DailyDose

తిరుపతిలో విషవాయువు పీల్చి కార్మికుడు మృతి – TNI నేర వార్తలు

తిరుపతిలో విషవాయువు పీల్చి కార్మికుడు మృతి  – TNI  నేర వార్తలు

*విశాఖ తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ మీద ఓ ద్విచక్రవాహనం అగ్నికి ఆహుతైంది. నడుస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాహనదారుడు వెంటనే వాహనాన్ని ఆపి.. పక్కకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుతున్నాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

*అన్నమయ్య జిల్లా నందలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నవారిని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుంచి తిరుమలకు పాదయాత్రగా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

*హైదరాబాద్ మెహిదీపట్నంలోని ఆసిఫ్‌నగర్‌లో అర్ధరాత్రి యువకులు హల్చల్‌ చేశారు. జిర్రా సమీపంలోని రాయల్స్ హోటల్‌ వద్ద గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై వాహనదారులకు తీవ్ర ఆటంకం కలిగించారు. దీంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు.

*కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లిలో దారుణం చోటుచేసుకుంది. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామానికి చెందిన జ్ఞాన ప్రవీణ్ ఐపీఎల్‌లో బెట్టింగ్‌ కోసం రూ.8 లక్షలు రుణం తీసుకున్నాడు. రెండ్రోజుల క్రితం రూ.1.5 లక్షలు చెల్లించాడు. మిగతా డబ్బులు కట్టాలని నిర్వాహకులు వేధింపులకు గురిచేయటంతో మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించాడు. బాధితుడు ప్రస్తుతం పిన్నమనేని సిద్దార్థ వైద్యశాలలో చికిత్సపొందుతున్నాడు. కాగా ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*బాపట్ల జిల్లా మార్టూరు మండలం ఇసుకదర్శి సమీపంలోని ఓ గ్రానైట్ పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లికురవ మండలం వల్లాపల్లి చెందిన షేక్ పెద్ద హిమాంస(71), షేక్ చిన్న హిమాంస(70) అనే ఇద్దరు కార్మికులు గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. గ్రానైట్ రాయిని మిషన్తో కోసే క్రమంలో బండరాయి ఇద్దరి మీద పడింది. గమనించిన తోటి స్థానికులు మార్టూరులోని ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.

*శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం చిగురువలసలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు బలయ్యారు. పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ సమయంలో పిడుగు పడింది.
పిడుగు పడటంతో పొలంలో పనులు చేస్తున్న రైతులు ముద్దడ పద్మనాభం (60), నేతింటి గోవిందరావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. వాళ్లతో కలిసి పని చేస్తున్నా దుంగ లక్ష్మణకు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతడిని శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు.

*సముద్రపు అలల తాకిడికి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన బాపట్ల జిల్లా సూర్యలంక తీరంలో చోటు చేసుకుంది. మెరైన్ పోలీసులు వారిని కాపాడేందుకు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ యువకులు మృతి చెందారు.

*తిరుపతిలోని వైకుంఠపుపరం సమీపంలో ఉన్న మ్యాన్ హోల్‌లో ఇద్దరు మున్సిపల్ కార్మికులు పడిపోయారు. వారిలో ఒకరు దుర్మరణం పాలవగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పుత్తూరు నారాయణవనానికి చెందిన డ్రైవర్ ఏ. ఆర్ముగం, తిరుచానూరుకు చెందిన మహేష్ ఇద్దరూ మ్యాన్ హోల్‌లో పడిపోయారు. వీరిలో ఆర్ముగం దుర్మరణం పాలయ్యాడు. మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. వైకుంఠపురం సమీపంలోనున్న డ్రైనేజ్ వద్ద ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురైన మహేష్‌ను హుటాహుటిన రూయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మహేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై వైద్యం అందిస్తున్నారు.

*నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు పేరారెడ్డిపల్లెలో దారుణం జరిగింది. శాంతి పూజల పేరుతో కన్న పిల్లలనే చంపేందుకు ఓ తండ్రి ప్రయత్నించాడు. పూర్విక, పునర్విక అనే కవల పిల్లలను తండ్రి వేణు గదిలోకి తీసుకెళ్లి పూజులు చేశాడు. ఆ తర్వాత పునర్విక గొంతు నులమడంతో పూర్విక భయపడి కేకలు వేస్తూ బయటకు వచ్చింది. దీంతో స్థానికలు ఇంట్లోకి వెళ్లి చూడగా వేణు క్షుద్రపూజులు చేస్తున్నట్లు గుర్తించారు. అప్పటికే పునర్విక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను స్థానికలు సాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటన పోలీసుల దృష్టికి చేరడంతో వేణును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*వైకుంఠపురం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ఇద్దరు మున్సిపల్ కార్మికులు పడ్డారు. ఈ ఇద్దరిలో ఆర్ముగం అనే కార్మికుడు మృతి చెందాడు. మహేష్‌ అనే మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మహేష్‌కు రుయాలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు పుత్తూరు జిల్లా నారాయణపురం వాసిగా గుర్తించారు. మృతుడి కుటుంబానికి మేయర్ శిరీష రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్‌ అనుపమ అంజలి సీరియస్‌ అయ్యారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

*వైకుంఠపురం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. మ్యాన్‌హోల్‌లో ఇద్దరు మున్సిపల్ కార్మికులు పడ్డారు. ఈ ఇద్దరిలో ఆర్ముగం అనే కార్మికుడు మృతి చెందాడు. మహేష్‌ అనే మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మహేష్‌కు రుయాలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు పుత్తూరు జిల్లా నారాయణపురం వాసిగా గుర్తించారు. మృతుడి కుటుంబానికి మేయర్ శిరీష రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అయితే ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్‌ అనుపమ అంజలి సీరియస్‌ అయ్యారు. ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

*కాకినాడ: జిల్లాలోని గొల్లప్రోలు తాటిపర్తి జంక్షన్‌ దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

*విజయనగరం జిల్లా దేశపాత్రునిపాలెం జంక్షన్‌లోని ఆలయంలో చోరీ జరిగింది. బంగారమ్మ ఆలయంలో బంగారం, వెండి నగలను దొంగలు అపహరించారు. హుండీలోని నగదు, సీసీ కెమెరా చిప్స్‌‌ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే గుడిలో దొంగతనం జరిగిందని గుర్తించిన గుడి నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

*చిత్తూరు:జిల్లాలోని ఎస్ఆర్ పురం మండల పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఓ జింక జనారణ్యంలోకి వచ్చింది. జింకను చూసి వీధికుక్కలు దానిపై దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు స్పందించి కుక్కల దాడి నుంచి జింకను రక్షించారు. గాయపడ్డ జింకకు తాత్కాలికంగా వైద్యం అందించిన స్థానికులు అనంతరం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.

*ఇబ్రహీంపట్నం మండలం ధొనబండ సమీపంలో రెండు లారీలు ఢీ. రాంగ్ రూట్ లో వస్తున్న టిప్పర్ లారీ ను కంచికచర్ల వైపు నుంచి వస్తున్న సిమెంటు లారీ ఢీ కొట్టడంతో చెలరేగిన మంటలు. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్లు…ఒక డ్రైవర్ ను రక్షించి 108లో హాస్పిటల్ కి పంపిన స్థానికులుమరొక డ్రైవర్ మంటల్లో చిక్కుకున్నట్ల సమాచారం

*హైదరాబాద్‌లోని బేగంపేటలో మందుబాబులు హల్‌చల్‌ చేశారు. మంగళవారం రాత్రి బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై అటుగా వచ్చిన ముగ్గురిని పోలీసులు ఆపారు. అప్పంటికే మందుకొట్టి ఉన్న ముగ్గురు పోలీసులతో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా ట్రాఫిక్‌ ఎస్‌పై దాడిచేశారు. మందుబాబులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

*కామారెడ్డి: జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రపహడ్ గ్రామంలో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల బాలికపై 49 సంవత్సరాల వయసు గల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఇంటివద్ద ఆడుకుంటుండగా చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి కామాంధుడు ఇంతటి దారుణానికి యత్నించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, తెలంగాణ ఉద్యమ కళాకారుడు దరువు ఎల్లన్నను మంగళవారం హయత్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అయితే నోటీసులు ఇస్తామని పోలీస్‌స్టేషన్‌కు రావాలని పిలిచి.. అదుపులోకి తీసుకోవడంతో వారు నిరసనకు దిగారు.

*ఆస్తిగొడవల కారణంగా తల్లీకుమార్తెలను బంధువులే దారుణంగా నరికి చంపారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం, గూడూరు మండలం పోసినవారిపాలెంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. బందరు డీఎస్పీ మాసుంబాషా తెలిపిన వివరాలు… పోసినవారిపాలెంకు చెందిన పోసిన శాంతమ్మ(80)కు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. శాంతమ్మ భర్త జీవించి ఉన్నకాలంలో వారిపేరున ఉన్న రెండు ఎకరాల భూమిని రెండో కుమార్తె రూపవతి(45) పేరున రాశారు. ఈ భూమి వివాదం కోర్టులో నడుస్తోంది. శాంతమ్మ రెండో కుమారుడు సహదేవుడు.., అతని కొడుకులు సాంబశివరావు, మల్లేశ్వరరావు కోర్టులో ఉన్న కేసును విరమించుకోవాలని శాంతమ్మపై ఒత్తిడితెస్తున్నారు. ఆమె అందుకు నిరాకరించడంతో ఇద్దరినీ అడ్డుతొలగిస్తే భూమి తమదవుతుందనే కారణంలో మంగళవారం సాంబశివరావు, మల్లేశ్వరరావు వారిపై కత్తులతో దాడిచేశారు. ఈ ఘటనలో గాయాలపాలైన ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అడ్డువెళ్లిన శాంతమ్మ పెద్దకుమార్తె కొడుకు శిరివేళ్ల నాగరాజుపైనా కత్తులతో దాడికి పాల్పడ్డారు. తప్పించుకున్న నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

* భూవివాదంలో సొంత అన్ననే తమ్ముడు దారుణంగా హత్యచేశాడు. అయితే అధికార పార్టీ అండదండలతోనే ఈ హత్య చోటు చేసుకున్నదని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… ఏలూరు జిల్లా సుంకొల్లు గ్రామంలో సింహాద్రి రవికుమార్‌, సింహాద్రి చంద్రశేఖర్‌ కుటుంబాల మధ్య పూర్వార్జితంగా సంక్రమించిన మామిడి తోట విషయంపై వివాదం నెలకొంది.

*భార్యపై అనుమానంతో ఆరు నెలల కుమారుడిని తలపై తాళంతో కొట్టి చంపేశాడు. భార్యనూ గొంతు నులిమి చంపేందుకు యత్నించగా, ఆమె తప్పించుకొంది. కర్నూలు జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.

*చిత్తూరు: జిల్లాలోని ఎస్ఆర్ పురం మండల పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఓ జింక జనారణ్యంలోకి వచ్చింది. జింకను చూసి వీధికుక్కలు దానిపై దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు స్పందించి కుక్కల దాడి నుంచి జింకను రక్షించారు. గాయపడ్డ జింకకు తాత్కాలికంగా వైద్యం అందించిన స్థానికులు అనంతరం ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు.