DailyDose

కాంగ్రెస్ నేత‌ల జులుం.. ఎస్ఐ చొక్కా ప‌ట్టుకున్న‌ రేణుకా చౌద‌రి

Auto Draft

రాజ్‌భ‌వ‌న్ వ‌ద్ద కాంగ్రెస్ నేత‌లు వీరంగం సృష్టించారు. పోలీసుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. విధుల్లో ఉన్న పోలీసుల‌పై కాంగ్రెస్ సీనియ‌ర్లు చేయి చేసుకున్నారు. రాజ్‌భ‌వ‌న్ వైపు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు రేణుకా చౌద‌రిని పోలీసులు అడ్డుకున్నారు. పంజాగుట్ట ఎస్ఐ ఉపేంద్ర‌ చొక్కా ప‌ట్టుకుని రేణుకా లాగారు. రేణుకాను అడ్డుకోబోయిన మ‌రో మ‌హిళా కానిస్టేబుల్‌పై కూడా ఆమె చేయి చేసుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తూ ఆమె రెచ్చిపోయారు. పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చి మ‌రీ కొడుతానంటూ బెదిరించారు. రేణుకా చౌద‌రి ఎంత ఓవ‌ర్‌యాక్ష‌న్ చేసిన పోలీసులు మాత్రం సంయ‌మ‌నం పాటించారు. మొత్తానికి రేణుకా చౌద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.