NRI-NRT

తానా  సంబరాలకు చోటు దొరికింది

తానా  సంబరాలకు చోటు దొరికింది

వచ్చే ఏడాది జులై నెలలో నిర్వహించ తలపెట్టిన తానా వేడుకలకు వేదిక ఖరారయింది గత సంవత్సర కాలం నుండి అట్లాంటాలో మొదలుపెట్టి అమెరికా అంతటా గాలించి ఎట్టకేలకు తానా పాలకవర్గం ఫిలడెల్ఫియాలో వేదిక ఖరారు చేశారు. రెండు మూడు రోజుల్లో పాలకవర్గంలో చర్చించి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించనున్నారు. గత రెండు రోజుల నుండి తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి బృందం ఫిలడెల్ఫియా న్యూజెర్సీలో పర్యటించి వేదికను ఖరారు చేశారు.