DailyDose

జగిత్యాలలో గల్ఫ్ JAC సభ్యుల ఆత్మీయ సమావేశం

జగిత్యాలలో గల్ఫ్ JAC సభ్యుల ఆత్మీయ సమావేశం

గల్ఫ్ JAC సభ్యుల ఆత్మీయ సమావేశం సోమవారం జగిత్యాలలోని శివ సాయి హోటల్‌లో జరిగింది. ఈ సమావేశానికి గల్ఫ్ జేఏసీ కన్వీనర్ గుగ్గిళ్ల రవిగౌడ్ అధ్యక్షత వహించారు. ఆర్మూర్‌కు చెందిన గల్ఫ్ కార్మిక నాయకుడు కోటపాటి నరసింహ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల్లో దౌత్యవేత్తగా పనిచేసిన మాజీ ఐ.ఎఫ్.ఎస్ అధికారి డా. బి. ఎం. వినోద్ కుమార్, ఏమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీం రెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పరికిపండ్ల స్వదేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గల్ఫ్ జేఏసీ అధ్యక్షుడిగా గుగ్గిల్ల రవి గౌడ్‌ను, ఉపాధ్యక్షులుగా గంగుల మురళీధర్ రెడ్డిని, గల్ఫ్ జేఏసీ సంయుక్త కార్యదర్శిగా సిరిసిల్లకు చెందిన తోట ధర్మేందర్‌ను, మహిళ కార్యదర్శిగా భుత్కురి కాంతను ఎన్నుకున్నారు. పలు గల్ఫ్ కార్మిక సంఘల నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పేర్కొన్న సభ్యుల డిమాండ్లను పరిశీలిస్తే…
t1
జగిత్యాలలో గల్ఫ్ JAC సభ్యుల ఆత్మీయ సమావేశం డిమాండ్లు:
రూ.500 కోట్ల బడ్జెట్‌తో “తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు” (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. గల్ఫ్‌తో సహా 18కి పైగా దేశాలలో పనిచేసే ప్రవాసీ కార్మికులకు ఉపయోగపడే చట్టబద్ధమైన “తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు” ఏర్పాటు గల్ఫ్ దేశాలలో పనిచేసే కార్మికులకు సాంఘిక భద్రత, ఆయా దేశాల నుండి వాపస్ వచ్చిన కార్మికుల పునరావాసం కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి. గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్‌మెంట్ ఫీజులు తదితర ఖర్చుల కోసం పావలా వడ్డీ రుణాలు ఇవ్వాలి. జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం (లీగల్ ఎయిడ్) చేయాలి.