Movies

నా గుండె చప్పుడివి నువ్వే

నా గుండె చప్పుడివి నువ్వే

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాలకి చిన్న విరామమిచ్చిన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లూ ను పెళ్ళి చేసుకొని కూడా తెరపై కనిపించిన కాజల్.. ఆపైకూడా నటించడానికి సిద్ధపడినా.. ప్రెగ్నెంట్ కారణంగా సినిమాలకు బ్రేకిచ్చింది. భర్తతో వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తూ.. మధ్యలో బేబీ బంప్‌తో ఫోటో షూట్స్ చేస్తూ తనలో అందం, ఆత్మవిశ్వాసం ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇటీవల కాజల్, కిచ్లూ దంపతులకు పండంటి మగపిల్లవాడు జన్మించాడు. ఆ చిన్నారికి నీల్ అని పేరు పెట్టుకొని.. తన జీవితంలోని ఆనంద క్షణాల్ని అనుభవిస్తోంది. అయితే ఇంతవరకూ ఆమె తన బిడ్డ ముఖాన్ని అభిమానులకు చూపించలేదు. తాజాగా కాజల్ అగర్వాల్ తన కొడుకు నీల్ కిచ్లూని ముద్దాడుతూ.. మాతృత్వంలోని మధురిమల్ని తనవితీరా ఆస్వాదిస్తూన్న ఓ క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నా జీవితంలోని ప్రేమవు నువ్వు, నా గుండె చప్పుడివి నువ్వే’ అనే కేప్షన్ ఇచ్చింది. అయితే అందులో నీల్ ముఖాన్ని పూర్తిగా చూపించకుండా అతడి చేతినే అడ్డుగా పెట్టి ఫోటో క్లిక్ చేసి.. షేర్ చేయడం గమనార్హం. ఇలా కాజల్ తన కొడుకుతో గడిపిన అపూర్వ క్షణాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ.. అతడి ఫోటోను రివీల్ చేయగా… దీనికి హీరోయిన్ కీర్తి సురేశ్ఓ మైగాడ్ అంటూ రిప్లై ఇచ్చింది. అలాగే రాశీఖన్నా ఆ ఫోటోకు లవ్ ఎమోజీస్ తో రిప్లై ఇచ్చింది. ఇంకా అభిమానుల నుంచి ఓ రేంజ్‌లో కామెంట్స్ వచ్చిపడుతున్నాయి.