ్లలో ఆశ్రయం పొందుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి 36 మంది హజ్‌ యాత్రికుల బృందం శనివారం బెంగళూరుకు చేరుకుంది.

*పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు ఇస్తుంటే.. తెలంగాణలో 24 గంటలపాటు ఉచితంగా కరెంటు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్మించిన నూతన ప్రయాణ ప్రాంగణాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. ‘‘ఇటీవల నేను మెట్ల మార్గంలో తిరుమలకు నడుస్తూ వెళ్తుండగా.. ఆ సమయంలో వివిధ రాష్ట్రాల ప్రజలు నన్ను పలకరించారు. కర్ణాటక నుంచి వచ్చిన ఓ వ్యక్తిని.. మీకు పింఛన్‌ ఎంతిస్తున్నారని అడిగా. రూ.500 ఇస్తున్నారని చెప్పారు. ఏపీకి చెందిన కొందరిని వ్యవసాయానికి కరెంటు ఎన్ని గంటలు ఇస్తున్నారని అడిగా. ఆరేడు గంటలకు మించి ఇవ్వడం లేదని, ఆ కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదన్నారు.

*కేంద్రంలో అధికార బీజేపీ ప్ర భుత్వం కక్ష సాధింపులో భాగాంగానే సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు ఈడీతో నోటీసులు జారీ చేయించిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్ల్లాడుతూ.. కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం విశాఖలోని ఈడీ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థికే జగన్‌ ఓటు వేయిస్తారని చెప్పారు.

*కేంద్రంలో అధికార బీజేపీ ప్ర భుత్వం కక్ష సాధింపులో భాగాంగానే సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు ఈడీతో నోటీసులు జారీ చేయించిందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ఆరోపించారు. నగరంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్ల్లాడుతూ.. కేంద్రం తీరుకు నిరసనగా సోమవారం విశాఖలోని ఈడీ కార్యాలయం ఎదుట సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా బీజేపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థికే జగన్‌ ఓటు వేయిస్తారని చెప్పారు.

*దుబాయ్‌లో మహానాడు వేడుకలు ఘనంగా జరిగాయి. దుబాయ్‌లో నివసించే ప్రవాసాంధ్రులు, టీడీపీ అభిమానులు ఆదివారం నిర్వహించిన మహానాడులో అనేక మంది పాల్గొన్నా రు. ఈ వేడుకల్లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ పాల్గొని మాట్లాడుతూ.. ఖండాంతరాల్లో సైతం టీడీపీకి ఇంతటి అభిమానం ఉండటం విశేషమని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పొలిట్‌బ్యూరో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పీతల సుజాత, నాదెండ్ల బ్రహ్మం, బండారు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

*గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ భేటీ అయ్యారు. కేంద్రమంత్రి ఆదివారం రాజ్‌భవన్‌కు విచ్చేశారు. ఆమెకు రాజ్‌భవన్‌ ఉప కార్యదర్శి సన్యాసిరావు స్వాగతం పలికారు. దేశంలోని సమకాలీన రాజకీయ అంశాలపై గవర్నర్‌తో ఆమె చర్చించారు. కేంద్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, నూతన పథకాలను గవర్నర్‌కు ఆమె వివరించారు. రాష్ట్రంలో ఆయా పథకాల అమలు తీరును పరిశీలిస్తున్నామని చెప్పారు. కేందమంత్రి వెంట ఆమె భర్త ప్రవీణ్‌ అర్జున్‌ పవార్‌ కూడా ఉన్నారు. వీరిద్దరినీ గవర్నర్‌ శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందించారు.

*కృష్ణాజిల్లాలోని గన్నవరంలో వైసీపీ మద్దతుదారుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధా భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత వల్లభనేని వంశీ వంగవీటి రాధాను కలవడం ఆసక్తికరంగా మారింది. ప్రైవేట్ ఫంక్షన్‌లో కాసేపు వారు ఏకాంతంగా చర్చించుకున్నట్లు సమాచారం. వంగవీటి రాధను దగ్గరుండి వంశీ కారులో ఎక్కించారు. ఈ దృశ్యం కాస్త మీడియా కంటపడింది. మీడియా వారిని ప్రశ్నించగా… స్నేహితులం కాబట్టే మాట్లాడుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఈ ఇద్దరి కలయికపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.

* జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రకు వాహనాలు సిద్ధమవుతున్నాయి. పవన్‌ యాత్ర కోసం 8 వాహనాలు కొనుగోలు చేశారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో కొత్త వాహనాలు ఉన్నాయి. యాత్రకు అనుగుణంగా వాహనాల్లో ఇంటీరియల్ మార్పులు జరగనున్నాయి. అక్టోబర్ 5న తిరుపతి నుండి పవన్ కళ్యాణ్ వాహనయాత్ర ప్రారంభం కానుంది.

*ట్విటర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి వర్సెస్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లుగా తలపడ్డారు. రఘరామపై విజయసాయి ట్వీట్స్ తీవ్ర విమర్శలు చేశారు. విజయసాయికి అంతే ధీటుగా రఘురామ కౌంటరిచ్చారు. ‘‘అవును నాకున్నది విగ్గు.. ఎన్ని తన్నులు తిన్నా నీకు లేనిది సిగ్గు. కొత్తగా రాజీనామా అంటున్నారు.. నువ్వు.. నీ గ్యాంగ్‌ లీడర్.. అనర్హత వేటుపై చేతులు ఎత్తేశారా?. నేను ఏపీకి వస్తే సీఎంకు మైండ్ బ్లాక్ అవ్వుద్దనేగా.. నాపై కేసులు పెట్టిస్తున్నారు’’ అని ట్విటర్‌లో రఘురామకృష్ణరాజు పోస్టు చేశారు.

*పవిత్ర హజ్‌ యాత్రకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన వారు ఈ నెల 14 నుంచి పవిత్ర యాత్రను ప్రారంభించనున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు 1,161 మంది వెళ్తున్నారు. పాత జిల్లాల వారీగా యాత్రికుల గుర్తింపు, మంజూరు ఏర్పాట్లు పర్యవేక్షించారు. దీని ప్రకారం అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన యాత్రికులు ఈ నెల 14న బెంగళూరు నుంచి రెండు విమానాల్లో మదీనాకు వెళ్తారు.

*గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పీఏలది కీలక పాత్ర అని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేల పర్యటన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల గ్రూపుల్లో ఉంచాలన్నారు.అలాగే ప్రభుత్వ పథకాలు, ప్రజల విజ్ఞపణలు ఈ గ్రూపుల్లో పోస్ట్ చేయాలన్నారు. ప్రజల డిమాండ్లను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

*ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ మదుపరుల నిఽ దుల ఉపసంహరణ నిరాఘాటంగా సాగిపోతూనే ఉంది. జూన్‌ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఉపసంహరించిన నిధులు రూ.13888 కోట్లు. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటివరకు వారు ఉపసంహరించిన నిధుల పరిమాణం రూ.1.18 లక్షల కోట్లు. రాబోయే కాలంలో కూడా ఈ నిధుల ఉపసంహరణ కొనసాగే ఆస్కారం ఉన్నదని, అయితే మధ్యకాలంలో మాత్రం అమ్మకాల జోరు తగ్గవచ్చునని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

*కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యేలా కనిపించడం లేదు. కరోనాను జనం తేలిగ్గా తీసుకుంటుండంతో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. జూలైలో కేసులు పీక్స్‌కు చేరనున్నట్లు, మరో ఆరు నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని చెబుతున్నారు. భారత్‌లో కేసుల నమోదు చూస్తుంటే కోవిడ్‌ నాలుగో వేవ్‌ దగ్గరికి వచ్చినట్లే కనిపిస్తోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 8,084 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,30,101కు చేరాయి. ఒక్క రోజే 10 మంది మరణించడంతో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,24,771కు చేరింది. ఇక దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 50 వేలకు చేరువగా ఉన్నాయి. ప్రస్తుతం 47,995 యాక్టివ్‌ కేసులున్నాయి. నిన్న 4,592 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు సోమవారం హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు.దీని ప్రకారం కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 2946 కేసులు ఉన్నాయి. కేరళలో 4319, ఢిల్లీలో 735, కర్ణాటకలో 463, హర్యానాలో 304 నమోదయ్యాయి.ఇక యాక్టివ్‌ కేసులు 0.11 శాతానికి చేరాయి. రికవరీ రేటు 98.68 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.24 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,95,19,81,150 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపింణీ చేశామని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆదివారం ఒక్కరోజే 11,77,146 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని పేర్కొంది.

*రాయచోటి, బెంగళూరు, కేరళ ల నుంచి దేశవిదేశాలకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా అక్రమంగా ఫోన్ కాల్స్ వ్యాపారం చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు. సుమారు 2.5 కోట్లు విలువ చేసే సామాగ్రి 8880 సీమ్ కార్డులు, ఒ ల్యాప్ ట్యాప్, 74 సీమ్ కార్డ్ డివైస్ యాంపిలిఫైర్ కన్వర్షన్ బాక్సులు,28 వైఫైరూటర్లు,నిస్సాన్ సన్నీ కారు, 6 సెల్‌ఫోన్లు స్వాధినం. విఒఐపి టేక్నాలజితో జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం, ప్రభుత్వ టెలికాం రంగం ఆదాయానికి గండి కోట్టడం వంటి నేరాలకు పాల్పడుతున్నట్లు వేళ్ళడించిన జిల్లా యస్పీ హర్షవర్ధన్ రాజు .