NRI-NRT

‘తానా’లో దూకుడు పెంచిన అధ్యక్షుడు అంజయ్య చౌదరి

‘తానా’లో దూకుడు పెంచిన అధ్యక్షుడు అంజయ్య చౌదరి

తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి స్పీడ్ పెంచారు. బుధవారం రాత్రి జరిగిన పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించారు. తదుపరి తానా మహాసభలు ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మరో అడుగు ముందుకు వేసి కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ పేరును కూడా ప్రకటించారు తానాలో కార్యదర్శి, కోశాధికారి వంటి పలు కీలక పదవులు నిర్వహించిన పొట్లూరు రవిని కాన్ఫరెన్స్ కమిటీ కన్వీనర్ గా ప్రకటించారు. పొట్లూరు రవి అప్పుడే రంగంలోకి దిగారు. తానాలో పెద్దల మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.