Politics

వైకాపా పోవాలి.. భాజపా రావాలి’ అనే నినాదంతో ముందుకు సాగాలి – TNI రాజకీయ వార్తలు

వైకాపా పోవాలి.. భాజపా రావాలి’ అనే నినాదంతో ముందుకు సాగాలి – TNI రాజకీయ వార్తలు

* ‘వైకాపా పోవాలి.. భాజపా రావాలి’ అనే నినాదంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూచించారు. మూడేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు. కదిరిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పేదలకు కేంద్రప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం తీసుకురావాలంటూ.. వైకాపా ఎమ్మెల్యేలను పేదలు నిలదీయాలని.. భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా పోవాలి.. భాజపా రావాలి అనే నినాదంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు.
భారతదేశంలో 68 ఏళ్లకాలంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తైతే..మోదీ 8సంవత్సరాల పాలనలో జరిగినది మరో ఎత్తని ఆయన అన్నారు. భారత దేశాన్ని అన్నిరంగాల్లో ముందుకు నడిపిస్తూ విశ్వనేతగా మోదీ ఎదిగారని జీవీఎల్ కొనియాడారు. ప్రతి కార్యకర్త ఆయన మార్గంలో నడవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మూడేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారన్నారు.కేంద్రప్రభుత్వం.. పేదలకుపంపిణీ చేసిన బియ్యాన్ని వారికి అందించకుండా గోదాముల్లో మగ్గేలా చేస్తున్నారని విమర్శించారు. గడపగడపకు ప్రభుత్వం పేరుతో వచ్చే నాయకులను నిలదీయాలని సూచించారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలకు స్టిక్కర్లు అతికించడం తప్ప జగన్ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకొచ్చే బాధ్యతను ప్రతి కార్యకర్తలు తీసుకోవాలన్నారు.

*కేంద్రం మెడ వంచుతారా?.. కేసుల మాఫీ కోసం తల దించుతారా?: లోకేశ్‌
ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని.. సీఎం జగన్‌ ప్రకటించగలరా? అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సవాల్‌ చేశారు. ప్రత్యేకహోదా తెస్తారనే నమ్మకంతోనే వైకాపాకు 22 ఎంపీ సీట్లు ఇచ్చారని లోకేశ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ప్రకటిస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని.. సీఎం జగన్‌ ప్రకటించగలరా? అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సవాల్‌ చేశారు. కేంద్రం మెడలు వంచుతారా లేదంటే కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డే తల దించుతారా అని నిలదీశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి విజయం సాధించాలంటే వైకాపా మద్దతు తప్పనిసరని.. విజయసాయిరెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రత్యేకహోదా తెస్తారనే నమ్మకంతోనే వైకాపాకు 22 ఎంపీ సీట్లు ఇచ్చారని లోకేశ్ స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు..ప్రత్యేక హోదాపై జగన్ చేసిన ప్రసంగాల వీడియోల్ని లోకేష్ ట్వీట్‌ చేశారు.

*రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ : షర్మిల
సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి అప్పులపాలు చేశారని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు, రేపల్లెవాడ, చింతకాని, జగన్నాథపురం, పందిళ్లపల్లి, గాంధీనగర్‌, రామకృష్ణాపురం గ్రామాల్లో బుధవారం ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. చింతకాని, పందిళ్లపల్లిలో మాటా-ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు పెరిపోవడంతో సామాన్యులు బతికే రోజులు లేవన్నారు. కేజీ టూ పీజీ ఉచితం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను బంద్‌ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు మూడు వేల పాఠశాలలు మూసివేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు వైఎ్‌సఆర్‌ బిడ్డగా పార్టీ పెట్టానని, ఒక్క అవకాశమిస్తే అన్నివర్గాల జీవితాలను పండుగ చేస్తానన్నారు. కాగా, షర్మిల పాదయాత్రలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన చింతకాని సర్పంచ్‌ బండి సుభద్ర పాల్గొన్నారు. గ్రామంలో సభ పూర్తయ్యేంతవరకు ఆమె అక్కడే ఉన్నారు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

*కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వ్యవసాయానికి ఊతం: Vinod kumar
కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో వ్యవసాయానికి ఊతం వచ్చిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కోహెడ మండలంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామలం అవుతోందన్నారు.గౌరవెల్లి ప్రాజెక్టుతో లక్షా 60 వేల ఎకరాలకు త్వరలో గోదావరి నీళ్లు అందనున్నాయని చెప్పారు.భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుందన్నారు.కానీ ప్రతిపక్ష పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు.

*అందుకే Renuka పోలీసులతో వాగ్వాదానికి దిగారు: Geetha Reddy
రాహుల్ గాంధీపై ఈడీ అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి గీతా రెడ్డి తెలిపారు. నేడు ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ఈడీ విచారణ, నోటీసులకు వ్యతిరేకంగా తాము శాంతియుతంగా నిరసన చేస్తున్నామన్నారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడంతో మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి పోలీసులతో వాగ్వాదానికి దిగారని వెల్లడించారు. మాజీ కేంద్ర మంత్రి అని కూడా చూడకుండా పోలీసులు అసభ్యంగా ప్రవర్తించారన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులపై పోలీసులు రెచ్చ గొట్టారన్నారు. దీంతో బస్సులు ఎక్కి నిరసన వ్యక్తం చేశారన్నారు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో బీజేపీ వాళ్ళు చూస్తారని గీతారెడ్డి హెచ్చరించారు.

*96 వ రోజు పాదయాత్ర ప్రారంభించిన Sharmila
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల గురువారం, ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్ నుంచి 96వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఖమ్మం టౌన్ పరిధిలోని కొత్తూరు, ముస్తఫానగర్, శాంతి నగర్, తుమ్మలగడ్డ, జడ్పీ సెంటర్, పాత బస్టాండ్ సర్కిల్, చర్చి కాంపౌండ్ సెంటర్ మీదుగా పాదయాత్ర సాగనుంది. అనంతరం గురువారం సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

*ఆక్వా రంగాన్ని గట్టెక్కించండి… Jaganకు లోకేష్ లేఖ
సంక్షోభం నుంచి ఆక్వా రంగాన్ని గట్టెక్కించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లే ఖ రాశారు. ఇసుక పాల‌సీ మార్చి భ‌వ‌న‌నిర్మాణ‌రంగాన్ని దానికి అనుబంధంగా ఉన్న 130కి పైగా వ్యవస్థల్ని అస్త‌వ్య‌స్తం చేసేశారన్నారు. వంద‌లాది మంది భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌కుల‌య్యారని ఆరోపించారు. అనాలోచిత విధానాల‌తో విద్యుత్ కోత‌లు ఆరంభించి ప‌రిశ్ర‌మ‌లకు ప‌వ‌ర్‌హాలీడే ప్ర‌క‌టించేలా చేశారని మండిపడ్డారు. ప్ర‌భుత్వ అనాలోచిత నిర్ణయాల వలన రైతులు పంట‌లు వేయ‌కుండా క్రాప్‌హాలీడే పాటిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు ఆక్వా రంగం కూడా సంక్షోభంలో ప‌డిందన్నారు. విద్యుత్ చార్జీల పెంపు, ఫీడ్ ధ‌ర అధికం కావ‌డం, రొయ్య‌ల ధ‌ర త‌గ్గిపోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఆక్వా హాలీడే ప్ర‌క‌టించాల‌ని రైతులు తీసుకున్న నిర్ణ‌యంపై ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కూ స్పందించ‌క‌పోవ‌డం విచార‌క‌రమని టీడీపీ నేత లేఖలో అన్నారు.

*అలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవు: ఆదిమూలపు
తిరుపతిలో పారిశుధ్య కార్మికుని మృతి లాంటి.. ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ హెచ్చరించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిర్లక్ష్యం వహించినట్లు తేలితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పురపాలక సంఘాల్లో కార్మికుల రక్షణ కోసం చేపట్టిన చర్యలపై మంత్రి ఆరా తీశారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సురేష్ తెలిపారు.

*Modiకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు Jagan మద్దతు ఇవ్వాలి: Ramakrishn
రాష్ట్రపతి ఎన్నికపై ప్రతిపక్ష పార్టీలు సమావేశం అవుతున్నాయని, ఏపీలో ఉన్న టీడీపీ , వైసీపీ ల వైఖరి స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశంలో లౌకిక వాదానికి పెను ప్రమాదం సంభవించిందని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మోదీ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు జగన్ మద్దతు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోందన్నారు. 25 పార్లమెంట్ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారని, 2014 ఎన్నికలలో ఓడినప్పటి నుంచి 2019 ఎన్నికల‌ వరకు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక కోసం జగన్ అవసరం మోదీకి ఉందని, ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తానని జగన్ ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. కేంద్రం మెడలు‌ వంచుతా అన్న జగన్… ఇప్పుడు నోరెందుకు విప్పడంలేదని రామకృష్ణ ప్రశ్నించారు

*నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు.. తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకు సూచించా: కేఏ పాల్దే
శం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని.. ప్రధాని మోదీ అమిత్ షా లకు స్పష్టంగా చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. నేడు ఆయన ఢిల్లీ లో మీడియాతో మాట్లాడుతూ.. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానన్నారు. బీజేపీ అభ్యర్ధే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తారన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలన్నారు. ప్రతిపక్షాలు వేరు వేరు కుటములుగా ఉండొద్దని పాల్ సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ అభ్యర్ధి 60 శాతం ఓట్లతో గెలుస్తారు. నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. బీజేపీ, కాంగ్రెస్ వల్ల దేశం నాశనం అయిపోతోంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బీజేపీ బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకి ప్రతిపాదించా. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోడీ, అమిత్ షా, పురుషోత్తం రూపాలకు తెలిపా. నాతో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కుటమిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాలుగు కూటములుగా ఉన్నాయి. కేసీఆర్‌(KCR)తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించా. కేసీఆర్‌కి వచ్చే ఎన్నికల్లో ఎంపీలు ఉండరు’’ అని పేర్కొన్నారు.

*దేశంలో హింసను ప్రేరేపించే వారిపై చర్యలు తీసుకోవాలి: సానా
దేశంలో పెరుగుతున్న ఇస్లామిక్, జిహాద్ మతోన్మాదం, హింసను ప్రేరేపించే వారిపై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ అధ్యక్షుడు సానా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనవమినాడు దేశవ్యాప్తంగా ఊరేగింపులో రాళ్ల దాడి, చెప్పుల దాడి చేస్తున్నారని… గడిచిన రెండు శుక్రవారాలలో ప్రార్థనల తర్వాత మసీదు నుంచి బయటకు వచ్చి హిందువుల ఇళ్లు, దుకాణాలు, వాహనాలను తగలబెట్టారని ఆరోపించారు. బెంగాల్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్లామిక్ జిహాద్‌లకు అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. జాతీయ భద్రతా చట్టం 1980 కింద జీహాద్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

*నాడు నేడుతో పాఠశాలలకు మేలు కన్నా కీడే ఎక్కువ: కత్తి Narsinghareddy
డీఈవో కార్యాలయం ఎదుట ప్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి మద్దతు తెలిపి.. ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసేందుకే సర్కార్ జీవో నంబర్ 117 తీసుకోచ్చిందని ఆరోపించారు. నాడు నేడుతో పాఠశాలలకు మేలు కన్నా కీడే ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఎమ్మెల్సీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కత్తి నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు.

*రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం వైసీపీకి వచ్చింది: రఘురామ
మాట తప్పితే రాజకీయాల్లో ఉండటానికి అనర్హులని సీఎం జగన్ అన్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుచేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంట పెట్టుబడికి రూ.12,500 ఇస్తామని రూ.7500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. రూ.4,500 కోట్లతో విపత్తు నిధి అన్నాం.. కానీ ఇవ్వలేదని తప్పుబట్టారు. డాక్టర్ల సంఖ్య పెంచడమంటే వాచ్‌మెన్‌లతో వైద్యం చేయించడం కాదని పేర్కొన్నారు. మద్యనిషేధం అన్నారు.. మద్యం బాండ్లపై అప్పు తెచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే అవకాశం వైసీపీకి వచ్చిందని, ఇప్పటికైనా ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.

*Visakha అంటే జగన్‌కు ప్రత్యేక అభిమానం: విడదల రజనీ
విశాఖ అంటే సీఎం జగన్‌ కు ప్రత్యేక అభిమానమని మంత్రి విడదల రజనీ తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ జరగని అభివృద్ధి పనులు విశాఖ జిల్లాలో జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో విశాఖ మరింత అభివృద్ధి చేస్తామని విడదల రజనీ ప్రకటించారు. ఋషికొండపై ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి అవంతి శ్రీనివాస్‌ విమర్శించారు. టీడీపీ అదినేత చంద్రబాబు హయాంలో అభివృద్ధి కోసం కొండలను చదును చేశారని తెలిపారు. ‘మీరు చేస్తే అభివృద్ధి.. జగన్ సర్కార్ చేస్తే విధ్వంసమా?’ అని అవంతి ప్రశ్నించారు.

* ఏపీ సర్కారు వద్ద చిల్లిగవ్వ లేదు: కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే
‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలన అప్పులు, అవినీతితో పరాకాష్ఠకు చేరుకుంది. రాష్ట్ర ఖజానాలో చిల్లిగవ్వ కూడా లేదు. ఖజానాకు వస్తున్న రాబడి ఎక్కడికి వెళ్తోంది. ఆ నిధులను విదేశాలకు తరలిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది…’ అని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే పేర్కొన్నారు. అనంతపురంలో బుధవారం భాజపా ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ పోలీసులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి జగన్‌ ప్రభుత్వానిదని విమర్శించారు. వైకాపా మూడేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క కళాశాల అయినా కట్టారా? కనీసం రోడ్డు వేశారా అని ప్రశ్నించారు. ఏపీలో భాజపా ఎంపీ ఒక్కరు కూడా లేకపోయినా పలు సంక్షేమ పథకాలకు ప్రధాని మోదీ నిధులు ఇచ్చారన్నారు. భాజపా అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.

*తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాను మోదీ అవమానిస్తున్నడు
‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి.. సోనియాగాంధీ. ఆమెను ప్రధాని మోదీ అవమానిస్తున్నడు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసుల జారీని నిరసిస్తూ గురువారంనాడు ఖైరతాబాద్‌ పీజేఆర్‌ విగ్రహం దగ్గరి నుంచి రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ నేతల నిరసన దీక్ష మూడో రోజూ కొనసాగింది. గాంధీభవన్‌లో చేపట్టిన ఈ దీక్షలో రేవంత్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 17న జిల్లా కేంద్రాల్లోని రైల్వే స్టేషన్లు, టెలికాం ఆఫీసులు, ఐటీ కార్యాలయాలు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. గాంధీ కుటుంబాన్ని, దేశాన్ని విడదీసి చూడలేమని, రాష్ట్రపతి, ప్రధాని పదవులనే త్యాగం చేసిన కుటుంబం అది అని అన్నారు. కాగా ప్రధాని మోదీ చేతిలో సీఎం కేసీఆర్‌ కీలుబొమ్మ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీలకు సమాన దూరమంటూ రాష్ట్రపతి ఎన్నిలకు దూరంగా ఉండి బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నైతిక విలువలు లేని బజారు నేత అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకుండా కేసీఆర్‌ ముందే ప్లాన్‌ చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

*విద్యార్థులకు బెదిరింపులు సిగ్గుచేటు: బండి సంజయ్‌
బాసర ట్రిపుల్‌ ఐటీలో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ వేలాది మంది విద్యార్థులు చేస్తున్న ఆందోళనను తొక్కిపెట్టేందుకు ప్రభుత్వం బెదిరింపు ధోరణులకు పాల్పడటం సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఒకవైపు సమస్యల పరిష్కారానికి చర్చలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెబుతోందని, మరోవైపు విద్యార్థి నాయకులను కలెక్టర్‌ పిలిపించుకుని ఆందోళనను విరమించుకోకపోతే ట్రిపుల్‌ ఐటీ నుంచి బహిష్కరిస్తామని బెదిరిస్తున్నారని, ఇది క్షమించరాని నేరం అని తీవ్రంగా ఆక్షేపించారు. సమన్వయ బాధ్యతలు నిర్వర్తించాల్సిన ఐఏఎస్‌ అధికారి.. టీఆర్‌ఎస్‌ తొత్తుగా వ్యవహరిస్తూ విద్యార్థి ఉద్యమాన్ని అణగదొక్కాలనుకోవడం దారుణమని పేర్కొన్నారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలపై సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకోవాలని, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

*సబిత వ్యాఖ్యలు అభ్యంతరకరం: సీపీఐ
బాసర ట్రిపుల్‌ ఐటీకి సంబంధించి వీసీ, కాంట్రాక్టు ఉద్యోగుల విషయం విద్యార్థులకు ఎందుకంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేయడం అభ్యంతరకరం అని సీపీఐ రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. అంతపెద్ద విద్యాసంస్థను వీసీ, శాశ్వత లెక్చరర్లు, కనీస సౌకర్యాలు లేకుండా నడపడం బాధ్యతారాహిత్యమన్నారు. విద్యాశాఖ మంత్రి.. ఈ రకమైన రెచ్చగొట్టే ప్రకటనలు మానుకుని విద్యార్థులతో చర్చించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

*గౌరవెల్లితో లక్ష కుటుంబాలు బాగుపడుతాయి: హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుంతుందని, దీంతో లక్ష కుటుంబాలకు పైగా బాగుపడుతాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు రైతులకు మాయమాటలు చెప్పి అడ్డుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నాయని ఆరోపించారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ జలాశయం పనులు అడ్డుకుని, పోలీసులపై తిరగపడేలా చేసి తప్పుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు బాగు పడడం ఇష్టం లేకనే అడ్డుకునే యత్నాలు జరుగుతున్నాయని, వారి మాటలను రైతులు, ప్రజలు నమ్మొద్దని, వారి వలలో కూడా పడొద్దని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని హరీశ్‌రావు తెలిపారు.

*రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పుతున్నారు: జగ్గారెడ్డి
రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీని ఉసిగొల్పుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్త పాదయాత్రతో బీజేపీని నిలదీయడానికి కాంగ్రెస్ నేత రాహుల్ సిద్దమయ్యారని తెలిపారు. రాహుల్ పాదయాత్ర నిర్ణయంతో బీజేపీలో భయం మొదలైందన్నారు. రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే ఈడీ విచారణ చేస్తోందన్నారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం రాజ్‌భవన్ ముట్టడిస్తామని, రాజ్‌భవన్ గేట్లు బద్దలు కొడతామని జగ్గారెడ్డి హెచ్చరించారు.

*రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ : షర్మిల
సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి అప్పులపాలు చేశారని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు, రేపల్లెవాడ, చింతకాని, జగన్నాథపురం, పందిళ్లపల్లి, గాంధీనగర్‌, రామకృష్ణాపురం గ్రామాల్లో బుధవారం ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. చింతకాని, పందిళ్లపల్లిలో మాటా-ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు పెరిపోవడంతో సామాన్యులు బతికే రోజులు లేవన్నారు. కేజీ టూ పీజీ ఉచితం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను బంద్‌ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు మూడు వేల పాఠశాలలు మూసివేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు వైఎ్‌సఆర్‌ బిడ్డగా పార్టీ పెట్టానని, ఒక్క అవకాశమిస్తే అన్నివర్గాల జీవితాలను పండుగ చేస్తానన్నారు. కాగా, షర్మిల పాదయాత్రలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన చింతకాని సర్పంచ్‌ బండి సుభద్ర పాల్గొన్నారు. గ్రామంలో సభ పూర్తయ్యేంతవరకు ఆమె అక్కడే ఉన్నారు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

*తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన సోనియాను మోదీ
తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన తల్లి.. సోనియాగాంధీ. ఆమెను ప్రధాని మోదీ అవమానిస్తున్నడు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియా రాహుల్‌లకు ఈడీ నోటీసుల జారీని నిరసిస్తూ గురువారంనాడు ఖైరతాబాద్‌ పీజేఆర్‌ విగ్రహం దగ్గరి నుంచి రాజ్‌భవన్‌ వరకు భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రజలు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ఈడీ అధికారులు విచారిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ నేతల నిరసన దీక్ష మూడో రోజూ కొనసాగింది. గాంధీభవన్‌లో చేపట్టిన ఈ దీక్షలో రేవంత్‌రెడ్డి టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈనెల జిల్లా కేంద్రాల్లోని రైల్వే స్టేషన్లు టెలికాం ఆఫీసులు ఐటీ కార్యాలయాలు తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు. గాంధీ కుటుంబాన్ని దేశాన్ని విడదీసి చూడలేమని రాష్ట్రపతి ప్రధాని పదవులనే త్యాగం చేసిన కుటుంబం అది అని అన్నారు. కాగా ప్రధాని మోదీ చేతిలో సీఎం కేసీఆర్‌ కీలుబొమ్మ అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ బీజేపీలకు సమాన దూరమంటూ రాష్ట్రపతి ఎన్నిలకు దూరంగా ఉండి బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ నైతిక విలువలు లేని బజారు నేత అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిపై బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాకుండా కేసీఆర్‌ ముందే ప్లాన్‌ చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

*జగన్‌ జైలుకు పోవడం ఖాయం: అయ్యన్న
వచ్చే ఎన్నికల్లో జగన్‌ ఓడిపోవడమే కాదు ఆ తరువాత జైలుకు కూడా పోతారు. ఎన్నో కల్లబొల్లి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన జగన్‌… ప్రజల ధనాన్ని దోచుకోవడమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు. జగన్‌కు దమ్ముంటే ఇప్పుడు పాదయాత్ర చేయాలి’’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సవాల్‌ చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడులో ఆయన మాట్లాడారు. ‘‘ఈ మూడేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు అయిన పూర్తి చెయ్యగలిగారా? మోదీని 11 సార్లు జగన్‌ కలసినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ కూడా తీసుకురాలేకపోయారు. ఈ చెత్త సీఎం పాలనలో రాష్ట్రానికి రాజధాని కూడా లేని దిక్కుమాలిన పరిస్థితి తలెత్తింది’’ అని అయ్యన్న మండిపడ్డారు.

*ఎమ్మెల్యేను ఎందుకు సస్పెండ్‌ చేయరు ఆనందబాబు
‘‘ఒక దళితుడిని కిరాతకంగా హత్య చేసినందుకు ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ ఎమ్మెల్సీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి ఆయనకు అనుకూలంగా ప్రదర్శనలు చేయించిన వైసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మిని ఎందుకు సస్పెండ్‌ చేయరు?’’ అని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రశ్నించారు. బుధవారం ఆయన ఇక్కడ తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితుల్లో వచ్చిన వ్యతిరేకతకు భయపడి వైసీపీ నాయకత్వం తూతూ మంత్రంగా అనంతబాబును సస్పెండ్‌ చేసిందన్నారు. లోపాయికారిగా మద్దతు ఉందనడానికి పాలాభిషేకాలే సాక్ష్యమని ఆరోపించారు. ‘‘దళితుడి హత్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అమలాపురంలో కుల ఘర్షణలకు తెర లేపారు. పచ్చగా కళకళలాడే కోనసీమ తగలబడటానికి సీఎం జగన్‌రెడ్డే కారణం. తమ పార్టీ నేతల హస్తం ఈ అల్లర్ల వెనుక ఉందని మంత్రి విశ్వరూప్‌ చెబితే… ముఖ్యమంత్రి మాత్రం సిగ్గు లేకుండా ఈ నెపాన్ని ప్రతిపక్షాల పైకి తోయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయంగా తన పబ్బం గడుపుకోవడానికి చివరకు అంబేడ్కర్‌ను కూడా ముఖ్యమంత్రి లాగడం దారుణం’’ అని ఆనందబాబు విమర్శించారు.

*త్వరలో విశాఖలో AP గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు: CM Jagan
త్వరలో విశాఖలో AP గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, పరిశ్రమలపై ఆయన తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసే పనిలో నిజాయితీ ఉండబట్టే రాష్ట్రానికి పెద్ద పారిశ్రామికవేత్తలు వస్తున్నారని పేర్కొన్నారు. బడా పారిశ్రామికవేత్త ఆదానీతో కూడా అదానీతో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. కాగా జూన్‌ 23వ తేదీన హిల్‌ టాప్‌ సెర్జ్‌ ఫుట్‌వేర్‌ ఇండియా లిమిటెడ్‌ (అపాచీ) … పరిశ్రమకు సీఎం భూమి పూజ చేయనున్నట్లు మంత్రి అమర్నాథ్‌ తెలిపారు

*రేపు రాజభవన్ ముందు నిరసన: సాకే శైలజనాధ్
నేషనల్ హెరాల్ట్ దినపత్రికకు సంబంధించిన కేసులో రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా రేపు రాజభవన్ ముందు నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే బీజేపీ ఉనికి ప్రమాదంలో పడుతుందనే భయం పట్టుకుందని, ప్రశ్నించే గొంతుకలను బీజేపీ అణచి వేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బేషరతుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీజేపీ చేసే చర్యలకు రేపు ప్రతిచర్యలు ఉంటాయని హెచ్చరించారు.

*జగన్ సర్కార్‎పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ చంద్రబాబు
విశాఖపై పెత్తనం విజయసాయిరెడ్డిదా?.. సుబ్బారెడ్డిదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. చోడవరంలో టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు.. జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆటంకం కలిగించిందని మండిపడ్డారు. టీడీపీ సభలను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అయినా మహానాడును సక్సెస్ చేశారని చెప్పారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వాటికి టీడీపీ కార్యకర్తలు బెదిరే పరిస్థితి లేదన్నారు. వైసీపీని ఇంటికి పంపించే సత్తా ఉత్తారాంధ్రకు ఉందని చంద్రబాబు తెలిపారు.

*రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ : షర్మిల
సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి అప్పులపాలు చేశారని వైఎ్‌సఆర్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని పాతర్లపాడు, రేపల్లెవాడ, చింతకాని, జగన్నాథపురం, పందిళ్లపల్లి, గాంధీనగర్‌, రామకృష్ణాపురం గ్రామాల్లో బుధవారం ఆమె ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. చింతకాని, పందిళ్లపల్లిలో మాటా-ముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. నిత్యావసరాల ధరలు, రవాణా చార్జీలు పెరిపోవడంతో సామాన్యులు బతికే రోజులు లేవన్నారు. కేజీ టూ పీజీ ఉచితం అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలను బంద్‌ చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు మూడు వేల పాఠశాలలు మూసివేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. ప్రజల తరఫున పోరాటం చేసేందుకు వైఎ్‌సఆర్‌ బిడ్డగా పార్టీ పెట్టానని, ఒక్క అవకాశమిస్తే అన్నివర్గాల జీవితాలను పండుగ చేస్తానన్నారు. కాగా, షర్మిల పాదయాత్రలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన చింతకాని సర్పంచ్‌ బండి సుభద్ర పాల్గొన్నారు. గ్రామంలో సభ పూర్తయ్యేంతవరకు ఆమె అక్కడే ఉన్నారు. ఈ విషయమై టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

*మళ్లీ వస్తా..గాడిలో పెడతా: మినీ మహానాడులో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా చోడవరంలో మినీ మహానాడు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడ్డాడు.
‘‘చరిత్రలో మహానాడు తర్వాత మినీ మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి.. చోడవరంతో ప్రారంభించాం. ఇలాంటి మహానాడులు 26 పెడతాం..కేసులకు ఎవ్వరూ భయపడేది లేదు.. A2 విజయసాయిరెడ్డి విశాఖను దోచేస్తున్నాడు. విశాఖ రాజధాని అన్నారు పిడికెడు మట్టైనా వేశారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.ఇంకా ఇలా అన్నారు.. ‘‘రాష్ట్రానికి జగన్ అరిష్టంగా తయారయ్యాడు. 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్ళాడు.. మళ్లీ వస్తా గాడిలో పెడతా..అన్న క్యాంటీన్లు తెరుస్తాం.. సవాళ్లు నాకు కొత్త కాదు.. కోనసీమలో చిచ్చుపెట్టి, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం సిగ్గు చేటని’’ అన్నారు.