DailyDose

వైసీపీతో ఎంపి లావు రూటు సపరేటు అయ్యేనా…?

వైసీపీతో ఎంపి లావు రూటు సపరేటు అయ్యేనా…?

ప్రజలకు చేరువ… పార్టీ కార్యక్రమలకు దూరం…
త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్తారంటూ పల్నాడు జిల్లాలో జోరుగా ప్రచారం
లావు చూపు సామజికవర్గ పార్టీ వైపా..? ఆర్ ఆర్ ఆర్ బాటలోనా…?

ఈ మధ్యకాలంలో నూతనంగా ఏర్పడ్డ పల్నాడు జిల్లాలో ఎక్కడ చుసిన ఓ ప్రచారం వినిపిస్తుంది అది ఏమిటి అంటే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలో వైసీపీని విడతారు అన్నా ప్రచారం పల్నాడు ప్రాంతంలో ఏ నోట విన్న ఏ నలుగురు ఒక చోట కూర్చున్న ఇదే విషయం చర్చకు వస్తున్నట్లు సమాచారం. 2019 పార్లమెంట్ ఎన్నికలలో నరసరావుపేట లోక్ సభ అభ్యర్థిగా లావు. శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ నుండి పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. లావు. శ్రీకృష్ణదేవరాయలు కుటుంబం విద్యకుసుమ కుటుంబం ఎంతోమంది తమ సంస్థ విజ్ఞాన్ ద్వారా విద్యబ్యాసన్ని అందించి దేశ విదేశాలలో ఎంతో మందిని ఉన్నత స్థానలకు ఎదిగేలా తీర్చిదిద్దిన కుటుంబం లావు కుటుంబం. లావు శ్రీకృష్ణదేవరాయలు తండ్రి గతంలో ఎన్నికలలో పోటీచేసినప్పటికి రాజకీయం ఆయనకు కలిసిరాలేదు అని తెలుస్తుంది. జిల్లాలో లావు కుటుంబనికి మచ్చ లేని కుటుంబం అని కూడా పేరు ఉంది. తండ్రికి రాజకీయలు వంటపట్టకపోయిన తనయుడు మాత్రం జగన్ వెంట నడుస్తూ జగన్ బాటలో పయనిస్తూ నరసరావుపేట అభ్యర్థిగా పోటీచేసి విజయబావుట ఎగరవేశారు.

గెలిచిన నాటి నుంచి ఎంపి శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు ప్రాంతంలోని ప్రజాసమస్యల పై తమ గళాన్ని పార్లమెంట్ లో ప్రస్థావిస్తూ సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషిచేస్తున్న ఆదర్శనేత మన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు.శ్రీకృష్ణదేవరాయలు అన్నా విషయం అక్షర సత్యంగా చెప్పవచ్చు. పల్నాడు ప్రాంత ప్రజలు కూడా ఆయనను ఎంతగానో ఆరాధిస్తూ సమస్య అయన ద్రుష్టికి వస్తే వెంటనే స్పందించే వ్యక్తి మన శ్రీకృష్ణదేవరాయలు అన్నా కితబు ప్రజల నుంచి వినిపిస్తుంది. పల్నాడు జిల్లాలో ప్రజలకు ఎంపి లావుకు మంచి సత్సంబంధాలు ఉన్నప్పటికి విభేదాలు మాత్రం సొంత పార్టీ వారితోనే మొదలయ్యాయని చెప్పవచ్చు. పల్నాడు ప్రాంత నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గలు ఉన్నప్పటికీ ఆయా అసెంబ్లీ నియోజకవర్గలలో సొంతపార్టీ వారే ఎమ్మెల్యేలు గా ఉన్నప్పటికీ కొంతమంది శాసనసభ్యులకు ఎంపికి మధ్య ఇప్పటికి విభేదాలు ఉన్నాయని పల్నాడు ప్రాంతంలో ప్రచారం జరుగుతుంది. మొదటినుంచి చిలకలూరిపేట శాసనసభ్యురాలు ప్రస్తుత రాష్ట్ర మంత్రి విడదల. రజిని ఎంపి శ్రీకృష్ణదేవరాయలు మధ్య విభేదాలు బగ్గుమన్న విషయం చాలాసార్లు బహిర్గతంఅయ్యాయి.

చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎంపి ఎమ్మెల్యే గ్రూపులు తారస్థాయికి చేరి రచ్చకేక్కిన సందర్భాలు కూడా దర్శనం ఇచ్చాయి. ఇక్కడ విభేదాలు రావటానికి ఎంపి శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే మర్రి. రాజశేఖర్ తో సన్నిహితంగా ఉండటమే కారణం అని ప్రచారం జరుగుతుంది. మరో పక్క వినుకొండ శాసనసభ్యులు బొల్లా. బ్రహ్మానాయుడు ఎంపి శ్రీకృష్ణదేవరాయలు మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనితో ఈ నియోజకవర్గంలో ఎంపి పర్యటనలకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించటం లేదన్న ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇక్కడ విభేదాలు రావటానికి మాజీ ఎమ్మెల్యే మక్కెన. మల్లికార్జునరావుతో ఎంపి సన్నిహితంగా ఉండటమే కారణం అని చెప్పవచ్చు. అంతేకాకుండా పల్నాడు ప్రాంతంలోని పలువురు ఎమ్మెల్యేలు ఎంపి లావు. శ్రీకృష్ణదేవరాయలు ను ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న ప్రచారం కూడా పల్నాడు జిల్లాలో జోరుగా వినిపిస్తుంది. కొంతమంది శాసనసభ్యులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో మంచి సత్సంబంధాలు ఉండటంతో నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి ద్రుష్టికి తీసుకొనివెళ్తున్నరే తప్ప ఎంపి ద్రుష్టికి మాత్రం తీసుకువెళ్లరు అనే ప్రచారం కూడా పల్నాడు ప్రజల నుంచి వినిపిస్తుంది. సొంతపార్టీలోని నాయకులే ఈ విధంగా ప్రవర్తిస్తు ఉండటంతో పార్లమెంట్ నియోజకవర్గలో పరిధిలో చాలామంది శాసనసభ్యుల మద్దతు శ్రీకృష్ణదేవరాయలుకు లేకపోవటంతో ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఎంపి మౌనవ్రతం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రజల నుంచి మంచి స్పందన ఉన్నప్పటికి సొంతపార్టీ నాయకులలో వ్యతిరేకత ఉండటంతో పల్నాడు జిల్లాలో ఎంపి వర్సెస్ ఎమ్మెల్యేగా రసవత్తర పోరు జరుగుతుందని తెలుస్తుంది. ఇటీవల ఎంపి శ్రీకృష్ణదేవరాయలు వైసీపీలో రూటు సపరేటు అయ్యేనా అన్నా సందేహం కూడా ఈ ప్రాంతవాసులలో ఇముడుకుపోయిందని చెప్పవచ్చు. సమస్యల పై పార్లమెంట్ లో మాత్రం తమ గళాన్ని వినిపిస్తు ప్రజల సమస్యలను తీరుస్తు ప్రజలకు చేరువఅవుతున్న శ్రీకృష్ణదేవరాయలు సొంతపార్టీ నాయకుల సహకారాన్ని మాత్రం అందుకోవలేకపోతున్నారు. ఇటీవల కాలంలో ఎంపి శ్రీకృష్ణదేవరయలు పార్టీ కార్యక్రమలకు కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది. ఇటీవల పల్నాడు జిల్లా ప్రాంతమైన నరసరావుపేటలో జరిగిన ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రుల సామజిక న్యాయభేరి బస్సు యాత్ర కార్యక్రమంలో ఎంపి పాల్గొనకపోవటంతో వైసీపీకి ఎంపి దూరం అవుతున్నారన్న సంకేతం ఈ ప్రాంతప్రజలలో ఇముడుకొనిపోయింది.

పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజకవర్గలలో ప్రోటోకాల్ విషయంలో ఎంపిని చిన్నచూపు చూస్తున్నారని కొంతమంది కార్యకర్తలు బహతంగానే విమర్శిస్తున్నారు. మరి కొన్నిచోట్ల ఎంపిని శీలఫలకాలపై పేర్లకే పరిమితం చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతుంది. సొంతపార్టీ నాయకుల వ్యవహారశైలి పై రగిలిపోతున్న శ్రీకృష్ణదేవరాయలు క్రమంగా పార్టీ కార్యక్రమలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. దీనితో రానున్న ఎన్నికలలో ఎంపి వైసీపీకి దూరం అవుతారా అనే సందేహం ఈ ప్రాంతవాసులలో కనిపిస్తుంది. ఒకవేళ వైసీపీకి దూరం అయితే అయన చూపు సొంతసామజికవర్గ పార్టీ వైపా లేక ఆర్ ఆర్ ఆర్ రఘురామకృష్ణరాజు బాటలో పయనిస్తారా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…!!