Devotional

సింహాద్రి అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ

సింహాద్రి అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ

సింహాచల అప్పన్న స్వామికి మూడో విడత చందనం సమర్పించారు. జ్యేష్ట పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి ఆలయ వర్గాలు చందనం సమర్పించారు. వేకువజామునే 125కిలోల చందన్నాన్ని స్వామి వారికి అలకరించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

*ప‌ల్ల‌కీలో మోహినీ అలంకారంలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామి
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో ద‌ర్శ‌మిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది. శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. కార్య‌క్ర‌మంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాధం, కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

*పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ యాత్రికులు .
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదటి విడతగా హజ్ యాత్రకు వెళ్తున్న ప్రయాణికుల విమానం ఈరొజు మధ్యాహ్నం బెంగళూరు విమానాశ్రేయం నుంచి బయలుదేరింది . విమానం బయలుదేరకముందు బెంగుళూరులోని కర్ణాటక రాష్ట్ర హజ్ హజ్ హౌజ్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ హజ్ యాత్రికులను విమానశ్రేయంలోపలికి తీసుకుని వెళ్తున్న 8 ప్రత్యెక బస్సులకు పచ్చజెండా ఊపి శుభాకాంక్షలు తెలుపుతూ సాగనంపారు . అనంతపురం , చిత్తురు జిల్లాలనుంచి 248 మంది హజేయాత్రికులు వెళ్లాల్సి ఉండగా అందులొ 6 గురు సాంకేతిక కారణాలవల్ల ఈరొజు వెళ్లలేక పొయారు . మిగతా 242 మంది హజ్ యాత్రికులు సౌదీ ఎయిర్లైన్స్ ప్రత్యెక విమానంలో ఈరొజు బెంగళూరు అంతర్జాతీయ విమనశ్రేయం నుంచి బయలుదేరారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి చైర్మన్ బద్వేల్ షెక్ గౌసల్ ఆజామ్ మాట్లడుతూ మొడటి విడుత హజ్ యాత్రికుల విమానం బెంగళూరు అంతర్జాతీయ విమానశ్రేయం నుంచి పవిత్ర హజ్ యాత్రకు బయలుదేరిందన్నారు. బెంగుళూరుకు సమీపంలోఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాలైన అనంతపురం , చిత్తూరు లనుంచి హజ్ యాత్రీకులు ఈ సంవత్సరం బయదేరారన్నారు. ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికుల పట్ల కర్ణాటక హజ్ కమిటి చైర్మన్ రావుఫుద్దీన్ కచేరీవాలా , సభ్యులు ఎంతో ప్రేమాభిమానాలతో ఆతిధ్య మిచ్చారన్నారన్నారు . ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు బయలుదేరే తదుపరి విమానాలు ఈనెల 27 , 28 , 30 తేదీల్లో హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమనశ్రేయం నుంచి బయలుదేరనున్నాయన్నారు. గుంటురు, కర్నూలు జిల్లాలతో 11 మిగత జిల్లాల 914 హజ్ యాత్రికులు సౌదీ ఎయిర్లైన్స్ విమానాల్లో ట్రిప్పుకు 377 మంది చొప్పున బయలుదేరుతారన్నారు . అంధ్రప్రదేశ్ సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యెక స్వీయ పర్యావేక్షణలో ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి తరపున హాజ్ యాత్రికులకు అన్నిరకాల సౌకర్యాలను చేశామన్నారు . హజ్ యాత్రనిమిత్తం వెళ్తున్నావారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దువా చేయడం మర్చిపోవద్దని గౌసల్ ఆజామ్ కోరారు . ఈ కార్యక్రమంలో మదనపల్లి శాసనసభ్యులు & ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటి సభ్యులూ మొహమ్మద్ నవాజ్ బాషా , హజరత్ వలియుల్లా ఖాదరీ (కడప) మునీర్ బాషా (పులివెందుల), ఇబాదుల్లా ( రాజమండ్రి ), అబ్దుల్ బసిత్ (గుంటూరు ), కర్ణాటక రాష్ట్ర వక్ప్ బొర్డు చైర్మన్ , సభ్యులు పాల్గోన్నారు . హజ్ యాత్రికుల కు శుభాకాంక్షలు తెలిపేందుకు బెంగుళూరు అంతర్జాతీయ విమానశ్రేయానికి పెద్ద సంఖ్యతో బంధు ,మితృలు తరలిరావడంతో పండుగ వాతావరణం నెలకొంది .