NRI-NRT

ఎలన్‌ మస్క్‌ ఆగమాగం, 2 నెలల్లో 100 బిలియన్‌ డాలర్ల నష్టం!

ఎలన్‌ మస్క్‌ ఆగమాగం, 2 నెలల్లో 100 బిలియన్‌ డాలర్ల నష్టం!

ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిణామాలతో జాతీయ, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్‌లు భారీగా నష్టపోతున్నాయి. ఊహించని విధంగా సెకన్ల వ్యవధిలో ఈక్వేషన్‌లు మారిపోతున్నాయి. లక్షల కోట్ల మదపర్ల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే మధ్య తరగతి ఉద్యోగి నుంచి క్యాపిటల్‌ మార్కెట్‌లో వేల కోట్ల కంపెనీ అధినేతగా పేరొందిన ఎలన్‌ మస్క్‌కు సైతం నష్టాలు తప్పడం లేదు.

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, లాక్‌ డౌన్‌, స్తంభించిన రవాణా సప్లయ్‌ చైన్‌, చిప్‌ కొరత, ఊహాతీతమైన నిర్ణయాలతో ఎలన్‌ మస్క్‌ నష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు.దీంతో మస్క్‌ కోల్పోతున్న సంపద ముఖేష్‌ అంబానీ ఆస్తుల కంటే ఎక్కువగా ఉందని బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది. జూన్‌ 14వరకు (నిన్న) కేవలం రెండు నెలల వ్యవధిలో 100బిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు పేర్కొంది. అదే సమయంలో ఆసియా రిచెస్ట్ పర్సన్‌ ముఖేష్‌ అంబానీ తన మొత్తం సంపదలో 96 బిలియన్ డాలర్లు ఉండగా..రిలయన్స్‌ ఇండస్ట్రీ కంపెనీ షేర్లు బెటర్‌ ఫర్మామెన్స్‌తో 9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ముఖేష్‌ అంబానీ ఆస్తి రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు బ్లూమ్‌ బర్గ్‌ తన కథనంలో హైలెట్‌ చేసింది.

దురదృష్టం అడ్రస్ వెతుక్కొని వెళ్లి మరీ
దురదృష్టం అడ్రస్ వెతుక్కొని వెళ్లి మరీ వెళ్లినట్లుగా..ఎలన్‌ మస్క్‌కు నష్టాలు చుట్టం చూపుగా వచ్చి నెలల తరబడి తిష్ట వేస్తున్నాయి. వెరసీ ఈ ఏడాది జనవరి నెలలో 300 బిలియన్‌ డాలర్లతో ప్రపంచంలో నెంబర్‌ వన్‌ బిలియనీర్‌గా అవతరించిన మస్క్‌ ఆదాయం మంచు పర్వతంలా కరిగిపోతుంది. కరెక‌్షన్‌ కారణంగా స్టాక్‌ మార్కెట్‌ ప్రతి రోజు నష్టాల్ని చవిచూస్తున్నారు. కాబట్టే రెండు నెలల వ్యవధిలో మస్క్‌ 100బిలియన్‌ సంపద తరిగిపోయింది. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం.. మస్క్‌ 203 బిలియన్‌ డాలర్లతో ధనవంతుల జాబితాలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్నారు. కానీ ఈ ఏడాది జనవరి నుంచి ప్రతి రోజు 0.6 బిలియన్‌ డాలర్లు నష్టపోతుండడం గమనార్హం.