NRI-NRT

అట్లాంటాలో ‘ఆటా’ అందాల పోటీలు

అట్లాంటాలో ‘ఆటా’ అందాల పోటీలు

అట్లాంటా నగరంలో జూన్ 11వ తారీఖున ఆటా సయ్యంది పాదం డాన్స్ కంపెటిషన్లు మరియు ఆటా వారి అందాల పోటీలు నిర్వహించారు. 25 పైగా డాన్స్ గ్రూప్స్ ఈ పోటీలలో పాలుపంచుకున్నారు. సయ్యంది పాదం నిర్వహణ బాధ్యతలు బాలు వళ్ళు మరియు శ్వేతా పర్యవేక్షించారు. అందాల పోటీల నిర్వహణలో శ్రావణి రాచకుల్లా, మల్లికా దుంపల, శృతి చితూరీ మరియు ఉదయ ఏటూరి చురుకైన పాత్ర పోషించారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ సెగ్మెంట్స్ క్లాసికల్ మరియు నాన్-క్లాసికల్ విభాగాలలో టీన్స్, మిస్, మిస్సెస్ పోటీలలో చాలా మంది మహిళలు పాల్గొని సందడి చేసారు.

జ్యోతి ప్రజ్వలన అనంతరం శ్రీరామ శ్రీనివాస్ అట అట్లాంటా టీంని సభకు పరిచయం చేసారు. ట్రస్టీ అనిల్ బొద్దిరెడ్డి ఆటా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు, అట మెంబెర్ బెనిఫిట్స్ సభకు వివరించారు. ఆటా పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి, కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, ఆటా కాన్ఫరెన్స్ అడ్వైసర్ గౌతమ్ గోలి, ట్రస్టీస్ అనిల్ బొద్దిరెడ్డి, వేణు పిసికే మరియు ప్రశీల్ రెడ్డి. ఆటా నేషనల్ కమిటీ చైర్ వెంకట్ వీరనేని, నిరంజన్ పొద్దుటూరి , జయ చందా, తిరుమల పిట్టా, శ్రీనివాస్ ఉడతా మరియు ఉమేష్ ముత్యాల పాల్గొన్నారు.
IMG-20220615-WA0084
ఆటా 17 వ మహా సభలలో విరివిగా పాల్గోవాలిసిందిగా కో-కోర్డినేటర్ కిరణ్ పాశం, అట పూర్వ ప్రెసిడెంట్ కరుణాకర్ అసిరెడ్డి మరియు గౌతమ్ గోలి పిలుపునిచ్చారు. అత్య అద్భుతమైన ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన వారికి లీడర్షిప్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసింది. కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొమెంటోస్ అందచేశారు. విజేతలు వాషింగ్టన్ డీసీ కార్యకరంలో పాల్గొంటారు. ATA కాన్ఫరెన్స్ కో-కోర్డినేటర్ కిరణ్ పాశం ఇంత అద్భుతంగా కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాటుని అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియచేసారు. నిర్వాహకులు సయ్యంది పాదం చైర్ సుధా కొండెపు, అడ్వైసర్ రామకృష్ణ అలె, కో చైర్స్ భాను, రాంరాజ్, అందాల పోటీలు చైర్ నీహారిక నవల్గా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.