Politics

రైతులకు మేలు చేసేందుకు దేశంతోనే పోటీపడుతున్నాం

Auto Draft

రైతులకు మేలు చేసే విషయంలో దేశంతోనే పోటీపడుతున్నామని సీఎం జగన్ అన్నారు. మన రాష్ట్రంలో మార్పు చూసి పక్క రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని వెల్లడించారు. బీమా పరిహారం కింద రూ. 2,977.82 కోట్లు రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో సీఎం జగన్‌ పర్యటించారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారం చెల్లిస్తున్నామని..అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి న్యాయం చేస్తున్నామని వెల్లడించారు. ఖరీఫ్‌ పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని.. బీమా పరిహారం కింద రూ.2,977.82 కోట్లు రైతుల ఖాతాల్లో వేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలోని పంటల బీమా కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు. రైతులకు మేలు చేసే విషయంలో దేశంతోనే పోటీ పడుతున్నామని సీఎం జగన్ అన్నారు. మన రాష్ట్రంలో మార్పు చూసి పక్క రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని వెల్లడించారు. ఈ మూడేళ్లలో రైతుల కోసం లక్షా 28 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఏ సీజన్‌లో నష్టపోతే ఆ సీజన్‌ ముగిసేలోపే పరిహారాన్ని రైతులకు జమ చేస్తున్నామని.. పంట అమ్ముకునే విషయంలో ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్నారు.