NRI-NRT

అమెరికాలో వీణకు ప్రాచుర్యం

అమెరికాలో వీణకు ప్రాచుర్యం

భారతీయ సంగీత వాయిద్య పరికరం ‘వీణ’కు అమెరికాలో గుర్తింపు సాధించిన శారదా పూర్ణ శొంఠి – డాక్టర్‌ శ్రీరామ్‌ శొంఠి దంపతులను మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ చికాగో నగరంలో అభినందించారు. శొంఠి దంపతులు 1987లో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్ట్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (స్వప్న) స్థాపించి భారతీయ సంగీతానికి అమెరికాలో ప్రాచుర్యం కల్పించటానికి కంకణం కట్టుకుని అంతర్జాతీయ వీణ మహోత్సవాలు నిర్వహించారు. వారు చేసిన విశేష కృషిని కాంగ్రెస్‌ ఆఫ్‌ ది యునైటెడ్‌ స్టేట్స్‌లో కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ రాజా కృష్ణమూర్తి ప్రస్తుతించారు. ఇల్లినాయిస్‌ రాష్ట్రం మే 6వ తేదీని అంతర్జాతీయ వీణ దినోత్సవంగా ప్రకటించింది.