DailyDose

కోనసీమ అల్లర్లు.. మంత్రి విశ్వరూప్ నలుగురు అనుచరులపై కేసు – TNI నేర వార్తలు

కోనసీమ అల్లర్లు.. మంత్రి విశ్వరూప్ నలుగురు అనుచరులపై కేసు  – TNI  నేర వార్తలు

* కోనసీమ జిల్లా అమలాపురం అల్లర్లలో.. మంత్రి విశ్వరూప్ అనుచరుల్లో నలుగురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. సత్యరుషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే అరెస్టై, A-222గా ఉన్న చీకట్ల వీరవెంకట సత్యప్రసాద్ వాంగ్మూలంతో ఈ నలుగురిపై కేసు పెట్టారు. తాజాగా పోలీసులు కేసు నమోదు చేసిన ఈ నలుగురు నాయకులు, వైకాపాలో క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారం. వీరు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.అమలాపురం అల్లర్లలో మొత్తం 258 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. వారిలో ఇప్పటివరకు 142 మందిని అరెస్టు చేశారు. కాగా.. 116 మంది పరారీలో ఉన్నారు.

*కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చర్లలో 230 మంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు గుర్తించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వివారలను సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు 11 వేల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే వారి వివరాలు పంపించాలని ఆయా శాఖలను ఆర్థిక శాఖ కోరింది. దీంతో తమ తమ శాఖల్లోని ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి, వారి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేశారు.

*నూజివీడు మండలం సుంకొల్లలో టిడిపి నేత సింహాద్రి రవి దారుణ హత్య..టిడిపి, వైసిపి మధ్య గత కొలంగా వివాదాలు.. తాజాగా వైసీపీ నేతలు దాడి చేసి చంపేశారంటున్న బంధువులు..వైసీపీ నేతలుఆరేపల్లి రాంబాబు, సింహాద్రి మురళి మోహన్ , అలివేలు, మంగమ్మ, రామక్రృష్ణ , చంద్రశేఖర్ పథకం ప్రకారం దాడి చేసి చంపారని పోలీసులకు ఫిర్యాదు..

*నల్గొండ: జిల్లాలోని నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. దామరచర్ల మండలం కొండ్రపోలు గ్రామంలో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముస్లిం సంఘాల ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేత కొనకళ్ల నారాయణ రావు మాట్లాడుతూ.. అన్ని మతాల వారు సమానంగా మన దేశంలో‌ జీవిస్తారని.. లౌకిక దేశంలో అన్మదమ్ముల్లా కలిసి ఉంటున్నామన్నారు. ఏ మతాన్ని కించ పరిచే విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ముస్లిం మనోభావాలను దెబ్బ తీసే విధంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవీన్ జిందాల్, నుపుర్ శర్మ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. వారిపై వెంటనే కేసులు నమోదు‌ చేసి… ఈ తరహా వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కట్టడి చేయాలని కొనకళ్ల నారాయణ రావు డిమాండ్ చేశారు.

*అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు తారాస్థాయికి చేరాయి. దీంతో కుటుంబ పెద్ద అయిన నాయినమ్మ, మేనత్తలను మేనళ్లుల్లే పొట్టనబెట్టుకున్నారు. కత్తులతో నరికి మరీ కర్కశంగా చంపేశారు. అడ్డుకోబోయిన వ్యక్తికి సైతం కత్తి పోట్లు తప్పలేదు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసిన వారి పాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసిన వారి పాలెంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

*అనంతపురం: జిల్లాలోని యాడికి మండలం వేములపాడు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. లారీ- ఆటో ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా… ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి యాడికి మండలం కూర్మాజీపేట గ్రామవాసిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*తెనాలిలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కాల్వలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంచర్లపాలెం గ్రామానికి చెందిన గొప్పరాజు అయ్యప్ప( అనే వ్యక్తి తెనాలిలోని ఓ ప్రయివేట్ కంపెనీలో గుమస్తాగా పని చేస్తున్నాడు. అతనికి ఏళ్ల క్రితం వివాహమైంది. గత కొంతకాలంగా భార్యతో అయ్యప్పకు గొడవలు జరుగుతున్నాయి. దీంతో అయప్ప కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

*కార్వీ ఎండీ పార్థసారథి పై మరో కేసు నమోదయింది. యాక్సిస్ బ్యాంక్‌ కు రూ.159 కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు అభియోగం. గతంలో రూ.15 కోట్ల స్కామ్‌ కేసులో పార్థసారథిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. పార్థసారథితో పాటు సీఈవో రాజీవ్‌రంజన్, కృష్ణహరి, కృష్ణ, ప్రభాకర్, శ్రీనివాసరాజు, శేషసాయి, వరప్రసాద్‌‌లను అరెస్టు చేశారు. ప్రస్తుతం కార్వీ ఎండీ పార్థసారథి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

*అమలాపురం అల్లర్ల ఘటనలో నలుగురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. అమలాపురంలో అల్లర్లకు సంబంధించి మొదటి నుంచి ఏం చెప్పిందో.. అదే మరోసారి స్పష్టమైంది. చిచ్చు పెట్టింది వైసీపీ ప్రభుత్వం అయితే.. దాని వెనుక నిప్పు పెట్టింది కూడా వైసీపీయేనని చెప్పింది. దీనికి సంబంధించి వైసీపీకి చెందిన నలుగురు కీలక నేతలను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు.

*అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఒకరిని బలగొంది. ఈ ఘటన నూజివీడు మండలంలో జరిగింది. సుంకొల్లు గ్రామానికి చెందిన సింహాద్రి మురళి, సింహాద్రి రవి సోదరులు. వీరి మధ్య కొంతకాలంగా భూ వివాదం నెలకొంది. అన్న వైసీపీ, తమ్ముడు టీడీపీకి చెందిన వారు కావటంతో పలుమార్లు అన్నదమ్ముల ఆస్తి వివాదంపై గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు పంచాయితీ చేశారు. ఇద్దరు సోదరుల్లో ఒకరు మామిడికాయలు కోసారన్న కోపంతో అన్నదమ్ములిద్దరూ కర్రలతో,రాళ్ళతో కొట్టుకున్నారు. ఘర్షణలో తమ్ముడు రవికుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రవికుమార్ మృతితో గ్రామంలో ఒక్కసారిగా టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య రాజకీయకక్షలు రాజుకున్నాయి. మృతుడు టీడీపీకి చెందిన వ్యక్తి కావటంతో వైసీపీ నాయకుల ఆదేశాలతో పోలీసులు కేసు నీరుగార్చేoదుకు ప్రయత్నిస్తున్నారని..టీడీపీ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడు ప్రభుత్వసుపత్రి వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాగా గ్రామంలో ప్రత్యక్ష సాక్షులను విచారించి కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు కారకులైన ముగ్గురిని అరెస్ట్ చేశారు.

*బాపట్ల జిల్లా చుండూరు మండలంలో మట్టి మాఫియా బరితెగించింది. చిన్నగాదెలవర్రులో 20 ఎకరాలు విస్తీర్ణం ఉన్న చెరువులో నెల రోజులుగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. గత నెలలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆ చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లారు. మట్టి మాఫియా ఆయన్ను అడ్డుకుంది. అయితే గ్రామానికి చెందిన నక్కా లక్ష్మయ్య, మరికొంత మంది యువకులు ఆయన్ను చెరువు వద్దకు తీసుకెళ్లి మట్టి తవ్వకాలు చూపించారు. దీనిపై కక్షపెంచుకున్న మట్టి మాఫియా.. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో నిద్రలో ఉన్న లక్ష్మయ్యను ఇంటి నుంచి అదే చెరువు వద్దకు తీసుకువెళ్లి మారణాయుధాలతో దాడి చేసి పరారయ్యారు. తలపై తీవ్ర గాయాలై రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడిపోయిన లక్ష్మయ్యను కుటుంబసభ్యుల, గ్రామస్తులు తెనాలి వైద్యశాలకు తరలించారు.

*కర్నూలు: జిల్లాలోని ఆలూరు మండలం వుళేబీడు సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

*వైసీపీ నేతల బరితెగింపు పరాకాష్టకు చేరింది. మట్టి అక్రమ తవ్వకాలను ప్రశ్నించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గ్రామ మహిళా సర్పంచ్‌ పట్ల కీచక పర్వం సాగించారు. గుంటూరు జిల్లా వంగిపురంలో ఆదివారం వైసీపీ నాయకులు అక్రమ మట్టి తవ్వకాలు మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్‌, దళిత నాయకురాలు శిఖా విజయలక్ష్మి తన కుటుంబసభ్యులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి పంచాయతీ అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు ఎలా మొదలుపెడతారని ప్రశ్నించింది. ‘మా ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటాం.అడగడానికి నువ్వెవరు?’’ అంటూ వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఆమె ప్రైవేటు పార్టులపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో సర్పంచ్‌తోపాటు కుటుంబ సభ్యులు భయంతో పోలీసులను ఆశ్రయించారు. అక్కడి నుంచి గ్రామానికి వెళ్లడానికి భయపడి టీడీపీ జిల్లా కార్యాలయంలో తలదాచుకున్నారు.

*అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం బొడ్డుగూడెం-ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడి ఒడిసాకు చెందిన ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. ఒడిసాలోని సీనాపల్లి గ్రామం నుంచి విజయవాడకు కూలీలతో సంగీత ట్రావెల్స్‌ బస్సు ఆదివారం బయలుదేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత బస్సు చింతూరు మండలం బొడ్డుగూడెం-ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మలుపులో బోల్తా పడింది.

*రుణపాశానికి మరో నలుగురు రైతులు బలైపోయారు. కర్నూ లు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, పల్నాడు జిల్లాలో ఒకరు మనోవేదనతో బలవన్మరణం చెందా రు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లకు చెందిన బోయ గుండన్న (43) కు ఐదున్నర ఎకరాల పొలం ఉంది. ఐదేళ్లుగా పత్తి, వేరుశనగ సాగు చేస్తున్నాడు. అతివృష్టి, అనావృష్టి వల్ల తీవ్ర నష్టాలు వచ్చాయి. పెట్టుబడులకు చేసిన అప్పులు తీరలేదు. నెల రోజుల క్రితం అప్పు చేసి కూతురి వివాహం జరిపించాడు. మొత్తం అప్పు సుమారు రూ.10 లక్షలకు చేరింది. కొన్ని రోజులుగా అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

*పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌పై మట్టిమాఫియా దాడికి దిగింది. ఆయన కారు అద్దాన్ని వైసీపీ నాయకులు పగులకొట్టారు. గత కొన్ని రోజులుగా వారు గుంటూరు జిల్లా పెదకాకా ని మండలం అనుమర్లమూడి గ్రామంలోని మంచినీటి చెరువులో అనుమతు లు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు.జగనన్న కాలనీలకు మట్టి నింపుతున్నామని చెప్పి.. ట్రాక్టర్‌ మట్టిని రూ.1,000 చొప్పున బయట అమ్ముకుంటున్నారు. దీనిని పరిశీలించేందుకు సోమవారం నరేంద్ర టీడీపీ నాయకులతో అక్కడకు వచ్చారు. దీంతో వైసీపీ నాయకులు ఓ పథకం ప్రకారం గుంపుగా వచ్చి నరేంద్రను చుట్టుముట్టారు. టీడీపీ నాయకులకు, వారికి మధ్య పెద్దఎత్తున ఘర్షణ జరిగింది. నరేంద్ర కారు వెనుక అద్దాన్ని ధ్వంసం చేశారు.

*ఇద్దరు అన్నదమ్ములు.. తెల్లారితే పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోయే ఓ మూడేళ్ల చిన్నారి.. మరో ఇద్దరి పాలిట ఆ లారీ, ఆటో మృత్యు శకటాలయ్యాయి. కామారెడ్డి. మెదక్‌ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఐదుగురిని బలితీసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గికి చెందిన విజయ్‌ అలియాస్‌ రాజు(22), పాండురంగ (15)లు అన్నదమ్ములు. అదే గ్రామానికి చెందిన గైని సచిన్‌(18) వీరి బంధువు. ముగ్గురూ కలిసి సోమవారం పెద్దశంకరంపేటకు బైక్‌పై బయలుదేరారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గద్దగుండు శివారులో 161వ జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి పిట్లం వైపు వస్తున్న లారీ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్‌, పాండురంగ, సచిన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌పై రాంగ్‌రూట్‌లో వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మరో ఘటనలో.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం యూసు్‌ఫపేటకు చెందిన భార్యాభర్తలు సంగీత, బాలరాజ్‌గౌడ్‌లు ఈనెల 10న మెదక్‌ మండలం జానకంపల్లిలోని పెద్దమ్మ ఆలయం వద్ద విందుకు హాజరయ్యారు. ఆదివారం రాత్రి తమ కుమార్తె అన్విక (3)తో కలిసి బైక్‌పై తిరుగుప్రయాణమయ్యారు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్‌ గ్రామ శివారులోకి రాగానే వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని మెదక్‌ వైపు వెళ్తున్న ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో అన్విక అక్కడికక్కడే మృతిచెందగా, బాలరాజ్‌గౌడ్‌ దంపతులతో పాటు టేక్మాల్‌ మండలం హసన్‌మొహ్మద్‌పల్లి తండాకు చెందిన ఆటో డ్రైవర్‌ శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాంత్‌ చికిత్స పొందుతూ చనిపోయాడు. తెల్లారితే పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోయే అన్విక మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

*పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రానాపూర్‌లో కౌలు రైతు బుర్ర రాజయ్య (56) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పదెకరాల కౌలుభూమిలో వ్యవసాయం చేసిన రాజయ్య దిగుబడి సరిగా రాక నష్టపోయాడు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఏడు లక్షలకు చేరాయి. అప్పు తీర్చలేక పోతున్నాననే మానసిక వేదనతో ఆదివారం పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

*అల్లూరి: జిల్లాలోని అనంతగిరి మండలం సరియా జలపాతంలో పడి పదిహేనేళ్ల బాలుడు గల్లంతయ్యాడు. నర్సీపట్నంకు చెందిన పోలాకి రాకేష్కుమార్ సోమవారం మిత్రులతో సరియా జలపాతం వద్దకు వెళ్లాడు. కాగా రాకేష్ ప్రమాదవశాత్తు కాలుజారి జలపాతంలో పడిపోయాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి ఆచూకి కోసం గాలింపు చేపట్టారు. కాగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో బాలుడి ఆచూకీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.