NRI-NRT

జూన్ 25న ‘తానా’ శతక జైత్రయాత్ర

జూన్ 25న ‘తానా’ శతక జైత్రయాత్ర

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(TANTEX) సంయుక్తంగా, ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ నిర్వాహకులు, తెలుగు రధసారధి, తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ఆధ్వర్యంలో కవి శ్రీ జొన్నవిత్తులతో “యజ్ఞేశ్వర శతకము” పద్య గాన మహోత్సవం కార్యక్రమం డల్లాస్ మహానగరంలో జూన్ 25వ తేదిన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, ఫ్రిస్కో, టెక్సాస్ లో నిర్వహించబడుతుంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా :
వేదకవి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు విచ్చేయుచున్నారు. సాహితీ వేత్తలు, సాహిత్యాభిమానులు, కార్యకర్తలు, పోషకదాతలు అందరిని తానా(TANA) మరియు టాంటెక్స్ ఆహ్వానిస్తుంది. ఈ అరుదైన అపూర్వ కార్యక్రమానికి మీరు విచ్చేసి,జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము.

తేదీ: శనివారం, June 25, 2022
సమయం: 3:00 pm to 6:00 pm
స్థలం: Karya Siddhi Hanuman Temple
12030 Independence pkwy
Frisco, TX 75035
t2